Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 40

    ఇన్నాళ్లుగా మృదువని ఎక్కడ వుంది? ఈ విషయంలో అతడి అనిమానం డిఫెన్స్ చీఫ్ మీదే వుంది... మృదువనిని అరెస్ట్ చేయటానికి అన్నిరకాల మార్గాలను అతను అనుసరించాడు... చాలా తీవ్రంగా ప్రతిస్పందించాడు... అంత అవసరం ఏమొచ్చింది? ఎన్నో సీరియస్ విషయాల్లో కూడా కామ్ గా ఉండే చీఫ్ ఈ విషయంలో ఎందుకంత  పట్టుదలగా వున్నాడు?

    కొన్నిరోజుల క్రితం జేమ్స్ అనే వ్యక్తి తన ప్రియురాలు శరణ్య కనిపించటంలేదని వచ్చాడు... అలాంటి వ్యక్తిని తను అరెస్ట్ చేయలేదని దీఫ్ స్పష్టంగా చెప్పాడు... కీనీ అంతక్రితం శరణ్య అనే అమ్మాయి ఇంటరాగేషన్ నిమిత్తం శ్తెషణ్ కు తీసుకువచ్చినట్టు ద్తూటీ ఆఫీసర్ ద్వారా తనకు తెలిసింది.

    మృదువని నిజంగా దేశద్రోహ నేరం చేసిందా? మృదువనిని షంషేర్ దాదా మనుష్యులు వెంటాడుతున్నారని అతనికి సమాచారం అందింది.

    షంషేర్ దాదా మృదువని విషయంలో కల్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? షంషేర్ దాదాను ఈ పనికి పురిగొల్పింది చీఫ్ వర్మేనని రూడీ అయింది రంగనాథ్  కు.

    అందుకే అతను సామ్యూల్ ను ఈ పనికి ఎంచుకున్నాడు... డబ్బుకోసం ఎలాంటి పని అయినా చేయగలిగే సామ్యూల్ డబ్బు కోసం ఎవరినైనా డబుల్ క్రాస్ చేయగలడు... కానీ తప్పదు... ముల్లును ముల్లుతోనే తీయాలి.

    సరిగ్గా కొద్దిగంటల క్రితం తనకు ఫోన్ చేసి చెప్పాడు సామ్యూల్ తను చీఫ్ వర్మను షంషేర్ దాదా దగ్గరకి తీసుకువేల్తున్నట్టు... అక్కడి మాటలను టేప్ చేత్సానని కూడా చెప్పాడు.

    కానీ షంషేర్ దాదా  దగ్గరనుంచి వచ్చేటప్పుడు చీఫ్ వర్మ, మరో వ్యక్తితో కలసి వచ్చాడు... చీఫ్ వర్మను డ్రాప్ చేసింది షంషేర్ దాదా మనుష్యులే... సరిగ్గా గంటక్రితం సామ్యూల్ డెడ్ బాడీని ఈ స్ట్ వాన్ ఫోలీసులు ట్రేస్ అవుత చేశారు... రోడ్డు పక్కన వున్న చట్ట కుండీలో కత్తిపోట్లకు గుర్తే చచ్చిపడి వున్నాడు.

    సామ్యూల్ కు, ఇతర గ్యాంగ్ స్టర్స్ కు వున్న కక్షలే ఇందుకు కారణమని ఫోలీసులు డిక్లేర్ చేశారు.

    ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి ఆలోచిస్తూ వుంటే డిప్యూటీ రంగనాథ్ కు విషయం స్పష్టంగా అర్దమవుతోంది... కాని తనేంచేయగలడు? ఎలా?
   
                                                 ***

    మధనం ఇమ్తిగంత కు లేక్వ్యూ హొటల్ లో రూమ్ నెంబర్ సిక్స్ టువన్ లో వున్న అంకిత్ కు ఫోన్ చేసాడు జర్నలిస్టు ప్రద్యుమ్న.

    "సాధించాను అంకిత్... మద్యాహ్నం రెండుగంటల ముప్పయి నిముషాలకు అపాయింట్ మెంట్ ఇచ్చాడు చీఫ్... మనం రెండుగంటలకల్లా యూనిట్ తో సహా అక్కడుండాలి... రొటిన్ చెకప్... కేవలం అరగంట మాత్రమె టైం ఇచ్చాడు."

    "థాంక్యూ ప్రద్యుమ్నా! ఈ మాత్రం అవకాశం చాలు... నేను వెంటనే బయల్దేరి వస్తున్నా... నేనూ, రాహుల్, చేతన్ డైరెక్టర్ గా డిఫెన్స్ చీఫ్ ఆఫీసుకు వచ్చేస్తాం!"

    "ఒకే..ఓకే! నేనూ రెండుగంటలకల్లా వచ్చేస్తాను!" చెప్పాడు ప్రద్యుమ్న.

   
                                                   ***
    ఆయాసంతో రొప్పుతున్నాడు జేమ్స్... అతని ఎదురుగా కూచున్నా మృదువని పరిస్థితి అలాగే వుంది... గత కొద్ది రోజులగా పరుగుపందెం ప్రారభిస్తూనే వున్నారు.

    హొటల్స్ దగ్గర షంషేర్ దాదా మనుష్యులు తమని గుర్తు పడతారన్న భయంతో ఓ మేస లో లంచ్ చేస్తుంటే షంషేర్ దాదా మనుష్యులు చుట్టుముట్టెసారు... అన్నం సగం లోనే వదిలేసి పారిపోయారు.

    షంషేర్ దాదా మనుష్యులు ప్రతీ అంగుళాన్ని తీవ్రంగా గాలిస్తున్నారు. మరో పక్క డిఫెన్స్ సంభందించిన వాళ్ళు కూడా.

    మృదువని దుఃఖం ముంచుకోచ్చేసింది.... ఒక్కక్షణం తను డిఫెన్స్ చీఫ్ దగ్గరకెళ్ళి లొంగిపోతే? అన్నా ఆలోచన కూడా వచ్చింది... కానీ ఆ మరుక్షణం తన ప్రాణాలు గాలిలో కలసిపోతాయి... తను అనవసరంగా జేమ్స్ ని కూడా ఇందులో ఇరికించిందా? ఆమె అలా పరిపరి ఆలోచిస్తూనే వుంది.
   
                                                                                  ***
    డీఫెన్స్ చీఫ్ ఛాంబర్.

    ప్రద్యుమ్న, అంకిత్ లు డిఫెన్స్ చీఫ్ కు పరిచయం చేసుకున్నారు... డిఫెన్స్ చీఫ్ వర్మ ప్రద్యుమ్న వైపు తిరిగి_

    "ప్రస్తుతం నేనెలాంటి ఇంటర్య్వూ ఇవ్వలేను.... మీ ఎడిటర్ అబ్లికేషన్ మీద సరేనన్నాను... కానీ అర్జంటుగా వేరే వర్క్ మీద వెళ్ళాల్సిన పని వుంది" చెప్పాడు.

    "సార్! నిజం చెప్పాలంటే మేమూ మీ ఇంటర్వ్యూ కోసం రాలేదు" అన్నాడు అంకిత్.

    "వ్వాట్! ఇంటర్వ్యూ కోసం రాలేదా? మరెందుకు వచ్చారు?" డిఫెన్స్ చీఫ్ గొంతులో విస్మయం, అనుమానం కలగలిసాయి.

    "మృదువని విషయం మాట్లాడదామని..."

    ఒక్కక్షణం సూది కిందపడితే వినిపించేంత నిశ్శబ్దం!

    "వాట్..." అదిరిపడి అడిగాడు.

    "యస్సార్! మృదువని కేసు గురించి..."

    "గెటప్! ఐసే గెటప్... మృదువని విషయం గురించి చెప్పటానికి ఏమిలేదు.అది హైలీ కాన్సిడేన్షియాల్" వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు డిఫెన్స్ చీఫ్.

    ఈ కారణంగానే ఇంటర్వ్యూ తప్పించుకుందామని అనికున్నాడు. గోరింతను కొండంతలుగా చేసి చిలువలు చేస్తారన్న భయం అతనిది.

    "సార్! ప్లీజ్ కూల్ డౌన్. మృదువని మాకు కావాల్సిన అమ్మాయి. మృదువని దేశద్రోహి ఏనాటికి కానేకాదు" అన్నాడు అంకిత్.

    "ఐసీ! అలా అని మీకెవరు చెప్పారు?"

    "నామనసు సార్!"

    డిఫెన్స్ చీఫ్ చురుగ్గా అంకిత్ వైపు చూసాడు.

    "మృదువని మీకు అంత కావాల్సిన అమ్మాయా?" సాలోచనగా అడిగాడు.

    "అవున్సార్!"

    "ఇఇపుడు మృదువని ఎక్కడ వుందో తెలుసా?"

    "తెలియదు సర్!"
 
    "మీకు అంతగా కావాల్సిన అమ్మాయి, దేశద్రోహం చేయని ఆ అమ్మాయి మరెందుకు పారిపోయినట్టు?"

    "భయంవల్లా సార్!"

    "ఏ నేరం చేయకుండా ఎందుకు భయం?"

    "మనం ఏ తప్పు చేయకపోయినా అర్దరాత్రి బందిపోటు  దొంగలు వురుచుకు పడితే భయపడతాం... మనం ఏ నేరమూ చేయకపోయినా గూండాలు దౌర్జన్యం చేస్తే భయపడతాం... ఇట్స్ నేచురల్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS