Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 44

    కానీ, బలమైన ఎవిడెన్స్ లేదు.

    తర్వాత సైనేడ్ మింగి ఆత్యహత్య చేసుకున్నాడు కేసు విచారణతో ఉండగానే.

    అతని మెదడులో చీఫ్స్ అమర్చి, అతనిచేత ఈ దారుణాలు చేయించే మాఫియా వుందని కొందరు. అతనే మెంటల్ బ్యాలెన్స్ తప్పి లేదా అతి తెలివిగా హత్యలు చేశాడని మరికొందరు చర్చించుకున్నారు. ఈ కేసు అసంపూర్తిగా ఉండిపోయింది. ఇప్పటికీ అదింకా మిస్టరీయేనట.

   
                                                 ***

        కళ్ళలో నేరస్థులు కనిపిస్తున్నారా?
 
    చైనా ఫోలీసులకు కురియన్ బాగా కావలసిన వ్యక్తి. ఎక్కడ ఏం నేరం జరిగనా... ముందుగాకురియన్ ని పిలుస్తారు. అతనానేరం చేశాడని కాదు. అనుమానం మీద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఇంటరాగేట్ చేసేందుకు.

    కురియన్ ఫోలీసు  మనషి కాదు.

    కానీ... అతని కళ్ళలో అతేతమైన శక్తులున్నాయని వాళ్ల నమ్మిక. నిందితులను కురియన్ దగ్గరకు తీసుకురాగానే వాళ్ల కళ్ళలోకి తీక్షణంగా చూస్తాడు. వెంటనే, అవతలి బ్యాక్తులు నేరం చేస్తే కురియన్ కళ్ళలోకి చూళ్లేక, కాళ్ళమీద వడి నిజం ఓప్పుకుంటారు.నేరం చేయని పక్షంలో అలానే కురియన్ కాళ్ళ వంక చూస్తుంటారు. అవిధంగా ఎన్నో కేసులను 'డిల్' చేసిన కురియన్, తన యాబై తొమ్మిదోవ ఏట చనిపోయాడు. ఓ మాజీ నేరస్థుడు, తనని కురియన్ దోషిగా నిరూపించాడన్న కక్షతో చంపేశాడు. ఆ నేరస్థుడికి మరణశిక్ష విధించపడింది, నేరం రుజువై.

   
                                                 ***

                   విభ్రవపరిచే సంఘటనలు

    అమెరికాలో ఏడ్వర్సన్ అనే యువకుడికి కళ్ళు మామూలుగా కాకుండా నుదిటి భాగాన్ని అనుకుని వున్నాయి. దీన్ని తాను లోపంగా భావించలేదు. కళ్ళజోడు ధరించడం అతనికి కష్టం. చెవుల మీదుగా నుదిటిపైకి తీసుకురావాలా కళ్ళజోడుని.

    కాంటాక్ట్ లెన్స్ వాడడం మొదలెట్టిన అతనికి యుక్త వయసు వచ్చాక విచిత్రమైన శుక్లాలు వచ్చాయట కంటికి కనిపించనంత దూరంగా వున్న వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడో అతనికి తెలిసేదట. తన వెనగ్గా ప్రెండ్స్ కామెంట్స్ చేస్తుంటే వాళ్ల యాక్షన్ కనిపించేదట. నాల్రోజులపాటుఅతని కళ్ళకు నల్లటి గంటలు కట్టుకుని మోటార్ సైకిల్ నడపడంలా. యిది ప్రాక్టిస్ కావచ్చు... సైన్స్ కు అందని విషయమా కావచ్చు ఏడ్వర్సన్ 1992లో చనిపోయాడు. అతను చనిపోయేనాటికీ కూడా ఆ మిస్టరీ విడివడలేదు.
   

                                                 ***   
            
                పురాణాలు లేదా సూడోసైన్స్

    కంటికున్న శక్తితో ఎదుటి వ్యక్తిని భస్మం (బూడిద) చేయొచ్చని పురాణాల్లో వుంది. ఋషుల కోపాగ్నికి శత్రువులు బూడిదైన సంఘటనలు పురాణాల్లో వుంది.

    చిన్నప్పుడు భూతద్దం పెట్టి, సూర్యకాంతితో ఎండుటాకుల్ల్నిమంట పెట్టించే దృశ్యం గుర్తుండే ఉంటుంది. కంటికున్న శక్తితో ఎదుటి వస్తువు బూడిద అవ్వడం... సైన్స్ కి అందితే లేజర్ భీం గా అనుకోవచ్చు లేదంటే, బ్రహ్మాస్త్రం అని పురాణగాధల్ని ఉదాహారణ గా తీసుకుని చేపొచ్చు.

   
                                                  ***

    నైరోనీల్ జాన్ అనే వ్యక్తికి యుక్తవయస్సు వచ్చాక. సమస్యలు మెదలయ్యాయి. అతన్నెవరో పిలిచినట్టు అనిపించేది. తేరా వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ తనను పిలిచేవారు కాదు. ఒక్కోసారి ఎవరో తనకు దగ్గరగా వచ్చి ఏడుస్తున్నట్టు కూడా అనిపించేది.

    రాత్రుళ్ళు ఒక్కసారిగా తల దిమ్మని తిరుగుతున్నట్టు అనిపించేది ఒక్కోసారి సడన్ గా తూలిపోతూ వుండేవాడు. డాక్టర్లు అన్ని పరిక్షలు చేసి రిపోర్టర్స్ లో ఏమీలేదని పెదవి విరిచారు అర్ధంగాక. కొంతమంది తాంత్రికులను కూడా కలిసాడు. చివరికి అతనికే నమ్మలేని నిజం తెలిసింది. అదేసితీలో తనకి కావాలా సోదరుడు పుట్టగానే తన సోదరుడ్ని తండ్రి తీసుకెళ్తే తల్లి తనని పెంచిందని తెలిసింది.

    తన సోదరుడు తరచూ తనని జ్ఞాపకం చేసుకునేవాడట. అప్పుడప్పుడు అతగాడికి మందుకొట్టే అలవాటు కూడా వుందిట. సోదరుడు మందుకొడితే కిక్కు ఎక్కడానికి రీజన్ అదే కావచ్చు.

    విచిత్రమేమిటంటే కావలలిద్దరూ కలుసుకున్నాక ఇలాంటి రియాక్షన్స్ తగ్గయట.

    ట్వీన్స్ (ఇంగ్లీష్) హలో బ్రదర్ (తెలుగు) సినిమాలు గుర్తొచ్చేలా వున్న వీళ్ళ కధ విచిత్రంగానే వుంది  కదూ!
   

                                                ***

                    వీటిని నమ్మొచ్చా ?!

    తర్కవితర్కలా మధ్య వుగిసలాడే కొన్ని సైన్స్ కు అందని విషయాలు

   
    -> న్యూజిల్యాండ్ లో ముఫ్రే  అనే వ్యక్తికి రాత్రిపూట విచిత్రమైన కలలు వచ్చేవి తెల్లారితే ఆ కళలు గుర్తుండేవి కావు. కానీ, కొన్నిరోజుల తర్వాత జరిగే సంఘటనలు కొన్ని రోజుల క్రితం తన కలలోకి వచ్చినవే అనే విషయం గుర్తొచ్చి ఆశ్చర్యం వేసేది. డాక్టర్లు కూడా ఏమీ తెల్చీ చెప్పలేకపోయారు. చిత్రంగా కొన్నేళ్ళు తర్వాత అతనికి కళలు రావడం ఆగిపోయాయి. 

   
    -> ఉత్తరకొరియాలో ఓ వ్యక్తికి ఏదైనా చెడు జరిగే సందర్బంలో అతని కన్ను పూర్తిగా రక్తవర్ణంలోకి మారిపోయేది. మనం బాగా ఏడిస్తే కళ్ళు ఎర్రగా ఉబ్బుతాయి అని అంటాం కదా... అల అతని కళ్ళు ఉబ్బి ఎర్రబడతాయి. ఆ వెంటనే ఏదో ఓ అనర్ధం జరుగుతుందట. అతని కల్లెర్రబడితే చాలు ఇంటిల్లిపాదీ... గిప్పిట్లో ప్రాణాలు పెట్టుకునేవారట... ఏం అనర్ధం జరుగుతుందోననే భయంతో.

   
                                                  ***

    న్యూజెర్సీలో కేఫిన్సన్ అనే అతను ఉండేవాడు. అతని వయసు ముప్పయి. అతనికి అతీత శక్తులున్నాయని కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. అతను కళ్ళు మూసుకునే ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో చెప్పగలడు. అది చాలా మాములు విషయం. ఇక్కడ గంటలు కట్టుకుని మోటార్ సైకిళ్ళు ను నడపడం చాలా కామన్ విషయం. అలాంటిదే ఇదని కొట్టిపారేశారు. కానీ కేఫేన్సన్ కళ్ళు మూసుకుని ఎదుటివ్యక్తులు ఏం చేస్తున్నారో చెప్పడమే కాదు, ఎదుటి వ్యక్తితో సంభాషించగలడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS