Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 41

    అగర్వాల్ జీ... మీరు కూడా నాతో వచ్చేయండి." చెప్పాడు ఖాన్.
    అగర్వాల్ అలాగే అన్నట్టు తలూపాడు.
    ఆ రోజు తాత్రి పదిన్నరకు తన అనుచరులతో బయల్దేరాడు ఖాన్.
                                                                             ***
    కౌశిక్ భస్మను చూడాలనిపించింది.
    అతని జీవితంలో యిలాంటి సెక్యులర్ కేసు మొదటిసారి టేకప్ చేస్తున్నాడు.
    భస్మను చూడాలని అనిపించగానే జేపులో బయల్దేరాడు.
    క్రాస్ రోడ్స్ దాటుతుండగా తను భరద్వాజ యింటి దగ్గర పెట్టిన సెక్యూరిటీ, రాజీవ్ గాంధి ఎయిర్ పోర్ట్ వైపువెళ్ళడం గమనించాడు.
    అతని సిక్స్ సైన్స్ ఏదో హచ్చరిస్తుంది. కోటు జేబులో వున్న రివాల్వర్ వంక చూసుకుని సంతృప్తిగా నిట్టూర్చి, జీపు వేగం పెంచాడు.
                                                    ***
    "వేల్ కమ్  కౌశిక్ అనుకోకుండా మీరు రావడం సర్ ప్రయిజ్ కాదు, ఆనందంగా కూడా వుండి" భరద్వాజ కౌశిక్ ను మనస్పూర్తిగా ఆహ్వానించాడు.
    "ఓక నిజం చెప్పమంటారా భారద్వ్జజ  గారూ. నాకు యిక్కడికి ఓ కేసు విషయంలో వచ్చినట్టు అనిపించడంలేదు. ఓ ఆత్మీయుడి యింటికి, చుట్టపుచూపుగా వచ్చినట్టు అనిపిస్తుంది" మనస్పూర్తిగా అన్నాడు కౌశిక్.
    "నోవ్వూ నాకు బిడ్డ లాంటి వాడివే నిన్ను నా రెండో కొడుకు అనుకుంటను" అంది విశాలీ అతనికి వేడి వేడి కాఫీ యిస్తూ.
    కౌశిక్ కళ్ళు చెమర్చాయి.
    "సేక్యూరీటి ఇక్కడనుంచి వెళ్ళిపోవడం నాకేదో అనుమానాన్ని కలిగించింది నేనిటు వస్తుంటే వాళ్ళు ఎయిర్ పోర్ట్ వైపు వెళ్ళడం గమనించి టెన్షన్ ఫీలయ్యాను. ఎందుకైనా మంచిది మీరు ఎలార్త్గా వుండండి" అన్నాడు కౌశిక్.
    భరద్వాజ  యింటికి రాగానే సేక్యూరీటి లేకపోవడం గమనించాడు. భరద్వాజాని అడిగితె "తనే సెక్యూరిటీని తాత్కాలికంగా వెళ్ళిపొమ్మని అన్నానని, సెక్యూర్టీ చెఫ్ చెప్పాడని చెప్పాడు."
                                                    ***
    పదకొండు దాటుతుండగా, ఆ జీపు  భరద్వాజ యింటి ముందు ఆగింది. ఒక్కసారిగా పదిమంది సాయూధలైన దుండగులు ఆ యింటిని చుట్టుముట్టారు.
    ఖాన్ ల్ప్పలకి పరుగెత్తాడు. అతని చేతిలో రివల్వార్ ఉంది.
    యింటి ముందు జీపు ఆగిన శబ్దం వినిపించగానే కౌశిక్ ఎలర్ట్ అయ్యాడు. పొజిషన్ తెసుకున్నాడు.
    మౌన కోదా అందుకు ప్రిపేరైంది.
    ఆమె చేతిలో పదునైన ఆయుధం వుండి.
    "మిస్టర్ భరద్వాజ ..? ఈ యింటికి చూట్టూ నా  అనుచరులు వున్నారు. పాతికేళ్ళ క్రితం నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడిక తప్పించుకోలేవు. కమ్అవుట్..." గట్టిగా అరిచాడు ఖాన్.
    వెంటనే  కౌశిక్ కిటికీ చాటు నుంచి రివాల్వర్ పేల్చాడు.
    ఒక్క అంగలో పక్కకు గెంతాడు ఖాన్.
    అతనికి అర్దమైంది. కౌశిక్ కూడా అక్కడే వున్నదని...
    "అగర్వాల్ మీరు భస్మను వెతికి పట్టుకుని అతనికి సజెషన్స్ యిచ్చి, ఈ యింటిని నాశనం చేయించండి" అంటూ అతడ్ని ల్యాబ్ వైపు నెట్టాడు.
    బయట జరుగుతున్న సంఘటనలు ల్యాబ్ లో  వున్న భరద్వాజ టి.వి స్క్రీన్ మీద చూస్తూనే వున్నాడు. ఆ యింట్లో వీడియో కెమెరా ఏర్పాటు చేశాడు భారద్వాజ యిలాంటి ప్రమాదాలను ముందుగా ఊహించి.
    భరద్వాజ ఓ నిర్ణయానికి వచ్చాడు. వెంటనే భ్స్మను పిలిచి చెయిర్ లో కూర్చో బెట్టాడు. అతనికి సజెషన్స్ ఇచ్చాడు.
    "ఇన్నాళ్ళూ నీ జేవితంతో ఆదుకుని, నిన్ను బలి పశువును చేసి మాకు దూరం చేసినవాళ్ళని ఫేనిష చెయ్... ఓపెన్ యువర్ ఐస్... వాళ్ళని నీ భస్మ నేత్రంలో భస్మం  చెయ్..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS