"ఈ విషయం సాయంకాలమే చెప్పాలి." తననెందుకు కొట్టాడో అంతకుమించి చెప్పలేదు గణపతిరాజు.
మరో అయిదు నిమిషాల వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. ముగ్గురూ విమలాబాయి ఆశ్రమం చేరుకుని తమ గదికి వెళ్ళారు.
గణపతిరాజు ఈజీ ఛైర్ లో కూర్చుని దీర్ఘాలోచనలో పడిపోయాడు.
తమ బాస్ ఏం ఆలోచిస్తున్నాడో అసిస్టెంట్లకు తెలుసు. అందుకే వాళ్ళిద్దరూ అతన్ని మాట్లాడించే ధైర్యం చేయలేదు.
గణపతిరాజు మెల్లిగా కళ్ళు తెరిచి "ఇక ఆలస్యం చేయడం అనవసరం. రేపే పని ముగించేద్దాం. పని పూర్తయితే తప్ప సరితాదేవి డబ్బివ్వదు. అంత ఖచ్చితమైన మనిషి అది" అన్నాడు.
మళ్ళీ అతనే "ఆ తరుణ్ గాడ్ని అనాథ మహిళాసదన్ నుంచి బయటికి రప్పించేందుకు ఒకటే మార్గం వుంది" అని తన ప్లాన్ ను పూర్తిగా చెప్పాడు.
అసిస్టెంట్ల వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
* * * * *
పరమేశదాసు రాత్రే సరితాదేవి ఇంటికొచ్చాడు. ఈ మధ్యకాలంలో ఆయన రహస్యంగా తన ప్రయాణాలు సాగిస్తున్నాడు. తనకీ, సరితాదేవికి వున్న సంబంధం గురించి ఎవరికీ ప్రత్యక్షంగా తెలియకపోయినా తన ఫ్యూచర్ ప్లాన్ లు చాలా పకడ్బందీగా అమలు కావాలంటే ఇలాంటి జాగ్రత్తలు అవసరమని ఆయనకి బాగా తెలుసు.
దాసు రాగానే సరితాదేవి అప్పటికప్పుడు రొయ్యలు తెప్పించింది. భోజనం వండి వడ్డించింది.
తర్వాత తీరిగ్గా ఇద్దరూ బెడ్ రూమ్ లో దూరారు. దాసు వచ్చినప్పుడు సరితాదేవి భర్త ముందున్న రూమ్ లోనే పడుకుంటాడు.
ఎప్పుడూ ఆయన పడక అక్కడే! శివరాత్రికో, ఏకాదశికో జాగారం వున్నట్టు ఎప్పుడో గానీ అతన్ని బెడ్ రూమ్ లోకి పిలవదు సరితాదేవి.
సరితాదేవి తనకు వంద ఎకరాల్లో భాగం ఇవ్వకపోవడం వల్ల ఆమె మీద ద్వేషం వుందిగానీ - ఆమె శరీరం, బెడ్ రూమ్ లో ఆమె చూపించే టెక్నిక్ అంటే మాత్రం మోజు తగ్గలేదు దాసుకి.
అందుకే ఆయన తొందరలో వున్నాడు.
"చెప్పండి! ఏమిటి విశేషాలు?" అంది సరితాదేవి ఆయన పక్కన పడుకుంటూ.
"ఇప్పుడు విశేషాలు చెప్పే మూడ్ కాదు" అన్నాడు. ఆయన పైట చెదిరిన ఆమె గుండెలవైపు చూస్తూ.
"విశేషాలు చెప్పే సమయమే ఇది. అసలు ఈరోజు మనం కలుసుకోవాలో లేదో టాస్ వేసి చూసుకుందాం" అంది ఆమె ఆయన ఛాతిమీదకి వంగుతూ.
"టాస్ వేయాలా? ఇదేమైనా క్రికెట్ గ్రౌండా?"
"క్రికెట్ గ్రౌండ్ కాకపోయినా గెలుపు ఓటములు ఇద్దరికీ సమానంగా దక్కే క్రీడ ఇదొక్కటే కదా ప్రపంచంలో. అందుకే టాస్ వేద్దాం"
దాసులాంటివాడ్ని బెడ్ రూమ్ లో యాక్టివ్ గా వుండేటట్లు చేయాలంటే మొదట ఆయన తన వయసును మరిచిపోయేటట్లు చేయాలని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆయన వచ్చినప్పుడంతా ఇలాంటి సరదా ఆటలు మొదలుపెడుతుంది.
"మనం ఈ రోజు కలిసి పడుకోవాలో లేదో టాస్ నిర్ణయిస్తుంది మరి" అని లేచి ఆమె డ్రాయర్ సొరుగులోంచి రూపాయిబిళ్ళను తీసింది.
"చెప్పండి బొమ్మా? బొరుసా? మీరు గెలిచారంటే ఈ బెడ్ మీదే పడుకుంటాను. లేకుంటే కింద చాప పరిచి నిద్రపోతాను. మరి మీ లక్కేమిటో చూసుకోండి" అన్నది.
ఆ మాటలు వింటుంటే దాసు పై ప్రాణాలు పైనే పోయాయి. టాస్ తిరగబడితే తాన గతేం కానో ఆయనకి అర్థం కావడంలేదు.
అయినా గుండె చిక్కబట్టుకుని "బొమ్మ" అన్నాడు.
సరితాదేవి ఓమారు కొంటెగా కన్నుగీటి "వేస్తున్నాను" అని రూపాయి నాణాన్ని గాల్లో తిప్పింది.
మూసిన చేయి పైకి తీసింది.
దాసు ముఖం ఒక్కసారిగా ఐదొందల రూపాయల నోటంత అయింది.
"బొమ్మే" అని చిన్నపిల్లాడిలా అరిచాడు.
ఆమెకు కావాల్సింది కూడా అదే! ఆయన తన వయసును మరిచిపోవాలి.
"అయితే మరోసారి వెయ్. ఈసారి నువ్వు మొత్తం డ్రస్ విప్పాలా వద్దా అన్న దానిమీద" అన్నాడు దాసు.
ఇప్పుడాయనకి ధైర్యం వచ్చింది గెలుస్తానని.
"ఓ.కే" అంది ఆమె.
మరోసారి టాస్ వేసింది.
"ఈసారీ బొమ్మే" అన్నాడు.
బొమ్మే పడింది.
దాసు మరింతగా వంగి ఆమె పైటను లాగాడు. ఇప్పుడు జాకెట్టు తప్ప మరో అచ్ఛాదన లేదు. బ్రా కొమ్మకు పూచిన ముద్దబంతి పువ్వుల్లాగా వున్నాయి ఆమె గుండెలు. ఆయన నరాలకు బ్యాటరీ కనెక్ట్ చేసినట్లు వుద్రేకపడిపోయాడు.
ఆమె బొడ్డు పంచామృతం పాత్రలాగా వున్నట్లనిపించి ఆయన ఠక్కున అక్కడికి వంగాడు. ఆయన పెదాలకు అమృతం తగిలినట్లని పించింది.
ఆయన్ని బలవంతంగా లాగి "ఈసారి లైటు వుంచాలా వద్దా అన్న దానిమీద టాస్ వేద్దాం" అంది.
"సరే"
ఆమె టాస్ వేసింది.
"బొరుసు. నేను గెలిస్తే లైటు వుంచాలి"
ఆమె చేయి తీసింది.
ఈసారీ ఆయనే గెలిచాడు.
ఆయన ఆనందానికి అవధుల్లేవు.
"లైటు వుంటేనే నీ అందాలకు నా కళ్ళు చిట్లడం తెలుస్తుంది" అన్నాడు ఆమె చెవిలో మెల్లగా.
"కానీ లైటుకూడా నన్నే చూస్తున్నట్లుంది నాకు. అయినా మీరు గెలిచారు కాబట్టి లైటు వుంటుంది" అన్నది కవ్వింపుగా.
ఇక టాస్ వేసి తేల్చుకోవలసిన విషయాలేమీ లేనట్లు ఆయన చేతిలోంచి రూపాయి బిళ్ళను పక్కన పెట్టాడు. వాళ్లిద్దరూ అలసి సొలసి నిద్రపోయేటప్పటికి తెల్లవారుజాము మూడు గంటలైంది.
అంత ఆలస్యంగా నిద్రపోయినా ఉదయాన్నే లేచేశారు. కారణం ఆ రోజు చాలా ప్రోగ్రామే వుంది.
ఇద్దరూ తయారై బయల్దేరేటప్పటికి పదిగంటలైంది. దాసు రహస్యంగా ఎవరికీ తెలియకుండా వచ్చాడు గనుక ఆయనకి సంబంధించిన హడావుడి ఎంతమాత్రం లేదు. తను వచ్చినట్టు తెలియకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
టౌన్ నుంచి ఇద్దరూ కారులో బయలుదేరారు. దాదాపు ముప్ఫై కిలోమీటర్లు వచ్చాక రైతు శిక్షణాకేంద్రం కోసం ప్రభుత్వం వారు మంజూరు చేసిన స్థలం వచ్చింది. అప్పటికే అక్కడ ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి.
