ఓడ మునిగింది. దాని ఖరీదుతో సహా మొత్తం పదికోట్ల నష్టం వాటిల్లింది.
అయినా ఆధారాలతో 'COFE POSA' క్రింద రమేష్ ని అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన రమేష్ ఆ నష్టానికి మానసికంగా ఎంత దెబ్బతిన్నాడూ అంటే ఇక కోలుకోలేక పోయాడు.
ఆ తర్వాత మతి భ్రమించి కనిపించకుండా పోయాడు.
ఇంతటి అనర్థానికి కారణం 'జయచంద్రే' అని ఆలస్యంగా తెలుసుకున్న సోఫియా రమేష్ లా మానసికంగా కృంగిపోలేదు.
పగబట్టిన కళింగనాగై అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అది ఇన్నాళ్ళకు దక్కింది.
"మనమూ రెవిన్యూ ఇంటలిజన్స్ అఫీషియల్స్ కి తెలియపరుద్దామా" అడిగాడు దామోదర్.
"దీనివలన మనకి ఒరిగేదేమీ లేదు"
"జయచంద్ర నష్టపోతాడుగా"
"అది ఒక్కటే మనకి లాభం కాదు... ఆ బంగారం కూడా మన సొత్తు కావాలి"
"షిప్ సముద్రంలోకి అడుగుపెట్టాక అది మన సొత్తెలా అవుతుంది" అనుమానంగా అడిగాడు.
"అదే నీకూ నాకూ వున్న తేడా."
చురుక్కుమంది "పథకం చెబితే నేను అమలు చేస్తానుగా"
"నీ వలన కాదు దామోదర్" సాలోచనగా కాక టెయిల్ వేపు చూస్తూ "నాకు శశాంక కావాలి" అంది.
దామోదర్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అంత అనుభవం గల తనను కాదని మరెవడి కోసమో ఆమె ఆసక్తి చూపిస్తుంటే..
"మిస్టర్ దామోదర్" సోఫాలో వెనక్కి జారగిలబడి లోయలా వున్న గుండెల నడుమ కొద్దిగా డ్రైమార్డినీ నింపుకుంది. సన్నని ధరలా పరుగెత్తే 'మార్డినీ' పాప పుంతలో అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంటే "వ్యవధి లేదు... శశాంక వైజాగ్ ప్లాయిట్ లో వెంటనే చేరుకోవాలి... అంటే శశాంక మరో గంటలో ఇక్కడ వుండాలి" పరవశంగా షాండ్లియర్ ని చూస్తూ అంది.
"అది కాదు మేడమ్"
"గెటవుట్ ఐ సెడ్" అసహనంగా అరిచింది.
"వెంటనే శశాంకని గాలించి తీసుకురా"
దామోదర్ కదిలాడు.
ఒకవేళ శశాంక వెంటనే అంగీకరించకపోతే ఏం చేసేదీ ఆలోచిస్తూ కవరులోని ఫోటో పైకిలాగి లాలనగా చూసింది. ఎక్కు పెట్టిన బాణంలా షాట్ గన్ తో నిలబడి ధనుష్కోటి చావును ఆనందిస్తున్న శశాంక తన గుండె లోతుల్లోకి గురిచూస్తున్న వాత్స్యాయనుడిలా అనిపిస్తుంటే ఫోటోని గుండెలకు హత్తుకుంది.
సూర్య తాపంతో సైతం కరగని మంచుకొండలని శశాంక స్వహస్తాలతో స్పృశించిన వివశత్వానికే లోనయ్యిందో లేక మేక్సీ బరువును మోయలేని ఎద చేసే సెక్స్ అల్లరిని అదుపే చేయలేకపోయిందో జిప్ లాగి అలాగే కార్పెట్ పై పాములా కాంక్షతో పొర్లుతూంది.
* * * *
తలుపు చప్పుడు విన్న జాకీ ద్వారాన్ని తెరుస్తుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ శశాంక బలాన్ని కూడగట్టుకుంటున్నాడు.
"పోలీసులు వెళ్ళిపోయారు జాకీ"
ఎదురుగా ఓ వృద్ధురాలు నిలబడి వుంది.
ముగ్గుబుట్టలా నెరిసిన తలతో అనుభవాల ఒరిపిడిని కళ్ళ వెనుక పదిలంగా దాచుకొని ప్రపంచాన్ని నిర్మలంగా దర్శించడమే తన ధ్యేయమన్నట్టు కనిపిస్తున్న ఆ వృద్ధురాలు మదర్ థెరిసాని గుర్తు చేస్తూంది.
"నా స్నేహితుడు శశాంక" పరిచయం చేసాడు జాకీ.
ఆమె కళ్ళలోని తాత్వికతకి అసంకల్పితంగా చేతులు జోడించిన శశాంకకి తనను స్నేహితుడంటూ జాకీ ఎడ్రస్ చేయడమూ వూహించనిదే...
"నమస్తే అంకుల్" అప్పటికే ఆమె చుట్టూ చేరిన పసిపిల్లల గుంపు జాకీతోపాటు శశాంకకీ నమస్కరించగానే నిరుత్తరుడై చూస్తూ వుండిపోయాడు శశాంక.
"వెళ్ళేటపుడు ఓమారు కనపడు జాకీ" ఆత్మీయంగా పిల్లల్ని దగ్గరకు తీసుకుని అక్కడ నుంచి కదిలిందామె...
అస్థిమితంగా కణతలు నొక్కుకున్నాడు జాకీ "మళ్ళీ ఏదో కథ చెప్పాలి."
తానెక్కడ అడుగుపెట్టిందీ ఇంకా అవగాహనకు రాని శశాంక "మీ అమ్మగారా?" అన్నాడు.
"నాకు మాత్రమే కాదు శశాంకా! నా లాంటి ఎందరికో అమ్మ అన్నపూర్ణమ్మ."
"అంటే ఇది..."
"అమ్మా, నాన్నల అండలో బ్రతికే అదృష్టంలేని పసిపిల్లలకి నీడనిచ్చే ఓ అనాధ శరణాలయం. ఎక్కడో చెత్త కుండీలో విసిరేయబడిన నేను పెరిగింది ఇక్కడే శశాంకా... ఈ స్వచ్చంద సంస్థని స్థాపించిందీ అమ్మే..."
