గీ|| భూరిసుకవీంద్ర మందార మేరుధీర
చారుగుణషీలా సత్ర్కియాసత్య లోల
...... ........
వళ్ళేచెంచలరాయ! సత్ప్రభువిధేయ! 468
రుద్రకవి విషయ మప్పకవీయమున నిట్లు కలదు :
చ|| కొలఁది గమున్ను చెప్పేఁ జలిగొండనృసింహుఁడు వెల్గయంచు నీ
వల్ల నగసాలిరుద్ర వసువాఁడును మొల్క లటంచుఁ గూరిచె
దెలియక కొందఱిట్లు వికృతి బడమధ్యమున లకారరే
ఫలతలపై యాకారమును బాపుదు రార్యులు నవ్వునట్లుగ 469
ఇందుకు వినుకొండలో గుంటుపల్లి భాస్కరయగారి సమ్ముఖమందుఁ గందుకూరి రుద్రయగారు చెప్పిన పద్యము ---
చ|| వెలగకు వెల్గయంచు సరవిం జలిగొండనృసింహుఁ డాడఁగా,
మొలకకు మొల్కయంచుఁ గనిముఖ్యుఁడు రుద్రయ పల్క దోసమా?
భళిభళి మంచి మాటాయే ప్రబంధము నా జలరాశి యందులో
వల నెఱసు ల్గ్రహింతురె యాపారము లౌమణు లెల్ల నుండఁగ. 470
మొల్క యను ప్రయోగము గల పద్య మిది--
ఉ|| ఎన్నఁడు నేరిచె బెళుకు లీచెలికన్నులు, కారుముబ్బు ల
న్నన్నః కూరల్ , పిఱుందు పటువై పటువైఖరిఁ గైకొనెంగదే,
మొన్న గదమ్మ పిన్న మొలమొల్కలు నేఁడివె ముద్దులాడి లేఁ
జన్నులు మిన్నలై వయఁటసందున దాఁగురుమూఁత లాడేడు. 471
ఈ క్రింది పద్య మొక్కటి యువలబ్దమయినది :-
సీ|| పాటీరగంధహృ ద్ఘోటీసమంచిత
దాటీతిరస్కారి ఘెటకములు
కోటీందు వరకళా పోటీడ్జాదంభోళి
దంభోళిసితశంఖ వ్రజంబు (?)
చేటీవిటాళీ కవాటీఘనారామ
వాటీశుభగ్రామ వారములును
.... .... .... ....
వృదుల సత్కుండలములు
గీ|| ప్రౌడి గైకొంటి గీర్వాణపద సమృద్ది
శతకహనుమజ్జయాది ప్రశస్తకావ్య
ప్రీతి శ్రీకృష్ణరాయ ధాత్రీశువలన
మనుకులుండను రుద్రార్య ఘనసుకవిని. 472
తెనాలి రామకృష్ణకవి
ఆంధ్రకవులలోఁ దెనాలిరామకృష్ణకవి మిక్కిలి పరిహాస చతురుఁడు; ప్రౌడకవితాధురీణుఁడు. శ్రీకృష్ణదేవరాయలవారి యస్థానకవులలో నొక్కఁడని కొందఱు; తర్వాతి వాఁ డని మఱికొందఱు. రాయల యాస్థానకవి యనుటకును నాధారములు కలవు. పాండురంగమహత్మ్యము, ఘటికాచలమహాత్మ్యము నీతనికృతులు. ఈతనికి వికటకవి యని పేరు. ఈతని యశస్సును గూర్చి యితరకవిచేఁ జెప్పఁబడిన పద్యము.
ఉ|| లింగనిషిద్దుఁ గల్వలచెలిం గని మేచక కంధరుం ద్రిశూ
లిం గని సంగతాళి లవలిం గని కర్దమదూషిత న్మృణా
ళింగని కృష్ణచేలుని హలిం గని నీలకచ విధాతృనా
లిం గని రామకృష్ణకవిలింగనీకీర్తి హసించు దిక్కుల. 473
రామకృష్ణుఁడు వేఱు , రామలింగఁడు వేఱు గాఁగూడఁ దెలియవచ్చుచున్నది. ఉద్భటారాధ్యచరిత్రాదులు రామలింగకృతులట! విచారింపవలసి యున్నది.
రాయలయాస్థానకవులలో నగ్రగణ్యఁడగు పెద్దనామాత్యుని మను చరిత్రమున "అమవసనిసికి" అను పద ప్రయోగమును విని రామకృష్ణుఁడు--
క|| ఎమి తిని సెపితివి కపితము
బ్రమపడి వెఱిపుచ్చకాయ వడిఁ దిని సెపి తో
యుమెతకయ తిని సెపితివో
యమవసనిసి యనెడిమాట యలసని పెదనా! 474
అని యాక్షేపించే నందరు. ఈ యాక్షేపము నొకవేళఁ బరిహసము నకై పెద్ద నామాత్యునిఁ గూర్చి రామకృష్ణుఁడు చేసి యుండు నెమో! ఈతనికిఁ బెద్దన పై నపరిమిత గౌరవము కలదు. పెద్దన్న కెంతో యుత్క్రుష్టత నెట్టి దన కెంతయు నికృష్టతను బద్యమునఁ జెప్పుకొనెను. చూడుఁడు--
క|| కవి యల్లసాని పెద్దన
కవి తిక్కన'సోమయాజి గణుతింపంగాఁ
గవి నేను రామకృష్ణుఁడఁ
గవి యను నామంబు నీరుకాకికి లేదే? 475
అల్లసాని పెద్దన్నకవి , తిక్కనసోమయాజికవి, రామకృష్ణుఁడను నేను కవిని, ఇంకను గొందఱకుఁ గవియును పేరు గలదు! నీరు కాకికిని గలదు; అని కూడా నర్ధము చూచుకొన నగును.
నందితిమ్మన యొకఁనాడు తనయింట నుయ్యేలలో నూఁగుచు గవిత్వము రచించుకొనుచుండఁగా నీకొంటే కోణంగి రామకృష్ణుఁడక్కడ కరిగి తాతా ఊతునా యని యడిగెనట! తిమ్మకవి యంగీకృతి సూచింపఁగా రామకృష్ణుఁడు తుబుక్కున మొగమున నుమిసి, నీకిదేమిచేటుఁగాలమున, "నూఁతునా' యని గదా నేనడిగినది; దాని కంగీకరించితిరి గావున నట్లు చేసితిననేనట! కోవ మావఁ జాలక తిమ్మకవి యేదురనున్న యాతని నుయ్యెలపైనుండి యెడమకాలితో మొగమునఁ దాన్నేనట! పాపము వల్లూడేను. చప్పున నింటికరిగి దుప్పి కొమ్ము నరుగఁదీసి వల్గుగా నదుకుకొనెను. మఱునాఁడు రాయలసభకు వచ్చినప్పుడేట్లో యీ వార్త రాయలకుఁ దెలిసి యస్థానకవుల కిట్లు సమస్య నోసఁగెను- రవిగాననిచొఁ గవి కాంచునే గదా" ఏకవియోగాని సరిగా నిట్లు పూరించెను --
ఉ|| అరవి వీరభద్రుచరణాహతి డుల్లినబోసినోటికి
నేరఁడు రామకృష్ణకవి నేరిచెఁబో మన ముక్కు తిమ్మరాట్
క్రూరవదాహతిం దెగినకొక్కిరివంటికి దుప్పి కొమ్ము ప
ల్గా రచియించే నౌర! రవి గాననిచో ఁగని కాంచునే కదా! 476
(చూ.పుట 174)
ప్రెగడరాజునరసరా జనుకవి యొకఁడు పెద్దనాదికవీశ్వరుల సరకు గొనక వారికవిత్వములందు దోషములు గలపని యందందు వదరులాడు చుండెడివాఁడట! అతఁడును స్వతస్సమర్దుఁడే . ఒకప్పుడాతఁడు కృష్ణరాయల యాస్తానమునకు వచ్చి పెద్దనాదులకంటే హెచ్చుగా నశువుగాఁ గవిత్వము రచింతును: సభకూర్పింపుమని కోరెను. రాయలు మఱుదినము సభగూర్ప నంగీ కరించెను. పెద్దనాదులు కొంకఁదొడఁగిరి. రామకృష్ణుఁడు "నే నాకవినడఁడఁగఁ ద్రోక్కేద" నని పెద్దనాదులకు ధైర్యము చెప్పెను. మఱునాఁడు సభకు నరసరాజు వచ్చి గంటకుఁ గొన్ని వందలు పద్యములు చెప్పేదననెను. రామకృష్ణుఁడు కొన్ని వేలు చెప్పేదననేను; వారిర్వురకు స్పర్ధ యేర్పడేను. ఉండునేమో! నేను కవిత్వము చెప్పెదను చూపుమనెను. నరసరాజునకు వ్రాయసమునఁ దనయంతవాఁడు లేఁడనియు గర్వముగలదు. కావునఁ దానే వ్రాసెదననియుఁ గల మాఁగనీయనంత వడిగా ఁ జెప్పవలయు ననియుఁ దప్పులు చెప్పిన దిద్దేద ననియు బ్రతినపూనెను. రామకృష్ణుఁడు చిత్రోచ్చారణముతో నొక పద్యమున జదివెను. నరసరాజు వ్రాయలేక గింజులాడుకొని యెట్టకేల కిట్టు వ్రాసెను --
క|| తృవ్వట బాబా తలపైఁ
బువ్వట జాబిల్లి వల్వ బూచట చేదే
బువ్వట చూడఁగను హుళు
క్కవ్వట తలఁపంగ నిట్టి హరునకు జేజే! 477
ఇది వ్రాయుటకు రామకృష్ణకవి పద్యము చదివి కొంత సేపూరకుండ వలసివచ్చెను. నరసరాజునకు వ్రాఁత బిరుదు పోయినది. రెండవపద్య మిల్టు చెప్పెను..
