భస్మనేత్రం నేపథ్యం...
గుజిరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ గా పన్జేసి రిటైరయినప్పుడల్ల ఏ. పరీఖ్ కు రెండు మెదళ్ళున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల డాక్టర్లు వెల్లడించారు. ఈయనకు రెండు కుదిచేతులున్నయట. యాభయ్యేళ్ళనాటి సంగతులు కూడా ఏ మాత్రం రెండు త్రోటుపాటు లేకుండా చెప్పగలడట. దేశ విదేశ శాస్ర్తజ్ఞులకుఅర్దంకాని ఈ మిస్టరీ ఎప్పటికి విడిపోతుందో...?
***
కెనడా_
రూజ్ వేల్డ్ అనే యువకుడని మీ కళ్ళెంతబావుతున్నాయి... అని అనడానికి ఎవరూ సాహసించేవారు కాదు. దానిక్కారణం అతనికి కళ్ళు బదులు 'కన్ను' మాత్రమె వుండి. అదీ రెండు కనుబొమ్మలమధ్య ఓకే కన్ను... ఆ కన్నుకి కాస్తంత కిందుగా ముక్కు, మిగతా పార్ట్స్ అన్నీ మనలాగే. అయినా రూజ్ వేల్డ్ ఇబ్బంది పడలేదు. ముప్పయి అయిదేళ్ళు వయసులో పెళ్ళి చేసుకున్నడతను. అతనికి ఇద్దరు పిల్లలు. ఒఅబ్బాయి మూడుకాళ్ళతో పుట్టాడు. సర్జరీ ద్వారా ఓ కాలిని తీసి వేసారనుకోండి. రూజ్ వేల్డ్ ఏదైనా వస్తువును తీక్షణంగా చూస్తే ఆ వస్తువులో కదలిక వచ్చేదట. అరవైయేళ్ళు వయసులో అతనాశాక్తిని కోల్పోయాడు. అరవై ఎడేళ్ళకి చనిపోయాడు.
***
కంటిచూపుతోనే కాల్చే శక్తి?
హాలెండ్ హంగియర్ అనే వ్యక్తికి అతీత శక్తులున్నాయని ప్రచారం జరిగింది. దాని వెనక వున్న నిజానిజాలను చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నించినా, అందుకు హాంగియర్ ఒప్పుకోలేదు.
తనో సాధారాణ మనిషిననీ, తనని పరీక్షల ప్రపంచాన్ని డిస్ట్రబ్ చేస్తున్నారని కోర్టుకెక్కే ప్రయత్నం చేశాడు.
దాంతో, అందరూ మిన్నకుండిపోయారు. హాంగియర్ కు వున్న అతీత శక్తులన్నీ అతని కళ్ళలోనే వున్నాయట. అతనికి ఎవరిమీదైన కోపం వస్తే అతని వైపు చూసి కన్నెర చేస్తే వాళ్లకు ఏదో కీడు జరుగుతుందట.
తీక్షణంగా అతను చూస్తే ఎదురుగా వున్న వస్తువు నిప్పుంటుకున్నట్టు భగ్గుమంటుందట. ఈ విషయాన్ని అతను చనిపోయేవరకూ రహస్యంగానే వుంచాడు. ఈ శక్తిని అతను 'వ్యాపారం' చెసుకున౩ఎ ప్రయత్నం చేయలేదు. పైగా అతని భార్యాపిల్లలు ఈ విద్యను పదిమందిలో ప్రదర్శించమని చెప్పినా నిరాకరించాడు. చరమదశలో పిల్లల నిర్లక్ష్యం, భార్య అతని కన్నా ముందే చనిపోవడంవల్ల ఏర్పడిన వైరాగ్యంతో మంచం పట్టిన ఆరు నేలలకే చనిపోయాడు.
ఈ రహస్యం అతనితోనే సమాధి అయ్యేది. కాని చనిపోయాక తండ్రి చేసిన నిర్వాకం గురించి అయన కొడుకులు పదిమందికీ చెప్పడంతో ఈ విషయం బయటపడింది.
***
కాలిఫోర్నియాలో ఓ బేకరీ పన్జేసీ గ్రాహామ్స్ కుడిచేతికి అపారమైన శక్తివుంది. ఆ చేత్తో అతను అలవోకగా పెద్దపెద్ద ఇనుప బీరువాలు, తోపుడు బండ్లు అవలీలగా లాగగలడు. అతని ఎడమ చేయి మాత్రం చాలా పీలగా వుంటుంది.
ఒకరోజు అతనికి బేకరీలోని స్టార్ట్ రూమ్ లో పాత సామాను తీసి వేస్తుండగా ఓ పొడవాటి పాము కాటేసింది అతని కుడిచేతిని. అతనికి ఆ విషయం తెలియదు. కాని ఆ దృశ్యాన్ని చూసిన తోటి స్నేహితులు గట్టిగా అరిచారు. ఆ పామును చంపేశారు.
గ్రాహమ్స్ కు మాత్రం ఏమీ కాలేదు. డాక్టర్స్ అతడ్ని పరీక్షించి ఆశ్చర్యపోయాడు పాము విషం కూడా అతని చేతిని ఏమీ చేయలేకపోయింది.
ఆ తర్వాత గ్రాహమ్స్ ఆ విషయాన్ని కన్ ఫార్మ్ చేసుకోవాడానికి పాముతో కాటేయించుకున్నాడు. ఏమీ కాకపోవడంతో వరసగా కోరలున్న పాములతో కాటేయించుకుంటూ ప్రదర్సనలు ఇవ్వసాగాడు.
పదిహేడెళ్ళ పాటు ఇలా ప్రదర్సలిస్తూ వచ్చాడు. పాయిజన్ మెన్ అని అతడ్ని పిలిచేవాళ్ళు. చివరకి తన యాభయ్యేళ్ళ వయసులో విచిత్రంగా పాము కాటుకు గురై మరణించాడు.
ఢిల్లీలో రామ్ లాల్ ప్యారీ అనే వ్యక్తీకి 1936లో ఓ యాక్సిడెంటయింది. అప్పటి వరకూ అతనో మామూలు పాల వ్యాపారి. యింటింటికి తిరిగి పాలమ్ముకుంటూ జీవనం సాగించేవాడు.
అతనికి రాత్రివేళల్లో కళ్ళు సారిగా కనిపించేవి కావు. ఓ జీపు వేగంగా వచ్చి రామ్ లాల్ ప్యారీ గుద్దేసింది. ఆ ప్రమాదంలో అతను తన రెండు కళ్ళూ కోల్పోయాడు. ఆ తర్వాత అతనికి బ్రతకడమే కష్టమైంది. పదిహేను రోజుల తర్వాత అతను తడుముకుంటూ నడవడానికి ప్రాక్టీసు చేస్తూంటే చిత్రంగా ఎదురుగా ఏం వుందో తెలిసిపోతూ వుండి. కళ్ళున్న వ్యక్తీలానే చురుగ్గా నడవసాగాడు. ఈ విషయాన్ని పదిమందికీ చెప్పినా నమ్మలేదు. అతను కూడా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేయకుండా తన పని తను మాములుగా చేసుకుంటూ పోతున్నాడు. అతనికి కొన్ని విషయాలు ముందే తెలిసేవి. సడన్ గా రోడ్డుమీద వెళ్తోన్న వ్యక్తిని ఆపి నీకు యాక్సిడెంటవుతుంది, వెళ్ళొద్దు... అని చెప్పేవాడు. ఆ వ్యక్తీ నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోతే యాక్దిడెంటయ్యేది.
రామ్ ప్యారీ 1985లో చనిపోయాడు. ఢిల్లీలోని ఓల్ట్ చౌక్ లో అతని గురించి ఈ విషయాలు ఓ వ్యక్తీ తెలియజేశాడు.
***
ఆదేశాలిస్తూ... హత్యలు చేయిస్తూ...
1980_లాస్ ఏంజెల్స్ లో ఓ బిజినెస్ ఏరియాలో హొరున కురిసే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెళ్తున్నడో వ్యక్తి. కనీసం రెయిన్ కోటు, హ్యాటు కూడా లేదు.
అ వర్షాన్ని చూసి జనం కకావికలై షాపుల్లో, రెస్టారెంట్స్ లో తలదాచుకుంటున్నారు.
"మిస్టర్ కొరియా... గో రైట్.." అన్నా మాటలు అతనికి వినిపించాయి.
వెంటనే కుడివైపు తిరిగాడు.
"లెప్ట్.. నెక్ట్స్ రైట్... స్టాప్ దర్.. సీ దాట ఓల్ట్ లేడీ.. కిల్ హర్.. హర్.."
అంటే.. అందరూ చూస్తుండగా, కొరియా అనబడే ఆ అగంతక వ్యక్తీ ఆ వృద్దురాలిని గొంతు నులిమి చంపాడు. ఫోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం... మిగతా కథ మామూలే.
"నాకేం తెలియదు" అని అంటాడు ఆగంతుకుడు.
"నీకు తెలియకుండా...నువ్వెలా హత్య చేశా" వంటారు ఫోలీసులు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించినా లాభం లేకపోయింది.
తనకెవరో సజెషన్స్ ఇచ్చి అలా చేయిస్తున్నారని... ఇంతక్రితం కూడా ఇలాగే 'సజెషన్స్' ఇచ్చి నల్గురుని చంపించారని చెప్పాడు.
ఫోలీసులు పరిశోధిస్తే అతను చెప్పింది నిజమేనని తేలింది.అతనిమీద ఐదు హత్యలు చేశాడన్న అభియోగం మోపబడింది.
