"అనూషగారు చాలా మంచావిడ నాన్నా! ఆవిడకి గర్వంలేదు."
హాటాత్తుగా ఆయన గట్టిగా నవ్వాడు. భరణి, లక్ష్మి తెల్లబోయి చూశారు.
"ఏంటండి? ఏమైంది?" అడిగిందావిడ.
"ఏం లేదు లక్ష్మి.... వీడు పెళ్ళిచేసుకోబోతున్నాడు. కాబోయే భార్యని గారు అని అంటున్నాడు. మనతో చెప్పేటప్పుడైనా అనూష అని చెప్పే ధైర్యంలేదు.... రేపు కాపురం ఎలా చేస్తాడా? అని నవ్వోస్తోంది."
భరణి మోహం కందిపోయింది. అక్కడ్నుంచి వెళ్ళిపోతూ "మేరు స్నానాలుచేసి రెడీగా వుండండి. వాళ్ళింటికి వెళదాం" అన్నాడు.
"ఆడపిల్లవాళ్ళు మనదగ్గరకి రావాలిరా."
"అబ్బా నాన్నా! నేను పెళ్ళిచేసుకునేది మామూలు ఆడపిల్లను కాదు. పెద్ద స్టేటస్ వున్న లేడిని. ఫార్మాలిటిస్ పక్కనపెట్టండి." అంటూ వెళ్ళిపోయాడు.
మార్కేండేయులు నవ్వుకున్నాడు.
పుట్టింది, పెరిగింది పెళ్ళేటూరయినా, పేరుకి కేవలం రైతు అయినా, వ్యవసాయమే జీవనదారంగా బతికినా, మార్కేండేయులు కమ్యూనిస్టు భావాలు జీర్ణించుకున్న వ్యక్తి. నిజానికి ఆయనకి డాక్టర్ అనూష తనకి కోడలు కాబోతుందని తెలియడంతో అనుకోకుండానే తమ కుటుంబ ప్రతిష్ట ఆకాశమంత పెరిగినట్టుగా అన్పించింది.
అంత గొప్ప స్రీని పెళ్ళిచేసుకుంటున్న భరణి మనోభావాలు తెల్సుకోవడానికి చిన్న ట్రిక్ ప్లే చేశాడు భరణికి ఆమె అంటే గౌరవం వుంది, ప్రేమా వుంది. కానీ కేవలం ఇవేనా? లక ఏదో వ్యామోహంతోటే ఆమె స్టేటస్ తనకి పనికొస్తుందన్న స్వార్డంతోటే, ఆమె డబ్బు చూసో కొడుకు ఆమెని పెళ్ళిచేసుకుంటున్నాడా? అన్న చిన్న అనుమానం ఓ మూలవుంది. ఆ అనుమానం తెరచు కోడానికి చిన్న ప్రశ్నలువేస్తూ సందేహాలు వెలిబుచ్చుతూనే వున్నాడు.
భరణి ఫోన్ చేసేటప్పటికి అనూషలేదు. హాస్పిటల్ కి వెళ్ళిపోయింది.
"సాయంత్రం కలుద్దాం నాన్నా! అందాకా మీరు రెస్టుతీసుకొండి. నేను ఆఫీసుకి వెళతాను" అన్నాడు భరణి.
"ఇంకా అఫీసేంటిరా? కుంటి నడక నడిచే అ పేపరు పట్టుకుని ఏం వేళ్ళాడుతావు? మీ ఆవిడా సంపాదించేది చాలదూ" అన్నాడు మార్కండేయులు.
భరణి రోషంగా చూసాడు.
"ఏంటి నాన్నా! పెళ్ళాం సంపాదిస్తుంటే తిని కూర్చునేవాడిలా కనిపిస్తున్నావా?" అన్నాడు.
"ఆ పేపరుమీద నీ ఆదాయం ఏం వుంది?"
లక్ష్మికి భర్తమీద కోపం వచ్చింది.
"ఎందుకండి వాడినలా అవమానిస్తారు?" అంది కోపంగా.
"అవమానించడం ఏంటి లక్ష్మి! చిన్న సందేహం వచ్చింది నీకు?"
"ఆదాయం వచ్చినా రాకపోయినా, పేపరు మాత్రం వదిలేదిలేదు నాన్నా... ఎప్పటికైనా దాన్ని డైలీ పేపరు చేస్తాను. చూస్తుండు... అన్నాడు.
"మంచిదే! నువ్విలా చేస్తే చాలా సంతోషిస్తాను. కానీ నీ ప్పారు ఆవిడ డబ్బు మాతరం వృధా చేయకు."
"ఆవిడా డబ్బు ఏంటండి? రేపు పెళ్ళయ్యాక వీడికి మాత్రం డబ్బుమీద హక్కు వుండదా?"
"ఇదే, ఇలా అలోచిస్తారనే చెబుతున్నాను. ఏరా? నిజం చెప్పు... ఆవిడా ఆస్తికోసమా? లేక నిజంగా ఆ అమ్మాయంటే పరమ వుందా ఎందుకు చేసుకోలనుకుంటున్నావు?"
"చూడమ్మా!" చిన్నపిల్లాడిలా ఫిర్యాదు చేశాడు భరణి. "ఆవిడా ఆశయాలు, ఆదర్శాలు, గొప్పదనం చూసి ప్రమిమ్చాను కానీ, నేనావిడ ఆస్తి చూసి ప్రేమించలేదు. ఆసలావిడకి ఎంత ఆస్తి వుందో కూడా నాకు తెలియదు."
"నిజమేనా?"
"చాల్లే ఊరుకోండి... ఎంత గొప్ప డాక్టరైనావీడకి కాబోయే భార్య... ఆ అమ్మాయి ముందు వీడి గురించి ఇలా మాట్లాడకండి. చులకనైపోతాడు" కసిరింది లక్ష్మి.
అయన నవ్వేసి ఊరుకున్నాడు.
సాయంత్రందాకా పేపర్ల ద్వారా తెలుసుకున్న ఓ స్రీ మూర్తి గొప్పతనాన్ని కళ్ళారా చూడాటానికి మార్కేండేయులు, భర్త అంత గొప్పగా చెబుతున్న కోడల్ని చూడాటానికి లక్ష్మి తహతహలాడుతూ, ఎదురు చూస్తూ కూర్చున్నారు.
సాయంత్రం ఆరింటికి వాకిట్లో కారు ఆగింది. వీణ కారుదిగి, లోపలోకి వచ్చింది. జీన్స్ పాంటు, టీ షర్ట్ వేసుకుని లోపలకి వచ్చిన ఆమెని చూడాగానే, డాక్టర్ అనూష ఈమేనా? అన్నట్టు కొంచెం అసంతృప్తిగా చూసింది లక్ష్మి. "నమస్కారం సార్! నాపేరు వెన, లాయరుని. అనూష స్నేహితురాలని....." అని తనని తను పరిచయం చేసుకోవడంతో హమ్మయ్య అనుకుంది....
కానీ, అనూష కూడా ఇలాగె వుంటుందేమో.... ఈ పాంట్లు, చొక్కాలు వేసుకుని కనిపిస్తుందేమో అని భయంగానే వుంది లక్ష్మికి.
"రామ్మా..." మార్కండేయులు అప్యాయంగా ఆహ్వానించాడు.
"మిమ్మల్ని మా అనూష దగ్గరకి తీసికెళ్ళాడానికివచ్చానండి.... ఆడపిల్లవాళ్ళం కదా!"
అయాన్ నవ్వాడు.... "తప్పకుండా వస్తాం. అబ్బాయి వచ్చేవేళ అయిందికదా! ఈలోగా... లక్ష్మి! ఆ అమ్మాయికి కాస్త కాఫీ ఇవ్వు...." అన్నాడు.
"వద్దండి .... రండి వెళదాం. భరణిని ఆఫీసు దగ్గర పికప్ చేసుకుందాం. రండమ్మా! నేనే పెళ్ళి పెద్దను" అన్నది లక్ష్మితో.
ఆవిడా నవ్వింది. "అమ్మాయి తల్లీ, తండ్రి లేరా?" అడిగింది.
"లేరు! చాలా కాలమైంది పోయి..."
