Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 44


    ఉ||  తిట్టుదునా మహోగ్ర కరతీవ్రవచోవరగద్య పద్యసం
        ఘట్టఘరట్టఘట్టవధగా విధి గాచిన నైన మానినీ
        పట్టణవవ్రసౌధమణి బంధురసింధుర సైంద వాడ్యుల
        బట్టపురాజుల దొరలఁ బండితుల దురహంకృతాద్రుల.      441

    ఉ|| తిట్టుదునా మహోగ్రకరతీవ్రవచో వరగద్య పద్యసం
        ఘట్టఫణీంద్ర కోటి ఘనకంఠ విషాగ్నుల రీతి మెట్టున
        నెట్టనఁ దాఁకఁగా వలయు నిందయుఁ జేయక పద్య మిస్తినా
        పట్టపురాజురీతి బహుభంగుల లెస్స సుఖింపంగా వలె.      442

    ఈ విధముగా సింహవలోకనముగా మూఁడు పద్యములను బలికెనఁట! రాయలు భయభ్రాంతుఁడై మీసామర్ధ్యము మాకుఁ దెలియదాయే నని స్తుతియించెను' పిమ్మట నీశాన్యసింహసనారూడుని గావించెను.

    అనఁగా:-- అష్టదిగ్గజము లనఁబరగు కవీశ్వరు లేనమండ్రును రాయల యాస్థానమండవమున నెనిమిదిదిక్కులను నెనిమిది సింహాసనములపై వెలసి యుండేడివా రని యగుచున్నది. అందు రుద్రకవి యీశాన్యసింహాసనమువాఁ డయినాఁడు.    రుద్రకవి రాయలయస్థానమునఁ బండ్రెండెండ్లు వసియించెను. సప్తకవులనఁబరుగు పెద్దన, తిమ్మన, పుత్తేటిరామభద్రయ, పింగళి సూరన, కవిరాట్టు, తెనాలి రామలింగయ, బట్టుమూర్తి, యను వారితోఁ, దాతయాచార్యులతో ననేక విధముల వాగ్వాదములు సలిపెను. కవిరాట్టు ఎవ్వరో?

    వరకవి కొండయ్య, ప్రెగడ రాజు నరసరాజు నను నల్లుమామలు కవులు రుద్రకవి కవిత నాక్షేపించిరఁట. ఈ క్రింది పద్యములను రుద్రకవి చెప్పేనంట :-

    క||  విదితంబుగఁ గవిరుద్రుని
        సదమలవాగ్జని తశాస్త్రసంహితపదముల్
        కుదిరిక తెలియక యూరక
        వదరకురా వెఱ్రిముండ! వరకవి కొండా!     443

    చ|  తెలియని వన్ని తప్పులని దిట్టతనాన నభాంతరంబునన్'
        బలుకఁగ రాకురోరి పలుమాఱుఁబిశాచపుఁబాడెకట్టే! నీ
        పలికిన నోట దుమ్ముపడ! భావ్య మెఱంగవు పెద్దలైనవా
        రల నిరసింతురా! ప్రేగడరాణరసా! విరసా! తుసా! బుసా!     444
    
    ఈ పద్యము తెనాలి రామలింగని పద్యముగాఁ బ్రఖ్యాతము. 'ఒకని కవిత్వమందేనయు' నను పద్య (445) మింకొకటి దీనితోడిదో రామలింగనిదికలదు.

    చ||  ఒకని కవిత్వమం దేనయు నొప్పులు నాకవిత్వమం
        దొకనికిఁ దప్పుపట్టఁ బనియుండదు కాదని తప్పు వట్టినన్
        మొకమటు క్రిందుగాఁ దివిచి ముక్కలు వోవ నినుంపకత్తితో
        సిక మొదలంటఁ గోయదును జెప్పునఁ గొట్టుదు మోము దన్నుడున్.  445


    రుద్రకవికిఁ గోప్పోలు త్రిపురాంతకుఁడు, నాగళ్ళ చిట్టప్ప యనువా రిర్వురు శిష్యులఁట! నవఘంటసురతా ననుపండితునితో వాదించుచు నీక్రింది పద్యమును శ్రీకృష్ణరాయలఁ గూర్చి త్రిపురాంతకుఁడు చెప్పినాఁ డట:
    
    చ|| గడియకు నూఱుపద్యము లఖండతరప్రతిభ ఘటింతునో
        బడిబడి నూఱుఘంటములఁ బద్యముల లిఖియింతునో పదం
        వడి వివిధాంద్రభాషలఁ బ్రబంధము లోక్కొకనాఁడు చేతునో
        యడుగుఁడి మీమనంబునకు హర్షము వెంటకకృష్ణభూవరా!   446

    ఇది కృష్ణరాయలఁగూర్చినది కామి స్పష్టము. మోచర్ల దత్తప్పగారి నాదరించిన తెట్టుప్రభువు. వేజెండ్ల వెంకటకృష్ణ రాజుగారిం గూర్చి చెప్పఁబడినది కాఁదగును.

    ఉ|| తెట్టు కుమారకృష్ణ జగతీవరనందన రాజ్యలక్ష్మీ కిం
        బట్టు, ధరాంగణామణికిఁ బాపటబొట్టు, రివూరగాళివా
        కట్టు, సముజ్జ్వలద్దృతికి గట్టు, బుధాళికి వేల్పుఁజెట్టు, వా
        గ్దిట్టల కున్కిపట్టును మదీయనివాసము యాచభూపతీ.    447

    పై వెంకట కృష్ణరాజుగారు, ఎండ్లూరి ప్రభువగు మందపాటి రామచంద్రరాజుగారి మేనమామ.

    చ||  జబగడదష్హు, లణు, శషసర్రు, కవయ్యు , ఝుభ, జ్జాటంచు వా
        జబజబలెల్లఁ జేసి యగసాలెల బేలల బోయపాలేపుం
        బబువులఁ దేల్చి చేతఁ గల పైకము దోఁచుటగాదు రుద్ర! నీ
        డబడబ భద్రమంత్రి యెదుటం గోనసాగదు పోకుపోకుమీ!    448

    అని భద్రమంత్రి చెప్పఁగా గొప్పోలు త్రిపురాంతకుఁ డిట్లు చెప్పెను :-

    క|| భద్రా! శ్వానము మొఱిఁగిన
        రుద్రాంకిత జంగమయ్యరూడికిఁగోదవా
        చిద్రూపుఁ డయినసాక్షా
        ద్రుద్రుఁడయా కందుకూరిరుద్రుఁడు ధాత్రి.      449

        చిట్టప్ప యిట్లు చెప్పినాఁడు.
    
    క|| రుద్రకవివాక్పటుత్వము
        భద్రప్రదయు కిఁదనరు భాసురలీల
        రుద్రస్వరూపు నేదురను
        క్షుద్రులేదుర్కొనఁగఁ గలరె కుంభినిలోన.      450

    "రవి గాననిచొఁ గవి గాంచునే కదా." అన్న సమస్యను * రుద్రకవియే పూరించినాఁడఁట. పెద్దనగారు రుద్రకవిని "తగురా కవిరుద్ర" యని యిట్లు ప్రశంసించి రఁట.

    ఉ.  వ్యగ్రకవిత్వతత్త్వచతురాస్యులు కైయటభాష్యఫక్కికా
        నుగ్రహశక్తి కల్గినఘనుల్ కవు లెందఱు లేరు? నీదువ్ర
        త్యగ్రవచోధురీణరవితల్ తగురా కవిరుద్రః రుద్రడ
        క్కాగ్రసముజ్జ్వలస్పురితతహల్లులకు స్వరపాళి కొజ్జలై.       451

    శాతాబ్దములు 1480, జయసంవత్సర మాఘ శుద్ధ పంచమీ జయనాపరమున మల్కిబ్రహిమ్ ప్రభువు రుద్రకవికి రెంటచింతల (చింతలపాలెము)  
    -----------
    "అరవి వీరభద్రు.........గాంచునే కదా!"      (452)
    ఈసమస్యా పూరాణమునకు చూ. రామకృష్ణకవి విషయము .
    గ్రామము నోసఁగినాఁడు . పైగ్రామము నేఁటికిని రుద్రకవి వంశ్యులకే చెల్లు చున్నది.

    శ్లో|| అద్యాశీతిచతుశ్శతధికసహస్రం వై శకాబ్దా గతా
        స్త (ఆ) స్మి శ్రీజయవత్సరే జయతిదౌ మాసేచ మాఘే తధా
        పంచమ్యాం ద్వయతింత్రిణీజానపదం రుద్రస్య విద్వత్కవేః
        ప్రీత్యా శ్రీయిభరామభూపతి రదాత్ క్షోణీధరాఖండలః.      453

    సీ||  ఇల శకవత్సరంబులు వేయునన్నూట
            యేనుబదియును జనునెడ జయాబ్ద
        మున మాఘమాసంబునను శుద్ధపంచమి
            నాఁడు మల్కిభరామనరవరుండు        
        తగుకందుకూరిరుద్రకవీశునకు జరు
            గుంబల్లిపురిని మాన్యం బొసంగె
        నైఋతి భాగంబున న్భదేన్కుచ్చేళ్ళ
            పోలమది రెంటచింతల యనంగ
    
    గీ||  నలరుపురియుత్తరమునఁ దా నరయ జోగి
        రాజుగారి పొలంబు పూర్వదిశ యొడ్ద
        వారిపొలము దక్షిణము పాలేరు వడుమ
        రమర గూడూరు పొలిమేర హద్దు లివియు
        మల్కిభరాము పొగడ్తపద్యములు:-          454

    ఉ||  రసుతుఁడైన మల్కి యిభరామునికీర్తియు వెండికొండయు
        ద్రాసునఁ బెట్టి తూన్ప రాజతాచల మెత్తున రాకయుండిన
        భాసురలీల నిల్పే నల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతి
        వాసుకికంకణు ఋషభవాహనుఁ జంద్రకళావతంసుని.      455
    
    చ||  పొలుపుగ నంతరాళమునఁ బూచిన పూవును బువ్వులోనఁ బెం
        పలరినచెట్టు చెట్టుచిగురాకునఁ బండినపండు వంటిపై
        కొలదలిపిందే పిందేగలకొమ్మయు నీకు దశావిభూతి ని
        శ్చలసుఖ మాయువు మతి యోసంగును మల్కి భరామ భూవరా!  456


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS