Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 40

 

    
                                   కృష్ణదేవరాయలు


    బళ్ళారిమండలములోని యనెగొందికి సమీపమున నుండిన విద్యానగరమును పట్టణరాజము రాజధానిగా దక్షిణ హిందూ దేశమున కెల్ల నేకచ్చత్రాదిపత్యమున నిర్వహించిన యీనృపాల రత్నము క్రై1509 మొదలు 1530 వఱకు రాజ్యము వహించినట్లు తెలియుచున్నది. కృష్ణరాయలు బహువారములు దండయాత్రలు చేసి నానారాజుల జయించి తురుష్కుల ముష్కర కృత్యముల సాగనీయక రాష్త్రముల నాక్రమించుకొని మహారాజ్య వైభవ మనుభవించినవాఁడగుటయ'కాక సరసకవితా విలసలాలసుఁడై పెద్దనాదిసుకవీంద్రుల పల్కుఁ దేనియలఁ జుఱలఁ గొని సంస్కృతాంధ్రములందు మేలయిన కవనము సెప్ప నేర్చిన సుకవిరాజ శిఖామణి. ఆంధ్రమున విష్ణుచిత్తీయమును సంస్కృతమున మదాలసా చరిత్రాదికములు నితనికృతులు. ఆంద్ర వాజ్మయమున కీ మహారాజు కాలమున నిం తం తనరానిమహోన్నతి చేకూరేను. పెద్దనాది కవిశ్రేష్టు లీతని యాస్థానమునఁ గవీశ్వరులు. మనుచరిత్రము పారిజాతాపహరణము మొదలగు కృతుల కీతఁడు కృతిపతి. పెద్దనామాత్యున కీతఁడాంద్రకవిపితామహుఁడన్న బిరుదు మొసఁగెను. విద్యావిషయమున నీ మహారాజు నాస్థానము నందు జరిగిన వృత్తాంతములు వింతవింతలుగాఁ జెప్పుకొనఁబడుచున్నవి. కొన్ని మాత్రమిందుఁదెల్పఁబడును.

    ఒకప్పుడు కృష్ణరాయలు పసిఁడి పళ్ళారమునఁ గవిగండ పెండేరమును గొనివచ్చి సభా స్థానమున నిడి సంస్కృతాంద్రాములందు సమముగాఁ గవనము సెప్ప నేర్చినవా రిద్దానిఁ గైకొన నర్హలనఁగా సభ్యులు మిన్నకుండిరనియు దాని పై నాతఁడే.

    ఉ|| ముద్దుగ గండ పెండియారము గొనుఁడంచు బహూకరింపఁగా
        నొద్దిక నాకొసంగు మనియొక్కరుఁ గోరఁగలేరు లేరొకో-    
    అని సగము పద్యముఁ జదివినఁ బెద్దనామాత్యుఁడు లేచి.

        పెద్దనబోలుపండితులు పృద్వీని లేరని నీ వెఱుంగవే
        పెద్దన కీఁదలంచినను బెరిమి నా కిడు కృష్ణరాణృపా!    388

    అని పూరించి యీ మాలిక నాశువుగా రచించి చదివే నట!

    ఉ|| పూఁత మెఱుంగులుం బసరువూఁ వబెడంగులు జూపునట్టివా
        కైతలు ? జగ్గు నిగ్గు, నేనగావలె, గమ్మన గమ్మనన్వలె
        రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారంజపు ని
        ద్దాతరితీపులో యనఁగఁ దారసులన్వలే లోఁ దలంచిన    

        బాఁతిగఁ బైకొన వలెను బైదలీకుత్తుకలోని పల్లటీ
        కూఁత లనన్వలె సొగసు కోర్కులు రావలె నాలకించినన్    
        జేతికొలందిఁ గౌఁగిటను జేర్చినకన్ని యచిన్ని పొన్ని మే        
        ల్మూఁతలచన్ను దోయివలె ముచ్చటగా వలెఁ బట్టి జూచిన
        దాతోడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
        వాతేఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదిన
        గాతలఁ దమ్మిచూలిదొర కైవస పుంజవరాలిసిబ్బెపు
        న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగుబ్బి గుబ్బ పొం
        బూఁతలనున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సం
        గాతపు సన్న తంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా
        సాతతతానతానలవస  దివుటాడేడు గొటమీటుబల్
        మ్రోఁతలు నంబలే హరపు మొల్లముగా వలె నచ్చతెన్గు లీ
        రీతిగ, సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
        టీతవనీయగర్భనికటీభవడాసినపర్వసాహితీ
        బౌతికనాటక ప్రకరభారతభారతసమ్మత ప్రభా
        శీత నగాత్మజా గిరిశ శేఖర శీతమయూఖ రేఖికా
        పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘు మార్భటీ
        జాతకతళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం'        
        గాతతతేహిత త్తహితహధితధందణురాణుధింధిమి
        వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణి
        నూతన ఘల్ఘలాచరణ నూపురఝుళ ఝుళీ మరందసం
        ఘాతవియద్దునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహ
        యాతకుమారగంధవహహరిసుగంధవిలసయుక్తమై
        చేతము చల్లఁజేయవలె జిల్లనఁ జల్లవలె మనోహర
        ద్యోతకగో స్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా
        రాతిరస ప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున.      389

    రాయ లంతటఁ గవిగండ పెండేరమును దానై యాతని పాదమునఁ దొడిగెనఁట! రాయలు వేఱొకప్పు డేదో యాశువుగా రచింపుమనఁ బెద్దన గారు చెప్పినది-

    చ|| నిరువహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక
        ప్పురవిడే మాత్మ కింపయినభోజన ముయ్యేలమంచ మొప్పు త
        ప్పరయురసజ్జు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
        దొరకినఁగాక యూరక కృతుల్ రచియింపు మనంగ శక్యమే!      390

    కృష్ణరాయ లోకనాఁ దాస్థానమునఁ గవీశ్వరుల కీసమస్య నోసఁగేనట! "వి ! స్పురితఫణామణిద్యుతులఁ బోల్పగునాకుమారుఁడో యన"- పెద్దన్న గారి పూరణము-

    చ||  వరుఁడు చెఱంగు వట్టినను వల్వ తొఱంగిన లేమ సిగ్గువ
        ట్టురు తరరత్నముద్రికల నొప్పగుడాపలికేల మూయఁగాఁ
        గరమమరేం గరం బపుడు కామనిదానముఁ గాచియున్నవి
        స్పురితఫణామణిద్యుతులఁ బొల్ప గునాగకుమారుఁడో యనన్.   391

    నగరు, తగరు, తొగరు, వగరు, అనుపదములు ప్రాసస్థానమున నెల కొల్పి , రామాయణ, భారత, భాగవత పరములుగాఁ గృష్ణరాయని యష్టానమున రాదామాధవకవిచేఁ జెప్పబడిన పద్యములు -

    చ|| నగరుపగాయే నింక విపినంబుల కేఁగుఁడు రాజ్యకాంక్షకుం
        దగరు కుమారులార! యని తల్లి వగ ల్మిగులంగఁ దోఁపగాఁ
        దోగరున రక్షగట్టి మదిఁదోఁపక గద్గదఖిన్న కంఠయై
        వగరుచుచున్నఁ జూచి రఘువంశవరేణుఁడు తల్లి కిట్లనున్.     392
    
    చ|| తోగరుచి కన్ను దోయిఁ గడుఁ దోఁపఁగఁ గర్జుఁడు భీమ సేనుపై
        దగరు ధరాధరంబునను దాఁకినభంగిని దాఁకి నొచ్చి తా
        వగరుచుచు వెస బరుగువాఱిన నచ్చటి రాజలోకముల్
        నగరు సుయోధనాజ్ఞ మదినాటుటఁ జేసి ధరాతలేశ్వారా!     393

    చ||  వగరుపు మాత్రమే వరుఁడు వశ్యుఁడు గాఁడు సఖీసఖత్వమే
        న్న గరుడహవనుండు మము నాఁడటు డించుటయేల్ల నుద్దవా
        తగ రని కాక మోహపులతాతను లైన విడంగఁ జూతురే
        తోగరుచి యోషదీశునకుఁ దోపఁగ జేయునే వీడనాడఁగన్?     394
    
    కృష్ణరాయలు దూర్జటకవి కవనశక్తిని గూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొక కవి పూరించిన పూరణము--

    చ|| స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గేనో
        యతులితమాధురీమహిమ! ! - హా! తెలిసే  జగదీక మోహనో
        ద్దతసుకుమారవారవనితా జనతా ఘనతావహారిసం
        తతమదురాధరోదిత సుధారసధారలఁ గ్రోలుటం జుమీ       395

    రాయల కోరికపై నీక్రింది మూఁడు పద్యములను బెద్దన తిమ్మన భట్టు మూర్తి కవులచే రచింపఁబడినవి-
    
    శా|| రంతుల్ మానుము కుక్కటాధము! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
        ప్రాంతోలూఖాలమూలతండులకణ గ్రాసంబుదేఁ గ్రొవ్వి దు
        ర్దాంతాభీలవిశేషభీషణఫణాంతర్మాంససంతోషిత
        స్వాంతుండైన ఖగెంద్రు కట్టెదుర నీజంజాటముల్ సాగునే?      396
    
    ఉ|| స్థానవిశేషమాత్రమునఁ దామరపాకున నీటిబొట్ట! ని
        బూనిక మౌక్తికం బనుచుఁ బోల్చినమాత్రాన యింతగర్వమా
        మానవతీశిరోమణులమాలికలందును గూర్ప వత్తువో
        కానుక నియ్య వత్తువో వికాసము నిత్తువో నిల్వదేత్తువో.     397

    ఉ||  తక్కువ నేల ముట్టేగొని త్రవ్వఁగనేర్తు నటంచుఁ దాకుతా
        వొక్కటే జాతి యంచు ముద మొందకు బుద్దిని వెఱ్ఱివంది! నీ
        వెక్కడ! యాది ఘోణియన నెక్కడ! యద్రిసముద్ర దుర్గభూ
        ర్భాక్కుతలంబు నొక్కయరపంటనే మింటికి నెత్త నేర్తువే.      398

    రాయల ఆస్థానమున కొక సంస్కృత కవి యరు దెంచి పెద్ద నాద్యాం ద్రకవీశ్వరుల యెడ నీసడింపుతో నిట్లు పల్కేనట.    
    
    శ్లో||  ఆంధ్రభాషామయం కావ్య మాయోమాయవిభూషణమ్,

        వెన్వెంటనే పెద్దనామత్యుఁడు చెంప పెట్టు పెట్టినట్లు పూరించే!

        సంస్కృతారణ్యసంచారి విద్వన్మ త్తేభశృంఖలమ్||    399


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS