Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 45

   
    "మరి గదిలోంచి మాటలు వినిపించాయి!"    
    కీర్తి మాట్లాడలేదు.    
    "నిన్నే అడిగేది. ఎవరు నీ గదిలోంచి మాట్లాడింది."    
    "ఏమో!"    
    "ఏమో అంటే ఏమిటి?"    
    "ఏమో!"    
    "అన్నింటికి ఏమో ఏమోలే. వక్కదానికి సరిఅయిన సమాధానం వుండదు. కలవరించావా!"    
    "ఏమో" అంది కీర్తి.    
    "అఘోరించినట్లేవుంది. గదిలోలైటు ఎందుకు తియ్యలేదు, అదీ ఏమోనా!" సతీదేవి కోపంగ అడిగింది.    
    కీర్తి మాట్లాడలేదు.    
    "దానికెందుకు అన్ని ఆరాలు వచ్చింది ఎందుకో చెప్పిపోవచ్చుకదా! వెర్రిదో, తెలివితక్కువదోగాని రాణి మంచిపిల్లే తన గురించిబైట పెట్టలేదు. ఈ పిశాచం తొందరగ యిక్కడ నుంచితగలబడితే బాగుండును. రాణితో రాత్రంతసయ్యాట లాడుకోవచ్చు." సంగయ్య ఆలోచిస్తున్నాడు.    
    "కలలో గాబోలు పెద్దగ అరిచావు. కెవ్వుమనే సరికి పరుగున వచ్చాను. ఎన్నిసార్లు తలుపు కొట్టి పిలిచినా లేవవు వకటే కలవరింతలు. నేను వెళుతున్నాను. పెద్దలైటు తీసి చిన్నలైటు వేసుకుని పడుకో అదేమిటి కిటికీతలుపులు కూడా బిగించుకున్నావ్, ఊపిరిఆడాలా అక్కరలేదా! ఫ్యానున్నా కూడా కిటికీ తలుపులు తీసుకునిపడుకోటం మంచిది." అంటూ వెళ్ళి కిటికీ తలుపులు తీసింది సతీదేవి.    
    "అమ్మయ్య యింతటితో శనిగ్రహం వదులుతున్నది." సంగయ్య మంచం కింద నుంచి అనుకున్నాడు.
    "అవేమిటి?" సతీదేవి అడిగింది.    
    సతీదేవి దేన్ని గురించి అడుగుతున్నదో సంగయ్యకి అర్ధం కాలేదు.    
    "బొమ్మలు." కీర్తి చెప్పింది.    
    మంచం కింద నున్న సంగయ్య పైప్రాణాలు పైననే పోయినట్లు అయింది. తను తెచ్చిన బూతు చిత్రాలు దాయనందుకు బాధపడ్డాడు.
    "ఏం బొమ్మలు" సతీదేవి అడిగింది.    
    "ఏమో" అంది కీర్తి.    
    "ఏమో ఏంటి నీ మంచం మీద వున్నవినీకు తెలియవా! ఏదీ నన్ను చూడనీ" అంది సతీదేవి.    
    "గోవిందా, గోవిందా!" అనుకున్నాడు సంగయ్య.    
    సతీదేవి కాగితం మడతలు విప్పిచూసింది. అన్నీ బూతు బొమ్మలే. రెండు మూడు బొమ్మలు ఆడమగ ముద్దు పెట్టుకున్నవి వున్నాయి. ఆ తర్వాత బొమ్మలన్నీ పూర్తి వాత్సాయనుడి వూహ సృష్టివే. ఆడామగా ఎవరికీ బట్టలులేవు.    
    "ఛీ...ఛీ...ఈ చండాలపు చిత్రాలు నీకెక్కడివి!" అంది సతీదేవి కోపంగ.    
    కీర్తి మాట్లాడలేదు.    
    "ఎవరిచ్చారురు నీకు!" సతీదేవి గద్దించి అడిగింది.    
    కీర్తి మళ్ళీ మాట్లాడలేదు.    
    "నీవు నోరుమూసుకుంటే లాభం లేదు చెప్పు."    
    "నేను ఏడుస్తాను." అంది కీర్తి.    
    "బెదిరింపా! ఇలాంటి విషయాలలో ఏడ్చినా వినను నిజం చెప్పు ఈ బూతు బొమ్మలు నీ కెక్కడివి?"    
    "తాతయ్యా!" అంటూ చిన్నరాగం తీసింది కీర్తి.    
    "నోరుముయ్యి?" గట్టిగ కసిరింది సతీదేవి.    
    కీర్తి నోరు మూసుకుంది.    
    "నీవు మంచిగ అడిగితే చెప్పవు. బాబాయి వంద జాగ్రత్తలు చెప్పినిన్ను నాకు అప్పగించి వెళ్ళాడు. నీవేమో నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు. మీ బావగారిని పిలుస్తాను."    
    "దేనికీ?" అంది కీర్తి.
    "మీ బావగారి దగ్గర హంటర్ వుంది. హంటర్ అంటే ఎద్దులని అదిలించి కొడతారే చెరణాకోల అదన్నమాట. ఎవరు ఈ బొమ్మలు యిచ్చారో నాకు చెప్పు. చెప్పకపోతే మాత్రం మీ బావగారిని పిలిచి విషయం చెపుతాను. అప్పుడు ఆయన హంటర్ పెట్టి నిన్ను కొట్టి కొట్టి...    
    "అమ్మో వద్దు కొడితేనెప్పి పుడుతుంది."    
    "అయితే చెప్పు ఎవరిచ్చారీ బొమ్మలు?"    
    "సంగయ్య."    
    "అవును."    
    "అయిపోయిందితనపని అయిపోయింది." అనుకున్నాడు సంగయ్య.    
    "ఎప్పుడు యిచ్చాడు!" సతీదేవి అడిగింది.    
    "ఇప్పుడే." భయంగ చెప్పింది కీర్తి.    
    "ఇప్పుడా!"    
    "అవును."    
    "సంగయ్య బొమ్మలు యిచ్చి వెంటనే మాయం అయ్యాడా?" కీర్తిమాట్లాడలేదు.    
    "చెప్పవేమిటి సంగయ్య ఏడి!"    
    "మంచం కింద వున్నాడు."    
    "మంచం కింద వున్నాడా!" అంటూ సతీదేవి వంగిమంచం కిందకి చూసి "భేష్ మంచి చోటనే దాక్కున్నావ్ రాబైటికి." అంది వ్యంగ్యంగ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS