"వాడ్డూయూ మీన్...! అంటే మృదువని ఏ నేరమూ చేయకుండా భయపడుతోందని, మేమే ఆమెను నేరంలో ఇరికించామని మే అభిప్రాయమా?"
అంకిత్ ఒక్కక్షణం ఆగి అన్నాడు.
"ఆమె నేరం చేసిందో లేదో తేల్చుకునే ముందు ఆమె వాదన వినిపించే అవకాశం ఇమ్మని నా ఉద్దేశ్యం సార్!"
"ముందు మృదువని సరెండర్ అవ్వలిగా?"
"మృదువని మీకు అప్పగించే పూచీ నాది సార్..." అన్నాది అంకిత్ వెంటనే.
"ముండా పని చేయండి..."
"అంతకన్నా ముందు ఆమెను వెంటాడి, వేధించే పని చేయకండి సార్... ముందు షంషేర్ దాదా మనుష్యులు ఆమెను ఏం చేయకుండా చూడండి" చెప్పాడు అంకిత్.
డిఫెన చీఫ్ వర్మ మొహంలో నెత్తురుచుక్క లేదు.
"షంషేర్ దాదా మనుష్యులా? వాళ్ళెవరు? వాళ్ళకూ, మృదువనీకి ఏమిటి సంభంధం?" కపోంగా అన్నాడు డిఫెన్స్ చీఫ్.
"ఆ విషయం మీకే తెలియాలి సార్... మనమధ్య ఫెయిర్ డీల్ ఉండాలి... మీరు ఏం చేత్సరావు, ఎలా చేస్తారో నాకు తెలియదు... నాకు ఇరవై నాల్గుగంటలు టైం ఇవ్వండి... నేను మృదువని మీకు అప్పగించి ఆమె నిర్దోషి అని నిరూపిస్తాను... అంతవరకూ మృదువని ఎవరూ చేంజ్ చేయకూడదు" తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాడు అంకిత్.
డిఫెన్స్ చీఫ్ ఒక్కక్షణం ఆలోచించాడు... యనకు మృదువని దొరకడం ముఖ్యం... ఇలాంటి పరిస్థితిలో తనకు వీళ్ళ సాయం అవసరం... అందుకే ఇంకేమీ ఆలోచించకుండా చెప్పుసాడు.
"అల్ రైట్ ! మీరు కోరినట్టే చేస్తాను... బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మృదువనిని నాకు అప్పగించాలి. రైట్... లేదంటే ఆమెతోపాటు దేశద్రోహ నేరంలో మిమ్మల్ని ఇరికించాల్సి వుంటుంది... ఎందుకంటే ఆమెను మీరు సపోర్టు చేస్తున్నారు కాబట్టి!"
"ఓకే వాన్ మోర్ కండిషన్ సర్... మా ఫోన్లు టాప్ చేయడం, మమ్మల్ని ఫాలో అవడం చేయకండి... అలా చేస్తే మృదువని మేము ట్రేస్ చేయడం చాలా కష్టం..."
"సరే! మీరిక వెళ్ళొచ్చు" అన్నాడు చీఫ్.
అంకిత్, ప్రద్యుమ్న బయటకు నడిచారు. వాళ్ళను అనుసరించారు రాహుల్ చేతన్ లు... వాళ్ళిద్దరికీ ఇదంతా అయోమయంగా వుంది... డిఫెన్స్ చీఫ్ ఇంటర్వ్యూ ను ఘాట్ చేయాలని అనుకున్నారు... కానీ కెమెరా యూనిట్ ను లోపలకు అనుమతించలేదు.
నలుగురూ బయటకు వచ్చాక అడిగాడు రాహుల్.
"అదేమిటి బాసూ! ఈ ఇంటర్వ్యూ ఇంత చప్పగా వుంది" అన్నాడు.
"ఇప్పుడేగా మొదలైంది... చూస్తూ షార్స్ గా పని చేస్తుంది.
"నేను ఆఫీసుకు వెళ్ళనా?" అడిగాడు ప్రద్యుమ్న.
"అలాగే... కానీ నాకో హెల్ప్ కావాలి" చెప్పాడు అంకిత్.
"చెప్పు అంకిత్! ఏం చేయమంటావు?"
"మీ రిపోర్టలు మొత్తం ఏమ్తమంది వుంటారు?" అడిగాడు అంకిత్.
"సుమారుగా వందమంది ఉండోచ్చు... వీళ్ళు కాక స్టింగర్లు ఓ రెండు వందల మందికి పైగా ఉంటారు. ఎందుకు?" అడిగాడు ప్రద్యుమ్న.
"మీ దగ్గర మృదువని ఫోటో సంపాదించటం పెద్ద కష్టం కాదు.."
"మృదువని ఫోటో మీ రిపోటర్లుకు,స్టింగర్లకుఇచ్చి ఏ ఏరియా రిపోర్టలకూ, స్టింగర్ కూ ఆమె తారసపడినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. మీ రిపోర్ట్ లదాదాపు అన్ని ఏరియాల్లో ఉన్నారుకదా!"
"దాదాపుగా అన్ని ఏరియాల్లో ఉన్నట్టే!"
"గుడ్... అయితే మన పని ఏరియాల్లో ఉన్నట్టే!"
"వెరీగుడ్ ఐడియా. నేనీరోజే మృదువని ఫోటో కాఫీలు తీయించి మా రిపోర్టర్ల ద్వారా వెతికే ప్రయత్నం చేస్తాను" చెప్పాడు ప్రద్యుమ్న.
"థాంక్యూ! నేను సాయత్రం నీకు ఫోన్ చేస్తాను. ఈలోగా ఏమైనాప్రోగ్రామ్స్ వుంటే నాకు ఫోన్ చేయి" చెప్పాడు అంకిత్.
ఆ రోజే వాళ్ళు సెల్ తీసుకున్నాడు... ఎప్పుడే అవసరం వచ్చినా వాళ్ళిద్దరూ కాంటాక్ట్ చేసుకోటానికి వీలుమ్తుమ్దన్నా ఉద్దేశ్యంతో.
"సరే నేను బయల్దేరుతాను" అన్నాడు ప్రద్యుమ్న.
"బాసూ! మనం కూడా హొటల్ కు వెళ్దామా?" అడిగాడు రాహుల్.
"వద్దు... మృదువని కోసం వెతుకుదాం... నువ్వో వైపు, చేతన్ మరో వైపు వెళ్ళండి... నేను ఇంకోవైపు వెళ్తాను.రాత్రి ఎనిమిదింటికి హొటల్ లో కలుద్దాం" చెప్పాడు అంకిత్.
"గురూ! హైదారాబాదు లో, ఢిల్లీలో ఈ అన్వేషణ కొనసాగాల్సిందేనా?" మెల్లగా అడిగాడు రాహుల్.
అంకిత్ సీరియస్ గా చూడటంతో కామ్ అయిపోయాడు.
***
రాహుల్ ఓ వైపుకు, చేతన్ మరో వైపుకు వెళ్ళారు... అంకిత్ రోడ్డుమీద నడుస్తున్నాడు. జనమ్మర్డంలో ఉండే రోడ్ల మీద నడుస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. బీజీ...బీజీ. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన బీజీ.
అంకిత్ రోడ్డుకు ఓ పక్కగా నడుస్తున్నాడు. అంకిత్ ను ఓ వ్యక్తి ఫాలో చేస్తున్నాడని, ఆ వ్యక్తి దిఫెంస్ చీఫ్ నియమించిన మనిషి అని అంకిత్ కు తెలియదు. అతను మృదువని వెతుకుతూ వెళ్తున్నాడు.
సరిగ్గా కొద్దిదూరం వెళ్ళిపోయాక రోడ్డు క్రాస్ చేయకబోతుంటే ఓ కారు వచ్చి అతన్ని తాకుతూ ముందుకు వెళ్ళిపోవడంతో తూలి ఓ ప్రక్కకుపడిపోయాడు అంకిత్.
"అయ్యో ఆక్సిడెంట్!" ఎవరో అరా తీసారు.
"అంబులెన్స్ కు ఫోన్ చేయండి" మరెవరో అరా తీసారు.
"అంబులెన్స్ కు ఫోన్ చేయండి"ఇంకెవరో కేక వేసారు...నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. ... అంకిత్ ను అంబులెన్స్ లోకి ఎక్కించారు... చూస్తుండగానే అంకిత్ ని ఎక్కించుకున్న అంబులెన్స్ ముందుకు ఉరికింది. అంతా స్వల్ప వ్యవధిలోనే జరిగింది.
ఇదంతా అంకిత్ ని వాచ్ చేస్తున్న వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని డిఫెన్స్ చీఫ్ కు చెప్పాడు.
"ప్రమాదం ఏమీలేదుకదా" అడిగాడు చీఫ్.
"ఏదో మామూలు గాయాలే అనుకుంటున్నాను. అంబులెన్స్ లో తీసుకువెళ్ళారు."
