ఇది నాయక్ కోడ్ లో కీర్తికి రాసిన లెటర్ అందించిన సమాచార మూను.
కీర్తి లెటర్ చదవడం పూర్తి చేసి లెటర్ ని వందముక్కలు గాచించి తూములో పడేసి నీళ్ళు కొట్టింది ఆతర్వాత తాఫీగా స్నానం చేసి హాయిగా యితవతలికి వచ్చింది.
"ఇంతవరకు ఏదో చిన్నచిన్న విషయాలు తప్ప పరిశోధనలో గట్టిగ ముందుకు సాగటానికి వీలులేక పోయింది. యిక్కడికి వచ్చి ఇరవైరోజులు దాటి పోయింది. ఎలా! అని మధన పడుతుంటే యిదేదో కొత్తది తెలిసింది. యిదిపనికొచ్చేదే కనక అయితే తీగ చేతికి చిక్కినట్లే దాంతో డొంకనంత కదలించవచ్చు" అనుకుంది కీర్తి.
ఆరాత్రి.
అందరూ గాఢ నిద్రపోతున్న వేళ కీర్తి తన గదిలో కూర్చుని కోడ్ తో లెటర్ తయారు చేసింది. దీనిని రేపటి రోజు నాయక్ కి అందించాలి నాయకు అందించే సమాచారంతోగాని విషయం అర్ధంగాదు.
సి.ఐ.డి.గ నాయకు కీర్తి కన్నా కిందరాంకు. అందువల్ల తనేం చేసినాకీర్తి కిచెప్పి గాని ముందుకు సాగడు. రాత్రికి ఆ యింట్లోకి వెళ్ళిరావటం వరకు నాయకుచేస్తాడు. ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పని చెప్పవలసింది కీర్తి మాత్రమే.
కీర్తి లెటర్ పూర్తి చేసి ఆతర్వాత హాయిగా నిద్రపోయింది.
33
రెండే రెండు రోజులు.
నాయకు చాలా సమాచారం కీర్తికి అందించాడు.
కీర్తి యింక ఏమాత్రం ఆలశ్యం చేయలేదు. "ఆపరేషన్ మొదలు పెట్టాలి అన్నీ రెడీ చెయ్యి." అని ఆదేశం యిచ్చింది కత్తులు సుత్తులు అన్నీ రెడీ చేశాను. మీదే ఆలశ్యం అంటూ నాయకు మంచి వార్త వచ్చింది. అంటే అర్ధం మన వాళ్లకి వార్త పంపించాను. కదిలివస్తున్నారు. అని...
నాయకు వల్ల బైతి వ్యవహారం ఓకొలిక్కి వచ్చింది. బైట పని పూర్తయితే చాలదు యింట్లో పని కూడా పూర్తి కావాలి. దీనికి యింట్లో వాళ్ళ సహకారం కూడా కావాలి. కీర్తి ఈ ప్రయత్నంలో విజయం సాధించింది.
ఈ రాత్రికే.
వకేసారి.
వకే టైములో.
అక్కడ ఇక్కడ.
పధకం ప్రకారం మనుషులని తప్పించాలి. అలా తప్పించిన మూడు రోజుల తర్వాత...?
"ఎస్, త్రీడేస్." అనుకుంది కీర్తి.
సతీదేవితో రహస్యంగా మంతనాలాడింది కీర్తి.
రంగ మార్తాండగారు అంతా నీ యిష్టం అంటూ కీర్తికి ఆ విషయంలో సర్వహక్కులు యిచ్చాడు.
కీర్తి నడుం బిగించి రంగంలోకి దిగింది.
ఆరాత్రి.
కీర్తి చెప్పినట్లు అక్షరాలా పాటించటానికిసతీదేవి మనసు చిక్క బట్టుకుని తయారయింది.
రాత్రి పదకొండు గంటల వేళ తన పడక గదిలో వున్నా సతీదేవి కిటికీలోంచి కనపడే ఆకాశాన్ని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నది.
ఆకాశంలో నక్షత్రాలు లేవు శూన్యంగ వుంది.
"నా బ్రతుకులాగానే వుంది." అనుకుంది సతీదేవి.
సతీదేవికి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్ళు బుగ్గల మీద జాలువారాయి పెదవులకి తగిలిన తడి నాలుకతో తుడిచేయబోయింది. ఉప్పగా రుచి తెలిసింది. చటుక్కున కర్తవ్యం గుర్తుకు వచ్చింది. "ఓహ్ ఈ సమయంలోనా తన ఆలోచన!" అనుకుంది. కన్నీరు తుడుచుకుని మనకు నిబ్బర పర్చుకుంది.
"నిండా మునిగిన దానికి చలేమిటి" అనుకుంది సతీదేవి. రెండు చేతులతో కిటికీ వూచలు పట్టుకుని శూన్యంలో కానరాని దేదో చూడటానికి ప్రయత్నిస్తూ అలా నుంచుండి పోయింది.
మాధవ్ గురుదేవ్ తలుపులు నిమ్మదిగా తెరచి పడక గదిలో అడుగు పెట్టాడు.
అటు తిరిగి కిటికీలోంచి బయటికి చూస్తున్న సతీదేవిని వెనుక నుంచి చూశాడు. పెద్ద జరీ బార్దరు వున్నా తెల్లచీర తెల్ల జాకెట్టు, తుమ్మెద రెక్కలు లాంటి బారాటికురులని పెద్ద ముడిగ చుట్టుకుంది. ముడిచుట్టూ మల్లె దండ పెట్టుకుంది. చక్కని వంపుసొంపులతో రతీదేవిలా వుంది.
మాధవ్ గురుదేవ్ వెనక నుంచి సతీదేవిని చూస్తూ గుమ్మంలో అలా కొద్దిసేపు నుంచుండి పోయాడు. ఆతర్వాత నిమ్మదిగా తలుపు గడియ పెట్టాడు. అడుగులో అడుగువేస్తూ నడచి వచ్చి సతీదేవి వెనుకనే నుంచున్నాడు.
సతీదేవి తన భుజం మీద చేయి పడంగానే ఉలిక్కిపడింది. నిమ్మదిగా వెను తిరిగి "మీరా!" అంది.
"నీ గదిలోకి అడుగు పెట్టి నీ భుజం మీద చేయి వేసే ధైర్యం నాకు గాక ఎవరికీ వుంటుంది." మాధవ్ గురుదేవ్ అన్నాడు.
సతీదేవి పెదవి కదపలేదు.
