Previous Page Next Page 
కావేరి పేజి 47

    ఎంతో బరువుగావున్న వడ్డాణాన్ని చూడగానే దానివిలువ ఎన్ని వేలు వుంటుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు. వడ్డాణాన్ని తన యింటిలో దాచుకుని గాజులను మాత్రం అమ్మి ఆధునీకమయిన పర్నీచర్ కొన్నాడు కావేరికోసమని! వాటిని లెక్కల్లో పదింతలు ఖరీదుగాచెప్పి నమ్మించేశాడు. కాని అవి నిజానికి నెలకి యింత అని అద్దెకి తెచ్చినవి! ఆ సంగతి కావేరికి తెలియదు.నెలఅద్దె ముందుగానే చెల్లించాడు.

    ఇంకా అతను చేసేపని కావేరిని తనకి రాబడివున్న వాళ్ళందరినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలని, డైరెక్టర్లనీ పరిచయంచేయటం. వాళ్ళదగ్గిర మాత్రం ఒక్కరాత్రికి అయిదువందలనుంచి వెయ్యిరూపాయలవరకూ వసూలుచేయటం! అలా వారిని తీసుకువచ్చినప్పుడు కావేరిని, ఆ వ్యక్తిని ఆ యింటిలో వదిలి తను తనయింటికి వెళ్ళిపోవటం! కాపలాకిమాత్రం అంబుజం వుంటుంది.

    తనకి సినిమా చాన్సులు ఇస్తారన్న ఉద్దేశ్యంతో వాళ్ళుచెప్పినట్లుగా వాళ్ళని సంతృప్తిపర్చటం కావేరీవంతు అయింది.

    రోజురోజుకీ ఆ జీవితానికి అలవాటుపడిపోయింది. ఇప్పుడు వచ్చిన వేలాయుధం పెద్ద నిర్మాత అని తనూ వినియున్నది అతను తీసే జంతువుల సినిమా షూటింగ్స్ కి తనూ వెళ్ళింది. వేలాయుధం తనకంటూ తనతోనే కారులో తనకుర్చీ తెచ్చుకుని మరీ కూర్చునేవాడు. తన పిక్చర్సుకి పేరుపొందిన డైరెక్టర్ ని పెట్టుకునేవాడు. తను చెప్పినవిధంగానే ఆ డైరెక్టర్, కెమెరామెన్ నడుచుకోవటం, ఈ షాటు యిలా తీయాలీ? అనంటే ఆ విధంగానే డైరెక్టర్, కెమెరా మెన్ తీసేవారు. ఆయన జంతువులపై సినిమాలు అనేకంతీసి లక్షలకి లక్షలు సంపాదించి దివాళా తీసిన స్టూడియో యజమానిదగ్గర తక్కువ ధరకి స్టూడియోని కొని అంతకంటే తక్కువ పెట్టుబడితో జంతువుల సినిమాలుతీసి విపరీతంగా సంపాదించిన వేలాయుధం ఆ స్టూడియో కొన్నతరువతః ఎంతో ఆధునీకం చేశాడు. రికార్డింగ్ థియేటర్, కలర్ లాబ్ వంటి సౌకర్యాలన్నీ కలుగచేశాడు.

    ఇప్పుడు వేలాయుధం స్టూడియో అంటే ఎక్కడుందో ఇట్టేచెప్పగలను లైట్ బాయ్ నుంచి దారేపోయే దానయ్యతోసహా!

    ఆయన పెద్ద ప్రొడ్యూసర్ క్రిందలెక్క! ఆయన తన పిక్చర్ లో హీరోయిన్ గా బుక్ చేశాడంటేనే చాలు! నిర్మాతల వర్గంలో సంచలనం రేపినట్లే!

    ఆ హీరోయిన్ నటించిన సినిమా షూటింగు పూర్తిచేసుకోకముందే ఆమె ఎలా నటించింధో చూడకుండానే అనేకమంది నిర్మాతలు క్యూలో నిలబడి తాము తీయబోయే పిక్చర్ లో నటించేందుకు బుక్ చేసుకునేటందుకు క్యూలో నిలబడతారు. ఎంత రేటుకయినా బుక్ చేసుకుంటారు.

    ఈ విషయం అంబుజం వెంకట్రావులద్వారానే కాక తనను వేలాయుధం తీస్తున్న జంతువుల సినిమా షూటింగుకని తీసుకెళ్ళినప్పుడు తనూ చూసింది.

    పెద్ద డైరెక్టర్ అనేవాడుకూడా వేలాయుధంముందు పిల్లికూన అయిపోతాడు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకోసం ఎంతోమంది అమ్మాయిలూ తాము వివిధ ఫోజులలో తీయించుకున్న ఫోటోలు చేతపట్టుకుని ఆయన పిలుపుకోసం పడిగాపులు పడతారు. అలాంటి వేలాయుధం తనదగ్గరకే వచ్చాడంటే కావేరికి ఎంతో ఆనందంగావుంది. మరెంతో గొప్పగావుంది.

    కావేరి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పూసగుచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు వెంకట్రావు.

    "ఈ హాలులో కూర్చుని మాట్లాడుతుంటే అందరికీ వినపడతాయి. మనం ఫ్రీగా మాట్లాడుకోవాలంటే ఏకాంతం కావాలి! నీతో ముఖ్యమయిన విషయాలు చర్చించాలి! నాకు సంతృప్తికరమయిన జవాబులు లభించితే నిన్ను వరుసగా నేను తీసే నాలుగు పిక్చర్సులో హీరోయిన్ ని చేస్తాను" అన్నాడు కావేరీనే నిశితంగా పరిశీలించుతూ!

    "అలాగేనండీ! ఈ గదిలో కోర్చుని మాట్లాడుకుందాం! రండి! రండి!" అంది ఎంతో ఆనందంగా.

    వేలాయుధం తనలోని బలాన్నంతటినీ ఊపులోకి తెచ్చుకుని లేచేసరికి సోఫా కిర్రుకిర్రుమంటూ ఎక్కువగా శబ్దంచేసింది. మరొక్కసారి ఊపితేచాలు విరిగిపోయేటట్లుగా అనిపించింది కావేరికి!

    ఇద్దరూ ఆ యింటికి ఓ మూలగావున్న పడగగదిలోకి వెళ్ళారు. ఆ గదిలోవున్న డబుల్ కాట్, పూవులున్న దుప్పటి పరుపుమీద పరిచి వుంది. ఓ మూలవున్న టీపాయ్ మీద అగరవత్తులు కాలుతూ వున్నాయి. అలా కాలుతూ అవి వెదజల్లుతున్న సుగంధ పరిమళం ఆ గదంతా ఆక్రమించుకున్నది.

    ఆ డబుల్ కాట్ తప్ప ఆ గదిలో ఓ కుర్చీగానీ, సోఫాగానీ లేదు! వచ్చినవాళ్ళు ఆ మంచంమీద కూర్చోవలసిందే!

    వేలాయుధం యిలాంటి గదులెన్నింటినో ఆయన హయాములో ఎన్నింటినో చూశాడు. ఆగదుల నాలుగుగోడలమధ్యా ఎంతోమంది అందమయిన అమ్మాయిలను అనుభవించాడు.

    అందులో కొందరికి తన సినిమాల్లో చిన్నచిన్న వేషాలు ఇచ్చాడు. మరికొందరిని హీరోయిన్ చేస్తానని, ఇంకెవ్వరూ ఆ అమ్మాయిని తమపిక్చర్ లో బుక్ చేసుకోకుండాను, తన అధీనంలోనేవుండేటట్లుగా రెండు సినిమాల్లో నటించేటందుకు అగ్రిమెంటు వ్రాయించుకోవటం, నెలకి ఇన్నివందలని ఆ అమ్మాయి పోషణకి యివ్వటం, తన అధీనంలో వుంచుకోవటం, తనకి అవసరం అయినా రాత్రిళ్ళు ఆ అమ్మాయిదగ్గిరకు వెళ్ళటం, తన కోరికలు తీర్చుకోవటంవరకే వాళ్ళని పరిమితం చేసేవాడు తప్ప వాళ్ళకోసం తీసే సినిమాని ప్రారంభించకపోవటానికి కారణం?

    సాలెగూడులాంటి ఈ రంగుల విషవలయంలో చిక్కుకున్న ఏ ఆడపిల్లా హీరోయిన్ గా రాలేదు! రాదుకూడాను!

    యిలాంటి ఎన్ని వందలమంది ఏవేవో ఊహలతో మద్రాసు మహానగరంలో అడుగుపెట్టి వెంకట్రావులాంటి బ్రతుకుతెరువుకోసం వెంపర్లాడి పారిపోయివచ్చిన అమ్మాయిలను వలవేసి పట్టుకుని వారికి మరెన్నో ఆశలుకల్పించి వేలాయుధంలాంటి వారికి అంకితం అయిపోయి సాలెగూడులాంటి ఆ ఉచ్చులో చిక్కుకుపోయి బయటపడలేక చివరికి సమిధలుగానే మిగిలిపోయిన వాళ్ళెంతమందో?

    "తలుపులు వేసిరా!" అన్నాడు వేలాయుధం యికిలించుథూ! అలవాటయినచేతులు సంకోచించకుండా తలుపులుమూసి గడియపెట్టివచ్చి వేలాయుధం పక్కనకూర్చుంది కావేరి.

    నశ్యంకంపు గుప్పుమంది.

    ముక్కులు నలుపుకునే నెపంతో నలుపుకుంటూ వుండిపోయింది.

    "నీగురించి వెంకట్రావు నాకంతా చెప్పాడు. నీలాంటి ఔత్సాహిక ఆర్టిస్టులే కావాలి! నీకు నటనానుభావం చాలాచాలా వుందన్నాడు. ఎంతో అందమయినదానివని నీ ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూస్తే ఏం తెలుస్తుంది? స్వయంగా చూసి నీ గురించి అంచనావేసుకుని, కొత్తవాళ్ళతోనే తీయబోయే పిక్చర్ లోకి హీరోయిన్ గా నువ్వు పనికి వస్తావో? లేదో? నిర్ణయించుదామని వచ్చాను. నా కంటికి బాగా నచ్చావు హీరోయిన్ పాత్ర యిస్తే చేయగలవో? లేదో ఇంకా చూడాలి! చూద్దామనే వచ్చాను. తీరుబడిచేసుకుని నీకోసం! అబ్బబ్బా! ఒక్కక్షణం తీరుబడి వుండదంటే నమ్ము!

    వారంరోజులనుంచీ వెంకట్రావు బ్రతిమాలగా యిదిగో....ఇప్పటికి వీలయింది!" అంటూ కావేరివైపుకి చూశాడు వేలాయుధం! తనమాట లకి ఏ విధంగా స్పందించుతుందోనని.

    స్పందించిన లక్షణాలే ఎక్కువగా కనిపించేసరికి ఎంతో ధైర్యం వచ్చింది వేలాయుధానికి! ఎంతో ఆప్యాయంగా చెయ్యిపట్టుకుని-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS