"వద్దొద్దు. నేను మూడుముప్పయికి శరణ్యతో అక్కడికి వస్తాను."
"నేను ఏ మూలనుంచో శరణ్యను గమనిస్తాను. మోసం చేయాలని ప్రయత్నంచకు.అది నీకే నష్టం" చెప్పి ఫోన్ పెట్టేసింది.
***
డిఫెన్స్ చీఫ్ కు ఫోన్ చేయగానే అక్కడ్నించి ఆటోలో మరో టెలిఫోన్ బూత్ దగ్గరకు వెళ్ళింది.
ఢిల్లీలో ఉన్న అన్ని ప్రతికాఫీసులకూఫోన్ చేసింది, మూడున్నరకు పిప్త్ ఏవెన్యూలో వున్న బిజినెస్ సెంటర్ దగ్గరకి రిపోర్టలను పంపాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది.
ఆ తరువాత అంకిత్ కూ ఫోన్ చేసింది, మూడున్నరకు ఎవన్యూ దగ్గర్లో వున్న బిజినెస్ సంతర్ దగ్గరకు రమ్మంది ఫిప్త్ టైమ్, వెన్యూ మారిన విషయం చెప్పింది. ఆమెకు చదరంగం తెలీదు.కానీ గ్రాండ్ మాస్టర్ తన పావులను చకచకా కదిలినట్టు కదుల్తోంది.
తెగింపు మనిషి ఆలోచనను చాలాసార్లు పదును పెడుతుంది. ఆటో ఇటో తేల్చుకోవాలనే ఆలోచనలో వుంది ఆమె.
***
సరికొత్త యుద్దానికి రంగం సిద్ధమైంది.
ఫిప్త్ ఎవెన్యూ మొత్తాన్ని షంషేర్ దాదా మనుష్యులు ఆక్రమించుకున్నారు. మరో వైపు డిఫెన్స్ మనుష్యులూ.
మూడుగంటల ఇరవై అయిదు నిముషాలు. ప్రెస్ కదలివచ్చింది.టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఉదయం నుంచీ మృదువనిఅక్కడే ఉంది.బట్నించి ఫిప్త్ ఎవెన్యూలోకి ప్రవేశించిందని, అక్కడ్నించి బిజినెస్ సెంటర్లో కి వస్తుందని షంషేర్ దాదా మనుష్యులు కావు కాసారు. అదే వాళ్ళు చేసిన పొరపాటు.
***
మూడుగంటల ముప్పయి నిముషాలు.
ప్రెస్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు అక్కడికి రావడం చూసి జనం గుమిగూడారు. ఓవైపు షంషేర్ దాదా మనుష్యులు, సరిగ్గా అదే సమయంలో ఓ వ్యాన్ వచ్చింది. అందులో నుంచి శరణ్య దిగింది.
బిజినెస్ సెంటర్ లో టెర్రేస్ మీద వున్న మృదువని శరణ్యను గమనించింది. సరిగ్గా పదినిముషాల ముందే జేమ్స్ కు చెప్పింది.
జేమ్స్ బిజినెస్ సెంటర్ లో ఓ మూల నిలపడ్డారు. శరణ్యను వెంటనే అక్కడ్నించి తప్పించే బాధత జేమ్స్ దే. అప్పటికే కారుతోసహా జేమ్స్ రెడీగా ఉన్నాడు.
మృదువని టెర్రస్ మీదనుంచే చీఫ్ కు సెల్ చేసింది తన దగ్గరున్న సెల్ ద్వారా.
"మిస్టర్ వర్మా! నేను టెర్రస్ మీద వున్నాను. నువ్వు శరణ్యను వదిలేయ్" అంది.
"నువ్వు నాకు కనిపించటంలేదు" అన్నాడు టెర్రస్ వైపు చూస్తూ చీఫ్ వర్మ.
"సరిగ్గా కళ్ళజోడు పెట్టుకుని చూడు" అంది మృదువని.
చీఫ్ వర్మ టెర్రస్ పైకి చూసాడు. టెర్రస్ మీద నిలబడి కనిపించింది మృదువని.వర్మ షంషేర్ దాదా మనుష్యుల వైపు చూసాడు. వాళ్ళు ఎలర్ట్ గానే ఉన్నారు.తనకిక శరణ్యతో పనిలేదు.వెంటనే శరణ్యను వదిలేసాడు.
జేమ్స్ ఆ జనంలో నుంచి శరణ్య దగ్గరకి వచ్చి ఆమె పక్కనే కారాపాడు. శరణ్యను లోపలకి లాగి కారు స్టార్ట్ చేసాడు.
"మృదువనీ! మర్యాదగా లొంగిపో. సరెండర్ యూవర్ సేల్స్" మెగా ఫోన్ లో హేచ్చారించాడు చీఫ్ వర్మ.ఆమెను పారిపోయేలాచేసి ఆ ప్రయత్నంలో ఘాట్ చేసినట్టు... ఇవ్వమన్నది అతని ఆలోచన.
మృదువనిలిప్టులో దిగుతోంది. ఆమెను అరెస్ట్ చేసే దృశ్యాన్ని చిత్రీకరించడానికి టీవీ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ కవర్ చేయటానికి రిపోర్టర్లు రెడీగా ఉన్నారు. అంకిత్ మృదువని కోసం ఎదురుచూస్తున్నాడు.
మృదువని కిందకి దిగీ రాగానే చంపటానికి షంషేర్ దాదా మనుష్యులు రెడీగా ఉన్నారు.మృదువని కిందకి దిగింది. ఒక్కో అడుగు వేస్తోంది చీఫ్ వైపు. అదే సమయంలో షంషేర్ దాదా మనుష్యులు తమ గన్స్ మృదువనివైపు ఎయిమ్ చేసారు.
స్లింట్ సెకన్. మృదువని ఓ అడుగు ముందుకు వేసింది. ఆమె ముందు బ్లాక్ కలర్ వ్యాన్ ఆగడం,అందులోనుంచి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆగంతుకులు దిగడం, మృదువనిని లోపలకు లాగడం, ఆ వ్యాన్ కదలడం క్షణాల్లో జరిగిపోయింది.
షంషేర్ దాదా మనుష్యులు మృదువనిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు" ఎవరో అరిచారు.
క్షణాల్లో ఆ న్యూస్ ఆ ప్రమ్తమంత స్పేడ్ అయింది.
మృదువనిని కిడ్నాప్ చేసింది తమ మనుష్యులే అన్నా ఉద్దేశ్యంలో ఫోలీసులు అక్కడికి వస్తే న్యూసెన్స్ అవుతుందని చల్లగా జారుకోబోయారు.
అప్పటికే ఫోలీసులు అ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టయింది షంషేర్ దాదా మనుషుల పని. డిఫెన్స్ వర్మ షాకింగ్ గా చూస్తూండిపోయాడు. అతనికంతా కన్ వ్యూజన్ గా వుంది.
అంకిత్ కంగారుగా ఆ వ్యం ని ఫాలో అవబావుయాడు. సరిగ్గా అప్పుడే అతని తల మీద ఎవరో బలంగా కొట్టారు. తరువాత ఒక కారులోకి నెట్టారు.
***
మృదువని కళ్ళు తెరిచింది. అంతా చీకటిగా వుంది. మెల్లగా లేచి తుడుముకుమ్తూ ముందుకు కదిలింది. ఆమె కళ్ళు క్రమక్రమంగా చీకటికి అలవాటుపడ్డాయి. మరో వ్యక్తి ఆ గదిలో బండగా వున్నాడని అర్దమైంది.
"ఎవరు?" మెల్లగా అంది మృదువని.
సరిగ్గా అప్పుడే ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. రెండు క్షణాల తరువాత మూసుకున్నాయి. కొత్త వ్యక్తి అడుగుల శబ్దం వినిపిస్తోంది. మూడోక్షణంఆ గదిలో లైటు వెలిగింది.
"మృదువనితన పక్కనేవున్న మరో బందీవైపు చూసి "అంకిత్ మీరా!" అంది.
అంకిత్ మృదువని వైపు ఆశ్చర్యంగా చూసి "మృదువనీ" అన్నాడు.
ఆ ఇద్దరూ తలెత్తి ఎదురుగా వున్న వ్యక్తిని చూసి మరింత ఆశ్చర్యపోయారు.
"సార్! మీరా!"మృదువని గొంతులో విస్మయం.
"అవును. నేనే. డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ ర్మగానాత్. మృదువనీ, అంకిత్ ఇంకా షాక్ లోనే వున్నారు. వాళ్లినిజం నమ్మలేకపోతున్నారు.
"ఏంటి ఆశ్చర్యంగా వుందా?" రంగనాథ్ అడిగాడు.
***
