Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 44

       "ఈఫిల్ జంక్షన్ దగ్గర ఆటో ఆగింది.

       "ఇదే సార్ ఈఫిల్ జంక్షన్" చెప్పాడు ఆటోవాలా జనసంమర్డంగా వుంది. వాచే వంక చూస్తున్నాడు. ఇంకా పదిహేను నిముషాలు వుంది.

    ఒక్కక్షణం ఒక్కో యుగంలా అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. ఒకటి... రెండు... మూడు... అతి భారంగా పదిహేను నిముషాలు గడిచాయి.

    అంకిత్ కళ్ళు పరిసరాలను నిశితంగా గమనిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే ఈపిల్ జంక్షన్ దగ్గర నిలబడ్డ అంకిత్ ని చూసి దగ్గరకు వెళ్ళబోయింది మృదువని.

    అప్పుడు గమనించింది...
   
    అంకిత్ కాస్త దూరంలో వున్న షంషేర్ దాదా మనుష్యులను. నిశ్సబ్దంగా అక్కడ్నుంచి తప్పుకుంది మృదువని

    అంకిత్ కళ్ళు మృదువనిని వెతుకుతున్నాయి. అరగంట అయినా మృదువని రాకపోవడమేమిటి? నలబై... యాబై... అరవై... అరవై నిముషాలు గడిచాయి. గంట.. గంట గడిచింది. అంకిత్ మృదువని కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

   
                                                   ***

    మృదువని టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళింది. ఆమె చేతి వెళ్ళు చకచకా ఓ నెంబర్ డయల్ చేస్తున్నాయి.

    ఆ నెంబర్ డిఫెన్స్ చెఫ్ వర్మది.

    రెండు క్షణాల అనంతరం అటువైపు వర్మ ఫోన్ లిస్టు చేసాడు.

    "హలో... వద్దు... ఇక ఈ గేమ్స్ వద్దు మిస్టర్ వర్మ. ఏంటి ఆశ్చర్యంగా వుందా? నీ సబార్టినేట్ నిన్ను పేరు పెట్టి పిలుస్తుందంటే నీ గోఎరవం కోల్పోయావు. నీకు అస్తిత్వమే లేదు. వ్యక్తిగా నీ ఉనికీ లేదు. ఈ గెం కు స్వస్తి చెప్పదల్చుకున్నాను. నీ కావాల్సింది నన్నుపట్టుకోవడమా? అయితే నేను రెడీ... బట్ వాన్ కండిషన్...!"

    ఆవలివైపు ఒక్కక్షణం నిశ్శబ్దం.

    వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది మృదువని. అక్కడ్నుంచి తూనీగలా పరుగెత్తి మరో టెలిఫోన్ బూత్ దగ్గరకి వెళ్ళి అదే నెంబర్ డయల్ చేసింది.

    "మిస్టర్ వర్మా! నన్ను ట్రేస్ చేసే పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఎలాగూ నేనే నీ ముందుకు వచ్చి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నాను. సరిగ్గా మూడు గంటలకు నేను నీకు దొరికిపోతాను. బట్ వన్ కండిషన్!"

    "ఏమిటది?" వర్మ అడిగాడు.

    "శరణ్య... శరణ్య నాకు అప్పగించాలి."

    "శరణ్యా! ఆమె నా దగ్గర..."

    "స్టాపిట్. ఈ కబుర్లు జేమ్స్ లాంటి అమాయకుడికి చెప్పు. నీ దగ్గర పని చేసిన నాకు, డిఫెన్స్ లో పని చేసిన నాకు నీ నక్క తెలివితేటలు తెలియవని అనుకోకు.

    నీకు సరిగ్గా రెండూ యబైకి ఫోన్ చేస్తాను. అప్పటికీ ఓ నిర్ణయానికి రాకపోతే నీ ఇష్టం. నేను చచ్చిపోయినా ఫర్లేదు. అంతకన్నా ముందు ఢిల్లీ నగరంలో జనాభా అంత నీ మీద దాడిచేసి కసికొద్దీ చంపే ఏర్పాటు చేసి మరి ఛస్తాను.టక్కర్ "ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది మృదువని. ఆ తరువాత క్షణం కూడా అక్కడ ఉండలేదు. ఆటోలో వెళ్ళి పోయింది ఏమాత్రం ఆలస్యమైన చెఫ్ తనను ట్రేస్ చేసే ప్రమాదం వుంది.
   
                                                 ***

    అంకిత్ ఇంకా ఈపిల్ జంక్షన్ దగ్గరే వున్నాడు. అతనికి మృదువని వస్తుందన్న నమ్మకం ఇంకా పోలేదు. సరిగ్గా అప్పుడే అతని సెల్ రింగయింది.

    "హాలో!" అన్నాడు అంకిత్.

    "సారీ ప్రెండ్! నన్ను కలవాలనుకునే ప్రయత్నంలో నిన్ను షంషేర్ దాదా మనుష్యులు ఫాలో చేస్తున్నారని విషయం మరచిపోయావు... నిన్ను కలుస్తాను... నాకో రాత్రి అన్నం పెట్టి ఆశ్రమం ఇచ్చావు... నేనెవరో తెలియకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చావు... నేను నేరం చేయలేదని నమ్మి నాకోసం తపిస్తూన్నావు... ఈ రుణాన్ని ఎలా తీర్చుకుంటావు మిస్టర్ అంకిత్. ఇది ఉద్వేగాల సమయం కాదు. అయినా ఇన్నాళ్ళ గుండె బరువు ఈ టెలిఫోన్ తీగల ద్వారా నీ చేవివేసి దించుకోవాలనుకుంటున్నాను... ఈ రోజు మూడు గంటలకు నేను లోంగిపోతున్నాను.

    నాకోసం ప్రాణాలను రిస్కు చేసిన శరణ్య ను కాపాడుకోవడమే నాభాద్యత... ఓ చిన్న హెల్ప్ మిస్టర్ అంకిత్! నేను డిఫెన్స్ చీఫ్ పట్టుపడే సన్నివేశం ఘాట్ చేయగలవా? అన్ని ఛానల్లో వచ్చే ఏర్పాటు చేయగలవా? నేను అన్ని పత్రికల ఆఫీసులకు ఫోన్ చేస్తాను. ప్రెస్ ముందు, టెలివిజన్ చానళ్ళ  ముందు, ప్రజల ముందు నేను డిఫెన్స్ చీఫ్ ముందు లొంగిపోతాను. నన్నప్పుడు వాళ్ళు చంపే అవకాశం ఉండదు."

    "మృదువనీ! ఎక్కడున్నావు?" ఆత్రుతగా అడిగాడు అంకిత్.

    "చెప్పానుగా! ప్రమాదపు చివరి అంచులో, మృత్యువుకు అతి చెరువులో... మళ్ళీ రింగ్ చేస్తాను అప్పటివరకూ బై..." అవతలివైపు ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.
   
                                             ***
    మృదువని ఫోన్ చేయగానే డిఫెన్స్ చీఫ్ వర్మకు ఎం చేయాలో పాలుపోలేదు. సదన్ గా మృదువని ఇలా షాకిస్తుందని అనుకోలేదు. తను ఫోన్ ట్రాప్ చేస్తానని తెలుసుకుని మరీ జాగ్రత్త పడుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు.
    శరణ్యను తను అరెస్ట్ చేయలేదని చెప్పినా మృదువని నమ్మలేదు. నమ్మదుకూడా. తనిప్పుడు శరణ్యను ఎలా అప్పగించాలి? ఈ విషయం డిప్యూటీ చీఫ్ కు తెలిస్తే రిస్కే తనింతవరకూ ఆమెను అరెస్ట్ చేయలేదని చెబుతూ వచ్చాడు.

    ఇంటర్ కం బటన్ ప్రెస్ చేసి డ్రైవర్ ని పిలిచాడు. అతను మాములు డ్రైవర్ కాదని, షంషేర్ దాదా ని మనిషి అని ఆ ఆఫీసులో ఎవరకీ తెలియదు.

    "మన అర్జెంటుగా దాదాని కలవాలి" చెప్పాడు వర్మ.

    "సారీ సర్, అపాయింట్ మెంట్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దదాని కలవడం కుదరదు" చెప్పాడతను.

    వర్మ చిరాగ్గా సెల్ తీసి దాదా డైరెక్ట్ సెల్ కు ఫోన్ చేసి విషయం క్లుప్తంగా చెప్పాడు. దాదా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

    వర్మ దాదా దగ్గరకి బయల్దేరాడు.
   
                                                ***

    ఇప్పుడేం చేద్దాంమనుకుంటున్నారు?" షంషేర్ దాదా అడిగాడు.

    "అదే ఆలోచిస్తున్నాను. శరణ్య అప్పగించటం య్తప్ప మార్గంలేదు. మనకు సరెండర్ అయ్యాక ఏదోలా మృదువని ఫినిష చేయవచ్చు" చెప్పాడు వర్మ.

    "మళ్ళి నీకు ఫోన్ ఎప్పుడు చేస్తానంది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS