నిముషాల వేదనలు...
క్షణాల మరనంరుదంగా ద్వనుల మధ్య అలిసి, నీరసించి, శుష్కించి, కృంగి...
"మృదూ! ఐ లవ్ యూ... దు యు లవ్ మీ"ఆమె చెవి దగ్గర గుసగుసగా అడిగాడు.
ఆమె 'ఐటూ' అని చెప్పలేదు. అంతకన్నా గొప్పదైన భావంతో అంతకన్నా అతి పదిలమైన అపురూపమైన అనిభూతితో చెప్పింది... ఆమె సలడని బిగి కౌగలితాలూకు ఉచ్చ్వస నిశ్వాసాలు ఆమె మనసులో భావాలను ఆమె గుండె వేగంతో పోటీపడి తర్జూమా చేస్తున్నాయి.
***
సాయంత్రం అయిదు గంటలు.
షంషేర్ దాదా,డిఫెన్స్ చీఫ్ లే వున్నారా గదిలో.
"ఆ డిప్యూటీ చీఫ్ రంగానాథ్ మబ్నల్ని మోసం చేసాడు.అతనే మృదువనిని కిడ్నాప్ చేసి ఆ నేరం నామీదకి పెట్టి ఫోలీసులను ఉసిగొల్పాడు" కోపంగా అన్నాడు షంషేర్ దాదా.
"అవును దాదా. ఇన్నాలుగా మనల్ని నమ్ముతున్నట్లు నటించాడు."
"డోంట్ వర్రీ మిస్టర్ వర్మా. ఈ ఢిల్లీలో ఏ మూలవున్నా మృదువనీ, ఆ రంగనాథ్ ని వదలను. వీళ్ళతోపాటు మనకు మూడో శత్రువు వున్నాడు... అంకిత్..."
"ఏదైనా చేయాలి... ఇప్పటికే ప్రెస్ లో నీకు నెగిటివ్ న్యూస్ వచ్చింది. త్వరలో నామీద కూడా యుద్ధం ఆరంభమవుతుంది" కంగారుగా అన్నాడు వర్మ.
సరిగ్గా అప్పుడే ఓవ్యక్తి వచ్చి షంషేర్ దాదా చెవిలో ఏదో చెప్పాడు. దాదా మొహం వెలిగిపోయింది.
"వర్మా! అంకిత్, మృదువని న్యూ ఢిల్లీ రైల్వేష్టేషన్ వైపు వెళ్తున్నారు. వాళ్ళమీద అటాక్ చేద్దాం" చెప్పాడు దాదా. అంకిత్ ని, మృదువనిని హత్య చేయడానికి పథకం సిద్ధమైంది. మరోవైపు డిప్యూటీ చెఫ్ రంగనాథ్ కు వేట మొదలైంది.
***
ఉపసంహారం:
మృదువని, అంకిత్ ఓ కారులో ఢిల్లీ రైల్వేష్టేషన్ వైపు వెళ్తున్నారు.వాళ్ళ వెనుకే రాహుల్, చేతన్, ప్రద్యుమ్న తదితరులు ఓ కారులో బయల్దేరారు.
అంతక్రితమే న్యూఢిల్లీ రైల్వేష్టేషన్ లో డిప్యూటీ చీఫ్ నమ్మకస్తులైన అధికారులు అయూదాలతో రెడీగా వున్నారు. మఫ్టీలో న్యూఢిల్లీ ఫోలీసులు అంగుళం అంగుళం గాలిస్తున్నారు.
మరోవైపు రంగనాథ్ వీటిని పర్యవేక్షిస్తున్నాడు. రైల్వేష్టేషన్ లో అడుగుపెట్టిన మృదువనిని, అంకిత్ ని హత్య చేయాలన్నా పధకం బెడిసి కొట్టింది. రైల్వేష్టేషన్ లోకి ప్రవేశించిన షంషేర్ దేడా మనుష్యులను డిఫెన్స్ అధ్కారులు, ఫోలీసు అధికారులు చుట్టుముట్టారు.
డిప్యూటీ చీఫ్ రంగనాథ్ ను తక్కువగా అంచనా వేసిన ఫలితమిది. మరోవైపు రంగనాథ్ ఆద్వర్యంలో షంషేర్ దాదాకోసం గాలింపు మొదలైంది.ఎప్పుడైతే తన అనుచరులంతా ఫోలీసులకు పట్టుపడ్డారని తెలిసిందో దూబాయ్ పారిపోయాడు. అండర్ వరల్డ్ డాన్ షంషేర్ దాదా. మృదువనిని తానే స్వయంగా చంపాలని వచ్చిన చీఫ్ వర్మ, మృదువని,అంకిత్ ప్లాఫీతో ఫోలీసుల బందోబస్తుతో బయటకు రావడంతో, తను చేసిన ద్రోహం బయటపడుతుందని, సూసయిడ్ నోట్ రాసుకుని ట్రైన్ కిందపడి ఘోరమైన చావు చచ్చాడు.
డబ్బుమీద అత్యాశే తనని దేశ ద్రోహ నేరానికి ప్రేరేపించిందని సూసయిడ్ నోట్ లో రాసాడు.
డిప్యూటీ చీఫ్ రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది ప్రభుత్వం.
మృదువని సాహాసాన్ని, ఆమెను కాపాడ్డంలో అంకిత్ వహించిన పాత్రను ప్రత్యేకంగా ప్రశింసించారు ప్రధానమంత్రి.
జేమ్స్, శరణ్యలు రిజిస్టార్ ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు.
ది ట్వీస్ట్:
న్యూ ఢిల్లీ రైల్వేష్టేషన్.
అంకిత్, రాహుల్, చేతన్ లు ఉన్నారు.
"బాసూ! మనం ఇక్కడకి ఎందుకు వచ్చాం?" అడిగాడు రాహుల్.
"మృదువని నాతో మాట్లాడతానని చెప్పింది. ఆమె వచ్చేవరకూ కంపెనీగా వుంది ఆమె వచ్చాక అలా బెన్సార్ గా ఓ అరగంట తిరిగిరండి" అన్నాడు అంకిత్.
"ఇంతకీ నీ ప్రేమ సంగతి మృదువనికి చెప్పావా?"
"చెప్పాను."
