న్యూఢీల్లిల్లో వున్న స్థానిక టీవీ చానల్లో ఓ ప్రకటన వచ్చింది... ప్రతీ అరగంటకోసారి ఆ ప్రకటన వస్తూ వుంది.
ఆ ప్రకటన ఇలా వుంది.
"హాలో... నేను గుర్తున్నానా? వాలైంటైంన్స్డే నాడు నువ్వు నన్ను ప్రేమించానని అనడం, మనం చిత్రంగా కలుసుకోడం , విచిత్రంగా విడిపోవడం గమ్మత్తుగా, కలలా మారిన మన ప్రేమ... నీ వెంటే జీవితకాలం ఉండి పోవాలని అనుకుంటున్నాను. నువ్వెక్కడున్నా నన్ను కాంటాక్ట్ చెయ్. నా ఫోన్ నెంబర్..." అంకిత్ తన ఫోన్ నెంబర్ చెబుతుంటే స్కీన్ మీద రోల్ అవుతూ ఉంది.
ఆ ప్రకటన ప్రతీ అరగంట కోసారి వస్తోంది.
***
ఈ ప్రకటన ఢిల్లీ నగరంలో సంచలనం స్పష్టించింది.
ఇంతవరకూ ఇలాంటి ప్రకటన రాకపోవడమే అందుకు కారణం.
ఈ ప్రకటన వెలువడ్డ అరగంట తరువాత ఓ ఫోన్ కల వచ్చింది.అంకిత్ ఆత్రంగా సెల్ అన్ చేసాడు.
"హాయ్... నాలాంటి అందమైన అమ్మాయి ఉండగా ఇంకేవర్నో ప్రేమించానంటావు" అంటూ ఓ అమ్మాయి మాట్లాడింది.
వెంటనే ఆ ఫోన్ కాల్ కట్చేసాడు.
అలా అప్పట్నుంచీ వరసగా ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి. ఏ కాల్ నూ మిస్ అవడంలేదు. పొరపాటున అ మిస్ అయినా కాల్ మృదువనిది అయితే?
***
మృదువనికి ఏడుపుచ్చేస్తోంది.
తనేమైపోతోంది? తన బ్రతుకు ఎటువైపు సాగిపోతోంది? తనీ విషవలయం నుంచి బయటపడలేదా? తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జేమ్స్ చెప్పిన వువరాల ప్రకారం చాలా ఫోన్లను టాప్ చేసాడు డిఫెన్స్ చీఫ్.
పగలూ, రాత్రి తేడాలేదు. ప్రతీక్షణం ప్రాణభయంతో పారిపోవడం, గుండెలో బాధ దిగేలా ఎడుద్దామన్న ఓ మనిషి ఆసరా లేదు.
ఆమెకు ఆ ప్రయత్నంగా అంకిత్ గుర్తొచ్చాడు. ఆ రోజు ఆకలి చూసి అన్నం పెట్టి షెల్టర్ ఇచ్చాడు. తను మాత్రం అతనికి చెప్పకుండా పారిపోతూ వచ్చింది.
ఇరానీ హొటల్ కు వచ్చింది మృదువని.
జేమ్స్ జ్వరంగా ఉంది. టీ, బాన్ కొనడానికి వచ్చింది. అతను పార్క్లో సిమెంట్ బెంచీ మీద పడుకుని ఉన్నాడు.
"ఏక ఛాయ్... బాన్" చెప్పింది మృదువని.
టీ కుర్రాడు గ్లాసు అడిగాడు. అవును. గ్లాసు లేకుండా టీ ఎందులోఇస్తాడు.
"అయ్యో! మరచిపోయాను" అని వెనతిరుగుతూ ఆగిపోయింది. ఆ ఐరనీ హొటల్ లో బ్లాక్ అండ్ వైట్ తెవీ వుంది. టీవీలో అంకిత్ కనిపించారు అతని మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఒక్కక్షణం ఆమె మనసు చిత్రమైన స్పందనకు గుర్తింది. దప్పికతో అలమటించే వ్యక్తికీ చల్లటి మంచినీళ్ళు దొరికినట్టు ఎడారిలో కుంభవృష్టి కురిసినట్టు...
అంకిత్ తన సేల్ నెంబర్ చెబుతున్నాడు. ఆమె ఆ నెంబర్లు గుర్తుంచుకుంది. ఆమె మేమోరిలో అ నెంబర్ రికార్డయింది. ఆమె క్షణాల్లోనే ఓ నిర్ణయానికి వచ్చింది.
***
సెల్ ఫోన్ రింగయింది.
అంకిత్ అనాసక్తిగా సెల్ ఫోన్ అందుకున్నాడు. దాదాపు వంద ఫోన్ల వరకూ వచ్చాయి. టీజింగ్ కాల్స్ కొన్ని, నేనే ఆ అమ్మాయినని మరికొందరు... ఇలా రకరకాల ఫోన్స్ కాల్స్ వచ్చాయి.
తను ఊహించిన ఫోన్ కాల్ రాలేదు. "హాలో..." అన్నాడు ఓకే బటన్ ప్రెస్ చేసి.
"అంకిత్!"
"ఒక్కసారిగా ఎలర్టయ్యాడు. అతని గుండె వేగం రెట్టింపయింది. అతని ఉద్వేగం... అనుభవవేద్య మైంది.
"మృదువనీ!"
"నేనే... మీరెవరో నాకు తెలియదు... అయినా నా గురించి ఇక్కడివరకూ వచ్చారా?"
మృదువనీ! నువ్వు నిర్దోషివి... అన్ని వివరాలు తెలిసాయి... నీకేమీ కాదు... నువ్వు... నువ్వెక్కడున్నావు?"
"ఇప్పుడు నన్నెవరూ రక్షించలేరు... అయాం ఇన్ డేంజర్... ఎందుకో ఒక్కసారి మిమ్మల్ని పలకరించాలని అనిపించింది."
"మృదువనీ! ప్లీజ్ ఫోన్ పెట్టేయకు. నేవ్వేక్కడున్నవోచెప్పు... నీ కోసమే నేను ఢిల్లీ వదలి వెళ్ళకు... చెప్పు మృదువనీ!
అటువైపునుంచి ఒక్కక్షణం నిశ్శబ్దం.
"మృదువనీ ప్లీజ్! దయ చేసి ఫోన్ పెట్టేయకు... నీ కోసం పిచ్చివాడిలా తిరిగాను... నువ్వు కనిపించకుండా ఢిల్లీ వదలి వెళ్ళకు... చెప్పు మృదువనీ! నువ్వెక్కడున్నావు? నిన్ను దక్కించుకుంటాను... నిన్ను కపాడుకుంటాను... ప్లాజ్ మృదువనీ... దయచేసి ఫోన్ పెట్టేయకు!"
"సరే మిమ్మల్ని కలుస్తాను. నాకంటూ అత్మీయలు ఎవరూరాలేరు. ఉన్న ఓకే ఒక ఆత్మీయురాలు నా కారణంగా చిక్కుల్లోపడింది... మరో అరగంటలో ఈ ఫెల్ జంక్షన్ దగ్గర కలుస్తాను... బై" అంటూ ఫోన్ పెట్టేసింది.
"హలో... హలో.." అరిచినట్టుగా మాట్లాడాడు అంకిత్. అటువైపు ఫోన్ దిస్ కనెక్ట్ చేశారు.
డిస్ ప్లేలో ఆ ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసాడు.
"హలో! ఇందాకే ఓ అమ్మాయి ఫోన్ చేసింది. కాస్త పిలుస్తారా?"
"సారీ సర్. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది పబ్లిక్ టెలిఫోన్ బూత్" చెప్పాడతను.
అప్పటికే అంకిత్ ఈ హడావిడి చూసి రాహుల్, చేతన్ లు అక్కడకి వచ్చారు.
"ఏమైంది అంకిత్?"
"మృదువని ఫోన్ చేసింది... మనం వెంటనే... ఊహో నేను ఒక్కడ్నే వెళ్తాను" అంటూ బయటకు పరుగెత్తాడు.
అతనికి ఉద్వేగంగా ఉంది... ఆనందంగా వుంది... ఆశ్చర్యంగానూ వుంది. ఇది కళా? నిజమా? అన్నా బ్రమలో ఉన్నాడు... రోడ్డు మీదుకి వచ్చి ఆటో ఎక్కి చెప్పాడు "ఈపిల్ జంక్షన్" అని ఆటో ముందుకు కదిలింది.
అంకిత్ కంగారులో ఓ పోరపాటు చేసాడు తన్ని షంషేర్ దాదా మనుష్యులు గమనిస్తున్నారన్న విషయం. అంకిత్ ఎక్కినా ఆటోని, షంషేర్ దాదా మనుష్యుల జీపు ఫాలో అయింది.
***
