Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 41

 

    రాయలకు జడరంగపుటేత్తులు వెయూటయం దత్యంతాసక్తి యుండేడిదట! బొడ్డుచెర్ల చినతిమ్మన యను కొప్పోలుకరణము కవీశ్వరదిగ్ధంతి యను ప్రతిష్టగలవాఁడై శ్రీ కృష్ణరాయలతోఁ జడరంగమాడుచుండేడివాఁడు. శ్రీకృష్ణరాయల పక్షమున నెంద జాలోచించి యెత్తువేయుచున్నాను నీతఁ డొక్కఁడే యేదురెత్తు వేసి యాటగెల్చుచు వేయార్లు పందెము గొనుచుండేడి వాఁడట! అతని శక్తికి సంతోషించి కొప్పోలు గ్రామమునకుఁ కృష్ణారాయపురమనునామ మేర్పఱిచి రాయలు సర్వాగ్రహారముగా నతనికి ధారవోసేను.

    క|| శతసంఖ్యు లొక్కటైనను
        సతతము శ్రీకృష్ణ రాయజగతీపతిలోఁ
        జతురంగ మాడి గెల్చును
        ధృతి మంతుఁడు బొడ్డుచెర్ల తిమ్మన బళిరే!    400

    ఉ|| దీరుఁడు బొడ్డుచెర్ల చినతిమ్మనమంత్రి కుమారుఁడంచితా
        కారుఁడు సత్కళావిదుఁడు కౌశిక గోత్రుఁడు పద్మనేత్రసే
        వారత బుద్ది సందవరవంశ్యుఁడు సత్కవిలోకనాధుఁ డా
        చారసమగ్ర వర్తనుఁడు చారువచస్థతినొప్పువాఁ డొగిన్.      401

    రాయలు కళింగదేశ విజిగీషామనీష దండెత్తిపోవుచు బెజవాడలో విడిసి హరివాససరోవవాస వ్రతమును గృష్ణాతీరమున నున్న శ్రీకాకుళపుణ్యక్షేత్రమునఁ గావించుటకై పెద్దనాది విద్వత్కవులతో నరిగెను. అప్పుడే యక్కడ వెలసియున్న యాంధ్రనాయకస్వామి కృష్ణరాయల స్వప్నమున నాముక్తమాల్యద రచింప నాదేశించిన ట్లాముక్త మాల్యదయందుఁ జెప్పఁబడి యున్నది. అక్కడ నేకాదశినాఁడు పండితమండలిలోఁ బుణ్యకధాగోష్టి సలుపుచుఁ గృష్ణరాయలు దాశరదు లేక్కువవారా? పాండవలేక్కువవారా? అని ప్రశ్నించెనట. పెద్ద నాదులు తమకు ఁ దోఁచిన రీతిని బలుదేఱఁగులఁ జేప్పిరట. దాశరధులు ఈశ్వరాంశమున జన్మించిన వారు గావున వారి కమానుషశక్తులును లోకోత్తర యోగ్యతయును గల్గుట వింత కాదు. పాండవుల యెడ నీశ్వరాంశములేదు. అట్లయియు శక్తుల యందును యగ్యతయందును దాశరధులతో సాటి వచ్చిరి. కావునఁ బాండవులే యెక్కువవారగుదు రని తన యాశ యమును రాయలు తుదకు వెల్లడించేనట! అది విని రాయల ప్రక్కను జామరము విసరుచున్న చాకలి యొకఁడు కేలు మోడ్చి "దేవర జన్మాంతరమున నున్నను బాండవుల మీఁది యభిమానమును మానలే" దనేనట! రాయ లత్యానందము సెంది యా చాకలివానినేది కావలయునో కోరికో మ్మనేనట! వాఁడు దేవరకోట యేలవలేనని కోరిక నోసఁగెనట! అప్పుడే యక్కడ వానికి దేవరకోటసీమ నేలుకొమ్మని యనుజ్ఞ నోసఁగెనట! నేఁడా దేవరకోట సీమను గమ్మజమీందారులు పాలించుచున్నారు. కాని నేఁటి వఱకును నా సంస్థానమునఁ జాకలి చేఁ బల్లకి మోయింపకుండుటయు సీలు మొహర్లు వాని యోద్దనే యుంచుటయు నాచారముగా వచ్చుచుండే నందురు. కృష్ణరాయలపై ననేక కవులచేఁ జెప్పఁబడిన చాటువులు.
    
    మ|| శరసంధానాబలక్షమాది వివిదైశ్వర్యంబులుం గల్గి దు
        ర్భరషండత్వ బిలప్రవేశకలన బ్రహ్మఘ్నతల్ మానిన
        నరసింహక్షితి మండలేశ్వరుల నెన్న వచ్చు నీసాటిగా
        నరసింహక్షితిమండలేశ్వరుల కృష్ణా! రాజకంఠీరవా!    402

    మ|| కలనం దావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండమం
        దలభేదం బొనరించి యేఁగునేడఁ దన్మధ్యంబున హారకుం
        డలకేయూరకిరీటభూషితుని శ్రీ నారాయణుం గాంచి లోఁ
        గలఁగం బాఱుచు నేఁగె నీవ యనుశంక గృష్ణరాయాధిపా!      403

    ఉ|| ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింట మార్గముం
        జూపిన భానుమండలము సొచ్చి హుటాహుటి శత్రు లేఁగుచో
        రేపటిబాపనయ్య! పగలింటి మహోగ్రపుజంగమయ్య! యో
        మాపటిదాసరయ్య! మము మన్నన సేయు మటందు రెంతయున్.  404
    
    ఉ|| కాశియు నీకరాసిసరి గాదు నృసింహుని కృష్ణరాయ! యా
        కాశిని జుచ్చువారికిని గల్గును జేతికిఁ బుర్రే నీమహో
        గ్రాసిని గండతుండేములుగా మృతిఁ బొందిన వైరికోటికి
        భాసురరంభకుంభకుచభారము లబ్బేడు నేమిచిత్రమో!      405

    శా||    రాయగ్రామణి కృష్ణరాయ! భవదుగ్రక్రూరఖడ్గాహిచేఁ
        గాయం బూడ్చి కాలింగదేశనృపతుల్ కానిర్ఘ రీసోషణీ
        మాయాభీకుముటూరులోటుకుహటూ మాయాసటా జాహరే
        మాయాగ్గేయమడే యాటండ్రు దివి రంభాజారుని యక్షునిన్    406

    మ|| సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచేఁ బడ్డ దు
        ర్దమదోర్ధండపుళిందకోటి యవనవ్రాతంబు సప్తాశ్వమా
        ర్గమునఁ గాంచి సెభా సహో హరిహారంగాఖూబు ఘోడాకితే
        తుముకీబాయిల బాయిదేమలికి యందు ర్మింటికిం బోవుచున్  407

    మ||  గవఁకుల్ బల్లిదమ'య్యే డిల్లికిని మక్కాకోటమేలయ్యేఁ బం
        డువకుం గ్రొత్తగఁ గ్రొత్తడంబు లమరె బోలేరుచందేరుల
        దవసం బెక్కె బెడందకోటపురకాంతాగర్భనిర్భేధన
        ప్రవణం బైన భవవత్ర్పయాణజయవార్త గృష్ణరాయూదిపా!    408

    ఒకప్పుడు కృష్ణరాయలకు గృష్ణడగ్గఱఁ దురుష్కులతోఁ బోరువాటిల్లెను. రాయలసేన కృష్ణ కిద్దరిని దురుష్క సేన యద్దరిని నుండెను. నదిదాఁటి రాయల సేన పైకి రావలయునని యెన్గులతోఁ దురకలు నదిలోనికి జొచ్చి కృష్ణ వెల్లువగాఁ బారుచుండుటచేఁ జెల్లాచెదరై కొట్టుకొని పోయిరి. ఎన్గులు మాత్ర మీదరికి వచ్చి రాయల సేనలోఁ జిక్కేను. అప్పు డొక కవి చెప్పిన పద్యము.

    క|| నరసింహకృష్ణరాయా
        దురమున నీ పేరిటేఱు తురకలఁ జంపె
        గరిరాజవరదుఁడంచును
        గరిఘట లట మిమ్ముఁ జూచి గ్రక్కునవచ్చెన్.    409

    శా|| శ్రీ లీలాత్మజః కృష్ణరాయః సమరోర్వి నీదువైరిక్షమా
        పాలు ర్వింగి హయాధిరూడులగుచుం బాఱ వనీశాఖిశా
        భాలాగ్నా యతకేశపాశులయి యూఁగ  గేకిస ల్గోటియు
        య్యాతో జాంపలొ యంచుఁ బాడుదురు ఖిల్గాంభోజవత్రేక్షణల్.   410

    మ||  బలభిన్నాగము చెంపఁగొట్టి గిరిజాప్రాణేశున ర్రెక్కి వా
        గ్జలజాతేక్షణకొప్పువట్టి శశివక్షంబెక్కి దట్టించి యా
        బలరాము మొలఁబట్టి నీ యశము భూభాగమ్మునన్ మించే నౌ
        లలనామాన్మద! కృష్ణరాయనరపాలా! రాజ'కంఠీరవా!      411

    క||  నరసింహకృష్ణరాయని
        కరమరుద గుకీర్తి యొప్పెఁ గరిభిద్గిరిభి
        త్కరికరిభిద్గిరిగిరిభి
        త్కరిఖిద్గిభిత్తురంగ కమనీయం బై.        412
    
    గీ||  పద్మ నాట్యస్థలంబునఁ బక్కి లోనఁ
        బైరుపైఁ బవ్వళించిన పరమమూర్తి
        అనుదినంబును గృష్ణరా యాదిపునకుఁ
        జుక్కజగడాలవేలపు శుభము లోసఁగు.     413

    చ||  పెనిమిటిచేయు పుణ్యజనపీడమా వ్రుత్తి యుఁ దండ్రి భంగము
        దనయుననంగ భావమును దమ్మునికార్శ్యముఁ జూచి రో సిస
        జ్జనపరిరక్షు శౌర్యనిధిఁ జారుశరీరుఁ గళాప్రాపూర్ణు న
        వ్వననిదికన్య చేరే జితవైరినికాయునిఁ గృష్ణరాయనిన్.      414

    ఉ|| అబ్జముఖీమనోజ! నరసాధినందన! కృష్ణ! నీయశం
        బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీవితీర్ణిమం
        బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీవరాక్రమం
        బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్దరన్.      415

    ఉ||  కాయము వంగి తా ముదిసెఁ గన్నులు నుం బొరగప్పే ఁ గాలు సే
        దాయె నటంచు రోసి నరసాధివనందన! కృష్ణరాయః యీ
        భూయువతీలలామ నినుఁబొందిన నాదిభుజంగభర్తకు
        బాయనిచింతచేతఁ దలప్రాణము తోఁకకు రాకయుండు నే!      416

    ఆంధ్రవాజ్మయమున శ్రీ కృష్ణరాయలవిఖ్యాతి యవినశ్వరామును బ్రదానమును గావున నామహరాజును గూర్చి సంస్కృతమునఁ జెప్పఁబడిన చాటు పద్యములఁగూడ నిందుఁజేర్చుట సముచితమని యట్లు చేయుచున్నాఁడను-
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS