Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 45


    
        ఈ క్రింది పద్యమున రుద్రకవిని నెవరో ప్రశంసించిరి.
    
    మ|| హరి యౌస్కందపురీజనార్దనువరం బందే  మహాసత్కనీ
        శ్వరు లౌరాయలవారిసన్నిధిని హర్షంబందేఁ బట్టంబు గ
        ట్టిరి యందోళికలు జవోగ్రతర ఘేటీ లగ్రహారంబు లం
        దఱు చూడ బహుమాన మందేఁ గవిరుద్రాఖ్యుండు తాముఖ్యుఁడై.     457

    (ఇందే ముద్రితమైన చూ. పుట 81) "దనుజమర్దన కందుకూరి జనార్ధనా" అను మకుటము గల శృంగారవద్యష్టకము రుద్రకవికృతి యని వినికి. "బలవధరీదరీకుహర భాస్వధరీయదరీదరీ హరీ" యను మకుటము గల శతక మొకటి కూడ రుద్రకవికృతియే యని వినికి. అది సమగ్రముగా లభింపలేదు. మచ్చునకు మూఁడు పద్యములు మాత్రము:-

    చ|| కలశవయోధిమీఁదఁ దరఁగల్ మఱి హోరనిమ్రోయ వేయభం
        గులతలపాన్పు పాము బుసకొట్టఁగ నేగతి నిద్ర చెందెదో
        యలసతఁ దండ్రి చీమచిటుకన్నను నిద్దుర రాదు మాకు నో
        బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదహరీః      458

    ------------

    * ఉదాహృత పద్యములేకాక మఱి మూఁడు పద్యము లీ క్రిందివి శాస్త్రి గారి నోట్సు నందున్నవి.
        
    చ|| కొలదిగ మున్ గుంచేలుఁ డడు కుల్ గొని వచ్చిన మెచ్చి హెచ్చుగా
        కలిమి నొసంగితీ (విపుడు) గంపెడు చక్కరఁ దెచ్చి పెట్టినన్
        బలుకపు ద్రవ్యమేమి గుణభక్త శరణ్యుఁడ నీవు (గావవే)
        బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదదరీహరీ!      459

    చ|| వెలయగా నంటి మీకధలు వింటి మిముం గనుగొంటి వెంకటా
        చలమును గంటి నింపగు ప్రసాదము లోనికిఁ గొంటి భ్రక్తి కిన్
        దొలఁగని మన్కిగంటి) నిక తొంటిచేనంటి గుణంబు లేన్నేదే
        బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదరీహరీ!      460

    చ|| కలుములు రోయుమంటి, వరకాంతలఁ గోరకుమంటీ, పాపముల్
        తలపకుమంటి, నేమనిన దారికి రాదు మనంబు చక్కగా
        వలనుకు వచ్చునే శునకవాలము బ్రద్దలువైచి కట్టినన్
        బలవదరీదరీకుహరభాస్వదరీయదరీదరీహరీ!      461

    చ|| కలుషసరి త్తరీ పుషితగంధకరీ మహిభృత్కిరీ భవా
        చలభిదురీ దయారసవిశాలఝురీ నిగమార్దమాధురీ
        ఖలగజ కేసరీ విభవకంషితమేరుగిరీ లతాదరీ
        బలవదరీదరీకుహరభాస్వదరీయదరీదరీహరీః      462

    చ|| అలవగవాని తమ్ముఁడు భయాతురుఁడై చనుదెంచినంతనే
        బళిబళి వచ్చి తీవనుచుఁ బట్టము గట్టవే లంక కప్పుడే
        కొలిచిన నిన్నే కొల్వవలెఁ గోరిక లిచ్చిన నీవ యీవలె
        బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదరీహరీః      463
    
    పంచరత్నము లను పేర జనార్ధనస్త్రోత్ర మొకటి రుద్రకవి కృతి యున్నది. ఒక్క పద్యము.

    పంచ|| అనాధనాధ నాగతల్ప యజ్ఞకల్ప మౌనిరం
        జనా జనార్తినాశనా దిశాపరీవృఢార్గశా    
        సనా సనాతనా యానాది సత్య కందుకూరిశ్రీ
        జనార్దనా జనార్ధనా ససాహాసారిమర్దనా!     464

        సుందరీమయాంగ వామశోభనా నిరంజనా
        స్యందనీకృతోర్విశైలజా మనోభితాంజనా
        మందహాసభాసకంఠ మంజుభావి తంజనా
        కందుకూరిసోమ విషయకామదర్పభంజనా      465
    
    సుగ్రీవవిజయ మను యక్షగానమును నిరంకుశోపాఖ్యాన మను రసవత్ర్సబంధమును రుద్రకవికృతులు లోకమున వ్యాపించియున్నవి. "మావంశమున రుద్రకవి నామదారులు పలువురున్నారు. కృష్ణరాయలనాఁటి వాఁడు ప్రధమ రుద్రకవి. ఇబ్రహీంనాఁటి వాఁడు ద్వితీయ రుద్రకవి. వారికిఁ దర్వాతఁ గూడఁ గవిత నేర్చినరుద్రకవులున్నా " రని యిప్పటివారు రుద్రకవివంశ్యులు చెప్పుచున్నారు. శ్రీ కృష్ణరాయలు క్రీ. 1530. న స్వర్గస్థుఁదయ్యేను. ఇబ్రహీంపాదుషా కాన యిబ్రహీంకాలమున రుద్రకవి యుండుట సునిశ్చితము. నిరంకుశోపాఖ్యాన కర్త యీతఁడు కాఁదగును. వేశ్యావర్ణనమున నాగ్రందమందు సీనపాదమొకటి యిట్లున్నది. "చేరి కన్నడభూమి చెఱపట్టు పాశ్చాత్యనృపతికైన నొకింత కృప తలిర్చు." ఇట్లుండుటఁబట్టి యీ గ్రంధము విద్యానగరవినాశానంతరము రచింపఁబడినది కాఁదగు ననఁదగును. ఈతఁడే బాలుఁడుగాఁ గృష్ణరాయలనాఁటఁ గూడ నున్నాఁడెమో! లేక యీతని తాత వేఱొకఁడే యానాఁట నున్నాఁడో! కృష్ణరాయల నాఁట రుద్రకవి యుండేననూట కాధారముగా మీఁద సుదాహరింపఁబడిన యాభాణకములకుఁ బద్యములకుఁ బరమప్రామాణ్య మంగీకరింపరాదు. ఆ పద్యములు కొన్ని యిటీవలివా రావంశము వారే యైతిహ్యములను బట్టి రచించియుందురు.
    రుద్రకవివంశ్యు లీటీవలివారు రచించిన పద్యములు లివి కొన్ని :-
    
    క|| ఈసారికి వైశాఖపు
        మాసానకు లక్ష్మి తొలఁగి మతిచెడి భ్రష్టై
        వీసానకుఁ గొఱగాకయు
        ఖాసారామన్న వల్లకాడుం జేరు.        466

    సీ||  భాసిల్లునిభరాముపట్టం భద్రుం డిచ్చె
            భూదానశాసనపుణ్య లేఖ
        వసియించు దిక్కుల వరకీర్తి యగునని
            రసిక శేఖరుఁడనె రమణతోడ
        కరమొప్పు కాశికాపురముతో సరియగు
            స్కాందపట్టణసీమ గడిఁదిఁ జెలఁగు
        సరణి బెరైనట్టి జరుగుమల్లి పొలానఁ
            దుదఁ బదె కుచ్చేళ్ళు దొరయు నోసఁగె
        బహుకాలమును బుత్త్రపౌత్త్రాభివృద్దిగా
            ననుభవించు మటంచు నానతిచ్చే
        నిట్లు మేమిడు భూమి యించుకం తైనను
            నాశ చెందినవారు కాశిలోన

    గీ||  వివ్రగోవధ చేసిన విధి విధించు
        పాపమునఁ జెంది మక్కాను బందిఁ జంపి
        మేటి యగునానల నొసంగి మోసఁగినట్లు (?)
        కందుకురిరుద్రఘనులకుఁ గరుణ నోసఁగె.     467

    సి||  శ్రీలలరఁగ రెంటచింతల ఖండ్రిక
            కేవల ప్రభుఁడు మల్కీభరాముఁ
        డలరుద్రకవికి సత్యంత మౌప్రేమచే
            నీనా మోసంగిన నివల మఱియు
        తానీషపాచ్చావు తనరార నడపించె
            వెనుక తావుత్జ్జానుఁ డనువు మీఱ
        దయచేసేఁ బిమ్మటఁ దగఁ బాల్పఖానుఁడు
            నతనికిఁ బిదప నింపలరఁగాను
        పాతులాఖానుఁడు సాహేబు మన్నించెఁ
            దగనొప్పె నైదుముస్తాఖనుండు
        గరిమతో ననవర్తిఖానుఁడు కృప నిచ్చే
            కడుసురాజిద్దవుల్ గారు నిడిరి
        త్రావరుస ప్రభు వీవల దయచేసే
            నందుకు సాక్షి యౌననుభవంబు
        దీనికిఁ గొర్లశీతిద్వయంబై యెప్పు
            శ్రీజనార్ధనవర శ్రీఁ జెలంగు
        కవిరుద్రఘను నలఖంద్రిక ఫలభోక్త
            లీరేడు పూరుషు లీవలయిరి
        రుద్రాఖ్య, కవితయు, రూడి తత్కులమందుఁ
            దత్కులీనుల మేము దానికడను
        క్షీరనదీతట క్షేత్రమందుఁ దవంబు
            గావించుభవదీయక పులమయ్య


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS