Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 47

 

    మ|| గసనీహరగు రామపద్మ దళరంగత్కీర్తి చానూరమ
        ద్దవ శుక్రాక్షిక ళేభరాణ్మృగవతీ త్రైలోక్యధామోదరా
        యనఁగా శంకరవాంచితార్ద కృపదివ్యాస్తోకపాణి జనా
        ర్ధనవా నేకపవైరివిగ్రహ ముకుందా మిత్రవిమ్దాధీపా!      478

    నరసరాజు తననేర్పు వెల్లడి యగునట్లుగా ననేక దోషములను సంస్కరించి రామకృష్ణుని గెలిసెసేను. నిజముగా రామకృష్ణునియుచ్చారణప్రకార మా పద్యమున కర్ధము కలదు. అందు దోషములు లేవు. సామాన్యబుద్దికి దోషములుగాఁ గిన్పట్టునట్లు రామకృష్ణుఁడు రచించెను. నరసరా జట్లే పొరఁబడెను. అంతట రామకృష్ణుఁడు లేచి యీ క్రింది పద్యములఁ జెప్పి గెల్పుకొని నరసరాజును వంచించి పంపెను.

    చ|| ఒకని కవిత్వమం దేనయు నొప్పులు తప్పులు నాకవిత్వమం
        దొకనికిఁ దప్పుపట్టఁ బని యుండదు కాదని తప్పుపట్టిన
        మొక మటుక్రిందుగాఁ దివిచి ముక్కులువోవ నినుంపకత్తితో
        సిక మొదలంటఁ గోయుదును జెప్పునఁ గొట్టుదు మోము దన్నుదు.   479
    
    చ|| తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభంతరంబునం
        బలుకఁ గరాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁ బాడెకట్ట! నీ
        పలికిననోట దుమ్ముపడ! భావ్య మెఱుంగవు పెద్దలైనవా
        రల నిరసింతురా ప్రెగడరాన్నరసా! విరసా తుసా! బుసా!    480

    రాయల యస్తానమున నప్సలాచార్యు లనుపండితకవి యొకఁడు కలఁడట! అతని ఁగూర్చి యొకరు...
    శ్లో||  ఆవశబ్దభయం నాస్తి అప్పలా చార్య సన్నిధౌ,
        రామకృష్ణుఁ డుత్తరార్ధమును వెంటనే యిట్లు పూరించే -
        అనాచారభయం నాస్తి తిష్టన్మూత్రస్య సన్నిధౌ.      481

    రాయలయస్థానముననే యొకనాఁడు బట్టుమూర్తికవి "కుంజర యాధంబు దోమ కుత్తుకసొచ్చె " అన్న సమస్య జెప్పి దీని ఁబూరింపుఁ డని తక్కిన కవుల నడిగేనట! రామకృష్డుఁణు.....

    క||  గంజాయిత్రాగి తురకల
        సంజాతులఁగూడి కల్లు చవిగొన్నావా!
        లంజెలకొడుకా! యెక్కడ
        కుంజరయూదంబు దోమకుత్తుక సొచ్చె ?      482

    రాయలు కోపించి యిదియా పూరణ మనెను. రామకృష్ణుఁడు "దేవా! పెద్దనాదిమహకవుల కీ బట్టుకవియా సమస్య నోసఁగువాఁడు! అతని కిట్టి పూరణమే పోలు" ననెను. రాయలు 'నే నోసఁగితిని పూరింపు' మని యాగ్రహము తోనే పల్కేను. వెంటనే....

    క|| రంజనచెడి పాండవు లరి
        భంజనులై విరటుఁ గొల్వఁ బాల్పడి రకటా!
        గుంజర యూధంబు దోమకుత్తుకసొచ్చె.     483\

    అని పూరించెను. రాయలు పరమానందభరితుఁ డయ్యెను.

    పెద్దన్నమనుచరిత్రము, తిమ్మన్న పారిజాతపహరణము, బట్టుమూర్తి వసుచరిత్రము, రాయలు మిక్కిలి మెచ్చుకొనుచుండువాఁ డట! ఒకనాఁడు సభలో మూఁడు గ్రంధముల నుండియుఁ దుల్యసందర్భముగల వగుమూఁడు పద్యములఁ జూపి వానిని విమర్శింప సభ్యులను గోరెనట! అపద్యము లివి....

    ఉ|| పాటున కింతులోర్తురే! కృపారహితాత్మక! నీవు ద్రోవ ని
        చ్చోట భవన్నఖంకురము సోఁకెఁ గనుంగొను మంచుఁ జూపి య
        ప్పాటలగంది వేదననేపంబిడి యే'డ్చేఁ గల స్వరంబుతో     (మను.)
        మీటిన విచ్చుగబ్బిచనుమిట్టల నశ్రులు చిందువందుగ.      484

    ఉ||  ఈసునఁ బుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే
        గాసిలి యేడ్చేఁ బ్రాణవిభుకట్టెదుర లలితాంగి పంకజ
        శ్రీ సఖమైన మోముపయిఁ జేల చేఱంగిడి బాలపల్లవ
        గ్రాసకషాయకంతకలకంఠవధూకలకాకలీద్వని.      485

    శా|| ఆజాబిల్లివెలుంగు వెల్లికల డాయ లేక రాకానిశా
        రాజశ్రీసఖ మైనమోమునఁ బటా గ్రంబోత్తి యేల్గేత్తి యా
        రాజీవాసన యేడ్చేఁ గిన్నరవధూరాజత్కరాంభోజ కాం     (వసు.)
        భాజీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగా .    486

    రామకృష్ణుఁ డీపద్యములపై నిట్టు లభిప్రాయ మోసఁగెనట! అల్లసాని పెద్దన అటు నిటు నేడ్చెను. - ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా నేడ్చెను; - బట్టు మూర్తి బావు రని యేడ్చేను; - భట్టు మూర్తికిని రామలింగనికిని ఘోరవైరము. ఆ బట్టు కవితను గూర్చి రామలింగకవి యిట్లధిక్షేపించేను.

    క|| ఛీఁవర పాఁవరతీఁగలఁ
        జేఁపలబు ట్టల్లినట్టు చేప్పేడునీయీ
        కాఁపుఁగవిత్వపుఁగూఁతలు
        బాఁపన కవివరుని చెవికిఁ బ్రమదం బిడునే!.     487

    శా||  అద్రిస్నిగ్ధతలంబు బుద్భుదము లుద్యద్దారుభూషావళుల్
        క్షుద్రౌదుంబరపాక పక్వఫలముల్ శక్త్యంతరాకాశముల్
        రుద్రాక్షాక్షారపం క్తివిభ్రమము లీరూడీ న్నిరూపింప నీ
        శూద్రప్రజ్ఞలు విప్రసత్కవివచస్సుపర్తి న్విడంబించునే!.      488
    
    క|| కేంగెల రామకృష్ణుని
        బంగరుకడియంబు లుండఁ బండితుఁ డగునా
        జంగులు జల్లులు గల్గిన
        సింగారపుటూరఁగుక్క సింగంబగునా!         489

    కవీశ్వరులస్తోత్ర పాఠములకును నతిశయోక్తులకును నేవగొని తిరుమల రాయ లోకనాఁడు స్వభావోక్తి మధురముగానే తన్ను వర్ణింపుఁడని వారి కాజ్జాపించేనట! అతని కొంటికంటి గ్రుడ్డి కలదు. రామలింగకవి వర్ణించిన వర్ధనము.

    క||  అన్నాతి ఁగూడ హరుఁడగు
        నన్నాతిని గూడకున్న నసురగరుండౌ
        నన్నా! తిరుమలరాయఁడు
        కన్నొక్కటి లేదు గాని కంతుఁడుగాఁడే.         490

    క|| ఒడ్డ్రారపూనా కొడుకులు
        దొడ్డదొరల్ కవుల కీయ దొరకొనుచోఁ దా
        మడ్డాలే వచ్చుచుందురు
        ముడ్డా చూచేదవు భట్టు మూర్తన గారూ!     491

    అళియ రామరాయలకు వాయురోగము రాఁగా అంతఃపుర స్త్రీలతోఁ జెప్పినది :

    క|| ఓయమ్మలాల మందులు
        వే యేల మకారకొమ్ము విషకవిగాని
        వా యెత్తకుండఁ జేసిన
        వా యెత్తదు రామ రాయ వసుదేశునకు.     492

    మకారకొమ్ము విషకవి = మూర్తికవి, వాయి = వాయురోగము.

                            పింగళి సూరకవి
        ఈతఁడు కళాపూర్ణో'దయము, ప్రభావతి ప్రద్యుమ్నము, రాఘవపాండవీయము, ననుకృతులను రచియించిన చతురకవి. ద్వ్యర్ధికావ్యములలో నీతని రాఘవపాండవీయ మగ్రగణ్యము. ఈ క్రింది పద్యము తద్గ్రంధరచనమును శ్లాఘించుచున్నది.

    క||  విశదం బొకవక్షంబున
        విశయము వేఱోకట నిట్లు విలసిల్లిన యా
        శశి యెట్లు సాటియగుఁ గని
        శశియగురము పాండుకావ్యచణసూరనకున్.     493

                        బెణక కవి
    
    ఉ||  శ్రీనరసింహ దేవునివిశేషకృవ రచియింప నేర్తునో
        మనవనాధులార! నను మక్కువ సేయుచు నాదరింపుఁడీ
        మానితవెన్ని నామకులమాన్యుఁడ భీమయమంత్రి పుత్రుఁడ
        మాని భాశంకరాంబసుకుమారుఁడ బెణ్క వకాఖ్యసత్కవి.       494 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS