Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 41


    
    "మొట్టమొదట ఎలక్ట్రానిక్ డిజిటల్ కాల్క్యులేటర్ తయారుచేసింది ఎవరు? ఏ సంవత్సరం?"
    
    "1942లో వాస్టీట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ అటానాసాఫ్, క్లిఫర్డ్ బెర్రీలు తయారుచేశారు."
    
    "ఫెంటాస్టిక్ ఆదిత్యా.....!" అతడిలోని అసాధారణమయిన శక్తి తెలుసుకుంటున్న తొలి స్కహనంలో విభ్రమం చెందుతూంది ప్రణయ. "లెక్కలలో డెసిమల్స్ గురించి కనిపెట్టిందెవరు?"
    
    "ఇప్పటికీ స్పష్టంగా తెలీని విషయమిది. కాని ఐరోపా దేశస్థులు కనుగొన్నారని అంటారు తప్ప కనుక్కున్నా వ్యక్తి పేరు స్పష్టంగా తెలీదు కానీ ప్లెమిష్ మేథమెటీషియన్ సైమన్ స్టీవెన్ 1585లో తొలిసారి తను రాసిన పుస్తకం 'ది టెంత్'లో ఈ డెసిమల్ సిస్టం గురించి రాశారు. అంతకుముందు ఒకటికంటే తక్కువ అంకెని ఫ్రేక్షన్ గా వివరించేవారు."
    
    "మొట్టమొదట న్యూక్లియర్ ఎక్స్ ప్లోజన్ ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ జరిగింది?"
    
    "1974 రాజస్థాన్ ఎడారిలో."
    
    "చీకటిలో సైతం స్పష్టంగా చూడగలిగే శక్తి కళ్ళకు ఇవ్వగలిగే వెజిటబుల్?"
    
    "కేరట్."
    
    "ఫైన్ రోగులకి ఆపరేషన్ చేసేటప్పుడు ఉపయోగించే అనెస్తీషియా మందును తొలిసారి కనుగొన్నదెవరు?"
    
    "1844 లో అమెరికాకి చెందిన దంతవైద్యుడు హురేస్ వేల్స్ నైట్రస్ ఆక్సయిడ్ ని అనెస్తీషియాకి వాడటం జరిగింది."
    
    "మెదడు పరిణామానికీ, తెలివికీ సంబంధం లేకపోయినా పురుషుడు ఆడదానికన్నా మెదడున్నవాడు.... అంటారెందుకని?"
    
    ప్రణయకేసి రెప్పలార్పకుండా చూశాడు ఆదిత్య క్షణంపాటు. "శరీరం బరువును బట్టి మెదడు బరువూ నిర్ణయించబడుతుంది ప్రణయా. మీరడిగిన ప్రశ్నలోని ఐరనీ మాటెలావున్నా పురుషుడి మెదడు సుమారు 1.4 కిలోగ్రాములుంటే స్త్రీ మెదడు బరువు 1.3 కిలోగ్రాములుంటుంది. అంటే బాల్యంలోని మెదడు బరువుకి మూడు రెట్లన్నమాట."
    
    "గుండె కవాటాల మార్పిడికిగాని, చర్మం గ్రాఫ్టింగ్ కి గాని మనిషికి చాలా సమీపంగా సరిపోయే జంతువేది?"
    
    "పంది."
    
    నవ్వేసింది ప్రణయ. "మనిషికి శరీరంపైన సగటున ఉండే రోమాలెన్ని? తలపైన కాదు- మొత్తం శరీరంపైన."
    
    "సుమారు యాభై లక్షలు అంటుంది వైద్యశాస్త్రం."
    
    "రైట్! ప్రపంచంలో సముద్రంలేని దేశాలు వున్నాయా?"
    
    "ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు."
    
    "ప్రతి నెలా పదమూడో తేదీ ఎక్కువగా వచ్చే వారమేది?"
    
    "సగటున లెక్కచూస్తే ఎక్కువగా వచ్చేది శుక్రవారం అవుతుంది."
    
    ప్రణయకిది నమ్మశక్యంగా లేదు. ఏ శక్తితోనో అతడు ప్రభావితుడవుతున్నట్టు ఆలోచించకుండానే ప్రతి ప్రశ్నకి జవాబులు చెపుతున్నాడు.
    
    ఇప్పటివరకూ ఆమె అడిగిన ప్రశ్నలు పదమూడు. ఒక్కటీ ఫెయిల్ కాలేదు.
    
    పదమూడులో ఒకనాడు ఆమె చెప్పలేకపోయిన జవాబులు రెండు. ఇక మిగిలిన ఏడు ప్రశ్నలూ అడగటానికి వుద్యుక్తురాలయింది.
    
    "భారతదేశంలో ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్ చంద్ తో పోల్చదగ్గ ప్రముఖ రచయిత, అతని సమాకాలికుడూ, అతడిలాగే సెమీఫ్యూడల్ సొసైటీ పైన తిరుగుబాటులా రచనలు చేసిన చైనా రచయిత ఎవరు?"
    
    "ఐ థింక్..." సాలోచనగా అన్నాడు "లూషున్!"
    
    "వెరీ కరెక్ట్ ఆదిత్యా! ఇప్పుడు నేను అడగబోతున్నది చాలా క్లిష్టమయిన ప్రశ్న. "క్షణమాగింది "వృత్తిరీత్యా డాక్టరై, ప్రవత్తిరీత్యా ప్రపంచం ఇప్పటికే కాదు, మరికొన్ని శతాబ్దాలదాకా గుర్తుంచుకోదగ్గ ప్రముఖ రచయితగా మారి, ఇంగ్లండు ఎంసిసి మెంబరుగా ఫస్ట్ క్లాస్ మేచ్ లోనూ అడిగిన క్రికెట్ ప్లేయర్ ఎవరు?"
    
    నిశ్శబ్దంగా వుండిపోయాడు చాలాసేపటిదాకా ప్రశ్నని మరోమారు మననం చేసుకున్నాడు.
    
    ఆసక్తిగా చూస్తూంది ప్రణయ.
    
    రెండు నిమిషాలు గడిచాయి.
    
    "చెప్పేయనా?" అంది ప్రణయ.
    
    "నన్ను ప్రయత్నించనివ్వండి."
    
    "అంత సులభం కాదు."
    
    "కాని ప్రయత్నించడంలో తప్పులేదుగా?" క్షణమాగి అన్నాడు. "మీరు చెప్పిన వ్యక్తి గొప్పతనం అంతటితో ఆగిపోలేదు ప్రణయా! ఓ హత్యానేరంపైన ఉరికంబం ఎక్కబోతున్న వ్యక్తి నోజంగా నేరం చేయలేదని తన పరిశోధనతో నిరూపించి, చట్టం చేసిన తప్పుని ఎత్తి చూపించాడు తన మేధతో."
    
    ప్రణయ అర్ధంకానట్టు చూసింది.
    
    "అతడు పెర్లాక్ హోమ్స్ లాంటి డిటెక్టివ్ ని సృష్టించిన సర్ ఆర్ధర్ కానన్ డయల్."
    
    "యురేకా!" అమాంతం అతడి చేతిని పట్టుకుని, మరుక్షణం తేరుకున్నట్టు చేతిని వదిలింది. "సూపర్బ్ మిస్టర్ ఆదిత్యా!"
    
    "థాంక్యూ ఇక మిగిలినవి అయిదు ప్రశ్నలు."
    
    "జీసస్ ని జెరూసలెంలో శిలువ వేయటానికి అనుమతించిన రోమన్ గవర్నర్ ఎవరు?"
    
    "తెలీదు" టక్కున అన్నాడు.
    
    "ఆలోచించండి."
    
    "ఆలోచించి పరిష్కారం వెదకటానికి ఇది మేథమెటిక్స్ కాదు. ప్రణయా! ఈ జవాబు నాకు తెలీదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS