Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 39

    ఈవినింగ్ డైలీ ఆఫీసు నుంచి కారు వచ్చింది. నలుగురు కారులో ఎక్కారు. కారు హొటల్ లేక్  క్యూ వైపువెళ్తోంది.
   
                                             ***

    విటివి చైర్మెన్ పరమహంసను సరిగ్గా నలబై ఎనిమిదిగంతల క్రితం కలిసాడు. అంకిత్... క్లుప్తంగా మృదువని గురించి చెప్పాడు... తను ప్రేమించిన మృదువని కోసం, ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించటం కోసం ఢిల్లీ వెళ్తానని చెప్పాడు.

    మృదువని ప్రమిమ్చిన వ్యక్తిగా ఆమెను కాపాడ్డమేకాక విటివి తరుపున ఈ కేసు డీల్ చేస్తానని చెప్పాడు అంకిత్.

    చైర్మెన్ పరమహంస అంకిత్ మీద నమ్మకంతో 'సరే' అనడమే కాకుండా తన  ఛానల్ తరుపున ఢిల్లీలో లేక్  క్యూ హొటల్ లో బస ఏర్పాటు చేసాడు... ఓ ప్రైవేటు కారును ఈవినింగ్ డైలీ ఆఫీసు ద్వారా వీళ్ళకు ఆరెంజ్ చేసాడు. ప్రద్యుమ్న వీళ్ళకు హీల్స్ చేస్తానని చెప్పాడు.

    ఇప్పుడు అంకిత్ లక్ష్యమొక్కటే. మృదువనిని కలుసుకోవాలి... ఆమె తప్పు చేయదని, చేయలేదని నిరూపించాలి.
   
                                                                           ***

    విశాలమైన ఆ రోడ్డు మీద కారు వెళ్తోంది.

    ప్రద్యుమ్న, చేతన్, రాహుల్ లు వెనక కూర్చున్నారు... ముందు సీట్లో అంకిత్ కూర్చున్నాడు... తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అంకిత్. చైర్మెన్ తో చెప్పి వచ్చాడు గానీ ప్రాక్టికల్ గా ఇక్కడి పరిస్థితులు ఎలా వుంటాయో తను పుట్టి పెరిగిన హైదారాబాదు లోనే ట్రేస్ చేయటం ఎలా?

    అసలు ఈ కేసును ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి... ఇలా రకరకాల ఆలోచనలు అతని మెదడులో విస్పోటనాలను సృష్టిస్తున్నాయి.

    "ఏంటి అంకిత్ ఆలోచిస్తున్నారు?" ప్రద్యుమ్న అడిగాడు.

    "ముందు ఈ వేళ రెస్టు తీసుకోండి... ప్రయాణ బడలిక తీరాక రేపట్నుంచి మన పని మొదలుపెడదాం" చెప్పాడు ప్రద్యుమ్న.

    "అవును బాస్!సాయత్రం వరకూ పడుకుందాం... రాత్రికి ఏ డిస్కోలోనో గడిపెద్దాం.. రేపట్నుంచి డ్యాం సేరియస్!" అన్నాడు రాహుల్.

    "ఊహూ! హొటల్ కు వెళ్ళి ప్రషప్ అయి మన పని మొదలెడదాం!" అన్నాడు అంకిత్.

    "వెంటనేనా? అదేమిటి సార్! కనీసం మద్యాహ్నం వరకైనా పడుకుందాం?" చేతన్ అన్నాడు.

    "అవును బాస్! కాస్త రస్త్ తేసుకుని పని మొదలుపెడితే ప్రేష్ గా వుంటుంది..." రాహుల్ వంతపాడాడు.
 
    "పనిలో కాన్  సంట్రేషన్ ఉంటే ఏ పనీ బోర్ అనిపించదు, దళ కాదు" అంటూ ప్రద్యుమ్న వైపు చూసి "ప్రద్యుమ్నా! మీరు డిఫెన్స్ చీఫ్ ఇంటర్య్వూ సంపాదించండి... ఎలాగైనా ఇవ్వాళ అపాయింట్ మెంట్ సంపాదించండి... ఈవినింగ్ డైలీ తరుపున విటివి ఛానల్ తరుపున ఇంటర్వ్యూ అని చెప్పండి."

    "ఇంత క్విక్ గా మనకు అపాయింట్ మెంట్ దొరక్కపోవచ్చు. మీకు తెలియనిదేముంది...పెద్ద ప్రాసిస్!"

    "ప్రద్యుమ్నా! వెరీజ్ ద విన దేరీజ్ ద వే! నీ ఇన్ ప్యూయేన్స్ అంతా ఉపయోగించు... మనకు మద్యాహ్నంకల్లా అపాయింట్ మెంట్ దొరకాలి" స్థిరంగా చెప్పాడు అంకిత్.

    'పని రాక్షసుడు' గొణుక్కున్నాడు రాహుల్.
   
                                                ***

    డిప్యూటీ చీఫ్ రంగనాథ్ తన ఛాంబర్ లో కూచుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు... అతని ముందు పైల్స్ ఉన్నాయి... అ పైల్స్ ని వేతీనీ ఓపెన్ చేయలేదు.

    ఏర్ కండిషన్ చప్పుడు తప్ప మరే శబ్దమూ వినిపించటంలేదు.

    యాబై రెండేళ్ళ రంగనాథ్ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి... నిజాయితీ, వృత్తి పట్ల అంకితభావం వున్న రంగనాథ్ రికార్డుల్లో ఏ బ్లాక్ మార్కూలేదు.

    వృత్తిలో దొరికే ప్రమోషన్ కన్నా చేస్తున్న పనిలో సిన్సియారిటీని వెతికే అతనికి పదవి అలంకారంకాదు, ఆ పదవికే అలంకారం అంటూంటారు తెలిసినవాళ్ళు.

    అతన్ని గత కొద్దిరోజులుగా తీవ్రంగా కలచివేస్తున్న విషయం మృదువని అదృశ్యమవడం.

    డిఫెన్స్ చీఫ్ పిఏగా పనిచేసే మృదువని గురించి అతనికి పూర్తిగా తెలుసు వృత్తిపట్ల అంకిత మయ్యే మనిషి ఆమె... ప్రొపేన్ లో ఎటువంటి రిమార్క్ లేదు... అలాంటి మృదువని దేశరక్షణ వ్యవహారాలకు సంభందించిన ప్లాపీని దోగిలించాల్సిన అవసరం ఏమిటి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS