Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 41

తనవాళ్ళల్లో వాళ్ళే చనిపోవటం చూసిన వాళ్ళ వాళ్ళు శవాన్ని ముందు పెట్టుకుని ఏడుపులూ, పెడబొబ్బలూ సాగించటం మొదలుపెట్టారు.
అక్కడ ఎవరిని ఎవరూ ఓదార్చే పరిస్థితిలో లేరు. ఎవరి బాధ వారిది. ఎవరి ఏడ్పులు వారివి.
మోహనరావు తన అత్తయ్యని, మామయ్యని చూసుకున్నాడు.
శివరావు, పార్వతి బ్రతికే వున్నారు.
కానీ,
శివరావు పూర్తిగా స్పృహ కోల్పోయి, ఎంత తట్టి పిలిచినా పలకకుండా కోమాలోవున్న వాడిలాగా వున్నాడు. పార్వతికి అక్కడ అక్కడా చిన్న చిన్న గాయాలు తగిలాయి. దానికితోడు జ్వర తీవ్రత.వూరికినే మూలుగుతున్నది. పలకరిస్తే జవాబు చెప్పలేక మూలుగే సమాధానంగా ఇస్తున్నది.
కొంతలో కొంత అత్తయ్యా మామయ్యా బ్రతికివున్నందుకు మోహనరావు చాలా సంతోషించాడు.
రాత్రికి అదే చివరి బస్సో, ఇంకా అటుకాని, ఇటుకాని బస్సు వస్తుందో లేదో కానీ ఆ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. దరిదాపుల్లో చిన్న గ్రామం కూడా లేదన్నది మాత్రం రూడీగా తెలుసు.
అందరినీ రోడ్డుమీదకి చేర్చి, ఒక్కక్షణం ఊపిరి పీల్చుకుని జరిగింది మననం చేసుకుంటూ వుంటే అప్పుడు వాళ్లకి గుర్తుకు వచ్చింది రెండవ బస్సు గురించి.
మోహనరావు చేతిలో వున్న టార్చిలైటు సహాయంతో కాస్త ముందుకు వెళ్ళి ఆ బస్సు కోసం చూశారు.
ముందు బస్సు రోడ్డు ప్రక్కన వున్న పెద్ద బురద గుంటలో సగానికి కూరుకుపోయి వుంది. పైగా ఆ బస్సు ఏటవాలుగా పడిందేమో, లోపలికి బురద నీరు ప్రవహిస్తూ వుంది. లోపల ప్రయాణీకులు లోపలికి కూరుకుపోయి వుండటంతో బస్సు లోపలికి వెళ్ళటానికి అసలు వీలవలేదు.
బస్సు లోపలినుంచీ చిన్న మూలుగు సైతం వినిపించడం లేదు.
ఆ బస్సు లోపలివారందరూ మరణించి అయినా వుండాలి. లేక వకరిద్దరు బ్రతికివున్నా యాక్సిడెంట్ షాక్ తో పూర్తి స్పృహ తప్పి అయినా వుండాలి.
మానవ ప్రయత్నంగా ఇద్దరు ముగ్గురు బస్సు విండో దగ్గరకు వెళ్ళి బస్సు రేకుమీద కొట్టి పెద్ద చప్పుడు చేస్తూ "ఏమండీ! ఏమండీ" అని గట్టిగా కేకలు వేశారు.
బస్సు లోపలినుంచీ నో రెస్పాన్స్.
వాళ్ళ ప్రయత్నం విఫలం కావటంతో ఎందుకైనా మంచిదని మరికొద్దిసేపు ప్రయత్నించి, లాభంలేదన్న నిర్ణయం తీసుకుని అందరూ ఇవతలకి వచ్చేశారు.
అసలే అవి చీకటి రాత్రులు. పైగా ఆకాశమంతా మేఘావృతమై వుంది. దాంతో అక్కడ ఒకరికి ఒకరు దగ్గరగా వున్నా కనిపించటం లేదు. మళ్ళీ వర్షం వచ్చే సూచనలు కనపడుతూ వుండీ వుండీ మెరుపులు మెరుస్తున్నాయి. వాన వస్తే అందరూ మళ్ళీ బస్సులోపలికి వెళ్ళాలి. కాళ్ళు చేతులూ విరిగిన వారిని మళ్ళీ బస్సులోకి చేర్చటమనేది కూడా కష్టమే.
ఫస్ట్ ఎయిర్ చెయ్యటానికి, వాళ్ళెవరి దగ్గరా మందులూ, సూదులూ లేవు. బస్సులో వున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెరిచి  చూస్తే చిన్న కాటన్ బండిల్ తప్ప మరేదీ కానరాలేదు. ఎందరికో రక్తం స్రవిస్తూ వున్న గాయాలని ఆ చిన్న కాటన్ బండిల్ ఏమి ఆపుతుంది. చాలామంది అప్పటికే చీరలూ, పై కండువాలూ చింపి, రక్తం వోడుతున్న గాయాలకి కట్లు కడుతున్నారు. గాయాలకి కట్లు కట్టినా కొందరికి ఇంకా రక్తం స్రవించటం ఆగలేదు. ఉపశమనానికి అంటూ ఏమీ కనపడలేదు.
ప్రాణం కడ గట్టిన కొందరు దాహంతో నోరు ఆర్చుకు పోతూంటే రోడ్డు ప్రక్కనే గుంటల్లో నిలిచిన బురదగా వున్న వాన నీటిని ఆబగా త్రాగారు.
ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నది ఎవరికీ తెలియదు.
అర్థరాత్రి.
అది వాళ్ళందరి పాలిట భయంకర కాళరాత్రి.
"టైమ్ ఎంతమంది అన్న సంగతి చూసుకోవాలన్నా, ఆ సమయంలో ఆ ఆలోచన ఎవరికీ రాలేదు. కాస్త సద్దుమణిగిన తరువాత ఒకాయన తన వాచీలో టైమ్ చూసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS