Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 45

    "రెండూ యాబైకి. ఇప్పుడు రెండయింది."

    "సరే! మృదువని ఫోన్ చేస్తే ఆమె కండిషన్ కు ఒప్పుకో. మనకు కావలసింది శరణ్యకాదు" దాదా ఆలోచించి చెప్పాడు.

    వర్మకూ అదే కరెక్ట్ అనిపించింది.

    "ఈలోగా నేనోసారి శరణ్యను కలుస్తాను" చెప్పి లేచాడు వర్మ. దాదా అలాగే అన్నట్టు తలూపి చెప్పాడు.

    "మృదువని ఎక్కడ కలుసుకుంటానంటుందో ఆమె ఫోన్ చేసిన వెంటనే నాకు చెప్పు."

    "ఎందుకు?" అడిగాడు వర్మ.

    "ఆ స్పాట్ లోనే మృదువని ఫినిష్ చేయటానికి. ఆమెను మీరు అరెస్టు చేసిన మరుక్షణమే మీ డిప్యూటీ చీఫ్ ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. మృదువని నోరు విప్పితే మీరు రిస్క్ లో పడతారు. అందుకే అక్కడే ఆమెను ఫినిష్ చేస్తే సరి!"

    వర్మ నవ్వి "గుడ్ ఐడియా" అంటూ బయటకు నడిచాడు.
   
                                                 ***
    అది ఓ చిన్న గది.వేమ్తలేషణ్ కూడా సరిగ్గా లేదు. ఆ గదిలో ఓ మూలకు కూచుని వుంది శరణ్య. ఆమె శరీరమంతా పచ్చిపుండులా తయారైంది. తనని ఇక్కడకి తీసుకు వచ్చి ఎన్ని త్రాజులు అయిఇమ్దావు కూడా తెలియదు.

    ఆ రోజు తనని అరెస్ట్ చేసి తీసుకు వచ్చకా ఆమెకు ఆ భయమ్కరమై సంఘటన కాళ్ళ ముందు మెదిలింది.

    దారిలో తన కళ్ళకు గంటలు కట్టారు. తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు. తన కాళ్ళ ముందు అంతా శూన్యమే!
   
                                                   ***

    "ఊ...దిగు!" ఓ వ్యక్తి శరణ్య పెడరెక్కలు విరిచి ముందుకు తోసాడు.

    "అమ్మా!" అంది బాధతో శరణ్య.

    ఆ తరువాత ఇరవై నిముషాలపాటు నడిపించారు. ఓ గదిలో తోసారు. అయిదు నిముషాల అనమాతరం కళ్ళకు వున్న గమతలు విప్పారు. చాలాసేపు చీకటేకాళ్ళ ముందు... ఆ తరువాత అస్పష్టంగా కనిపించసాగింది ఆ గది.

    జోరో బల్బు ఉంది ఆ గదిలో.

    "హలో మిస్ శరణ్యా! ది గ్రేట్ హర్షవర్దనరావు ఓన్లీ డాటర్" డిఫెన్స్ చీఫ్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు.

    శరణ్య కామ్ గా ఉంటే వదిలి పెడతామని అనికోకు. ఇప్పటికైనా మీ ప్రెండ్ మృదువనిఎక్కడుందో చెప్పు" ఆమె దగ్గరకి వస్తూ అన్నాడు.

    "నాకు తెలియదు" అంది శరణ్య. లోలోపల ఆమెకు భయంగానే వుంది.

    "నీకు థర్ట్ డిగ్రీ ఎలా వుంటుందో తెలియదు" అంటూ ఆమెను ఎదురుగా వున కుర్చీలో కి నెట్టాడు.

    "న్నంనేందుకు అరెస్ట్ చేసారో చెప్పండి. నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి." అరిచి చెప్పింది శరణ్య.

    డిఫెన్స్ చీఫ్ వర్మ నవ్వాడు.

    "నిన్నసలు అరెస్ట్ చేస్తేకదా కోర్టుకు తీసుకువెళ్ళడానికి! అరెస్ట్ చేయకుండా ఎఫ్ ఐఆర్ లేదు, ఎఫ్ ఐఆర్ లేకుండా కోర్టూ లేదు."

    "అంటే?"

    "నిన్ను కిడ్నాప్ చేశాం. ఇప్పుడు నిన్ను చంపేసినా అడిగే వాళ్ళుండరు."

    "అసలు నేన్నేందుకుకిడ్నాప్ చేసారు?"

    "మృదువని ఆడ్రస్ చెప్పేవరకూ నువ్వు ఇక్కడ్నుంచి కదల్లేవు."

    "నాకు తెలియదు అని చెప్పానుగా!"

    డిఫెన్స్ చీఫ్ వర్మ చేయి ఆమె చెంపను బలంగా తగిలింది.

    ఆ తరువాత స్టార్ట్ యింది టార్చర్.

    ఆమె చేతివెళ్ళమీద రూళ్ళకర్రతోబాదారు... అరచేతుల్లో గోలీకాయలు పెట్టినొక్కారు... ధర్ట లేట్ క్రిమినల్ ని ఎలా టార్చర్ చేస్తారో అలా చేశారు... చేవారి ప్రయత్నంగా జేమ్స్ ని చంపుతామని బెదిరించారు... అయినా బెదరలేదు.... జేమ్స్ ను వాళ్ళు ఏమీ చేయరు... తను నిజం చెబితే మృదువనిని వీళ్ళు చంపేస్తారు. అందుకే పల్ల బిగువున బాధను గుండె లోపల వున్న జేమ్స్ మీద ప్రేమను  చంపుకుంది.

    తను ఎన్ని రోజులు ఇక్కడ వుంది? మృదువని ఏమైంది? జేమ్స్ ఎలా వున్నాడు?

    ఈ ప్రశ్నలే ఆమెను వేధిస్తున్నాయి. ఇక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా కుదర్లేదు. ఉదయం సాయత్రం ప్లేటులో భోజనం తెచ్చి ఇస్తారంతే. శారీరమంతా కూడదీసుకుని లేచే ప్రయత్నం చేసి శరీరమంత కూడదీసుకుని లేచే ప్రయత్నం చేసి శరీరం సహకరించక నేల మీదే కూలబడింది.అప్పుడే తలుపులు తెరుచుకుంటున్న శబ్దం. ఊపిరి బిగపెట్టింది. మళ్ళీ తనను రార్చార్ చేయటానికి డిఫెన్స్ చీఫ్ వచ్చాడా? కళ్ళు చిట్లించి చూసింది. తెరుచుకున్న తలుపుల్లోంచి వెలుతురు లోపలకి చొచ్చుకు వచ్చింది.

    "హలో శరణ్యా!" నవ్వుతూ విష్ చేసాడు డిఫెన్స్ చీఫ్ వర్మ.

    అతనివైపే చూస్తొంది. ఇలా నవ్వుతున్నాడంటే మరో కొత్త నాటకమా?

    "ఏంటి ఆశ్చర్యంగా వర్మ వైపు చూసింది. ఐదో కొత్త ప్లానా?

    "మరో అరగంటలో నిన్ను వదిలిపెడతాను. ఈలోగా చివరి సారిగా మా ఆదిత్యం స్వీకరించు" అంటూ చప్పట్లు చరిచాడు.

    ఓ వ్యక్తి ట్రేలో బిర్యానీ ప్లేటు తీసుకువచ్చాడు.

    "అల్ ద బెస్ట్" అని వెనుదిరగబోతూ " అన్నట్లు చెప్పడం మరచిపోయాను. మృదువని దొరికింది. తనే లొంగిపోతుంది. నిన్ను విడిచిపెట్టే  కండిషన్ మీద" చెప్పి బయటకు నడిచాడు డిఫెన్స్ చీఫ్ వర్మ.
   
                                               ***

    రెండు గంటల యాబై నిముషాలు.

    డిఫెన్స్ చీఫ్ చేతిలో వున్న సెల్ రింగయింది. వెంటనే ఓకే బటన్ ప్రెస్ చేసి "హలో" అన్నాడు.

    "నేను మృదువనిని. సరిగ్గా మూడుగంటల ముప్పుయి నుముశాలకు ఫిప్త్ ఇవే న్యూలో వున్న బిజినెస్ సెంటర్ దగ్గర వుంటాను. శరణ్యను అక్కడకు తీసుకురా. ఆమె వచ్చిందని నిర్దారణ అయ్యాక నేను మీకు సరెండర్ అవుతాను" అంది మృదువని.

    "నువ్వు సరెండర్ అవకపోతే?" చీఫ్ అడిగాడు.

    "నమ్మాలి మిస్టర్ చీఫ్. అంతకన్నా నీకు మరో మార్గంలేదు. ఫోనీ సరాసరి రాష్ట్రపతి భవన కువేల్లిఅక్కడ లొంగి పోంమ్మంటారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS