Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 47

   
    పెరట్లో ఆ పూలు ఈ పూలు కోస్తూ పెరడంతాతిరుగుతూ రహస్య సమాచారం తను నాయక్ కి అందించటంగాని బయట నుంచి నాయక లోపలి కొత్త సమాచారం పంపటం గాని అక్కడ నుంచే చేస్తుంటారు.    
    పెరట్లో ఓ చెట్టుకొమ్మ గోడమీద నుంచిఅవతలికివుంది. నాయక్ తను సేకరించిన సమాచారాన్ని కాగితం మీద రాసి దాన్ని చిన్న మడతగ పెట్టి కొమ్మకి వున్నా తొర్రలో పెడతాడు. అది పూల కొమ్మ, అందుకని ఆ నెపంతో కీర్తికొమ్మని లాగి వంచి పూలకోసం అటూయిటూ తిప్పి తొర్రలోవున్నా లెటర్ ని చాకచక్యంగా తీసుకుని జాకెట్లో దాచుకునివస్తుంది.    
    కీర్తి కూడా ఇంట్లో విషయాలను లెటర్ రాశి అదే తొర్రలో పెడుతుంది. రాత్రిపూట నాయక్ ఆ లెటర్ తీసుకుంటాడు.    
    నాయక్ యింటి లోపలికి రాకుండా కీర్తి ఇల్లు విడచి బయటికి వెళ్ళ కుండను రహస్య సమాచారం ఒకరి కొకరు ఈ పద్దతిలో తేలిగ్గా చేరవేసుకుంటున్నారు.    
    పల్లెటూళ్ళలో టి బంకు తడికల హోటలు పెడితేబాగా డబ్బు వస్తుంది. బస్తీలో బతకలేము ఇక్కడే ఏదో ఒకటి చూడాలి. అంటూ నాయక్ వూళ్ళో మకాంపెట్టి బయట వ్యవహారం చూస్తున్నాడు. నాయక్ రూపురేఖలు చూసిన ఎవరూ కూడా అతనో సి.ఐ.డి ఆఫీసరని అనుకోరు.    
    కీర్తి పరిశోధనలో కొద్దివిషయాలే బైట పడ్డాయి మాధవ్ గురుదేవ్ ని పట్టేసిందిగాని తగిన సాక్ష్యాలు లేవు, తెలిసి ఎమీచేయలేని పరిస్థితి అది.    
    ఆ ఇంట్లోంచి బైటకి వచ్చే ప్రతివాళ్ళ మీద నిఘావేశాడు నాయక్, అతని పరిశోధన అంతగా ఫలించలేదు.    
    కీర్తి ఓరోజు రహస్య సమాచారం అందిస్తూ "సూరప్పడు అనేవాడు ఈయింటికి నాలుగు రోజుల కొకసారి వచ్చి మాధవ్ గురుదేవ్ గదిలో దూరి గంటసేపు ఏదోమంతనాలు ఆడి వెళ్ళిపోతున్నాడు వాడి గురించి ఆరాతీసి నాకు సమాచారం అందించండి" అంటూ చీటీ రాశి కొమ్మతొర్రలో పెట్టింది. యిది జరిగి అయిదు రోజులు అయింది.    
    నాయక్ రాసిన లెటరు ఈరోజు కీర్తీ చెట్టుకొమ్మ తొర్రలోంచి తీసుకుని జాకిట్లో దోపుకొని పూలు కోసుకుని మామూలుగా లోపలికి వచ్చింది.    
    నాయక్ కొత్తసమాచారం ఈపూటనైనా అందించాడో లేదో! అనుకుంటూ కీర్తి పూలన్నీ ముందు పోసుకుని మాల కట్టటం ప్రారంభించింది.    
    పావుగంట కల్లా పూలమాలలు కట్టటం పూర్తి అయింది. మరో పావుగంటకి వాటి పందారం కూడా పూర్తి అయింది ఓపదినిమిషాలుఅటూ యిటూతిరిగి ఈరోజు తొందరగా స్నానం చేయాలి చీదరగ వుందంటూ కీర్తి స్నానాల గదిలోకి వెళ్ళి తలుపు లేసుకుంది.    
    కీర్తి లెటర్ ని జాగ్రత్తగ మడతలు విప్పిచదవడం మొదలు పెట్టింది.    
    జింజర్ వాలీ    
    నేను ప్రతిxxమీద చేశాను. ఇంతవరకూ 33 ఆకుకి.....అందని....చెందని తప్ప  xxx సాగలేదు మొన్న 4 SSS క్రితం సమా ooo చాలా మంచి ooo నేను సూ........వెంటా AAB తర్వా... .... ...__ __ __మానస్ మహోదయ.    
    నాయక్ రాసిన ఆలెటర్ చాలాపెద్దది దానిలో చాలా సమాచారం వుంది. అయితే ఆలెటర్ నిండా గీతలు, సున్నాలు ఇంగ్లీషు అక్షరాలు ప్రతి మాటకి మాటకి మధ్య వున్నాయి.    
    ఈలేతర్ కొత్తవాళ్ళ చేతిలో పడినాప్రమాదం లేదు లెటర్ లో మధ్య మధ్య వుపయోగించింది ఒకరకం కోడ్ కాదు చాలా రకాల కోడ్ పొందుపర్చివుంది, ఏదోఒక కోడ్ అయితే కోడ్ ని చేసి తెల్సుకోవచ్చు. యిది అలాకాహ్డు ఎన్నో రకాలుగా రాసిన కోడ్ ని డీకోడ్ చేసి దాంట్లోంచి మరో కోడ్ లాగాలి, చాలా కష్టం.    
    కోడ్ స్పెషల్ సి.ఐ.డీ.లు మాత్రమే వాడుతుంటారు. అలాగే ఒక్కోసారి గీతలు కొన్ని కొండగుర్తులతో లెటర్ తయారు చేస్తారు. అంత అవసరం లేక నాయక్ మరొక కోడ్ వుపయోగించి ఈలెటరు తయారు చేశాడు.    
    నాయక్ రాశిన దానికి కోడ్ లోకి తీసుకుని దానిని నాలుగు రకాలుగా డీకోడ్ చేసి విషయం గ్రహించింది కీర్తి.    
    ఆలెటర్ సరిచేసి చదివితే యిలావుంటుంది.    
    మిస్ కీర్తి.    
    నేను ప్రతిరోజూ వాళ్ళమీద పరిశోధనచేశాను ఇంత వరకు నాపరిశోధన ఆకుకి ఏమాత్రం అందని పోకకి చెందక తప్ప కించిత్ ప్రయోజనం లేదు ముందుకు సాగలేదు. మొన్ననాలుగు రోజుల క్రితం మీరు అందించిన క్లూ చాలా మంచిదైంది నేను సూరప్పడిని రాత్రింబవళ్ళు వెంటాడాను. కొంత తెలుసుకున్నాను.    
    సూరప్పడు రాత్రిళ్ళు రహస్యంగ ఊరికి చివరగ పక్కగ వున్నా ఓయింటికి వెళుతున్నాడు. ఆయింట్లోకి భోజనం క్యారియర్ కూడా వెళుతున్నది నిన్నరాత్రి మాధవ్ గురుదేవ్ కూడా ఆయింట్లోకి వెళ్ళి గంట సేపు లోపల వుండి బైటికి వచ్చాడు.    
    మాధవ్ గురుదేవ్ గారిదే ఆయిల్లుకూడాను. ఆయింట్లో ఆయన ముండని పెట్టుకున్నారు. మధ్యమధ్య దాని దగ్గరకు ఆయన వచ్చివెళుతుంటారు. అని ఊళ్ళోవాళ్ళు చూచాయగ అనుకుంటున్నారు. నిజం అదికాదని నాకనిపిస్తున్నది ఈరాత్రికి రహస్యంగా ఆయింట్లోకి వెనక నుంచి ప్రవేశించి అసలు సమాచారం ఎంతో కొంత తెలుసుకుంటాను. రేపుసాయంత్రం విషయం మీకు అందిస్తాను ఆపై మీలెటర్ చూసుకుని ఏంచేయవలసిందీ అలాచేస్తాను.   
                                                                                 నాయక్


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS