ఓ తల్లీ బిడ్డకు నగ్నంగా స్తనమిస్తొన్నా దృశ్యం. స్నానం చేస్తున్నా ఓ తల్లి గుక్కపట్టి ఏడుస్తున్నా బిడ్డా ఆకలి ఏడుపు విని తను వివస్రనన్న విషయం కూడా మరచి, బిడ్డ కోసం పరుగు పరుగున అలా వువశ్రిగా వచ్చి బిడ్డను ఒళ్ళోకి తీసుకుని, స్తనమిస్తొన్నా దృశ్యం.
ఆ బిడ్డ అతనా ఆకలి తెరిమ్దన్నా సంతోషంతో తల్లి బొమ్మను ఒడిలో స్తన్యాన్ని గ్రోలుతూనే నిద్రలోకిజారుకున్నాడు.
మౌన ఆ బొమ్మా భస్మ ముందు పెట్టి, తల్లి బొమ్మను చూపించి, తర్వాత విశాలిని చూపించి " అమ్మ.. అమ్మ.." అంది.
తరవాత బిడ్డ బొమ్మను చూపించి... భస్మ గుండెల మీద చేయివేసి
"బిడ్డ నువ్వు..." అంది.
భస్మ మెదడులో అప్పటికే ఏదో కదలిక.
మనసులో ఏదో చలనం...
"అమ్మ..అమ్మ"అన్నాడు మెల్లిగా.
"యస్.. అమ్మ.. మదర్.." చెప్పింది మౌన.
భరద్వాజ కళ్ళు చెమ్మగిల్లాయి.
"వారసులు అంటే ఏమిటో... ఎవరికెవరు ఏమవుతారో.. ఏమీ తెలియకుండా ఓ ల్యాబ్ లో ఓ వస్తువులా తమ పరిశోధనకు ఉపయోగపడే ముడి సరుకులా పెంచారు వాడిని..." అన్నాడు భరద్వాజ.
"మీరే యిలా అధైర్యపడితే ఎలా భరద్వాజగారు... మీరు వెంటనే పరిశోధన ప్రారభించండ... భస్మ పూర్తిగా మారిపోవాలి.
ఓ మామూలు మనిషిగా మారిపోవాలి. నేను ప్రైమినిష్టార్ తో మాట్లాడాను. భస్మ కేసూ విషయం మొత్తం డిటేయిల్ద్గాగా చెప్పాను.
అతను కూడా తన సానుభూతి వ్యక్తం చేశారు. అంతేకాదు, భస్మ విషయంలో ఏ కేసూ లేకుండా చూస్తానని హామీఇచ్చారు. భస్మ వామ్తెడ్లీ చేయలేదు కాబట్టి చట్టం దృష్టిలో కూడా నేరస్థుడు కాకపోవచ్చు..." చెప్పాడు కౌశిక్.
"థాంక్యూ అఫేస్ర్.. సైన్స్ తోనే పరిష్కరిస్తాను. నేను చేసే ఈ ఆపరేషన్ పేరేమిటో తెలుసా...
ఆపరేషన్ భస్మనేత్రం" అన్నాడు భరద్వాజ.
"అల్ ది బెస్ట్" చెప్పాడు కౌశిక్.
ఆపరేషన్ భస్మనేత్రం ప్రారంభమైంది.
***
భరద్వాజ యింటి చుట్టూ సేక్యూరీటి, మఫ్టిలో కాపాలా కాస్తూంది.
ఏ మాత్రం అనుమానం కలిగినా, ఘాట్ చేయమని కోఎశిక్ సేక్యూరీటి కి అదేశాలిచ్చాడు.
మౌన, విశాలి, భరద్వాజ, భస్మ మాత్రమే ఆ యింట్లోకి ప్రవేశించాలి. భరద్వాజ ముందు భస్మకు చిన్నపాటి ఆపరేషన్ చేసాడు. అతని మెదడులో వున్న చిప్స్ తొలగించాడు. దాంతో అగర్వాల్ కు, భస్మకు వున్న సంభందం తెగిపోయింది.
***
"సార్.. కంప్యూటర్ పనిచేయడంలేదు. నామాటలు భస్మకు వినిపించటంలేదు. మా మధ్య వున్న లిమ్గ్స్ తెగిపోయాయి..." చెప్పాడు అందోళన గా అగర్వాల్.
"వాట్..లింగ్స్ తెగిపోయాయా?ఇదెలా జరిగింది?"
"భస్మ మెదడులో మణం అమర్చిన చిప్స్ ని ఎవరో తొలగించి వుంటారు. మనం భస్మను యిక్కడికి తీసుకువచ్చి, చిప్స్ ను వెంటనే అమర్చి, మన సజెషన్స్ ద్వారా మనం అనుకున్న పనులు పూర్తిచేయలేకపోతే.. చ్ఝాలా రిస్క్ లో పడాల్సి వస్తుంది" చెప్పాడు అగర్వాల్.
"అల్ రైట్... ఈ రోజు రాత్రే భరద్వాజ యిమ్తిని అటాక్ చేద్దాం అక్కడ సెక్యూరిటీ తిట గా వుండి అయినా సరే... నేను కొమ్శిక్ లా గొంతు మార్చి సెక్యూరిటీ వెనక్కి రంమంతాను. అదే టైంలో మన మనుషులు ఆ యిమ్తిని అక్రమిమ్చేస్తారు.
అవసరమైతే అందర్నీ చేమ్పెస్తాం. యిల్లు పేల్చి, భస్మను తీసుకువద్దాం..." చెప్పాడు ఖాన్.
అగర్వాల్ అలాగే అన్నట్టు తలూపాడు.
***
రాత్రి పదిన్నర దాటుతుండగా వైరలెస్ సెట మోగింది.
సేక్యూరీటి చిఇఫ్ వైర లెస్ అన్ చేసి..." యస్.. సెక్యూరిటీ చీఫ్ స్పీకింగ్ అన్నాడు.
"నేను కొమ్శిక్ ని మాడ్లాడుతున్నాను. ప్రైమినిష్టార్ ప్రోగ్రాం సదన్ గా పడింది. మన సెక్యూరిటీ ని మొత్తం తీసుకుని మీరు వెంటనే రాజీవ్ గాందీ ఎయిర్ పోర్టుకు వచ్చేయండి."
"కొంతమంది సెక్యూరిటీని వుంచమంటారా?" "నో.. న్నో.. అంతా వచ్చేయండి. నేను వచ్చేవరకూ ఎయిర్ పోర్టులోనే వుండండి" అవతలివైపునుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
***
భస్మ మెల్లమెల్లగా రికవరీ అవుతున్నాడు. మనుష్యులను గుర్తుపట్టగలుగుతున్నాడు. 'అమ్మ' 'నాన్న' అని పిలుస్తున్నాడు అయితే 'అమ్మంటే ఎవరు? నాన్నంటే ఎవరు? వాళ్ళ మధ్య అనుబంధాలు ఎలా వుంటాయి..." లాంటివి మౌన భస్మకు చెబుతుంది.
టీచర్ స్టూడెంట్ కు చెప్పినంత శ్రద్దగా చెబుతుంది. అనుబంధాల నేపద్యంలో కధలు యిచ్చి చదవమంటుంది.
నవ్వడం... జోక్స్ వేయడం... స్పర్శ.. రియాక్షన్ అవన్నీ విడమర్చి చెబుతుంది.
ఆ రోజు సాయంత్రం విశాలి అంది మౌనతో...
"మౌనా నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా వుంది . భస్మ జీవితానికి కొత్త వెలుగును ఇస్తున్నావు. నేను వాడికి ఊపిరినైతే యివ్వగాలిగాలి గానే, జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఆ పని నువ్వు చేస్తున్నావు."
"అదేంటీ అంటి... అది నా భాద్యత" అంది మౌన వినయంగా.
భరద్వాజ అబ్జర్వేషన్ లో భస్మ కొద్దీ కొద్దిగా రికవరీ అవుతున్నాడు.
భరద్వాజ మాటలను ఫాలో అవుతున్నాడు భస్మ.
అతనిలో విద్యుత్ ని నిర్వీర్యం చేయాలి. అల చేసే ప్రయత్నంలో అతని తల మధ్యభాగంలో వున్న కంటిని తీసివేయాలి. అ ప్రయత్నంలో భస్మ ప్రాణాలు పోయినా పోవచ్చు.
***
