శ్లో|| వీరాగ్రేసరః కృష్ణరాయనృవతే! త్వద్త్వైరికాంతా వనే
ధావంత్య! కుభయానరోసులతి కావ్యాహారలీలాభృతః,
ప్రాప్తా కోక మహెభవన్నగశుకా రుంధతి వక్త్రేందునా
మధ్యే నాపి కచేన కంకణలసద్వ్యేడూర్యరత్త్నే రపి. 417
శ్లో|| భో భో భూవరః భూరివిక్రమ! భవద్దాటీషు విద్యాధరై
ర్ని స్సాణేషు ధణం ధణం ధణధణం ధాణం ధణధ్యానిషు,
త్వత్కృత్త వ్రతిమల్ల వీరవరణే దేవాంగనానా మాభూ
న్నృత్తేభ్యో ధీమిధిమ్మి దింధిమి ధిమిం ధింధిం దిమింధింకృతి 418
శ్లో|| వీరాగ్రేసర ! కృష్ణరాయ! భవతా క్రుత్తారణ ప్రాంగణే
ప్రౌడా! కేచన పారసీక పతయః ప్రాప్తాః పురీ మామరీమ్,
పీరు త్తేతిగురౌ , నలద్విషి సురత్తాణేతి, శాచ్యాంపున
ర్భిబ్బీతి, వ్రణతౌ సలామితి, సురా స్మేరాననా కుర్వతే. 420
శ్లో|| కృష్ణరాయః స్తువంతు త్వాం కవయో న వయం స్తుమః,
నరసింహకిశోరస్య కియా గజవతేర్జయః? 421
శ్రీ కృష్ణదేవరాయలు లావణ్యగణ్య మగు నొక స్త్రీరత్నమును బహు యత్నమున సాధించి యవరోదవధూసవిధమునఁ దనయుల్లాసమును వెల్లడించేటః అంత నాయంతః పురిక "యింతకే యింత యుప్పొంగవలెనా? యిది యేమి గజపతి కుమార్తెను సాధించుట యోక్కోః" యని తేలనాడేనట! రాయల డెందమున చుఱుకుమని తాఁకేను. గజపతి కుమార్తెను సాదింపఁదలం పోదవెను. ఒకనాటి రాత్రి యువ శ్రుతి పరిజ్ఞానమునకై చాకివాని యింటిదరి కొక యాప్తభృత్యుని, దిమ్మరుసును బంపెనట! ఆయింటి చాకినాఁడు సుఖశయితుఁడై యిల్టు పాకుచుండేనట!
"కొండవీడు మందేరా కొండపల్లి మందేరా
కాదని యెవ్వఁడు వాదుకు వచ్చిన కటకందాకా మందేరా. 422
విజయ సూచకమగు నాయుప్రశుతిని గొనియే రాయలు దాడి వెడలి కటకము వఱకును గల దేశమును వశవఱచుకొనుటయేకాక గజపతికుమార్తెను గూడ దక్కఁగొని యంతఃపురమున జరిగిన యవమానమును బాపికొనేనటః
శ్రీకృష్ణదేవరాయల నిర్యాణకాలము --
ఉ|| బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నందుచుండఁ గా
నారయ శాలివాహనశకాబ్ధము లాద్రియు గాబ్ది సోములం
దారణవత్సరంబున నిదాఘదినంబున మాఘశుద్ధష
ష్టిరవివాసరంబున నృసింహుని కృష్ణుఁడు చేరే స్వర్గము
ద్వారక నున్న కృష్ణుఁ డవతారసమాప్తిని జెందుకైవడిన్. 423
రాయల నిర్యాణానంతరము కొన్ని సంవత్సరములు పెద్ద నామాత్యుఁడు జీవించి స్వావస్థ నిట్లు చేప్పుకోనెను-
సీ|| ఎదురైనచోఁ దనమదకరీంద్రము నిల్పి
కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
బల్లకిఁ దనకేలఁ బట్టి యెత్తే
గోకటగ్రామా ద్యనేకాగ్రహరంబు
లడిగిన సీమలయందు నిచ్చే
బిరుదై కవిగండ పెండేరమున కీవ
తగుదని తానె పాదమునఁ దొడిగె
గీ|| ఆంధ్ర కవితా పితామహ! అల్లసాని
పెద్దన కవీంద్రః యని తన్ను ఁబిల్చునట్టి
కృష్ణరాయలతో దివి కేఁగ లేక
బ్రదికియున్నాఁడ జీవచ్చవంబ నగుచు. 424
రాయల నిర్యాణానంతరమే గజపతిరాజు కన్నడ రాజ్యముపైకి దండెత్తి రాఁగాఁ బెద్దనామాత్యుఁ డీ సీసపద్యమును రచించి పంపెను. సిగ్గిలి గజపతి రాజు తిరిగిపోయెను.
సీ|| రాయరాహుత మిండరాచయేనుఁగు వచ్చి
యారట్ల కోట గోరాడునాఁడు
సంపెటనరపాల సార్వభౌముఁడు వచ్చి
సింహాద్రి జయశిలఁ జేర్చునాఁడు
సెలగోలు సింహంబు చేరి దిక్కృతిఁ గంచు
తల్పులఁ గరుల డీ కొల్పునాఁడు
ఘనతరనిర్భరగండ పెండేర మిచ్చి
కూఁతు రాయల కొనగూర్చునాఁడు
గీ|| ఒడ లెఱుంగవో చచ్చితో యుర్వి లేవొ
చేరఁ జాలక తలచెడి జీర్ణమైతో
కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్రః
తెఱచినిలు కుక్క సొచ్చిన తెఱఁగు దోఁవ. 425
అల్లసాని పెద్దన్న
చ|| హరుఁ డధీకుండు వింటికిఁ బురాంతకుకంటేఁ గిరీటి మేటి శం
కరపురుహుతనందనుల కంటెను రాముఁడు నేర్చు నిందుశే
ఖర కపికేతు భార్గపులకంటేఁ గుమారుఁడు మీఱు నంబికా
వర నర జామదగ్న్య శిఖివాహుల కెక్కుడు రాఘవుం డిల. 426
రెండో పాదాన నిత్యసమాసము, మూఁడో పాదాన అఖండము.
నంది సింగయతిమ్మన
పారిజాతాపహరణము రచించిన నంది తిమ్మనకు ముక్కు పొడుగుగా నుండుటచే ముక్కు తిమ్మన యనియుఁ బేరుకల్గెను. పారిజాతాపహరణము కృతి నందినప్పుడు కృష్ణరాయ లీతనికి రత్న కుండలముల నోసఁగెను. ఒకనాఁడీ కవి కుండలముల ధరించి తన యింటి యరుఁగుపైఁ గూర్చుండియుండఁగా భట్టు కవి త్రోవ నరుగుచు నీకంద పద్యముఁ జెప్పెను.
