Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 43


    లెట్ మీ డై!

     ఐ డోంట్ వాంటు యు కిల్ యూ మెంటల్లీ"

    "అలా ఎందుకనుకొంటున్నావు?

    ఆమె తలపైన చేత్తో నిమిరాడు.

    "అదంతే! నేను నిన్ను అంగీకరించడం అంటే మానసికంగా నేను చంపినట్టే అవుతుంది. మంచితనానికీ ఓ హద్దు వుంటుంది."

    "నువ్వెంత పిచ్చిదానివి భారతీ

    గ్రహణం పట్టిందని చందమామని ఆకాశం దూరం గా విసిరేయదు?"

    అతని మాటలకి ముగ్దురాలపోయింది శిరీష.

    "నిజంగా నువ్వు ఆకాశం కంటే గొప్ప వాడివి రంగారావు. నీ మనసు ఆకాశం కన్నా పెద్దది. అంతులేని నీ ఔన్నత్యానికి నేను నీకు చేతులు జోడిస్తున్నాను.

     మగాళ్లందరూ నీలా వుండాలని నేను అనడం లేదు.

     కానీ కనీసం నూటికి అయిదు మందన్నా నీలాంటి వాళ్లుంటే ఆడపిల్లల బతుకులు కొన్నైనా బాగుపడతాయి.

     రంగారావు అదోలా నవ్వాడు.

     "నేను అంత గొప్ప మనిషిని కాను శిరీష! ప్రేమించ మనిషిని దక్కించుకోవాలనుకుంటున్నానే తప్ప, ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీలేదు.

     ఒక విధంగా ఇది నా స్వార్దం కాకూడదని ఏముంది?"

    భారతి మెల్లగా తలెత్తింది.

    "వద్దు రంగారావు. చీకటిలో నీ జీవితంలో ప్రవేశించలేను. నీ బతుక్కి సమాధి కట్టలేను."

    "అలాని నేను అనుకోవడం లేదు భారతీ! నువ్వు నాక్కావాలి.

    అంతే!

    ఇది నీకు తెలుసా?

     నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను తెలుసుకొనే సరికే నువ్వు ప్రశాంత్ వలలో చిక్కుకున్నావు.

     అది తెలీగానే నా గుండెల్లో బాణం దిగినట్లు విలవిల్లాడిపోయాను. దానిక్కారణం ప్రశాంత్ గురించి నేను చాలా విని వున్నాను.

     ఆ వేటగాడి వలలోనువ్వు చిక్కుకున్న క్షణం నుంచి నిన్ను నేను ఓ కంట జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాను.

     కానీ చేతులు కాలిపోయాయని ఆలస్యంగానే తెలుసుకున్నాను!"

     "నన్ను ఎందుకు హెచ్చరించలేదు!"

    ఆమె మాటలకి అతను చిన్న మందహాసం చేశాడు.

     "నిజమే . కానీ నువ్వే ఆలోచించు.

     నువ్వు ఆరాధిస్తున్న వ్యక్తి గురించి ఒక్కసారిగా వాడెలాంటి వెధవో చెపితే నువ్వెలా స్పందిస్తావో నాకు తెలుసు.
     నామీద నీకు జుగుప్స కలుగుతుంది.

     నన్ను  ఓవిలన్ గానూ, శత్రువుగానూ నువ్వు భావించే అవకాశం ఎక్కువగా వుంటుంది.
 
     అందుకనే చెప్పలేకపోయాను.

    ప్రశాంత్ విషవలయంలోంచి ఏదో క్షణంలో నువ్వే బయట పడతావనుకున్నాను. కానీ ఇలా కాదు"

    "భారతీ!" శిరీష పిలిచింది.

     భారతి ఆమె కేసి చూసింది.

     "చూడు. మనిద్దరం అవడానికి ఆడవాళ్లమే. కాస్తో కూస్తో నేను నీకంటే పెద్దదాన్ని వయసులో. అయితే మనిద్దరిలోనూ చెప్పలేనంత వ్యత్యాసం వుంది.

     నేను బతకడానికి బతుకుతోన్న రాజీ పడినదాన్ని.

     కానీ నువ్వు బతకడానికి కిష్టంలేక చనిపోడానికి సిద్దపడినదానివి.

     నేను సమాజాన్ని లక్ష్యం చేయను.

    నువ్వు సమాజం అంటే భయపడుతున్నావు.

     నేను సెంటిమెంట్స్ విడిచిపెట్టేసాను. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ వి.

     నేను ఎండకీ, చలికీ భయపడేదాన్ని కాదు.

      కానీ నువ్వు నీ నీడని చూసి నువ్వే భయపడే  పిరికిదానివి.

     జీవితం మనిషికి దేవుడిచ్చిన గొప్పవరం భారతీ!

     దాన్ని నాశనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు.

     ఆత్మహత్య పరిష్కారం కాదు.

     ఆత్మహత్య పిరికివాల్లు చేసుకొనేది.

     నువ్వు మారాలి.

    రంగారావులాంటి మనిషి నీవెనక నిలుస్తున్నందుకు గర్వపడాలి.

    నీకు తెలీదు. చిన్న పిల్లవి. ఎదురుదెబ్బ తగలడం అనేది నీకిదే మొదటిసారి.

     అందుకే విలవిల్లాడి పోతున్నాను.

     ఆడపిల్ల పుట్టిందిమొదలు ఎదురు దెబ్బలు కాచుకొనే వుంటాయి.

     మగాడనే వేటగాడు విసిరే గాలానికి ఎప్పుడూ తగులుకోకూడదు.

     ఒకవేళ తగులుకున్నా గాలానికి వున్న ఎరని మింగేసి, గాలాన్ని కొరికి తప్పించుకోవాలి. ఆ నైపుణ్యాన్ని  ఆడది సంపాదించుకోవాలి.

    నేను నీకు చెప్పే సలహా ఒక్కటే!

    నువ్వు ప్రేమించిన వాడికోసం నువ్వు దిగులు పడకూడదు.

    నిన్ను నిన్నుగా ప్రేమించేవాడినే నువ్వు చేపట్టాలి.

     అప్పుడే ఆడదానికి సుఖం, సంతోషం.

     రంగారావు మాటని కాదనకు" అంది శిరీష.   

     "అయితే నేను అబార్షన్ చేసుకొంటాను!" అంది భారతి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS