Previous Page Next Page 
మహావృక్షం పేజి 41

"పుట్టుట గిట్టుట కొరకే కదండీ మీరేం దేవుడా.... మీ ప్రయత్నం మీరు చేశారు... ఆవిడా పోయారు... దానికి మిమ్మల్ని మీరు నిందించుకుంటే ఎలా? అన్నాడు. అందరం ఎప్పటికైనా పోయేవాళ్ళమేగా" అని తేల్చాడు.
అవునా? హటాత్తుగా వేదాంతసారం తెలిసినట్టు అనిపించింది.... అవునా? అందరూ చచ్చిపోతారు.... తనూ చచ్చిపోతుంది. అవును.....
ఎప్పటికైనా నేనూ మణిలా చచ్చిపోతాను కదూ! అనుకుంది.... పాపం మణి.... తన జీవితం పెటిల్ చేయాలని, పెళ్ళికి ఒప్పించాలనీ తన ఇల్లునీ, భర్తనీ వదిలి నా  దగ్గరకు ఒక రాత్రి కోసం వచ్చింది. ఆ రాత్రే ఆఖరి రాత్రి  అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. ఇట్నించి శాశ్వతంగా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయింది.
అ రోజు మణికి ఎటాక్ వస్తే పక్కనే తనుండి కూడా కాపాడలేక పోయింది. కానీ ఆ పరిస్తితి తనకే వస్తే! కనీసం తనని హస్పిటల్ కి తీసి కెళ్ళడానిక్కూడా ఎవరూలేరు. ఎవరోస్తారు? ఎవరాదుకుంటారు? ఆదుకునే వాళ్ళులేక, నోప్పితో  విలవిల్లాడి చచ్చిపోతుంది.
తెల్లారాకకానీ వాచ్ మాన్ కీ, పనివాళ్ళకీ తెలియదు. తెలిశాక.... అవును తెలిశాక... ఏం చేస్తారు? అందరికీ చెప్తారు? వీణకీ, శ్యామలకీ, నీరజకీ, శారదకీ,హరిశ్చంద్రగారికీ, వసుధకీ, భరణికీ... అవును... భరణి... తన మరణవార్త తన పత్రికలో ప్రచురిస్తాడు.... అభిమానం వున్నవాళ్ళు వచ్చి పూలదండలు వేస్తారు తన శవానికి.... రెండు, మూడు రోజులు పత్రికల్లో వార్త వస్తుంది. గొప్ప డాక్టర్ మనకిక లేరు... అని టిబ్యూట్స్ వుంటాయి. వీణ, శ్యామాలా అందరూ ఏడుస్తారు. కొంత కాలం... తరవాత...
అనూష నిలువెల్లా వణికిపోయింది.
"నో! నో! అలా జరక్కూడదు. తనూ అనాధల చనిపోకూడదు. అవును చనిపోకూడదు. ఏం చేయాలి?
మంచంమీంచి లేచి,ఆస్థిమితంగా అటూ ఇటూ తిరిగింది. ఇంట్లో వుండలనిపించలేదు.
ఆ రాత్రి కారు తీసుకుని ఆశ్రమం వైపు బయలుదేరింది.
అంత రాత్రివేళ వచ్చిన అనూషని  చూసి ఖంగారుపడింది శ్యామల.
"నాకు భయంగా వుంది శ్యామా! అందుకే నీ దగ్గరకు వచ్చాను. బెలాగా అంటూ తనని వాటేసుకున్న అనూషని ప్రేమగా దగ్గరకు తీసుకుంది.
ఎందుకు భయం? మేమంతా లేమూ! పిచ్చిదానా? నువ్వింత బెలవనుకోలేదు. అంతా మేక పోటు గాంభీర్యమేనా?

                                       *    *    *    *
వీణ ఒప్పించకపోయింది. తన వల్ల అవుతుందా? మణి మాట్లాడిందో లేదో! ఈ విడ ఎమన్నాదో... తెలిస్తే అవకాశం లేదు. ఎలా? ఎంతకాలం ఇలా?
తనకెప్పుడూ ఎవర్ని ఇంతగా కోరుకోలేదు. కాలేజీరోజుల్లో క్లాస్ మేట్ స్మితని ప్రేమించాడు. ఆ అమ్మాయికి పెద్ద పెద్ద ఆశలు, పెద్ద ఇంజనీరును చేసుకుని అమెరికా వెళ్ళింది. తను ప్రేమలేఖ రాస్తే, జావాబుగా వెడ్డింగ్ కార్డ్ తెచ్చిచ్చింది. ఆ దెబ్బ చాలా  కాలంతన గుండెల్లో అలా పచ్చిగా వుండేది. తరవాత మర్చిపోయాడు.
ఆ తరువాత ఇంకెవరూ తన గుండెల్ని స్పృశించిలేదు. ఇంతకాలానికి అనూష తనని బాగా ఆకర్షించింది. మనసులోకి వెళ్ళిపోయితిష్ట వేసు క్కూర్చుంది. ఆమెని అక్కడి నుంచి కదిలించటానికి సుతారామూ ఇష్టంలేదు. ఆమెని పొందాలి. ఎలాగయినా పొందాలి. అనూష తన జీవన భాగం స్వామి, తన కన్నా అదృష్టవంతుడు వుండడు.
కానీ ఆమె ఇంత మొండిదెం?
నో! లాభంలేదు. ఇలా బాధపడేకన్నా డైరెక్టర్  గా వెళ్ళి  అడగడం జర్సు కాదుగా... ఏదో చిల్లరవేషలేసాడని కొట్టడానికి. ఏం మాట్లాదాదానికి లేక సారీ! భరణీ! నాకా ఉద్దేశంలేదు అంటుందా?
లేక పోతే ఇప్పుడు ఏర్పరచుకోమనాలి.
క్లర్క్ ఆవేళటి పోస్ట్ తీసుకొచ్చాడు.
ఎవో ఆర్టికల్స్, కధలు... వచ్చాయి. స్రీలకోసం ప్రత్యేకంగా వేస్తున్న పేజీకి కుప్పులు తెప్పులుగా వస్తుంటాయి. ఆర్టికల్స్... అవన్నీ చూడాలనిపించలేదు. పక్కన పడేశాడు.
భరణి పేరుమీద కవర్ వుంది. అతని తండ్రి రాశాడు.
వద్దనుకుంటూనే చింపి చదివాడు.
చి. భరణికి....
మేమిక్కడ కులాసా... నువ్వు కూడా కులాసా అనుకుంటాను. నువ్విక్కడ నడవని పత్రికతో కుస్తీ పడుతూ ఎన్నాళ్ళు గడుపుతావు? పత్రిక నడపడం అంటే సామాన్యం కాదు. ఉద్దండులె చేతులెత్తేశారు. నామాట విని ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకో... భారతదేశం వ్యవసాయక దేశం.... కాబట్టి వ్యవసాయం చేయడానికి సిగ్గుపడక్కర్లేదు.... గర్వపడాలి.... ఇంకో విషయం.... మన దూరపు బంధువు సీతాపతిగారి అమ్మాయి అలివేణి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.ముపై ఏళ్లున్నాయి.... పిల్ల చామనఛాయా... కానే చక్కటి కనుముక్కు తీరు కలగా వుంటుంది. పాతికేకరాల మాగాణి ఇస్తారట.... వెంటనే బయల్దేరిరా..... మీ అమ్మ కూడా చెప్పమంది....
మీ నాన్న...
గాడిదగుడ్డో! చస్తే వెళ్ళాను. కోపంగా విసిరేసాడా ఉత్తరం. ఈయనేంటి చూసేది సంభందం. అలివేణి లేదు. నీలవేణి లేదు, అనూషని తప్ప ఎవరినీ చేసుకోకూడదు. అనూష ఒప్పుకోకపోతే జీవితాతం బ్రహ్మచారిగా వుండాలి. అంతేగానీ పెళ్ళికోసం ఎవరో ఒకరిని పెళ్ళాంగా తెచ్చుకోడం నాస్నేన్స్.
ఏవిటో ఈ జాతకం... కోరుకున్నదేదీ జరగదు.
హూ... ఎలా జరగదో చూస్తాను. ఈ జాతకాన్ని తిప్పి రాసుకోవాలి. అనూష ఎందుకు ఒప్పుకోదు? తీరాలి అంతే....
విసురుగా లేచాడు కుర్చీలోంచి.
ప్యూన్ వచ్చి ఎవరో అమ్మాయి వచ్చిందని, అతడిని కలవాలంటోందని చెప్పాడు.
ఎందుకు?" విసుగ్గా అడిగాడు.
"తెలియదు సార్...." సరే రమ్మను." తిరిగి కుర్చీలో కూర్చున్నాడు.
రెండు నిమిషాల్లో ఆ అమ్మాయి వచ్చింది. ఆమె చేతిలో పడ్డ రిజిస్టరు వుంది. "నమస్కారం సార్" అన్నది,

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS