Previous Page Next Page 
మహావృక్షం పేజి 43

ఒక విధంగా అతడి దైర్యం ఆమెకి అనందాన్నిచ్చింది. చాలాకాలం తరువాత తనని కేవలం ఓ స్రీగా భావించి, నిర్భయంగా, నిర్మోహమాటంగా భరణి వెలిబుచ్చిన అభిప్రాయంతో ఆమెలో నిద్రాణమైన స్రీత్వం కొద్దిగా కళ్ళుతెరిచి, ఒళ్ళు విరుచుకున్నట్టు అయింది. డాక్టరుగా, సంఘ సేవకురాలిగా అందరూ తనని గౌరవిస్తారు, అభిమానిస్తారు ఎన్నో విషయాలు చర్చిస్తారు. హాస్పిటల్లో కలసి ఆపరేషన్లు చేస్తారు... కానీ,
ఇంతవరకూ ఏ మగవాడి సమక్షంలోనూ కలగని ఓ భావం, సన్నజాజి పరిమళంలా, ఆమె గుండెని తాకింది.
 పదిహేనేళ్ళక్రితం, ప్రశాంత్ ని హత్తుకు కూర్చుని గండిపేట వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అదే లాస్ట్... మళ్ళీ తన మనసులో అలాంటి అనుభూతికి ఆస్కారమే లభించలేదు. మళ్ళీ ఇన్నేళ్ళకి, భరణి మూసుకున్న హృదయ కవాటలామీద తన మునివేళ్ళతో సున్నితంగా తట్టాడు.
మణి తనతో మాట్లాడిన ఆఖరి మాటలు గుర్తోచ్చాయి. ఆ రాత్రి నీకు కోరికల్లేవా అని అడిగింది. తనకి కోరికల్లేవా? వున్నాయి. కానీ, అణగారిపోయాయి.... వాడిపోయాయి... అయితే. ఆ అణగారిన కోరికల మీద భరణి ప్రేమ అనే అమృతాన్ని చిలకరించి,చిగురింపచేస్తున్నాడు.
ముఖ్యంగా మణి మరణానంతరం తనకి జీవితంపట్ల , భవిష్యత్తు పట్ల, ఓ భయం ఏర్పడింది. ఎవరన్న తోడు కావాలనిపిస్తోంది. ఎవరురున్నారు? ఎవరొస్తారు? వీణ ఎప్పుడో ఓ సరి కలుస్తుంది. మణిలేదు... ఇకపోతే ఎంతసేపుండగలదు! తన పరిధి వృత్తి పరంగా ఎంతవిసృతమో, వ్యక్తిగతంగా అంత పరిమితం... అందుకే ఎక్కువవుతుంది స్నేహితులు లేరు.
ఈ చిన్న పరిధలో తనకెప్పుడన్నా, ఏదన్న ఆపద కలిగితే ఆదుకోవడానికి ఎవరు వస్తారు?
తనకీ వయసు అయిపోతుంది. ఈ ఓపిక, ఈ చలాకీతనం ఇవ్వన్నీ ఏమీ వుండడు. జబ్బు చేయచ్చు. ఏదన్న అవచ్చు.... అప్పుడు తనకి ఎవరు సేవ చేస్తారు? ధుఖం కలిగితే ఓదర్చడానికి, జబ్బు చేస్తే, సేవలు చేయడానికి, అనందం పంచుకోడానికి ౬తనకి ఎవరున్నారు?
ఏదో ఒకరోజున మణిలాగే తనూ హర్టుఎటాక్  తో చనిపోతుంది. అప్పుడు... అప్పుడు తన కోసం ఎవరు బాధపడతారు? ఎవరు తనకోసం ఓ కన్నీటిబొట్టు రాలుస్తారు? తను ఓంటరిది...
ఒంటరిగా బతకడంకన్నా, ఒంటరివాళ్ళం అని అలోచించడంలోనే అంతులేని బాధ వుంది. ఇప్పుడు అనూష ణి ఆ బాధ దహించివేయసాగింది.
ఇంతకాలం నుంచీ హుందాతనం అనే గిరిగీసుకున్న ఆమె దగ్గరకి, ఆ గిరిదాటి రాగల సాహసం ఎవరకీ కలగదు... కానీ, ఇవాళ భరణి... ఇంతకాలం నుంచీ,వాళ్ళద్వారా తన అభిప్రాయాన్ని, తెలియచేసిన భరణి, ఆ గిరిదాటి ఒకడుగు ముందుకేసి తన అభిప్రాయన్ని చెప్పాడు.
అతని పదస్పర్స ఆమె మనసుని తాకి స్పందించచేసింది.
ఆమె మనసులో అప్పటికప్పుడే తన భవిషత్తుపట్ల ఓ నిర్ణయాన్ని రావడానికి చిన్న పడింది...
నేమ్మదిగాలేచి, ఫోన్ దగ్గరకి నడచి, వీణ నెంబరు డయల్ చేసింది...

                                      *    *    *    *
నూష అంగీకారం తెలియ చేయగానే, వీణ వెంటనే కారేసుకుని భరణీ అపీసుకి వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికి టేబుల్ మీద రకరకాల న్యూస్ పేపర్లు పడేసుకుని, ఏదో రాసుకుంటున్నాడు భరణి.
"హలో! భరణీ!గుడ్ మార్నింగ్!"
వీణ స్వరం వినగానే చటుక్కున లేచాడు...." హలో వీణగారూ ఏంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి... ఏదన్నా న్యూస్ గానీ, ఆర్టికల్ గానీ తెచ్చారా?"
గుడ్ న్యూసా! ఏంటది? చెబుతారా?"
"ముందు నేనడిగిందానికి సమాధానం చెప్పండి."
"మీరు చెప్పే న్యూస్ యొక్క ఇంపార్టెన్స్ మీద ఆధారపడి వుంటుంది."
ఆమెని పంపించి లోపలకి వచ్చిన భరణికి తను ఈ ప్రపంచాన్ని జయించిన వీరుడినన్న్జ భావం కలిగింది.
అనూష పెళ్ళికి, అది కూడా తనతో....ఈ జర్నలిస్టు భరణితో.... వారెవ్వా... ఏం అదృష్టం! ఒరేయ్ భరణీ! నువ్వురా ఈ ప్రపంచంలో అదృష్టవంతుడివంటే.....
అందం ఐశ్వర్యం, హొదా, తెలివితేటలు, మంచితనం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ వున్న అమ్మాయి నీకు భార్య కాబోతుంది.
ఆ పూట ఇంకేం పని చేయాలనిపించలేదు. ఇష్యూ రావడానికి ఇంకా చాలా సమయం వుంది. ముందు చేతిలో డబ్బులేదు. ఎన్ని ఆర్టికల్స్ రాసి ఏం లాభం?
కాబట్టి ఇష్యూ గురించి హడావడి పడక్కర్లేదు. ఓ సారే పెళ్ళి అయాక, ఫోటోలతో సహా ఓ పేజీ మొత్తం నింపవచ్చు.... టేబుల్ మీద పరుచుకున్న న్యూస్ పేపర్లన్నీ సర్ది బొత్తిగా పెట్టాడు.
ఫోన్ దగ్గరకి జరపుకుని, తండ్రి నెంబరు కలిపాడు.

                                               *    *    *    
వీణ, అనూషతొ భరణి రుయక్షన్ అంతా పూసగుచ్చి చెప్పింది. చివరకి అన్నది." అనూ! అతని అనందం చూస్తుంటే హటాత్తుగా ఎలిజిబెత్  టేలర్ పిలిచి నన్ను పెళ్ళి చేసుకుంటావా? అని అడిగితె అచ్చు ఇలాగే రియాక్ట్ అవుతాడేమో అనిపించింది."
అనూష నవ్వింది. "ఇంతకీ పెళ్ళి సింపుల్ గా జరగడానికి ఒప్పుకున్నాడా?"
"ఒప్పుకోక చస్తాడా? ఇంకో మాట మాట్లాడితే నీ మూడ ఎక్కడ మార్చేసుకుంటవో అని హడలిపోతున్నాడు మానవుడు. పోనీలే మొత్తానికి మంచివాడురా.... హొదాదెం వుంది? హొదా ఉన్నవాళ్ళకి మానవత్వం వుండద్దూ? జీవితంలో ఎంతో అలసిపోయి వున్నావు. ఈ దశలో సేద తీర్చుకోడానికి మానవత్వం నిండిన అతని హృదయం చాలు. ఫోమ్ బెడ్ లు కాదు. అప్ కోర్స్! ఫోమ్ బెడ్స్ కి నీకు లోటు లేదనికో...."

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS