క|| మాకొలఁది జానపదులకే
నీక వసపుఠీవి యబ్బు నే కూపనట
ద్బేకములకు? గగనధునీ
శీకరములచెమ్మ! నందిసింగయతిమ్మా. 427
అనందించి తిమ్మకవి చేత నేమియు లేకపోవుటచేఁ గర్ణమున నున్న కుండల మొకటి తీసి యాతని కొసఁగెనట! తర్వాత రాయలయాస్థానమునకు నొంటికుండలముతోఁదిమ్మకవియు భట్టు కవియు వచ్చిరట! ప్రస్తావవశమున నీ వృత్తాంతము రాజు విని 'గగన' యనుచో 'నాక' యని మార్చి పద్యము మినమిసలార్చేనట.
క|| మాకొలఁది జానపదులకె
నీకవనపుఠీవిః యబ్బునే కూపనట
ద్బేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ! నందిసింగయతిమ్మా! 428
తిమ్మకవియు భట్టుమూర్తి కవియు రెండు కుండలములను రాజునకు సమర్పించిరట! రాయలు వారి సరసతకు మెచ్చి హెచ్చు బహుమతు లిచ్చెనట!
కందుకూరి రుద్రకవి
ఈ కవి విశ్వబ్రాహ్మణకులుఁడు . ఈయన వంశమువా దిప్పుడు కందుకూరి దగ్గఱనే చింతలపాలెమను గ్రామమున నున్నారు. రుద్రకవి యనంతర మావంశమునకు "కవివారు" అని యుపనామ మేర్పడినదఁట! నేఁటిదాఁక నా వంశమువారు "రుద్ర" నామము పారంపర్యముగాఁ బెట్టుకొనుచున్నారు. ఈ క్రింది విధమున రుద్రకవి చరిత్ర విషయ మావంశము వారి దగ్గఱఁ జేకూరినది:-
రుద్రకవి కృష్ణరాయల నాఁటివాఁడు . రాయల యస్థానమున కీయనను దత్రుత్యులు మంత్రులు రానీయరైరి. రాయలసన్నిహిత భృత్యుఁడగు మంగలకొండోజి యనువాని తోడ్పాటున రాయల సందర్శనము పోసఁగఁగా రుద్రకవి యీ క్రింది పద్యము చెప్పినాఁడు.
క|| ఎంగిలిముచ్చు గులాములు
సంగతిగాఁ గులము చెఱువఁ జనుదెంచి రయా
యింగిత మెఱిఁగినఘనుఁ డీ
మంగల కొండోజి మేలు మంత్రులకన్న. 429
క|| అపలు కాలించి మహా
కోపంబునఁ దాత యాఖ్యకోవిదుఁ డనియే
"కాపల్లీ? తేవర్ణః
కో పితు? పద, కించ నామ గుణవ?" న్నని తా. 430
రుద్రుని వాక్యము
ఉ|| బంధువిప్రవ ప్రగృహ భాసుర గోపుర సౌధవీధికా
బంధుతటాక కూపవరిపక్వఫలాన్వితవృక్షవాటికా
గంధమదభ్రమ ద్బ్రమరగానవిహిరికిఁ గందు కూరికి
సింధుపరీతభూములను జెప్పఁగఁ నొప్పుగుసామ్య మబ్బునే. 431
సీ|| వరనిజ కర్మ దూర్వహత బ్రాహ్మణులు మీర్
పరికింప నిలఁ బరబ్రహ్మ నేను
ఇనుముచేతను నొసర్చినశంఖచక్రాంక
గురువులు మీ ర్జగద్గురుఁడ నేను
దానవ్రతి గ్రహాదీనబిరుదు మీది
పెషణీ హనుమంత బిరుదు నాది
ఋషివంశ భూషణ శ్రేష్టులు మీరలు
కనక కుంతలపరిష్కారి నేను
గీ|| అనుచుఁ దేల్పితి మామకఘనకులంబు
రాయలు వినంగ నంద ఱౌరా యనంగ
సత్కవులలోనఁ దాతయాచార్య! యేన
రూడి కెక్కినకందుకూర్ రుద్రకవిని. 432
సీ|| ఆమాట తప్తలోహశలాకతో దీటు
గా నాటి చెవిఁ బుట్టుకఠినబాధ
యిట్టట్టుగాఁ జేయ నిట్టుర్పు నిగిడించి
యూరకే తలయూఁచి హుంకరించె
తాతయ తా "నిషీ" దేతి వాక్కడుగఁగా
రుద్రుఁ "డెక్కడ" నని రూడిఁ బలికె
నపుడు సమీచీన మధ్య సమస్యా యి
మా పద" యని దుస్సమస్య లెన్ని
గీ|| యిచ్చే నన్నిటిఁ బూరించే హృదయలసద
సూయఁ దాతయాజ్జైక విధేయుఁ డైన
రాజుముం దతిజడరోషరక్త రూక్ష
వీక్ష నీక్షించి యిట్లనే దక్షుఁడగుచు. 433
పూరించిన సమస్య లీ క్రిందివి యఁట :- తల లొక్కేఁ బదినాల్గు కానఁ ఐడియె దద్గౌరివక్షంబున (434) - దుగ్ధపయోధిమధ్యమున (435) - వక్త్రంబుల్ పది కన్ను లైదు (436)- అస్ఖలలిత బ్రాహ్మచారి (437) - ఉండ్రావోరిదురాత్మక - (ఈ సమస్యలు మోచెర్ల దత్తప్ప వెంకన్న కవులు పూరించినవని వినికి. ఇవి యీ వఱకు ముద్రితము లయినవి)*
----------
* (లభించిన వాని నిందు చేర్చినాము - (వ్రకాశకులు).
ము|| లలితాకారుఁ గుమారు షణ్ముఖుని ఁదా లాలించి చన్నిచ్చుచో
గళలగ్న గ్రహరత్న దీప్తకాళికా గాంభీర్య హేమాంచితో
జ్జ్వలరత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపఁగాఁ
దలలోక్కెఁబదినాల్గు కానఁబడియన్ దద్గౌరి పక్షంబునన్. (434)
(మిగతా ప్రక్క పుటలో)
ఉ||రింష్ట్రహి యేమిటం గఱచు ? ఋక్షము లెక్కడనుండు ? నంధకు
నంష్ట్రనుఁ జేసే నేవిభుఁ? డనంతరమం దతఁడేమి చేసే చే
రుంష్ట్రఖిలాత్ముఁ డై నలవు రూప మదేగతి నుండేఁ? జెప్పు మా
దంష్ట్రల మీఁద శంకరుఁడు తాండవమాడెను రాముకైవడి. 438
క|| పచ్చలు కెంపులు హేమము
నిచ్చలముగ విశ్వకర్మ నిర్మించే నయా
యుచ్చలకొఱకై తాపిన
పచ్చని రాచిలుక మీఁదఁ బచ్చిక మొలచె. 439
ఈ క్రిందివి రుద్రకవి కోపించి రాజు మీఁదఁ జెప్పిన పద్యములఁట:-
ఉ|| తిట్టుదునా భుజంగవిషదిగ్ధదవానల ధాగధైగచి
ట్చిట్టచిటార్భటిప్రకటశీఘ్రమహోగ్రత దంతనిష్టురో
ద్ఘట్టనవిస్పులింగలయకారణ దారుణలబ్ధలుబ్ధరా
టట్టణ గోపురధ్వజనిపాత హతాహుతిగాఁగ నుద్ధతి. 440
------------
ఉ|| స్నిగ్ధపువర్ణుఁ డీశ్వరుఁడు చిచ్చఱకంటను బంచబాణునిన్
దగ్ధముచేసే నంచు విని తామర సేక్షుణు మ్రోలనున్న యా
ముగ్ధపులచ్చి మోదుకొనే; మోహన గంధము పిండి పిండి యై
దుగ్ధపయోది మధ్యమున దుమ్ములు రేఁగే నదేమి చిత్రమో. (435)
శా|| ఈక్తా ప్రాసము కష్టమౌననుచు మీరింతేసివా రాడఁగా
వాక్త్రాసంబది సత్కవీశ్వరులత్రోవల్గామి నేఁ జెప్పెదన్
దిక్ప్త్రారాతికిఁ భారతీశ్వరులకున్ దిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్పది కన్ను లైదు కరముల్ వర్ణింపఁగా వేయగున్ (436)
క|| ఈస్టా ప్రాసము దుష్కర
మస్థలనత నీయఁదగునె యది సుకవులకున్?
సస్ఖలితలయి గుహుంగని
రస్తలిత బ్రహ్మచారి కార్గురు పుత్రుల్. (437)
