"అలాగా! పాపం... పదమ్మా వెళదాం."
ముగ్గురూ బయలుదేరారు.
దారిలో అనూష గురించి క్లుప్తంగా వివరించింది వీణ. ఆమె ఇంతకాలం పెళ్ళిచేసుకోకుండా వుండిపోవాడానికి కేవలం వృత్తి పట్ల వున్న అంకిత భావం తప్ప మరేంలేదని. భరణి ఆదర్శాలు, మంచి మనసు చూశాక అనూషకి అన్ని విధాలా నచ్చాడు.
ఏమిటో, మరణం సన్నిహితంగా క్రుంగతీస్తుందనుకోలేదు. అనికోకుమ్డా జరగడంతో తట్టుకోలేకాపోతున్నాను. నా కళ్ళతో అమ్మానాన్నల మరణం చూశాను.
హాస్పిటల్లో ఎందరి మరణమో చూశాను. కానీ, ఇలా ఎన్నాడూ జరగలేదు. నా నీదే నన్ను భయపెడుతుంది.
మణి మరణానికి నువ్వే కారణం అన్న భావన నీ మనసులోంచి తుడిచెయ్... అప్పుడు ఇలా అనిపించదు.
శ్యామల అన్న మాటలు నిజమనిపించాయి. శారదని లేపి,ఏదన్నా పాట పాడమను శ్యామా! అన్నది.
శ్యామల వెళ్ళి శారదని లేపింది.
శారద వీణ తెచ్చుకుని కూర్చుని సావ్యమ్గా పాడింది. నిది చాల సుఖమా? రాముని సన్నిధి చాల సుఖమా?
కొన్ని కీర్తనలు, మరికొన్ని తత్వాలు పాడింది.
ఆ పాటలు వింటూ అనూష నిద్రపోయింది.
ఓరోజు అనూష హాస్పటల్ కి వెళ్ళేటప్పటికి హరిశ్చంద్రగారుకబురుచేశారు ఆమె వెళ్ళగానేఅప్యాయంగా మాట్లాడి ఓదార్చారు.
అనూషా! విద్యావతిని. నీకు తెలియనిదెం వుంది? మనం డాక్టర్ గా రోగికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తాం-- తీయడానికి కాదు కదా! నువ్విలా అయిపోతే ఎలా? హాస్పిటల్ కి కూడా రావడంలేదు."
అనూష మాట్లడలేదు.
"చూడమ్మా! నీ తండ్రీలాంటి వాడిని. నా మాటవిని జరిగింది మర్చిపోయి, నీ రొటిన్ లో పడిపో. మణిగారు ణే స్నేహితురాలే. కానీ ఏం చేస్తాం? వుయ్ హావ్ టు కాప్రమైజ్...."
"నాకింక ఎవరున్నారు డాక్టర్? నాకు దుఃఖం కలిగినా, అనందం కలిగినా పంచుకోడానికి ఎవరున్నారు....?" అనూష స్వరం కంపించింది.
"ఆవిడా బతికివుంటే మాత్రం అనిక్షణం నీకు దగ్గరగా వుండేవార? అనూషా! స్నేహితులు స్నేహితులే. మనకి తోడు కావాలంటే మన అనే మనిషి వుండాలి. ప్రతిక్షణం మనతో కలసి బతకాలి. మనతో తిరగలి. మనతో మాట్లాడాలి. మన భావాలు పంచుకోవాలి. అది కేవలం లైప్ ఫార్టనర్ తప్ప ఎవరూ చేయలేరు. వీణ నాకు భాద్యత అప్పగించింది, ఈలోగా బాద్ ఇన్సిడెంట్ జరిగింది. మర్చిపో. అతనెవరో నిన్ను ఇష్ట పడుతున్నాట్టా. పెళ్ళిచేసుకో."
అనూష అడిరిపడింది. వీణ ఈ సంగతి ఈ యంకి చెప్పిందా? బుద్ది లేదు? ఛీ....
అయన మళ్ళీ అన్నాడు. "వయసు ఐస్ లాంటిది. వయసు కరిగిపోతే వెనక్కిరాదు. నీకింకా వయసుంది. అనవసరమైన ఆలోచనలు మానేసి, పెళ్ళి చేసుకుని సుఖపడు.... నువ్వు ప్రమిమ్చే వాడికన్నా, నిన్ను ప్రేమించేవాడు నిన్ను భాగా చూసుకుంటాడు. డబ్బు, హొదా అన్నిటికన్నా కంపెనీయన్ ముఖ్యం. ఈ సమయంలో నిన్ను కంటికి రెప్పాలా కాపాడుకోవాలంటే నీ భర్త మాత్రమె చేయగలడు."
అనూష మౌనం చూసి అన్నాడు. "తొందరలేదు. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయనికిరా. అది పాజిటివ్ లా వుండేలా చూసుకో... ఓ.కే... నీకేదన్నా సాయం కావాలంటే నా దగ్గర మోహమాటం లేకుండా అడిగి తీసుకో."
అయన చూపిస్తున్న ఆదరానికి అనూష మనసు కరిగిపోయింది.... " థాంక్యూసర్..." సెలవు తీసుకుని వచ్చేసింది.
తరువాత కిన్ని రాజులకి అనూష మామూలుగా అయింది.
శ్యామల, వీణా హాయిగా నిట్టూర్చారు. "కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పుతుంది. కాలం చాల శక్తివంతంమైంది" అన్నది వీణ.
"నిజమే!" అన్నది శ్యామల.
* * * *
వీణగానీ, మణిగానీ, అనూషని ఒప్పిస్తారనుకుంటే ఇలా జరిగిందేంటి? అసహనంగా అనుకున్నాడు భరణి.
అతనకి చిరాగ్గా వుంది. పత్రిక విషయంలో ఎంతమాత్రం ఏకాగ్రత చూపించ లేకపోతున్నాడు.
అనూష తిరస్కారం అతనికి జీర్ణం కావడంలేదు. నాకేం తక్కువయింది? ఎందుకు వద్దంటోంది? పోనీ, తనే వెళ్ళి మాట్లాడదామంటే, మణి మరణంతో పూర్తిగా గంబీరంగా మారిపోయింది.
ఎలా?
"చాలా మంచి న్యూస్... మీరేప్పటినుంచో ఎదురుచూస్తున్నది."
భరణి మొహంలో రంగులు మారాయి. కొచెం ఎగ్జయిటింగ్ గా అడిగాడు."ఊరించక చెప్తారా? ప్లేజ్... అసలే నాకు టెన్షన్ ఎక్కువ."
"అలాగా! పోనీలెండి. అందుకేనేమో.... హార్ట్ స్పెషలిస్టుని జీవన భాగస్వామిని చేస్తున్నాడు దేవుడు...."
"వ్యాట్!" అతని కళ్లాల్లో సంతోషం, ఉద్వేగం.... చట్టుక్కున కుర్చీలోంచి లేచి వీణ భుజాలు పట్టుకున్నాడు.
"అవును. అనూ! పెళ్ళికి ఒప్పుకుంది."
ఎగిరి గంతేశాడు భరణి. "నిజంగానా! నిజంగానా! చెప్పండి వీణగారూ! ఆవిడా ఒప్పకున్నారా?" అంటూ వీణ భుజాలు పట్టుకుని లేపి, ఉద్వేగంగా కుదిపేశాడు.
"మీ సంతోషానికి నా భుజాలు బలిచేయడం బాగాలేదు భరణీ! మీ మీద మీకింత అపనమకమ్మా?" అన్నది వీణ అతని చెతుల్నుంచి విడిపించుకుని కుర్చీలో కూర్చుంటూ.
భరణి సిగ్గుపడ్డాడు. "సారీ మేడమ్! హఠాత్తుగా కలిగిన అదృష్టానికి తట్టుకోలేకపోతున్నాను. ఉండండి.... మీకు మంచి స్వీటు తెప్పించిపెడతాను. ఏం తింటారు?" అడిగాడు బెల్ నొక్కుతూ.
"ఇప్పుడెం తినను. అంత పెళ్ళిలో తింటానుగానీ, మీ వాళ్ళకి కబురుచేసి రమ్మనండి."
"ష్యూర్! వెంటనే టెలిగ్రాం ఇస్తాను. నో! నో! ఫోన్ చేస్తాను ఇవాళే వెళ్ళి పురోహితుడినికన్సల్ట్ చేస్తాను... ముహూర్తం పెట్టిస్తాను.వీణగారూ! ఆవిడకి మంచి చీరలు, నగలు కొనాలి....న్ కొంచెం హెల్ప్ చేస్తారుగా!"
