"అలాగే మీ యిష్టప్రకారం చెయ్యండి" అంది.
ఆ సాయంత్రమే అవంతిని వెంట బెట్టుకొని తను గుమాస్తాగా పని చేస్తోన్న లీడింగ్ లాయర్ సూర్యారావు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు.
ఆయనకి అరవై ఏళ్ళుంటాయి. అయినా బలంగా వున్నాడు. అది డబ్బు బలం అని అవంతి గ్రహించింది సూర్యారావుకి క్రిమినల్, సివిల్ కూడా మంచి ప్రాక్టీస్ ఉంది.
"రోజూ వచ్చి పని నేర్చుకో" అన్నాడు సూర్యారావు.
అవంతి తల వూపింది.
ఆయన కొన్ని ఫైల్స్ తీసిచ్చి అవి చదువుకోమని చెప్పాడు. అవంతి ఆయనకెదురుగా కుర్చీలో కూర్చుని అవి చదువుతుంటే గోవిందరాజులుకి ఏనుగెక్కినంత సంబరం కలిగింది.
తన కన్న కలలు నిజమైనందుకు చాలా గర్వంగా వుంది ఆయనకి.
వస్తున్న క్లయింట్స్ కి ఒక్కొక్కరికీ తన బిడ్డని చూపించుకొని పొంగిపోతున్నాడు ఆయన.
అవంతి అదంతా గమనిస్తూనే వుంది. ఎవరో అంటున్నారు.
"అదృష్టవంతుడివోయ్ గోవిందరాజులు నువ్విక ఈ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు?" అని.
"అమ్మాయి కోర్టుహాల్లో నిలబడేవరకూ ఆయన తర్ఫీదు వుండాలి?" ఇంకెవరో అన్నారు.
అవంతి రోజూ సూర్యారావు ఆఫీసుకి వెళ్ళి వస్తోంది.
రోజులు గడిచిపోతున్నాయి. అనుకొన్నట్టుగా రిజల్ట్స్ వచ్చేసినాయి. అవంతి ఫస్ట్ క్లాసులో పాసయింది.
ఆరోజు అవంతికన్న ఆనందపడింది గోవిందరాజులే.
ఆ మూడు నెలల్లో నోటీసులు వ్రాయడం, పిటీషన్ అంటే ఏమిటి, ప్లేంట్ అంటే ఏమిటి, అఫిడెవిట్ అంటే ఏమిటో మొదలైన విషయాలే కాక కాల్ వర్క్ గురించి మొదలైన ప్రాథమిక విషయాలని సూక్ష్మంగా అర్థం చేసుకుంది అవంతి.
29
"అమ్మాయిని ఎన్ రోల్ చేసి తెప్పించు. మంచి స్పార్క్ వుంది. చాలా త్వరలోనే మంచి లాయర్ అవుతుంది" అన్నాడు సూర్యారావు గోవిందరాజులతో.
వారం తర్వాత అవంతి హైదరాబాద్ వెళ్ళింది. వెళ్ళేముందు అవంతి మనోహర్ కి టెలిగ్రాం ఇచ్చింది.
మనోహర్ స్టేషన్ కొచ్చి ఆమెని రిసీవ్ చేసుకున్నాడు.
"కంగ్రాట్స్" అన్నాడు.
"థాంక్యూ ఇదంతా ఓ రకంగా నీ ప్రోత్సాహమే." అంది. అతన్ని చూస్తుంటే ఓ ఆత్మీయుడ్ని చూసినట్టుగా అనిపించిందామెకి.
మనోహర్ ఆమె చేతిలోంచి ఎయిర్ బాగ్ ని అందుకొని చిరునవ్వు నవ్వాడు.
"ఇప్పుడెక్కడికి!" అడిగింది అవంతి.
"మా ఇంటికెళదాం? అన్నాడు మనోహర్.
"మీ నాన్నగారూ......" అనుమానంగా అడిగింది అవంతి.
"మరేం ఫరవాలేదు. ఆయన ఏమీ పట్టించుకోరు. నువ్వు నాగెస్ట్ వి" అన్నారు కారు డోర్ తెరుస్తూ మనోహర్.
అవంతి కారెక్కి కూర్చోగానే స్టార్ట్ చేశాడు.
అవంతికి అతన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా వుంది.
అతని పక్కగా జరిగి కూర్చుని భుజంపైన చెయ్యివేసింది.
మనోహర్ తల తిప్పి ఆమెకేసి చూశాడు.
"నేనెప్పుడన్నా గుర్తుకొచ్చేదాన్నా!" అడిగింది.
అతను నవ్వాడు.
"అసలు మరచిపోతే కదా గుర్తుపెట్టుకోవడం అనేది జరిగేది" అన్నాడు.
"థాంక్యూ" అంది.
"మరినీకు!"
"దేవుడున్నాడో లేదో నాకు తెలీదుకానీ నా జీవితాన్ని ఓతాటిమీద నిలబెడుతున్న నిన్ను నేను ఓ ప్రాణ స్నేహితుడిగానే కాదు, దేవుడిగా అనుకొంటున్నాను. నిన్ను నాగుండెలో దాచుకొని ఆరాధించతగ్గ వ్యక్తివి మనోహర్. నేను నీకు జన్మజన్మలకీ రుణపడిపోతాను. ఈ రుణాన్ని ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా నేను తీర్చుకుంటాను" అంది అతని భుజంపైన తలవాలుస్తూ.
థాంక్స్" అన్నాడు మనోహర్.
"ఒట్టి థాంక్సేనా" అంది.
"మరింకేం కావాలి!"
"నేను చెప్పను"
"ఇప్పుడే చెప్పకు. వెళ్ళేలోగా చెప్పు" అన్నాడు.
అవంతి నవ్వింది.
పదిహేను నిమిషాల తర్వాత హిమయత్ నగర్లో ఓ ఖరీదైన మేడముందు కారు ఆగింది.
"దిగు" అన్నాడు.
అవంతి ఎయిర్ బాగ్ తో సహా దిగింది. ఆ ఇంటి ముందు -
కె. రామదాసు
