భస్మ కుర్చీలో నుంచి లేచాడు. తండ్రి ఆదేశాలు అతని మెదడును చేరాయి. ల్యాబ్ తలుపు తెరిచినా అగర్వాల్ భస్మవైపు చూశాడు. భస్మ కళ్ళలోని ఎర్రటి మెరుపు చూసి భయపడిపోయాడు.
ఏదో అనుమానం. వెంటనే వెనక్కి పరుగెత్తాడు.
ఏంటి అనుమానం. వెంటనే వెనక్కి పరుగెత్తుకు వచ్చిన అగర్వాల్ ని చూసి కంగారుగా అడిగాడు ఖాన్.
అతనికి టెన్షన్ గా వుంది కౌశిక్ వస్తాడని.
భస్మ... అతనికి సజెషన్స్ యివ్వు.'
"అతనిప్పుడు మన కంట్రోల్ లో లేడు. అతనికి సైంసిస్ట్ భరద్వాజ సజెషన్స్ యిచ్చాడు"
"వాట్..." అదిరిపడి తన రివాల్వర్ ని భస్మ వైపు గురి పెట్టాడు. భస్మ వాళ్ళను చేరాడు.
ఆరు బుల్లెట్లు భస్మకు తగిలి నేల రాలాయి.
అతని బుల్లెట్లు ప్రూప్ అన్నా విషయం వాళ్ళే మరచిపోయారు. ఖాన్ పరుగెత్తాబోయాడు.
అగర్వాల్ భయంతో వణికిపోతున్నాడు.
భస్మ యిద్దర్నీ ఒడిసి పట్టుకున్నాడు.
అతని కళ్ళు ఎర్రబడ్డాయి.
శరీరం రుధర వర్ణంలోకి మారుతోంది.
తల మద్యన ఉన్న భ..స్మ..నే..త్రం... తెరుచుకుంటోంది మెల్లగా...
త్రీ.. టు.. వన్..
ఒక్కసారిగా హై వోల్టేజీ విద్యుత్ భస్మ శరీరాన్ని కుదిపేసింది. చిన్న ఉలికిపాటు భస్మలో.
మరో క్షణంలో ఖాన్, అగర్వాల్ ఒక్కసారిగా కేక వేశారు. కరెంట్ పాస్ అవుతున్న స్తంభాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో ఖాన్, అగర్వాల్ కు అదే అయింది.
స్ప్లిం ట్ సెకన్.
వాళ్ళు నల్లగా మాడిపోయారు.
కొద్దీ క్షణాల్లో వాళ్ల బాడీ నుంచి పొగలు వచ్చాయి. యాసిడ్ లో కాలి పోతున్నట్టు...
కొద్దీ క్షణాల్లో బూడిద కుప్ప మిగిలింది.
పాతికేళ్ళాగా ఈ దేశంలో గూఢచార్యం సాగించి, భారదేశాన్ని శ్మశానంగా మార్చాలని ఎన్నో కుట్రలు, కుయుక్తలు పన్ని, ఏ వ్యక్తిని ఆయుధంగా మార్చి దేశాన్ని మరుభూమిగా మార్చాలని అనుకున్నాడో, ఆ వ్యక్తి చేతిలోనే బూడిదయ్యాడు అగర్వాల్.
కౌశిక్ సేల్ ఫోన్ ద్వారా కంట్రోల్ రూమ్ ను కాంటాక్ట్ చేసాడు. ఫోలీసులు ఆ యింటిని చుట్టుముట్టిన సాయుధలను ముట్టడించి, అరెస్ట్ చేశారు.
ఓ విదేశీ శత్రువు చరిత్ర, స్వదేశీ నమ్మకద్రోహుల చరిత్ర అలా అంతమైంది.
***
ల్యాబ్ బయట రెడ్ కలర్ బల్బ్ వెలుగుతోంది.
ఆపరేషన్ భస్మనేత్రం మొదలైంది.
ఆపరేషన్ ఫెయిల్యూర్ అయితే భస్మనేత్ర చనిపోతాడు. సక్సెస్ అయితే మాములు మనిషిగా మారిపోతాడు.
***
విశాలి.. మౌన.. కౌశిక్.. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
క్షణాలు భారంగా వెలుగుతున్న రెడ్ కలర్ బల్బు ఆగిపోయింది.
తలుపులు తెరుచుకున్నాయి.
భరద్వాజ బయటకు వచ్చాడు. అతని వెనకే అమెరికా నుంచి వచ్చిన సర్జెంస్ బృందం కూడా వుంది. భస్మకు ఆపరేషన్ చేసి మూడోకన్ను తొలగించడానికి సవాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు.
ఆపరేషన్ భస్మనేత్రం సక్సెస్ అన్నాడు ఆనందంగా భరద్వాజ. డాక్టర్స్ బృందం సంతృప్తి తాలూకు ఫీలింగ్..
అంతే_
అక్కడున్న అందరూ చిన్నపిల్లలే అయ్యారు. రంగులు చల్లుకున్నారు. మిఠాయిలు పంచకున్నారు. ఎగిరి గంతులేశారు. కేరింతలు కొట్టుకున్నారు. భరద్వాజతో సహా..
***
లాన్సర్ కారుకు 'జస్ట్ మ్యారేజ్' అన్నా బోర్డు వేలాడుతోంది.
ఒటైపు ఆపరేషన్ భస్మనేత్రం సక్సెస్ అయింది. మరో వైపు వెంటనే ఆపరేషన్ పెళ్ళి మొదలైంది.
"అలా ది బెస్ట్! న్యూకపుల్...
వియ్ విష్ యూ అల్ ది బెస్ట్ " కౌశిక్ మనస్పూర్తిగా షేక్ హ్యండ్ ఇస్తూ అన్నాడు.
భస్మనేత్ర నవ్వి మౌన నడుమ్మీద గిల్లాడు.
అతని తలమీదుగా బ్యాండేజీ వుంది. ఆపరేషన్ సక్సెస్ అయినా వెంటనే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టింది మౌన.
పెళ్ళి మంటపం, అగ్నిసాక్షి ఏదీ వద్దంది. సింపుల్ గా బామ్మ, కౌశిక్ విశాలి, భరద్వాజలే అతిధులు.
భస్మనేత్ర మూడోకన్ను ఆపరేషన్ ద్వారా తొలిగించారు. సైన్స్ కు అందని ఓ అద్బుతం. మరో అద్బుతాన్ని సృష్టిస్తూ మాయమైంది అదే సైన్స్ ద్వారా ఆ మాయని మచ్చని చేరిపేస్తూ!
'జస్ట్ మ్యారేజ్' అని రాసివున్న లాన్సర్ కారు కాశ్మీర్ వైపు వెళ్తోంది. వాళ్ళ శోభనానికి కుంకుమపూల తోటే వేదిక కాబోతుంది.
____అయిపోయింది___
