"నమస్తే కూర్చోండి."
ఆ అమ్మాయి బిడియంగా కూర్చుని రిజిస్టరు టేబుల్ మీద పెట్టింది.
"నా పేరు స్పందన... నేను ఓఅక నవల రాశాను. మీ పత్రికలో అచ్చుకోసం తేచ్చానండి."
"నా బొంద...." విసుగ్గా అనుకున్నాడు మనసులో. పత్రిక అసలే నడవడంలేదు. ఆ అందానికి నవలోకటి. పైకి మాత్రం నెమ్మదిగా అన్నాడు. "ఉంచండి... చూసి చెప్తాను."
"ఎప్పుడు చెప్తారు సార్?"
"నేలా, రెణేల్లు పటచ్చు."
"అందులో నా అడ్రసు, పాన్ నెంబరు వున్నాయి."
"అలాగే... ఇన్ఫాం చేస్తాను."
"సబ్జేట్ చెప్పమంటారా సార్?"
"వద్దులెండి. నేను చూసుకుంటాను."
"ధాంక్స్ సార్! వస్తాను" అప్పుడే తన నవల సెలక్ట్ అయిందన్న సంతోషంతో వెళ్ళిపోయింది. రిజిస్టర్ డ్రాయరు సొరుగులో తోసి, లేచాడు.
బైటికి వచ్చి, బైక్ స్టార్ట్ చేశాడు... అనూష ఇంకా ఇంటికీ వచ్చి వుండదు.
ఆకలేస్తోంది ముందు భోజనం చేయాలి. బైక్ హొటల్ వైపు పోనిచ్చాడు.
లోపలకి వెళ్ళాగానే హాయిగా అనిపించింది. ఇద్దరు, ముగ్గురు కూర్చుని ద్రంక్ చేస్తున్నారు. పర్ ప్యూమ్ వాసనతోపాటు, ద్రంక్ వాసన కలిపి చిత్రమైనా వాసన వస్తుంది. ఖాళీగా వున్న ఓ టేబుల్ దగ్గర కెళ్ళి కూర్చున్నాడు.
తక్కువ వాల్యూమ్ లో మంచి మ్యూజిక్ వినిపిస్తోంది.
బేరర్ వచ్చాడు... మెనూ ఇచ్చాడు.
భారానికి కూడా ద్రంక్ చేయాలనిపించింది. అతను తాగుబోతుకాడు. ఎప్పదన్న సరదాకి తీసుకుంటాడు. కానీ, ఎందుకో ఆ వేళ తాగాలనిపించింది. బాగా తాగాలి. వెళ్ళి అనూషని ఒప్పించాలి.మామూలుగా వుంటే గట్టిగా మాట్లాడలేడు. ఆమెని చూడగానే భయం వేస్తుంది. మాటలురావు.
బేరర్ పిలిచి జిం ఆర్డర్ చేశాడు.
బేరర్ పదినిమిషాల్లో బాటిల్, గ్లాసులు తీసుకొచ్చాడు.
హాప్ బాటిల్ ఓపెన్ చేసి, తళతళాడేగాజుగ్లాసులో పోసి, ఐస్ క్యూట్స్ వేశాడు. వెయిటర్. వేయించిన మసాలా జీడిపప్పు పింగాణీ ప్లేటులో తెచ్చిపెట్టాడు.
భరణి కసిగా తాగడం మేడలు పెట్టాడు.
సరిగ్గా అప్పుడే వీణ లోపలికొచ్చింది. భరణిని చూసిన వీణ ఆశ్చర్యంగా అతని టేబుల్ దగ్గరకి వెళ్ళి, ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. "హాలో!"
భరణి అమెవేపు విసుగ్గా చూసి, వెంటనే "మీరా?" అన్నాడు.
"నేనే. ఏంటి సంగతి? దేవదాసు పూనాడా?"
భరణి మాట్లాడలేదు.
"ఇలాంటి డ్రామాలు ఈ వయసులో బాగుండవు."
"డ్రామా ఏంటి?"
"కాక మరేంటి?"
"ఇదంతా మీ ప్రెండ్ చేసిందే. చెప్పండి ఆవిడకి... భరణిని తగుబోతుని చేసిన పాపం వూరికే పోదని చెప్పండి."
"ఇలా తాగి సాపనర్దాలు పెడితే అనూష కరిగిపోతుందా?"
భరణి కోపంగా చూసి వూరుకున్నాడు.
వీణ మృదువుగా అన్నది- "భరణి పంపించాను ఒప్పించమని. మాట్లాడిందో,లేదో తెలియదు. బాడ్ లక్! తను పోయింది. ఇప్పుడు అనూ చాలా డిప్రెషన్ లో వుంది ఇదే ఛాన్స్.చేతనైతే, ఇప్పుడే ఆమె మనసులో స్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయి. సాధారణంగా ఎవరై నాసర్, బాధలో వున్నప్పుడే ఓ తోడు కోరుకుంటారు. ఈ సెటప్ వదిలేసి, సాయంత్రం అనూష ఇంటికెళ్ళి,ణే ప్రమానురాగాలతో ఆమె మనసు గెల్చు కోవడానికి ప్రయత్నించు."
"ఒప్పుకుంటారా?" ఆశగా అడిగాడు.
"ట్రై యూవార్ లక్!"
వీణ అన్నట్టుగానే, ఆ సాయంత్రం అనూష ఇంటికీ వెళ్ళాడు. ఆమె చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది. అతణ్ణి చూడగానే ఆరోజు ఎందుకో ఆమెకి కాస్త హాయిగా అనిపించింది. చక్కటి కబుర్లు చెప్తాడు. కాసేపు అన్నీ మర్చిపోవచ్చు అనుకుంది. చాలా కబుర్లు చెప్పాడు. సుందర చైతన్యా నంద ఉపన్యాసం కవర్ చేసిన సంగతులు చెప్తూ, జీవితసారాన్ని, భగవంతుడి పరమార్ధాన్ని వివరించాడు.
చాలా రోజుల తరువాత అనూషకి తాని సమక్షంలో కాలం తెలీలేదు.
వీణ అన్నట్టు ఎప్పుడైతే మనిషి మనసు వేదనామయం ఆపుతుందో, ఆ భారాన్ని పంచుకోవడానికి, ఆ మనసు తోడుని కోరుకుంటుంది. తన వృత్తి, ప్రవృత్తి ద్వారా అనుక్షణం బుజీగా వుండే అనూషకి ఇంత కాలం నుంచీ జీవిత సహచరుడి గురించి ఆలోచించే వ్యవధిలభించలేదు. అందుకే ఆమె అ విషయంలో శ్రద్ద చూపించలేదు. ఇద్దరు, ముగ్గురు తోటి డాక్టర్లు ప్రపోజ్ చేసినా నిరాకరించింది ఇదివరకు. వీణ మాటలు, మణి మాటలు, మణి మరణం, వంటరితనం, తల్లీ జ్ఞాపకలు, భరణిపట్ల ఆమె మనసులో ఓ చిన్న పాజిటివ్ ఆలోచనకి బీజం వేశాయి.
భరణి వెళుతూ, వేళుతూ దైర్యంచేసి చెప్పాడు. "అనూషగారూ! మీరంటే నాకు చాలా ఇష్టం. మీతో కలసి బ్రతకాలని వుంది. మీతో మాట్లాదితుమ్తే కలం తెలియదు. మీలోని విజ్ఞానం, అంకిత భావం,నిస్వార్ధం నాకెంతో నచ్చాయి. ఇంత పెద్ద ఎన్ సైక్లోపీడియానునా స్వంతం చేసుకోవాలనుకోవడం అత్యాస కాక పోతే, రిపీ టైమ్కి వస్తాను.మీ నిర్ణయం చెప్పండి. వస్తాను" అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వడి, వడిగా వెళ్ళిపోయాడు.
అనూష నిర్ఖాంతపోయింది ఎంత దైర్యం ఇతనికి! ఎలా మాట్లాడాడు ఇలా?
