Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 44

నిండు జీవితాన్ని అర్దాంతరంగా చీకటిలో మగ్గిపోయేలా చేసుకునే కన్నా పదిమందికీ ఉపయోగపడే నవ సమాజ నిర్మాణంలో అసువులు బాసినా జీవితానికి ఒక అర్ధం వుంటుంది అనే నిర్ణయానికి వచ్చాడు అతను.
అందుకే ప్రాణాలకు తెగించి రణధీర్ తో పాటు రవితేజ కూడా జైలునుంచి తప్పించుకున్నాడు. వాళ్ళపై పోలీసులు అత్యంత పాశవికంగా కాల్పులు జరిపారు.
ఆ కాల్పులలో రణధీర్, రవితేజలు ఇద్దరూ గాయపడి పోలీసులకు దొరికారు.
వాళ్ళను హాస్పిటల్ లో చేర్పించి, చూట్టూ పట్టిష్టమయిన కాపలా ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ ఎలాగయినా తమ కామ్రేడ్ ను విడిపించుకు వెళ్ళాలనే పట్టుదలతో రణధీర్ సహచరులు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
గాయపడిన రవితేజను చూడాటానికి అతని తండ్రి ఆనందరావు వచ్చాడు.
బెడ్ మీద అచేతనంగా పడివున్న కొడుకును చూడగానే అయన దుఃఖం అవధులు దాటింది. బాధ ఎక్కువ కావడంవలన ఎక్కువసేపు వుండలేక వెళ్ళిపోయాడయన.
మరొక పావుగంట తరువాత ధీరజ ఆ వార్డులోకి అడుగు పెట్టింది.
జర్నలిస్ట్ కావడంవలన పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆమెను లోనికి వెళ్ళనిచ్చారు. రవితేజ వున్న గదిలోకి వెళ్ళి అతనని పరామర్శించింది.
అంతలోనే పిడుగులాంటి వార్త హాస్పిటల్ స్టాప్ చెవిన పడింది.
రణధీర్ తప్పించుకు వెళ్ళిపోయాడు అని తెలియడంతో పోలీసులలో అలజడి మొదలయింది. ఆ హడావడిలో వున్న పోలీసులు కళ్ళు కప్పి రవితేజ కూడా అదృశ్యమైపోయాడు.
షాక్ మీద షాక్...
కొద్ది వ్యవధిలోనే ఒకరి తరువాత ఒకరు ఇద్దరు ఖైదీలూ హాస్పిటల్ నుంచి విచిత్రంగా మాయమయ్యారు.
పోలీసులు అనుకున్నట్టుగానే స్త్రీ వేషంలో రవితేజను బయటకు పంపించాను. పోలీసుల దృష్టి పడకముందే అతను నా ప్లాట్ కు చేరుకుంటాడు. నేను ఇంటికి తిరిగివెళ్ళిన  తరువాత మళ్ళీ ఫోన్ చేస్తాను. తరువాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం."
ధీరజ.. ఫోన్ లో ఆనందరావును కాంటాక్ట్ చేసింది.
ఒక పద్దతి ప్రకారం రవితేజను తప్పించటం జరిగింది. సరిఅయిన సాక్ష్యాధారాలు సంపాదించిన తరువాత వాటితో వెళ్ళి మేజిస్ట్రేట్ గారివద్ద లొంగిపోయి, అప్పుడు అతను నిరపరాధి అని నిరూపించాలని ధీరజ ఆలోచన...
అంతవరకూ పోలీసుల కంట పడకుండా రవితేజను దాచి వుంచాలి.
తనను ఎవరూ గమనించకముందే హాస్పిటల్ ఆవరణలో నుండి జర్నలిస్టు ధీరజ బయటకు వెళ్ళిపోయింది.
 
                     *    *    *    *
కుషాయి గూడా....
ఇండస్ట్రియల్ ఎస్టేట్....
సమయం రాత్రి పదిగంటలు....
ఒక గోడవున్  లో లైట్లు వెలుగుతున్నాయి....
అప్పుడే అ గోడౌన్ లో ముందు ఒక తెల్లని అంబాసిడర్ కారు ఆగింది.
పగలు అంతా వర్కర్స్ తో బిజీగా వుండే ఇండస్ట్రియల్ ఏరియా అది... అర్దరాత్రి అంతా నిర్మానుష్యంగా వుంటుంది. గతానికి వర్తమానానికి, భవిష్యత్ లో జరగబోవు సంఘటనలకు మౌనసాక్ష్యలా నిలబడి వున్నాయి వివిధ రకాలయిన ఫాక్టరీ గోడౌన్లు.
హుందాగా కారుదిగిన జయచంద్ర, సత్యమోహన్ లు ఠీవిగా ఆ గోడౌన్ లోపలకు నడిచారు. అప్పటికే అక్కడ పదిమంది అనుచరులు వున్నారు.
వాళ్ళందరూ వివాద నగరాలలో దొంగనోట్లు పంపిణీ చేసే జయచంద్ర మనుషులు...
జయచంద్ర వెంటనే సమావేశాన్ని ప్రారభించాడు.
"డియర్ ప్రెండ్స్.... ఎంతో చాక చక్యంగా మీరందరూ మన కరెన్సీని వెదజల్లి అసలు సిసలయిన నోట్లను తెచ్చినందుకు ఎంతో సంతోషంగా వుంది. ఈ మధ్యకాలంలో మనపై నిఘా ఎక్కువయింది. అందుకే కొంత కాలం పాటు నగర పరిసరాలలో నోట్ల మార్పిడి ఆపేశాం. ఇకనుంచి మీరే రధసారధులు. ఈ బిజినెస్ చేసేది మీరే కాబట్టి మీరు తెచ్చిన కాష్ లో నాలుగవ వంతు మీ స్వంతం అవుతుంది....
"ఎవరెవరు ఏయే ఏరియాకు వెళ్ళవలసిందీ .... వాళ్ళకు నకిలీ కరెన్సీ ఎంత సప్లయ్ చేస్తున్నదీ వివరాలు సత్యమోహన్ దగ్గర వున్నాయి. ఆ ప్రకారంగా మీకు సూట్ కేసులలో సర్ది వుంచిన కాష్ కూడా ఇప్పుడే అందచేస్తాం. ఒక్కొక్కరు తమ వంతు వచ్చిన కౌంటర్ ఫీట్ కరెన్సీని సాధ్యమయినంత త్వరగా వైట్ చేసుకుని రండి. ఈసారి మనం ఎక్కడ కలుసుకోవాలో తరువాత మీకు తెలియ జేస్తాను.... గుడ్ లక్..." జయచంద్ర చెప్పడం ఆపి అందరివైపు పరిశీలనగా చూశాడు.
మరుక్షణం ఇద్దరు అనుచరులు కారు వెనక సీట్లో వరసగా పేర్చి వున్న సూట్ కేసులను మోసుకువచ్చారు.
ఒక్కొక్కడి పేరు చదువుతూ వాళ్ళకు కేటాయించిన సూట్ కేసును అందచేయగానే అతను  వెళ్ళిపోతున్నాడు.
పదిమంది అనుచరులు తమ వంతుకు వచ్చిన సూట్ కేస్ లను తీసుకుని వెళ్ళిపోయారు.
ఇప్పుడు అక్కడ మిగిలింది జయచంద్ర.... సత్యమోహన్.... వాళ్ళ వెంట వచ్చిన ఇద్దరు.
వాళ్ళు కూడా వెనుదిరిగి వెళ్ళబోయేటంతలో ఒక దృశ్యం వాళ్ళ కంటపడింది.
అ బిల్డింగ్ గోడచాటున నక్కినక్కి రోడ్ వైపుకు వెళుతున్న వ్యక్తిని గమనించడంతో ఖంగుతిన్నారు.
"ఓ మై గాడ్... ఎవరో మనలను ఫాలో అయి వచ్చాడు, వీడియో కూడా తీసినట్టు వుంది. గో ఆన్... ఘాట్ హిమ్.... వదలవద్దు వాడిని-" సత్యమోహన్ ఖంగారుగా అరిచాడు.
ఇద్దరు అనుచరులు వేగంగా దూసుకువెళ్ళారు.
"వాడు తీసిన వీడియో కాసెట్ బయట పడిందంటే మన రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది. వాడిని ప్రాణాలతో వదలవద్దు" జయచంద్ర పట్టరాని కోపంతో చిందులు వేస్తున్నాడు.
"నువ్వు ఖంగారు పడకు బావా.... వాడు ఎక్కడికిపోతాడు..." కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు సత్యమోహన్.
వీడియో కెమేరా భుజాన తగిలించుకున్న వ్యక్తి బుల్లెట్ స్పీడ్ ను మరింతగా పెంచాడు.
అతన్ని ఛేజ్ చేస్తున్న ఇద్దరు అనుచరులు కూడా కారు హెడ్ లైట్ల వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నారు.
ఇక అలా లాభం లేదనుకుంటూ డాష్ బోర్డ్ లో నుంచి రివాల్వర్ తీశారు జయచంద్ర.
మౌలాలి సెంటర్ లోకి తిరిగి ఇ.సి.ఐ.ఎల్ కు వెళ్ళే రోడ్ వెంట పరుగు ప్రారంభం అయింది.
పళ్ళు బి బట్టి గేర్ మర్చి, యాక్సిలేటర్ ను అడుగుకంటా అదిమి పెట్టాడు సత్యమోహన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS