Previous Page Next Page 
మహావృక్షం పేజి 39

"పర్వాలేదు. షి ఈజ్ ఓ.కే ఏం శ్యామా! మీ రేలా వున్నారు?" అప్యాయంగా పలకరించింది శ్యామల.
కాసేపు పరామర్సలయాక వీణ, మణి పడుకున్న మంచానికి తల వైపునున్న మోనిటర్ మీద వేవ్స్ లా కనిపిస్తున్న మణి గుండె కదలికలు పరీక్షగా చూస్తూ అంది అనూషతో_" ఈ పరీక్ష ద్వారా ఎవరి గుండె కదలికలయినా చూడచ్చా?"
"ఆ_ఏం?"
"నీ లాంటి బండలాంటి గుండెలవో?"
"షటప్."
"ఇ.సి.జి. అంటే ఇదేనా అనూషా!" అడిగింది శ్యామల.
"ఊ.... హార్ట్ కండిషన్ ని కంటి న్యూస్ గా రికార్డు చేస్తుంది. ఈ మోనిటర్ మీద చూపిస్తోన్న వెన్స్ ని టిస్యూ పేపర్ మీద రికార్డ్ చేస్తాం. దీన్ని బట్టి హార్ట్ టిష్యూ ఎక్కడ డెడ్ అయిందో స్పష్టంగా తెలుస్తుంది."
"ఎకో కార్డియోగ్రఫీ అంటారు. వీణ ఈ పరీక్ష ద్వారా హార్ట్ ఎటాక్ గురించి తగిన చికిత్స చేస్తారు. సాధారణంగా చెస్ట్ పెయిన్.... దీన్నే ఇంటేన్స్ పెయిన్ అంటారు. ఈ పెయిన్ ఎడంచేతికి రెడిఏట్ అవుతుంది. దాని వలన బాక్ పెయిన్ కూడా వస్తుంది. దీనికే ఎక్సేరే తీస్తాను.పి.ఏ.వ్యూ ఎక్సరే లాబీ మీద పెట్టి స్టడీ చేస్తారు. గుండె  సైజు, లంగ్స్ పొజిషన్ తెలుస్తుంది. తెల్లగా కొన్ని ౩రియాస్ కన్పిస్తాయి. అవి కనక డిజనరేట్ అయితే, వాటిని పనికిరాని తిశ్యూలుగా భావిస్తారు. అదే మైకార్దియల్ ఇన్ ఫార్ క్షన్....
కొంతమందికి ఆయాసం వస్తుంటుంది. ఇనిషయాల్ స్టేజిలో అలా వస్తుంది. అదే నిద్రలో కూడా సదన్ గా వచ్చి నట్టు అనిపించి, చల్లగాలిలోకి వెళితే కానీ తగ్గదు. అన్ని వైపులా బ,దించి, ఏ.సి.లో కూర్చూన్నా కొందరికి తగ్గినట్టు అనిపించదు."
"సిం కోస్ అంటే?"
"సింకోస్ అంటే.... సదన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం, హార్ట్ డిసీజ్ వలన బ్రెయిన్ కి రక్త ప్రసరణ తగ్గిపోయి, పేషెంట్ అన్ కాన్షస్ అవడం జరుగుతుంది. అలాగే, ఎడిమా....కాళ్ళల్లో వస్తుంది. ఒక వేళ పేషెంట్  మంచంమీదే వుండాల్సివస్తే, నడుం దగ్గర నీరు పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్."
అదంతా వింటుంటే శ్యామలకి ఎగ్జయిటింగ్ గా అనిపించసాగింది. అనూష దగ్గర రోజూ కూర్చుని, ఇలాంటి విషయాలు తెలుసుకుంటే కొంచెంజ్ఞానం పెరుగుతుందేమో అనిపించింది.
"బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు?" శ్యామల అడిగింది.
"గుండెకి రక్తాన్ని సరఫరాచేసే రక్తనాళాలు మూసుకుపోతాయి.... పర్సంటేజ్ వుంటుంది. ఎంత భాగం మూసుకు పోయాయి అని చూసి, సర్జరీ అవసరమా? కాదా? అనే విషయం చెప్తారు. అది తెలియాలంటే అంజియేగ్రాప్ చేయాలి. ఆ రిపోర్ట్ ని బట్టి సర్జరీ చేయాల్సి వస్తే చెప్తారు. లేక పోతే అవసరంలేదని చెప్తారు. చాలామంది ఆపరేషన్ అవసరం అయితే యంజియేగ్రాపి చేయించుకుంటాం లేక పోతే ఎందుకు డబ్బులు దండగ అంటారు."
"ఆపరేషన్ అంటే గుండె కొస్తావా!"
నవ్వింది అనూష "మూసుకుపోయిన రక్తనాళాలను ఎక్స్ పాండ్ చేసి, వాటిని బైపాస్ చేసి, పక్కన పెట్టడంకాదు."
"అనూ? సాధారణంగా గుండెనొప్పికి సార బిట్రేట్ లాంటి సాబ్ లింగ్వల్ టాబ్లెట్స్ కాదా ఇచ్చేది... అలాంటప్పుడు ఇంత ట్రీట్ మెంట్ అవసరమా? నేను అడగడంలేదు. ఆమధ్య ఒక లాయరు ఈ లీగల్ పాయింట్ లేవదీశాడు. అతని ఉద్దేశం ప్రకారం బైపాస్ సర్జరీ అనవసరంగా చేస్తున్నారు... డబ్బుకోసం అని అంటాడు. నీ అభిప్రాయం?"
"సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ విషయంలో అలాంటి అభిప్రాయానికి రావచ్చు. కానీ మా హాస్పిటల్ లో అలాంటి అవకాశం లేదు. అయినా, ఏ డాక్టర్ కూడా సరదాకి గుండె కోయారు కదా! గుండె నొప్పి రావాడానికి కారాణాలు అనేకం. పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నీ అన్నింటికి సార్  బిట్రేట్ వేసి నయం చేయకలిగితే సైన్స్ ఇంతగా డెవలప్ అవడం దేనికి?"
"అబ్బ.... డాక్టర్ గారికి కోపం వచ్చింది" సరదాగా నవిఇమ్ది వీణ.
"నాకేం కోపం.... కానీ, కొందరు పేషెంట్స్ అడ్డంగా వాదిస్తారు. అప్పుడు కోపం వస్తుంది."
"సరేలే.... ఇంతకీ నా కండిషన్ ఏంటి?" అడిగింది మణి.
"నువ్వు చక్కగా నీ ఉద్యోగం చేసుకుంటూ, ప్రసంటంగా సినిమాలు చూస్తూ, కాలక్షేపం చేయి... హాయిగా వుంటావు. సరేనా?"
అందరూ నవ్వేశారు.
ఆ రాత్రికి శ్యామలని మణి దగ్గర వదిలేసి అనూషా, వీణ ఇంటి కేల్లిపావుయారు.
అయితే, తెల్లవారి లేచే టప్పటికి ఊహించని పిడుగులాంటి వార్త మోసుకొచ్చాయి టెలీఫోన్ తీగలు....
డాక్టర్ అనూష, ఫేమస్ కార్టియాలజీస్టు జీవతంలో మొదటిసారిగా ఓటమి చవిచూసింది. ఏ మాత్రం ఆనవాలు తెలియకుండా నిశబ్దంగా వచ్చి, తనతో మణిని తీసికెళ్ళిపోయింది మృత్యుదేవత.
కులాసాగా కబుర్లు చెప్పుకుని, వీణతో కలసి హొటల్లోభోంచేసి, ఇంటికీ వచ్చి నిశ్చంతగా నిద్రపోయిన అనూష ని గణగణమంటూ లేపి, మణి చనిపోయిందన్న వార్త తెలియచేసింది టెలీఫోన్.... వణికే స్వరంతో గుండెపగిలేలాఏడుస్తూ చెప్పింది శ్యామల.
అనూషకి తన నెత్తి మీద పిడుగు పడినట్టు అనిపించింది....
"నిజం చెప్పు శ్యామలా? ఆమని బతికే ఉంది కదూ!" వెర్రి దానిలా అడిగింది.
శ్యామల ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.
కుప్పకూలిపోయింది అనూష...
ఇంత వరకు ఈ చెతులతో చికిత్స  చేసిన పేషింట్ఎవరూ కూడా చనిపోలేదు.... పెద్ద పెద్ద సర్జరీలు చేసి, ఎంతో మందికి పూనర్జన్మ ప్రసాదించిన అనూష ప్రాణ స్నేహితురాల్ని బతికించుకోలేకపోయిందా? ఇంకేందుకీ డిగ్రీ? ఇంకెందుకీ పేరు ప్రతిష్టలు..... ఇంకెందుకీ జీవితం?
  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS