మీ భార్యకి ఏం ఫర్వాలేదు.... నా ప్రాణం అడ్డేసికాపాడి, ఇంటికీ పంపిస్తాను... మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చిన్నయ్యకి భరోసా ఇచ్చి, ప్రశాంతంగా ఇంటికీ వచ్చింది. ఇప్పుడు ణ భార్య ఏదమ్మ అంటూ ఆయన అడిగితె ఏం సమాధానం చెప్పాలి?
హాయిగా నవ్వుతూ, కోలుకున్న మణి హాఠాత్తుగా ఎలా చని పోయింది? అంటే... అంటే! మణికి మృత్యువు సమీపించిందా? దాన్ని తను ఆపలేకపోయిందా? మరి డాక్టరు పునర్జన్మ ఇస్తారంటారె.... ఇదేనా? ఎలా?ఎలా? బతికించుకోవాలి? నో! మణి చనిపోలేదు. ఏదో పొరపాటు జరిగింది.
అనూష ఎలా వున్నది అలాగే, లేచి హాస్పిటల్ కి వెళ్ళింది.
మణి నిర్జీవంగా పడి వుంది.... శ్యామల గుండె పగిలేలా ఏడుస్తోంది. డాక్టర్స్, సిస్టర్స్ అనూషకోసం ఎదురు చూస్తూన్నారు.
"ఎప్పుడు వచ్చిందో మళ్ళీ ఎటాక్ వచ్చింది. నిద్రలోనేపోయారు" ఎర్రబడ్డ కళ్ళతో చెప్పాడు డ్యూటీ డాక్టరు.
అనూషకి ఏమీ వినిపించటంలేదు... కాళ్ళ ముందు మసకలు కమ్మి నట్టుగా వుంది. జరుగుతుంది, జరిగంది వాస్తవం కాదేమో.... కలేమో అనిపించసాగింది. కలైతే బాగుండు అనిపిస్తుంది.
సరిగ్గా పదిగంటల క్రితం తన దగ్గర పాఠాలువిన్న మణేనా? ఇంత చైతన్యరహితంగా ఎలా పడుతుంది? తనచ్చిన ట్రీట్ మెంట్ లో లోపం ఎలా జరిగింది? ఇదేనా? మానవ మేధస్సు కీ దేవుడికి శక్తికీ జరిగే పోరాటంలో మానవుడు అంగీకరించవలసిన ఓటమి... మృత్యువుని వాయిదావెయగలిగింకానీ, అపలేకపోయిందన్నమాట.
గంభీరంగా, విషాదంగా కూర్చున్న అనూషని కదిలించే సాహసం ఎవరికీ కలగలేదు. కర్తవ్యం గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు.కొంచెం సేపట్లో వీణ వచ్చింది. ఆమెతో పాటుగా చిన్నయ్య వచ్చాడు... చిన్న పిల్లాడిలా కుమిలి కుమిని ఏడుస్తూ, భార్యని కుదుపుతూ "మాట్లాడు మణీ! నాతో ఒక్కసారి మాట్లాడు" అంటూ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న అతడిని ఓదార్చే ప్రయత్నంకూడా చేయకుండా,పిచ్చిదానిలా కూర్చుంది. అనూష అందరిలో వీణె తేరుకుని, డెడ్ బాడీ తీసికెళ్ళే ప్రయత్నాలు చేసింది.
డెడ్ బాడీ తీసుకుని అందరూ ఇంటికెళ్ళాక, పిల్లకి మెసేజ్ పపించింది వీణ.
అనూష దగ్గర వెళ్ళి నెమ్మదిగా పిలిచింది "అనూ!"
మాట్లాడలేదు ఆమె.
"అనూ! నిన్నే మాట్లాడు..." వీణ భయంగా అరిచి, అనూషని గట్టిగా కుదిపింది.
అనూష నెమ్మదిగా వీణ వైపు చూసి "నేనే చంపాను కదూ?" అన్నది.
"పిచ్చిపట్టిందా? నువ్వు చంపటం ఏంటి? డాక్టర్స్ బతికిస్తాను.... చంపరు."
"నో! నేను... చంపాను. అవును చంపాను" హిస్టీరిక్ గా ఎడవసాగింది.
ఆమెని ఓదార్చటానికి వాళ్ళకి చాలా శక్తి కావాల్సి వచ్చింది.
మర్నాడు మణి దహనసంస్కారాలు జరిగాయి. పిల్లలు అంతా అయ్యాక వచ్చారు చిన్నయ్యని వాళ్ళకి అప్పగించి, శ్యామాలా,వీణా అనూషని తీసుకుని ఇంటికేళ్ళారు.
దారిలో అన్నది వీణ పాపం! పిల్లలు.... పిల్లలంటూ తల్లడిల్లి పోయింది ఎంత అనుభందం! ఎంత ప్రేమ పెంచుకుందో! పిచ్చిది ఎవరి కెవరు శాశ్వతం? బతికున్నంతకాలమేగా ఈ బంధాలూ, అనుబంధాలూ... ఆమె ఫోటోకి దండ వేసినంతమాత్రాన ఆమె వాళ్ళ జీవితాన్ని ఇకముందు ఏ విధంగా ప్రాభావితం చేయగలదు?"
"అలాగని మమతలు పెంచుకోకుండా వుండగలమా?" శ్యామల భాధగా అన్నది.
అనూష మాత్రం మాట్లాడలేదు.
ఆమెని ఇంటికీ తీసికెళ్ళి బలవంతంగా కాఫీ తాగించారు. కాఫీతో నిద్ర మాత్రం కలిపిచ్చింది వీణ. కాసేపు నిద్రపోయి లేస్తే సెటిల్ అవుతుంది అనుకుంది.
అనూష నిద్రపోయింది. ఆమె లేచిందాకాశ్యామలా, వీణా జాగ్రత్తగా కానీ పెడుతూ కూర్చూన్నారు.
రెండు గంటల తరువాత కళ్ళు తెరిచింది అనూష.
"అనూ! ఎలా వున్నావు?" మృదువుగా అడిగింది వీణ.
కాసేపు ఆమె మొహంలోకి చూసి గట్టిగా ఏడవడం ప్రారంభించింది అనూష. ఎన్ని మొహంలోకి చూసి వుంటుందీ డాక్టరు. అలాంటిది... మరణం ఎందుకింతగా కదిలించింది. అర్ధంకాలేదు వీణకి. కాసేపు ఏడవనిచ్చి అన్నది. "నువ్వు ఏడ్చినంత మాత్రాన మణి తిరిగి వస్తుందా? కొంచెం ధైర్యం తెచ్చుకో. లే లేచి. స్నానం చేయి. కొంచెం ఎవన్నా తిందువుగాని."
"ఏం తినను? ఎలా తినను? ఈ ఓటమి భరించలేకపోతున్నా వీణా! ఎందుకిలా జరిగింది? అమనికి వచ్చింది కూడా మైల్డ్ ఎటాక్. నేనసలు ఊహించలేదు. ఒక్క రోజు వుంచి డిస్చార్జి చేయాలనుకున్నాను."
ఊహించనివి జరగడమే జీవితం.... అన్నీ మన వూహకు అందిస్తే అ వుండేందుకు? అయన వునికి ఎందుకు?"
హు....కుమిలి,కుమిలి ఏడ్చింది. శ్యామలా,వీణా చాలసేపు ఎవో కబుర్లు చెబుతూ కొంతవరకు ఉపసమింపచేశారు.... మర్నాటికి కొద్దిగా తేరుతుంది.
శ్యామలా, వీణా దైర్యం చెప్పి వెళ్ళిపోయారు.
రోజులు మాములుగా గడిచిపోతున్నాయి. మణి మరణంతో అనూష బాగా క్రుంగిపోయింది.
ఇదివరకు లేని భయం ఏదో ఈ మధ్య ఆమెని ఆవహించింది.
ఎన్నడూ లేనిది ఇప్పుడు వంటరిగా వుండాలంటే భయం వేస్తోంది. రాత్రిళ్ళు ఎంతో దైర్యంగా ఇంటికీ వచ్చేది. ఈ మధ్య చీకట్లో నిర్మానుష్యంగా విన్న రోడ్లమీదనుంచి రావాలంటే దైర్యం చాలడంలేదు... ఎక్కడినుంచో మణి తనని వెంటాడుతున్నట్టు నా భర్తకి సజీవంగా ఇస్తానని చెప్పి మోసం చేస్తావా అని నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది. అశ్రమానికి ఫోన్ చేసి డ్రైవర్ ని పిలిపించుకుంది.
తరచూ వీణకి ఫోన్ చేసి, మాట్లాడుతూ తన ఓంతరితనం మర్చిపోడానికి ప్రయత్నం చేయసాగింది.
మధ్యలో భరణి వచ్చి చూసి వెళ్ళాడు, ఇది లైప్ కధా! మర్చిపొండి.... కంట్రోల్ చేసుకొండి అంటూ తనకి తోచిన నాలుగు వాక్యాలు చెప్పాడు.
