Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 42

   
    "తాతయ్య యిచ్చిన బొమ్మ ఏదీ!" మళ్ళీ అడిగింది కీర్తి.    
    "రాణి"!    
    "ఊ..."    
    "ఆ బొమ్మ రహస్యంగా దాచాను. చాలా ఖరీదైన బొమ్మ చాలా బాగుంటుంది. ఎవరికీ తెలియకుండా ఎవరూ చూడకుండా నీ కిమ్మని మీ తాతయ్య చెప్పాడు."    
    "మరెట్లా!"    
    "అందుకని ఓపని చేద్దాం."    
    "చెయ్యి."    
    "నీ వేమో రాత్రి భోంచేసి తరువాత పెరట్లోకిరా అక్కడ యిస్తాను. సరేనా!" ఆశనిండిన చూపులతో అడిగాడు ఆనంద్ మూర్తి.    
    "నిజంగ యివ్వాలి."    
    "నిజంగ యిస్తాను. వస్తావుగా?"    
    "వస్తాను." కీర్తి అప్పటికప్పుడే ఓ పధకం ఆలోచించింది.    
    ఆనంద్ మూర్తి సంతోషపడి పోయాడు. రాణి వెర్రిది. బొమ్మకోసం పెరట్లోకి వస్తుంది. ఈ రాత్రిలోపల తనో బొమ్మ సంపాదించాలి. ఆ ప్రాణం లేని బొమ్మని ఈ ప్రాణం వున్న బొమ్మచేతిలో పెట్టి మాయమాటలు చెపుతూ పెరట్లో వక మూల వున్న గుబురు చెట్ల చాటుకి తీసుకు వెళ్ళాలి ఆపై....ఓహ్__మజాయేమజా.    
    ఆనందమూర్తి ఆలోచిస్తూ కమ్మటి కలలు కంటూతేరుకుని చూసేసరికి ఎదురుగా రాణి కనపడలేదు.    
    తెలివిగా కీర్తి అక్కడ నుంచి జారుకుంది ఎప్పుడో.    
    "అయ్యోయ్యో, ఈ పిచ్చి మాలోకం వెళ్ళిందే, తగిన జాగ్రత్తలు చెపుదామనుకున్నాను. అయినా నాకిదేం మాయరోగం మాట్లాడుతూ మాట్లాడుతూనే పగటి కలల్లోకి వెళ్ళిపోతాను! అలా బస్సులో కూర్చుని ఆలోచిస్తుంటే నేకదా ముసలాడు కనబడకుండా పోయాడు బస్సు బైలు దేరింది.    
    తన్ని తానే తిట్టు కుంటూ ఆనంద్ మూర్తి అక్కడ నుంచి లేచివెళ్ళిపోయాడు.
    
                                       30
    
    ఆనంద మూర్తి పెరట్లో పచార్లు చేస్తున్నాడు.    
    రాణి వస్తుందా రాదా! బొమ్మలంటే యిష్టం తాతయ్య అంటే యిష్టం. తాతయ్య కొని యిచ్చిన బొమ్మ అని చెప్పాడు కాబట్టి బొమ్మ కోసం తప్పక రావచ్చు. చేతిలో ఒక బొమ్మ పట్టుకుని ఆనందమూర్తి ఆలోచిస్తున్నాడు.    
    కీర్తి అడుగులో అడుగు వేస్తూ నిమ్మదిగ పెరట్లోకి వచ్చింది.    
    ఆనందమూర్తి కళ్ళు ఆనందంతో పెద్దవయాయి. నీ రొట్టె విరిగి పంచదార పాకంలో పడిందిరా ఆనందం. ఇంక ఈ ఛాన్స్ ఎలా సద్వినియోగం చేసుకుంటావో నీయిష్టం. రాణి బంగినపల్లి మామిడి పండు. ఏపుగ ఎదిగిన చెరకు గడ. గడ్డు జామకాయ. అలా ఆలోచిస్తూ కీర్తికి ఎదురొచ్చాడు.    
    "వచ్చావా రాణీ!"    
    "వచ్చాగా!"    
    "వస్తావో రావో అని భయపడ్డాను."    
    "బొమ్మేది?" చేయిచాచి అడిగింది కీర్తి.    
    "ఇదిగో అంటూ కీర్తి చేతిలో పులిపిల్ల బొమ్మనుపెట్టి అలాగే కీర్తి చేయిపట్టుకున్నాడు ఆనందమూర్తి.    
    కీర్తి తనచేతిని వెనక్కు లాక్కోలేదు. అలా చేస్తే తన పాత్ర దెబ్బ తింటుంది. అందుకని ఆనందమూర్తి చేతిని నొక్కుతున్నా పట్టించు కోకుండా "పులిపులి ఎంత బాగుందో! బొమ్మ నాకు ఈ బొమ్మలు చాలా యిష్టం. తాతయ్య ఓసారి బుజ్జి ఆపు బొమ్మని కొనిపెట్టాడు. అదీ బాగుంది." అంది బొమ్మని ఆప్యాయంగా చూస్తూ.    
    "చాలా బాగుందా!" ఆనందమూర్తి అడిగాడు.    
    "ఓ....భలేబాగుంది. ఇంకా నేవెళతాను. బొమ్మని ఎవరికీ చూపించనులే."    
    "రాణీ! రాణి! మాట..."    
    "ఏంటీ!"    
    "యింతకన్నా మంచి బొమ్మ నా దగ్గరవుంది.
    "ఏది?"    
    "చూపించనా!"    
    "ఊ..."    
    "అదిగో అక్కడ ఆమూల పొదలచాటున దాచాను నీ వక్కదానికి చూపిస్తాను. వెళదాం పద."    
    "అమ్మో అక్కడ చీకటి నేను రానుబాబూ!"    
    "నేనున్నా కదా భయంఏమీలేదు. తమాషాబొమ్మరా నేను తీసుకెళతాకదా!" అంటూ కీర్తి చేయి పుచ్చుకుని లాక్కెళ్ళినట్లే తీసుకెళ్ళాడు ఆనందమూర్తి. మాయమాటలతో బుట్టలో వేసుకోటం, భయపడి ఎదురు తిరిగినా అరిచినా నోరు మూసి తన పని పూర్తి చేసుకోటం అనుకున్నాడు.    
    పొదల చాటుదాకా మాట్లాడకుండా వెళ్ళి అడిగింది. కీర్తి "బొమ్మ ఏదీ?"    
    "చూపిస్తాను. నేఅడిగిందానికి చెప్పు." అన్నాడు ఆనందమూర్తి.    
    "ఏమిటీ?"    
    "నీవు సినిమా యాక్టర్ల బొమ్మలని ముద్దు పెట్టుకుంటావు అది నేను చూశాను. నీవు ముద్దు పెట్టుకున్నా వాళ్ళ బొమ్మలు ముద్దు పెట్టుకోలేవు కదా" అన్నాడు ఆనంద్ మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS