"సార్! నేనిది నమ్మలేకపోతున్నాను" అంది విస్మయంగా మృదువని.
"ఏది!నేను నిన్ను కిడ్నాప్ చేయడమా?" నవ్వుతూ అడిగాడు రంగనాథ్.
"అవున్సార్" అంది మృదువని. డిప్యూటీ చీఫ్ మీద ఆమెకు గౌరవభావం వుంది.
"నువ్వు అదృశ్యమయ్యాక నీమీద సీనియర్ గా యాక్షన్ తీసుకోవాలని, రక్షన్ వ్యవహారాలకు సంభందించిన ప్లాపేలో పారిపోయామని ఉన్నతాధికారులను, హోంమంత్రిని నమ్మించాడు చీఫ్ వర్మ. కానీ నాకు నీమీద నమ్మకం. నువ్వెంటో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నీ గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టాను. శరణ్యను చీఫ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో నువ్వు లొంగిపోవడానికి సిద్ద్దపడ్డ విషయం తెలిసింది.
నిన్ను స్పాట్ లోనే చంపెయలన్న పథకం వేసాడు చీఫ్ వర్మ. షంషేర్ దాదా మనుష్యులు ఫిఫ్త్ ఎవెన్యూ చూట్టుముట్టారు. నువ్వు లొంగిపోయినా పారిపోయే ప్రయత్నం చేసానని, ఆ ప్రయత్నంలో చంపొచ్చని అతని ఉద్దేశ్యం. అలాకాని పక్షంలో షంషేర్ దాదా మనుష్యులు ఎటూ రెడీగా ఉన్నారు. అందుకే పథకం ప్రకారం మన డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లోవున్న సిన్సియర్ అధికారుల సహాకారంతో నిన్నూ, అంకిత్ ను కిడ్నాప్ చేయించాను."
"మరి షంషేర్ దాదా మనుష్యులు?"
"అతని మనుష్యులను కన్ ప్యూజ్ చేయటానికి మన డిపార్ట్ మెంట్ అధికారులకే బ్లాక్ డ్రెస్ వేసాను. మరో కారణం కూడా వుంది. ఈ వంకతో పోలీసుశాఖ అంతా ఎలర్టయి ఆ ఏరియాలో వున్న షంషేర్ దాదా మనుష్యులను చుట్టుముడుతుంది. షంషేర్ దాదా మీద నిన్ను కిడ్నాప్ చేసిన నేరం ఒకటి కొత్తగా వచ్చి పడుతుంది. అతడ్ని కన్ ప్యూజ్ చేసి ఇబ్బందుల్లో పెట్టడానికే ఈ ప్లాన్లు" డిప్యూటీ చీఫ్ రంగనాథ్ వివరంగా చెప్పాడు.
"థాంక్యూ సార్!" నాకోసం మీరింత రిస్క్ తీసుకోవడం రియల్లీ ఆయామ్ వెరీ థాంక్ పుల్ టు యు సార్" అంది చేతులు జోడిస్తూ మృదువని.
"నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాక్కదమ్మా. ఇదిగో ఈ అంకిత్ కు.నువ్వు మ డిపార్ట్ మెంట్ కాబట్టి ఓ డిఫెన్స్ ఉన్నతాధికారిగా నిన్ను కాపాడ్డం నా బాధ్యత కాబట్టి, ఓ సిన్సియర్ ఆఫీసర్ గ నా ద్యూతే నిర్వర్తించాను. కానీ అంకిత్ అలాకాదు. నువ్వెవరో తెలియదు. కేవలం వాలైంటైన్స్ డే రోజు అతని వైపు చూపించి అతడే నాక్కబావుయే భర్త అన్నవన్న ఓకే ఒక అద్భుతమైన ఫీలింగ్ టో, అతను తనను తను నీకోసం దేదికేట్ చేసుకున్నాడు.నువ్వు నిర్దోషివని ముందు నమ్మింది అతను. నీకోసం షంషేర్ దాదా లాంటి మాఫియాతో, అతిశక్తివంతమైన డిఫెన్స్ తలపడ్డానికి సిద్ధపడ్డాడు. రియల్లీ హాయ్ ఈజ్ గ్రేట్ చెప్పాడు అంకిత్ వైపు చూస్తూ.
మృదువని అంకిత్ వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు.
"మృదువనీ! ఇప్పుడు చెప్పమ్మా అసలు జరిగిందేమిటి?" అడిగాడు రంగనాథ్.
మృదువని చెప్పడం మొదలెట్టింది.
***
ఆ రోజు మీరు నాకు కొన్ని ఫైల్స్ ఇచ్చి స్టడీ చేయమని చెప్పారు. నేను లైబ్రరీలో కూర్చుని పైల్స్ చూస్తుండిపోయాను. ఆ ఫైల్స్ హడావిడిలో టైం తెలియలేదు. చీకటి పడింది. అఫిసులో మన చీఫ్ తప్ప అంత వెళ్ళిపోయారు. నేను కంగారుగా లైబ్రరీ నుంచి బయటకి వచ్చాను. సరిగ్గా అప్పుడే చీఫ్ గదిలోకి కొందరు అగంతుక్లులు వెళ్ళారు. వాళ్ళను ఎక్కడో చూసినట్టు అనిపించింది.
ఒక్కసారి వాళ్లెవరో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు గుర్తుకొచ్చింది.మీరు స్టడీ చేయమని ఇచ్చిన పైళ్ళాలో వల్లా ఫోటోలు వున్నాయి.ఐఎస్ ఐ గూఢచారులు.
వాళ్లకు మన చీఫ్ పని ఏమిటో అర్దంకాలేదు. మెల్లగా చీఫ్ ఛాంబర్ వైపు వెళ్ళాను. అక్కడ చీఫ్ వాళ్ళతో మాట్లాడుతూ కనిపించారు.
ఓ ప్లాఫీ కంప్యూటర్ పెట్టాడు.మన డిఫెన్స్ సీక్రెట్స్ అతను ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నా దృశ్యాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించాయి మన వివరాల గురించి ఇతరత్రా ఆయుధ వ్యవహారాలు ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ప్లాఫే ని ఐఎస్ ఐచీఫ్ కు పంపించాలని నిర్ణయించుకున్నారు.
ఆ క్షణం ఏ చేయాలో తోచలేదు. మొండి ధైర్యం వచ్చీసిమ్ది. ఆ ప్లాఫీని పట్టుకుని ఐఎస్ ఐ గూఢచారులతో కలసి మన చీఫ్ బయటకు వస్తున్నాడు. అదే టైంలో నేను వేగంగా చీఫ్ దగ్గరకు పరుగెత్తుకువెళ్ళి ఆ ప్లాఫీని లాక్కుని బయటకు పరుగెత్తాను. ఆ తరవాత కధ మీకు తెలిసిందే. డిఫెన్స్ ఓ వైపు, షంషేర్దాదా మనుష్యులు మరో వైపు, ఫోలీసులు ఇంకోవైపు నన్ను వెంటాడారు."
"మరి ఈ విషయం ఉన్నతాధికారులకో, నాకో చెప్పొచ్చుగా" డిఫ్యూటీ చీఫ్ అడిగాడు.
"చేఫొచ్చు. కానీ ఎవర్నీ ఎలా నమ్మాలి. పైగా తనకీ విషయంలో ఎంతోమంది ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని చీఫ్ ఐఎస్ ఐ వాళ్ళతో చెప్పడం విన్నాను. ఆ క్షణం ఎం చేయాలో తోచలేదు. ఎవర్నీ నమ్మాలో కూడా తెలియలేదు."
"ఆ ప్లాఫీని ఎక్కడ పెట్టావు?"
ఒక్కక్షణం ఆగి చెప్పింది.
"న్యూఢిల్లీ రైల్వేష్టేషన్ క్లాక్ రూమ్ లో!"
"వేల్ డన్ మృదువని! నీ సాహసం, నీ బాధలూ, అన్నీ ఒళ్ళు జలదరింపజేస్తూన్నాయి.ఈ దేశాన్ని కపాడ్డం కోసం ఒంటరిగా రెండు బలమైన వ్యవస్థలతో ఢీకొన్నావు" మనస్పూర్తిగా అభినందించాడు డిప్యూటీ చీఫ్.
"సార్! ఇప్పుడా ప్లాఫీ తీసుకువెళ్ళి ప్రెసిడెంట్ కు ఇస్తే" అంకిత్ అడిగాడు.
"ముందు ఆ ప్లాఫీని స్వాధీనం చేసుకోవాలి" మృదువనివైపు తిరిగి "మృదువనీ! నువ్వు, అంకిత్ కలసి రైల్వేష్టేషన్ వెళ్ళండి.మిమ్మల్ని నేను ఫాలో అవుతాను. రాహుల్, చేతన్ లకు నేను మెసేజ్ పంపిమ్స్తాను. సరిగ్గా ఐదుగంటలకు మనం బయల్దేరుతున్నాం. అప్పటివరకూ రెస్ట్ తీసుకోండి" అంటూ బయటకు నడిచాడు రంగనాథ్.
తలుపులు మూసుకున్నాయి.
ఆ గదిలో వాళ్ళిద్దరే మిగిలారు.
మృదువని తలెత్తి అంకిత్ వైపు చూసింది.నిర్మలంగా, చాలా నిర్మలంగా ఉన్నాడు.
ఏ జన్మ పరిచయమో, ఏ రుణ ఫలితమో, ఏ తపస్సు తాలుకు వరమో తన పాలిత ఆత్మీయ ప్రియతముడై...
అంకిత్ రెండు చేతులూ చాచాడు.
ఒక్కస్ఖనం కడలి..కడలి.తరంగమై...ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటమై, ఉదృతమై, మహాద్బుతమైన,అద్బుతమై అతడ్ని చుట్టేసింది.
అప్పుడు... అప్పుడు తన్నుకు వచ్చేసింది దుఃఖం...
ఇన్ని నెలలు....
రోజుల పర్యంతం...
గంటల చొప్పున...
