Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 42

    "సరే! నువ్వు అతను వుండే హొటల్ దగ్గర వెయిట్ చేయి" చెప్పాడు చీఫ్.

    "అలాగే సార్" అన్నాడు అతను సెల్ ఆఫ్ చేస్తూ.
   
                                               ***

    మెల్లగా కళ్ళు తెరిచాడు అంకిత్.

    భుజం మీద కొద్దిగా బాధ... అతనికి మెల్లమెల్లగా గుర్తుకు రాసాగింది.

    తను రోడ్డు క్రాస్ చేస్తుండగా జరిగిన చిన్న ఆక్సిడెంట్.... తనకు తగిలింది చిన్న దెబ్బే... కానీ తను కొద్దిగా తూలీ పడుతున్న సమయంలో తన భాజానికి కిందుగా ఏదో గుచ్చుకుంది.

    ఏమిటది? ఇంజెక్షనా? కుడి భజం తడుముకున్నాడు... చూట్టూ చూసాడు.

    "మీరూ?"

    "మీ శ్రేయోభిలాషిని... యూ ఆర్ మిస్టర్ అంకిత్... రైట్" అడిగాడా వ్యక్తి.

    "అవును."

    "వేల్! ఇప్పుడు మృదువని వెతికే పనోలో వున్నారు కదూ!"

    "అవును... ఈ విషయం మీకెలా తెలుసు?" అనిమానంగా అడిగాడు అంకిత్.

    "తెలుసుకోవడం నా వృత్తిలో భాగం. అన్నట్టు డిఫెన్స్ చీఫ్ తో ఏం మాట్లాడారు?" ఆ వ్యక్తి అడిగాడు.

    "అది మీకు అనవసరం... ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు."

    "రెండుసార్లు చెప్పాను శ్రేయోభాలాషిని."

    "మీరేన్నిసార్లు చెప్పినా మీరు నా శ్రేయావుభిలాశా కాదా అన్నా విషయం యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడకు తీసుకువచ్చినట్టున్నారు..." అనిమానంగా అడిగాడు అంకిత్.

    "యూ ఆర్ టూ ఇమ్తిలిజేమ్ట్. సెంట్ పర్సెంట్ కరెక్ట్. కావాలనే యాక్సిడెంట్ సీన్ ని క్రియేట్ చేశాను... కావాలనే మీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను... కావాలనే ఇక్కడకి తీసుకువచ్చాను."

    "ఎందుకో తెలుసుకోవచ్చా?"

    "నిన్ను, మృదువని కాపాడాలని."

    "మృదువనిని ఎందుకు కాపాడాలి? ఆమెకు కాపాడ్డానికి మీరెవరు?'

    "నేనా...?" అని ఒక్కక్షణం ఆగి అన్నాడు రంగనాథ్. "డిఫెన్స్ దిప్యిఇటీ చీఫ్ రంగనాథ్."

    ఆశ్చర్యంగా తలెత్తి "మీరు... మీరు చెబుతున్నది నిజమా?"

    "అబద్దం చెప్పాల్సిన పనిలేదు."

    "మీరే డిఫెన్స్ చీఫ్ అయితే ఇలా నన్ను కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏమిటి?"

    "నీ వెనుకే డిఫెన్స్ చీఫ్ మనుష్యులు ఫాలో అవుతున్నారు కాబట్టి!"

    అంకిత్ అపనమ్మకంగా చూసాడు.

    "చూడు మిస్టర్ అంకిత్! మృదువని నిర్దోషి అని నాకు తెలుసు... ఆమెను కాపాడాల్సిన భాద్యత నాకూ వుంది... ఈ విషయంలో నీకు అనిమానాలు అక్కర్లేదు...ఇదిగో నా ఐడెంటిటీ" ఐడెంటిటీ కార్డ్ తీసి చూపించాడు డిఫెన్స్ డిప్యూటీ చీఫ్ రంగనాథ్.

    "సారీ సార్... నాకు ఢిల్లీ కొత్త... ఇక్కడ శత్రువులు ఎవరో తెలీదు... ఇక మిత్రులంటారా... నాకేవరుంటారు సార్. అందుకే మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది."

    "దట్సాల్ రైట్ మైబోయ్... ఇంతకీ మృదువని నీకెలా పరిచయమో చెప్పనేలేదు" అడిగాడు రంగనాథ్ స్టూలు అతని మంచం పక్కన జరుపుకుని కూర్చుంటూ.

    అంకిత్ క్లుప్తంగా చెప్పాడు... వాలైంటైంన్స్ డే రోజు ఘాంటింగ్ సంగతి, అక్కడ తారసపడడం, ఆతరువాత జరిగిన సంఘటనలూ...

    "ఆ మాత్రం పరిచయానికి ఇంతదూరం వచ్చి మృదువని నిర్దోషి అని నిరూపించే దుస్సహసానికి ఓడిగాట్టావా?"

    "సార్! పెళ్ళిచూపుల్లో రెండు నిముషాలు అబ్బాయి అమ్మాయిని చూసి ఓకే అనికుని పెళ్ళి చేసుకుని జీవితాంతం కలసి ఉంటారు. పెళ్ళి ఎలా కుదురుతుందో తెలుసా. పెళ్ళి చూపులు, పెద్దల మధ్య బేరసారాలు, తెలిసిన కుటుంబాలు, ఇలాంటివి ఎన్నో... కానీ ప్రేమ ఎలా పడుతుందో ఎవరికీ తెలుసు సార్.ప్రేమంటే తొలిచూపులతో కలిగే ఆకర్షణ కాదు, తొలిచూపులతో కలిగే ఆత్మీయత పరామర్శ, నమ్మకం. మృదువనితో పరిచయంలేదు. నిజానికి ఆమె నన్ను ప్రేమించను కూడాలేదు.అయినా ఆమెను నేను ప్రేమించాను... త్రేమిస్తూనే వుంటాను."

    "వేల్! కేవలం ఒకేసారి అమ్మాయిని చూసి 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని వాలెంటైన్స్ డే రోజున అన్నా ఒక మాటతో ఆమెను ప్రేమించేసి ఆమెను కాపాడ్డానికి దేశంలో ఓ అతి పెద్ద సంస్థ చీఫ్ మాఫియాతో తలపడుతున్నవా?"

    "మృదువనిని నేను మనస్పూర్తిగా ఇష్టపడ్డాను... ఆమె గురించి నాకేం తెలియదు... అయినా మృదువనినిర్దోషి అని నామనసు చెబుతోంది... అది నిరూపించడానికి, మృదువనిని కాపాడుకోవడానికి ఎవరి తోనైనా తలపడాతను... అన్నింటికి సిద్ధపడ్డాను... ఆ రోజు సావిత్రి తన భర్తను కాపాడుకోవడానికిఎవరినైనా నిలదీస్తాను."

    "వెరీగుడ్ మిస్టర్ అంకిత్! ఒక అమ్మాయిని ఆమె ప్రమేయం లేకుండానే ప్రేమించి ఆమె నిర్డైషి అని మనస్పూర్తిగా నమ్మి ఆమెకోసం నాప్రాణాలు పణంగా పెట్టడం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది...కీపిటప్!"

    "థాంక్యూ సార్... మీలాంటి వాళ్ల ఆశీస్సులు, సహకారం వుంటే నా మృదువనినినినేను కాపాడుకుంటాను" సిన్సియర్ గా అన్నాడు అంకిత్.

    "వైనాట్... ష్యూర్! అది నా బాధ్యాత... మృదువని నా సబార్తినేట్. ఆమెను కాపాడుకోవడం నా బాధ్యాత కూడా."

    "వన్స్ అగైన్ థాంక్స్ సార్" అంటూ లేవబోయాడు అంకిత్.

    "కాసేపు రెస్ట్ తీసుకోండి. అన్నట్లు మృదువనిని ఎలా ట్రేస్ అవుత చేస్తావు."

    "దానికో ప్లాన్ ఆలోచించాను సార్!"

    "ఏమిటది?" ఆసక్తిగా అడిగాడు.

    చెప్పసాగాడు అంకిత్.
   
                                                      ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS