Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 41

కంటి ఎదురుగా జరిగే ఘాతకాన్ని ఆపాలని ముందును పరుగుదీస్తున్న వీరేష్ కు మరొక ఇద్దరు అడుపడ్డారు.
ఆ యువతి దీనాలాపాలు అప్పటికే గాలిలో కలసిపోయినట్టయ్యాయి బలవంతంగా ఆమె శీలాన్ని హరించి దిగ్విజయం సాధించిన వీరునిలా నిలుచున్నాడు ఒకడు.
అతని స్థానంలోకి మరొకడు మారాడు.
తను మళ్ళీ మానభంగానికి గురికాబోతున్నానని అర్దమయింది ఆమెకు. తిరిగి ప్రతిఘటన... అసలే బలహీనురాలు... వున్న శక్తి ఎప్పుడో హరించుకుపోవడంతో అతనని ఎక్కువగా ప్రతిఘటించలేకపోయింది. తను తన పనిని తను చేసుకుపోతున్నాడు. కత్తితో కోస్తున్నట్టు బాధతో విలవిలాడిపోతూ ఆర్తనాదాలు చేస్తున్నదామె!
ఇద్దరినీ చితకకొట్టటానికి దాదాపు పది నిమిషాలు పట్టింది వీరేష్ కు.
రెండవ వ్యక్తి కూడా విజయగర్వంతో ఆమె పైనుంచి లేచాడు.
తన సహచారులందరూ వీరేష్ చేతిలో మట్టికరవడం చూసి పిచ్చి ఆవేశంతో మిగిలిన ఇద్దరూ అతనిపైకి ఉరికారు. అప్పటికే తన రివాల్వర్ ను సంపాదించిన వీరేష్ వెనుకా ముందూ ఆలోచించకకుండా నిర్దాక్షిణ్యంగా ట్రిగ్గర్ నొక్కాడు.
"ధన్...ధన్...." బుల్లెట్లు దూసుకుపోయాయి.
వెర్రికేకలు వేస్తూ ఆ ఇద్దరూ విరుచుకుపడిపోయారు. వాళ్ళ తొడలలో  దూరిన బుల్లెట్లు చేసిన రంద్రాలలో నుంచి ఎర్రటి రక్తం చివ్వున చిమ్మింది.
అపస్మారక స్థితిలో పడివున్న యువతిని హాస్పిటల్ లో చేర్చి, ఐదుగురు సిటీ గూండాలను వీరేష్ అదుపులోకి తీసుకున్నాడు.
ఎలాంటి టార్చర్ పెట్టకుండానే తమ పూర్తి వివరాలను చెప్పేశారు గూండాలు. తమ నాయుకుడు ఎవరో, తమ వృత్తి ఏమిటో... తమ నువాసం ఎక్కడో అన్నీ పూస గుచ్చినట్టు వివరించడంతో ఏసిపి వీరేష్ భృకుటి ముడిపడింది.
ఎన్నాళ్ళనుంచో జటిలంగా మిగిలిపోయిన దొంగనోట్ల ముఠాకు చెందిన వివరాలు రేప్ కేసులోని ముద్దాయిల నోటినుండి వినడంతో అవాక్కయిపోయాడు.
అప్పటికప్పుడు క్షణాలమీద ఒక నిర్ణయానికి వచ్చిన వీరేష్ తను తీసుకొనబోవు స్టెప్ ను గురించి మరొకసారి దీర్ఘంగా ఆలోచించాడు.
తన అడుగులు ఏ మాత్రం పొరపడినా తన ఉనికి బయటపడిపోతుంది. సంఘంలో ఘరానా పెద్ద మనిషిగా  చలామణీ అయ్యే ఆ ప్రముఖవ్యక్తి జాగ్రత్త పడిపోతాడు. అదే జరిగితే మళ్ళీ తిరిగి తనకు దొరకడం కల్ల!
అందుకే తను ఆచి_ తూచి అడుగు వేయాలి.
స్థిరమైన నిర్ణయంతో ఏసిపి వీరేష్ డి.జి.పి కార్యాలయం వైపు కదిలాడు.   
                       *    *    *    *
బీర్ బార్....
నిజానికి అక్కడ బీర్ మాత్రమే సప్లయ్ చేయాలి. కానీ, నిబంధనలకు వ్యతిరేకంగా లోపలవున్న సీక్రెట్ గదులలో రహస్యంగా యదేచ్చగా సాగుతుంది రకరకాల మద్యపానం.
విద్యార్దులు, మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికులు, రిక్షావాళ్ళు మాత్రమే కలదు వీధి గూండాలు కూడా వచ్చిపోయే చోటా బార్ అది.
సీసాలుమీద సీసాలు చీప్ లిక్కర్ పట్టించేవాళ్ళు కొందరయితే మరికొందరు పెగ్గుల మీద పెగ్గులు ఖాళీ చేస్తున్నారు.
ఒక గదిలో వున్న బల్ల దగ్గర కొందరు ఆకురౌడీలు గుమికూడి వున్నారు.
వాళ్ళముందు బీర్ బాటిల్స్ తో పాటు రమ్ కూడా వుంది. తినడానికి తందూరి చికెన్ కోడిపలావులను తెప్పించుకుంటున్నారు. తింటూనే మధ్య మద్యలో మందుకొడుతున్నారు.
అప్పటికే వాళ్ళ మాటలు తడబడుతున్నాయి. మత్తు మత్తుగా వస్తున్నాయి. వాళ్ళలోవాళ్ళే తిట్టుకుంటున్నారు.... అరుచుకుంటున్నారు.
దాదాపు గంట నుంచీ వాళ్ళ భాగోతాన్నీ ఓపిగ్గా భరిస్తున్న పెద్దమనిషి తను కూర్చున్న టేబుల్ మీద బీర్ బాటిల్స్ వైపుచూశాడు. అప్పటికే మూడు ఖాళీ చేశాడతాను. ఇక ముట్టుకోకూడదు అనుకుంటూ వాచీవంక చూసుకున్నాడు.
కానీ అక్కడ తను ఇంకాస్త టైమ్ ఎలాగోలా గడపాలి. ఖాళీగా కూర్చుంటే బిల్లు తెచ్చి ఇంకా కస్టమర్లు బయట వున్నారంటూ వెళ్ళమని బేరర్ తొందర చేయవచ్చు అనుకుంటుండగానే బేరర్ వచ్చి నిలుచున్నాడు.
అప్పుడు పది అవుతుంది.
అంటే ఇంకా అరగంటలో బార్ మూసేస్తారు.
అప్పటివరకు ఓప్పిగా వుండక తప్పదు. అందుకే ఇంకొక బీర్ తెమ్మన్నాడు అతను.
అతను ఏ.సి.పి. వీరేష్.... మారవేషంలో వున్నాడతను.
వీరేష్ కు దగ్గర్లో వున్న టేబుల్ చుట్టూ వున్న వీధి రౌడీల మధ్యన వున్న వ్యక్తి చతుర్వేది చంపబడిన స్టూడియో ముందు వున్న ఫోటో స్టూడియో యజమాని.
ఆ ఫోటోగ్రాఫర్ తన మిత్రులతో ఖుషీ చేసుకుంటున్నాడు. అతని చుట్టూ వున్న వాళ్ళని చూడగానే అతను ఎలాంటివాడో వీరేష్ కు అర్దమయింది.
రఫ్ కారెక్టర్లు ప్రతిరోజూ తప్పనిసరిగా వచ్చి ఖుషీ చేసే బార్ అది అని రేప్ కేసులో దొరికిన ముద్దాయిలు ఇచ్చిన ఇన్ ఫర్ మేషన్ తెలిసిన రోజునుంచీ ప్రతిరాత్రి వచ్చి బార్ లో తిష్టవేస్తున్నాడు.
చివరకు అతని ప్రయత్నం మూడవరోజున ఫలించింది.
ఫోటో గ్రాఫర్ తో పాటు మందుకొడుతున్న వాళ్ళలో సైదాబాద్ గూండాలు యిద్దరు వున్నారు. తన దగ్గర వున్న లిస్టులోని వాళ్ళు అక్కడ వుండడం వలన తప్పనిసరిగా తనకు అవసరమయ్యే ఏదో ఒక విషయం వాళ్ళ నోటివెంట వినవచ్చుననే ఊహతో వీరేష్ కాచుకుని కూర్చున్నాడు.
అతని ఊహను నిజం చేస్తూ....
ఫోటోగ్రాఫర్ గర్వంగా మేధాశక్తిని పొగడుకోవడం మొదలుపెట్టాడు.
"ఆ ఏసిపి గాడిని టోకరా కొట్టించానుబే... పెద్ద హీరోలా మీ ఫోటోలు పట్టుకువచ్చాడు. వాటిలో మన బాస్ ఫోటో కూడా వుంది. అయినా నేను నిజం చెప్పలేదు. అసలు వాళ్ళలో లేనేలేడని నమ్మించాను ... చతుర్వేదిని చపింది మన బాసే అన్న విషయం అతనికి తెలిసే అవకాశం ఇక లేనట్టే...." మత్తు మత్తుగా చెబుతున్నాడతను.
వీరేష్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
అతను తనని ఎంత నమ్మకంగా మోసం చేశాడో తలుచుకోవడంతోనే ఆవేశం పుట్టుకొచ్చింది.
అయినా తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఇంకేమైనా చెప్పా కుంటారేమోనని ఊపిరి బిగపట్టాడు.
హోటల్ లో హత్యలు జరగడంతో పోలీసులు వచ్చి పడ్డారు. లేకపోతే ఆ పది  లక్షల సూట్ కేస్ ను కనిపెట్టేట్టా వాళ్ళు. ఇప్పుడేమో అది ఏమయిందో అంతుబట్టలేదు. ఎవరు దానిని తెస్తే అది తెచ్చిన వాళ్ళకు ఘనంగా బహుమతి ఇస్తానని చెప్పాడు బాస్. ఆ హోటల్ లోనే అది మాయమైంది కాబట్టి హోటల్ వాళ్ళే ఆ సూట్ కేస్ ని దాచి వుంచారని బాస్ అనుమానం..."
"ష్... ఎవరన్నా వింటారు మన మాటలు..." అన్నాడు మరొకడు.
"అవునవును_ వింటే కొంపలు అంటుకుంటాయి. జయచంద్ర సాబ్ మన తాట వలిచేస్తాడు" అంటూ మాటలను మధ్యలోనే మింగేశాడు ఆ ఫోటోగ్రాఫర్.
అంతటితో వీరేష్ అనుమానాలు అన్నీ పటాపంచలయి పోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS