Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 46

నీలాగా నేనూ న్యాయపన్నాలు చెప్పగలను. కానీ కోర్టుకు కావలసింది సాక్ష్యం.
ఆ సాక్ష్యాలు నువ్వే నేరం చేశావని రుజువు చేశాయి. అందులో నేను చేసింది ఏమీలేదు. హంతకుడు ఎప్పుడూ శిక్షనుంచి తప్పించుకోలేడు. ఈ రోజు నువ్వు పారిపోయి రాగలిగినా తప్పనిసరిగా మళ్ళీ జైలుగోడల మధ్యకు వెళ్లవలసినవాడివే. నీలాంటి నేరస్థునికి ఏ తండ్రీ చూస్తూ చూస్తూ కన్నకూతురును యిచ్చి పెళ్ళిచేసి గొంతు కోయలేడు. నువ్వు ఎన్ని కలలుకన్నా అవి నెరవేరవు అని తెలుసుకో."
"నాకూ నేలానే పట్టుదల ఎక్కువ. చేయని హత్యానేరాన్ని నా పైకి నెట్టింది నువ్వేనని నాకు తెలుసు.
నువ్వు ఎలా చెబితే అలా వినేలా జయచంద్రనూ అతని కొడుకునూ నీ చాతుర్యంతో కట్టుబానిసలుగా చేసి స్వలాభం పొందుతున్నావు.
అవకాశం అంటూ దొరికితే వాళ్ళను అధఃపాతాళానికి తొక్కి నువ్వు పైకి వెళ్ళిపోగల సమర్డుడవు అని పాపం ఆ అమాయకులకు తెలియదు.
"వాళ్ళ పలుకుబడిని, డబ్బు, అంగబలాలను నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు.
నీ మనసులోని కుయుక్తులు వాళ్ళు పసిగట్టికపోయినా నాకు తెలుసు. నీలాంటి నమ్మకద్రోహి ఎంతోకాలం వాళ్ళు పంచన నీతి నిజాయితీగా ఉండడని నేను ఎప్పుడో వూహించాను. అది నుజం అని ఇప్పటి నీ  ప్రవర్తనే తెలియచెబుతుంది.
"భేష రవితేజా... తెలివిగలవాళ్ళను గౌరవించటం నా హాబీ... అయితే న ఎత్తులను చిత్తుచేసే అనుభవం నీకు లేదు. పోలీసులు పట్టుకుంటారనే భీతి కూడా లేకుండా ఇంత దైర్యంగావచ్చి నా ఎదురుగానే కూర్చుని సంభాషిస్తున్న నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ఎవరు ఎవరిని ఏం చేయగలరో నీ ఛాలెంజ్ ను నెరవేర్చుకోవడానికి అవకాశం యిస్తున్నాను.
నువ్వు ఇక్కడనుంచి నిర్భయంగా వెళ్లిపోవచ్చు. ఈ రోజు నుంచి మన మధ్య ప్రచ్చన్నయుద్ధం ప్రారభంమయినట్టే...." సత్యమోహన్ విసురుగా లోనికి వెళ్ళిపోయాడు.
తన తండ్రి పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తాడేమోననే అనుమానంతో రవితేజను వెంటనే అక్కడనుంచి వెళ్లిపోమని ప్రాధేయపడింది రజని.
"ప్చ్..." నిట్టూర్చి వెనుదిరిగాడు రవితేజ.
   
                                                 *    *    *    *
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చలనం లేకుండా పడి వున్నాడు ఏ. సి. పి వీరేష్.
కొనప్రాణాలతో వున్న అతనని బతికించటానికి డాక్టర్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ఒళ్ళంతా చితికిపోయి చాలా రక్తంపోయింది. నరాలు తెగి చిట్లిపోవడంవలన రక్తపు ముద్దలా కనిపిస్తున్న వీరేష్ లో ఇంకా ప్రాణాలు నిలిచి ఉండడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది డాక్టర్లకు.
ఒకవేళ ప్రాణాలతో ఉండడం సంభవించినా కొన్ని గంటలు మించి బ్రతకడని తేల్చి చెప్పారు. అయినా దైవంమీద బారంవేసి తమ వంతు కృషి తాము చేయసాగారు.
దాదాపు పదిగంటలు కృషి అనంతరం వీరేష్ పెదవులలో కదలిక వచ్చింది. అతను ఉచ్చరించిన తొలిపదం... 'ధీరజ...'
అందుకే వెంటనే ఆమెకు వీరేష్ పరిస్థితి తెలియజేశారు.
వచ్చీరావడంతోటే అవాక్కయిపోయిందామె.
నిలువెల్లా బ్యాండేజీలతో....రక్తపు ముద్దలతో చలన రహితంగా పడుకుని ఉన్న ప్రియడుని  చూడగానే కళ్ళలో నీళ్ళు సుడులుతిరిగాయి.
అతనిది మొండిప్రాణం కావడం వలన మృత్యువుతో సైతం పోరాడి మీతో మాట్లాడడానికే ప్రాణాలను నిలుపుకుని వుండాలి... అంటూ తమకు తోచిన అభిప్రాయాన్ని చెప్పారు.
"వీరూ... ఎలా జరిగింది ఘోరం...ఎవరు...ఎ..వ..రు..చేశారు ఈ ఘాతుకం?" ధీరజ హృదయం విలవిల్లాడిపోతూ ఆక్రోశించింది.
"సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఉన్న కుషాయిగూడా దగ్గర వీరేష్ కారుపై బాంబింగ్ జరిగింది మేడమ్" అక్కడి ఇన్ స్పెక్టర్ చెప్పాడు.
"మైగాడ్___బాంబులు వేశారా? ఎవరు?"
"అది తెలుసుకోలేకపోయాం."
అసలు వీరేష్ అక్కడకు ఎందుకు వెళ్ళాడు?"
అ విషయం తెలియాలంటే ఏ సి పి వీరేష్ పెదవి విప్పి చెప్పవలసిందే మేడమ్ రాత్రి అదే సమయంలో ఆయన దగ్గర పనిచేస్తున్న కానిస్టేబుల్ కూడా ఇ సి ఐ ఎల్ కు వెళ్ళే రోడ్ పై అనుమానాస్పద పరిస్థితులలో హత్య చేయబడ్డాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతని శరీరాన్ని మాంసపుముద్దలా చేసి పడవేసి పోయారు.అక్కడకు కొద్ది దూరంలోనే వీరేష్ గారిపై ఈ హత్యా ప్రయత్నం జరగడం చూస్తుంటే రెండిటికీ ఏదో లింక్ వుందనిపిస్తుంది" అన్నాడతను.
"ఎస్.. ఖచ్చితంగా వుండి తీరుతుంది. రాత్రి వీరేష్ కారు అక్కడకు ఏ సమయంలో వెళ్ళిందో, దాన్ని చూసినవాళ్ళు ఎవరయినా వున్నారేమో చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వయిరీ చేయండి. నా అనుమానంనిజమైతే ముందు కానిస్టేబుల్ ను పంపి వెనుకగా వీరేష్ వెళ్ళి వుండాలి. అంతే అక్కడే ఏదో జరిగింది. ఆ విషయం బయటకు పొక్కనీయకుండా వీరేష్ ను మట్టు పెట్టడానికి ప్రత్యర్దులు బాంబులు వేసి వుంటారు. తప్పని సరిగా వీరేష్ ఆ ప్రదేశానికి వస్తాడని తెలిసే వాళ్ళు అక్కడ కాపుకాసి వుండాలి."
"ఆ శబ్దాలకు ప్రేలుళ్ళకు భయపడి చాలాసేపు బయటకు రాలేదు. తరువాత ఎప్పటికో తెప్పరిల్లిన ప్రజలు బిక్కు బిక్కుమంటూ వెళ్ళి చూసేసరికి ధ్వంసమైన కారు మంటలు, పొగల మధ్య అచేతనంగా పడివున్న వీరేష్ కనిపించడంతో పోలీస్ కు ఇన్ ఫామ్ చేశారు."
ఆపై మాటలను వినిపించుకునే స్థితిలో లేదు ధీరజ.
ఆమె కనులు అగ్నిగోళాల్లా నిప్పులను కక్కుతున్నాయి.
తను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన వీరేష్ ఉలుకూపలుకూ లేకుండా అల పడివుండడం చూసిన ధీరజలో ఆవేశం తారా స్థాయికి చేరుకుంది.
వెంటనే ఢిల్లీకు లైట్నింగ్ కాల్ బుక్ చేసింది.
క్షణాలమీద ఆమెకు కావలసిన నంబరు కలిసింది.
"ఐ వాంట్ టు టాక్ మిస్టర్ ఛటర్జీ"
మరు నిమషంలోనే ఛటర్జీ గొంతు వినిపించింది.
"మైడియర్ ధీరూ.... వాట్స్ ది మాటర్__" గంభీరంగా వుంది అయన కంఠం.
"అంకుల్... ఎంతకాలం ఓర్పు వహించమంటారు. దొంగనోట్ల ముఠా మూలవిరాట్ ఎవరో తెలుసు. నగరంలో శాంతి భద్రతల విఘాతానికి కారకుడు ఎవరో తెలుసు. సంఘ విద్రోహ శక్తులతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు జేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు. ఇన్ని తెలిసి వుండి కూడా సాక్ష్యాలు దొరికేవరకూ ఆగుదాం అనే ఒకే ఒక కారణం వలన ఈ రోజు నా ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. దీనికి ఆ బ్లడీ బార్బేరియన్ జయచంద్రే కారణం... అంకుల్ ఐ విల్ టేక్ రివెంజ్."
"నో... నో... బేబీ ఇంతవరకూ ఓర్పుగా వున్నదానివి ఇప్పుడు బరస్ట్ అయితే ఎలా చెప్పు. స్పెషలిస్టులయిన డాక్టర్లను ప్లయిట్ లో పంపాను. వాళ్ళు ఏ. సి. పి వీరేష్ కండిషన్ స్కానింగ్ రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. యిప్పుడు అతని ప్రాణాలను వచ్చిన నష్టమేమీ లేదు. నీకు కావలసింది యిదే కదూ..."
ఛటర్జీ మాటలకు ధీరజ బిత్తరపోయింది.
ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వున్నప్పటికీ ఇక్కడ జరిగిన ఘోరాన్ని క్షణాలమీద తెలుసుకుని తగిన ఎరేంజ్ మెంట్స్ చేశాడు ఛటర్జీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS