Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 48

 

                 క్షేత్రేయ కవి

    క||    తముఁదామె వత్తు రర్ధులు
        క్రమ మెఱిఁగిన దాతకకడకు రమ్మన్నా రా
        కమలంబు లున్న కొలనికి
        భ్రమరంబుల నచ్యు తేంద్ర రఘునాదనృహా!    495

    "ఇతి మువ్వగోపాలభక్తేన క్షేత్రకవినా ఉక్తత్వాచ్చ" ఆంధ్రకౌముది.

           కూచిమంచి తిమ్మకవి
        
    మ|| కవివిధ్వద్దరణీసుధాశనవరుల్ కార్యార్ధులై తన్ను డా
        సి వడి జేతులు దోసిలించుకొని యాశీర్వాదముల్ సేయ నె
        క్కువ దర్పంబున నిట్టటుల్ గదలకే కొఱ్ మ్రింగినట్లుండువా
        రవని  దుర్నృపు లేమి యీఁగలరో భర్గా! పార్వతీవల్లభా!      496

          వక్కలంక వీరభద్రకవి

    సీ|| అతఁడు రాజకిరీటుఁ డభిలరాజకిరీట
            ఘటిత పదాబ్జసంగతులు మీరు
        అతఁడు వారణదూరుఁ డభిలవారణరాజ
            గణసమాకులపు రంగాణులు మీరు
        అతఁ డాదుభిక్షుఁ తతభిక్షుడు కానీక
            యచితార్ధవ్రదాయకులు మీరు
        అతఁడు సర్వజ్ఞుఁ డంచితనైకసర్వజ్ఞ
            పూజనీయసమస్తబుధులు మీరు
    
    గీ|| భళిర మీతోటిసాటి కేపాటిమేటి
        సర్వలోకేశ్వరుం (డనఁ  జనెడుశివుఁడు)
        వత్సవాయు]జగత్సతీశ్వరతనూజ!
        ఘననుగుణసాంద్ర! జగపతిక్ష్మాతలేంద్ర?     497

    సీ||  అంబుజం బిల్లుగా హర్షించుపువుఁ బోణి
            ధర జగజ్జఠరనిర్భరవటుహరి
        హార శేశాచ్చాయయౌకఠోర శ్రేణి (?)
            ధరశాజ్గ దరుబొడ్డుదనరుకొడుకు
        భూరిసింహము గుఱ్ఱముగ రూడిఁ గలచేడే
            దక్షమఘక్షయౌద్దత్యబలుఁడు
        రధగజతురగభద్రజయాయురక్షతా
        ....... ....... ......

    గీ||  సంతతోత్సవశాలివై జగతి ఠేవ
        నలరు మిల వక్క లంకవీరయను బ్రోవు
        వత్సవయరాయ గజవతీశ్వరతనూజ
        రాయజగపతిరాజః గోత్రాబిడౌజః          498

                      దిట్టకవి తిప్పన
    
    గీ|| దిట్టకవి ప్రసిద్ది గలతిప్పన సత్కవిసార్వభౌముఁడౌ
        నేట్టనినం గవిత్వమున నెవ్వరు వానికి నీదు గామిఁదాఁ
        గట్టినగోచిదక్క నొకకానియు డాఁవక యర్దికోటికి
        బెట్టుట బాపురే బిరుదు వెట్టిన వారిక చెల్లు నుర్వర.      499
    
                         పుష్పగిరి తిమ్మకవి

    ఈయన ములికినాటి బ్రాహ్మణుఁడు . నెల్లూరి మండల మండలి మోడెగుంటలో నున్నవాఁడు. ఈయన కృతులుగా సమీరకుమార విజయము, కొన్ని శతకములు సుపలబ్ధములు. కంకంటిపాపరాజు నుత్తరరామాయణ మీయన రచించినదేయని లోకప్రతీతి. సమీర కుమారవిజయమునకు నుత్తర రామాయణమునకు శైలీభేదము గోచరించుటచే నా ప్రతీతి విశ్వస్యము కానేరదని కొందఱ వాదము. గ్రంధద్వయమందలి వద్యైక్యము వారు పాటింపరు. తిమ్మకవి నివాసగ్రామముచేరువ నుపలబ్ధమయిన యొక ప్రాఁత వ్రాఁత పుస్తకమున గ్రందాంతగద్యమున, పాపరాజు ప్రమోదసంపాదనార్ధము, తిమ్మకవి రచించి నట్లున్నది. తిమ్మకవి సాహాయ్యముచే నానాఁడు మఱియుఁ గొందఱు కవులలో గణన గాంచిరి. ద్విపదభాగవతకర్త  తేకుమళ్ళ రంగశాయి కవి యిట్టివాఁడు.

    మ||  కమనీయం బగునీదు కావ్యరస మాకర్ణించి నానాబుధుల్
          సముఁడౌ నీతఁడు పూర్వసత్కవులకు  సాబాసురే యంచు స్తో
        త్రము గావింతురు శంభుజూటతటినీరంగత్తరంగార్భటి
        మమతాహంకృతిదూర! పుష్పగిరి తిమ్మా! సత్కవిగ్రామణీః      500

                        తురగా రామకవి
        ఈతఁడు పెద్దాపురపుఁబ్రభువగు వత్సవాయ తిమ్మజగపతి మహా రాజులుంగారి నాఁటి వాడు. ఈతని చాటుపద్యములే గాని గ్రంధములు తెలియరాలేదు. వత్సవాయతిమ్మనృపాలు నీతఁడు తిట్టెను.

    క||  అద్దిర! శ్రీ భూనీలలు
        ముద్దియ లహరికిఁ గలరు ముగు రందఱలోఁ
        బెద్దమ్మ నాట్య మాడును
        దిద్దిమ్మని వత్సవాయతిమ్మని యింటన్.      501

            మఱియు నీ పద్యమును వినుఁడు.    

    ఉ|| పెండేల నాగికొప్పువయిఁ బెద్దికటిస్థలి గంగిగుబ్బ చ
        న్గొండలనుండు రామకవికుంజరుహస్తము క్రిందుఁ జేసే హా!
        వండక బంటు మిల్లి యది వండిన నీ కసుమాలధారుణీ
        మండలనాధుఁ బోలు నొక మానవమాత్రుని వేఁడఁబోవునే?   502

    వింత యొక్కటి వెల్లడియయినది. సింగారము చేలరేఁగుచున్న పద్యములన్నియు శ్రీనాధునితలకుఁ దగిలింపఁబడుచున్నవి. పెండేల నాగి, గంగి, పెది యనువిలసినులు రామకవిగారికిం గామినులని పై పద్యము పలుకు చున్నది. కాన యావేలఁదుకల పేర నున్న పద్యములు రామకవితకృతములే యగును.

    ఉ|| చూడఁగ నల్పుగాని పరిశోభిత దివ్యకురంగనాభ మే
        జాడను రాజయోగ్యమగు జవ్వని నల్లని మేని సంచుతో
        డాడగ రాదుగా! రాతిరహస్య మెరింగిన జిత్తసంభవ
        క్రీడలఁదేలి చూడవలె గేదగి గంగ విచిత్ర వైఖరుల్.      503

    ఉ|| భూతలమందు ధాతకు నపూజ్యత గల్గెను రెంట మూఁట భా
        గోతుల బుచ్చిగాని కొకకొంచే మనంగ గృహంబు సేయమిన్
        భీతకురంగనేత్రయగు పెండెలనాగికి మర్మజాత సం
        ఘాతము లుంచినందుకును గంగిని నల్పోనరించిసందుకున్.      504

    అను పద్యమును, శ్రీనాధకృతులుగాఁ దలఁపఁబడుచున్నవి. రామకవిగ్రామణివని నిజము నేఁటఁ దేటపడినది. ఈపద్య మీరామకవి దగునోకాదో !

    గీ|| విప్పుతలముండ తల్లి వివేకిగాదు
        ఎన్ని దిట్టిన నాభార్య యేభ్యరాశి
        అన్నిటికీఁ దోడు నాకాలు నవిటికాలు
        రామకవి గాని బ్రదుకు శ్రీరామ రామః        505

                    నృసింహభారతి

    ఈయన శృంగగిరిపీఠాదికారి కాఁబోలును. ఎవరో వీరిని బొగడినారు.

    మ|| కరహటాంద్రమరాటలాటవిలసత్కాంభోజనేపాళికా
        కురుకాళింగవిదర్భ చేదియవనాఘూర్జావనీనాయక
        స్పురితానేక సభంతరాళములలో భూషింతు వాక్స్పౌఢిచే
        నరసింహోత్తమభారతీందుగురుని నాస్వామిని వేడుకన్.     506

    ఈయన తన పీఠమునకు వచ్చు ద్రవ్య మంతయును మేడలకును మిద్దెలకును వ్యయించెడువాఁడట! 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS