"అంటే.. భస్మ ఆమెను పెళ్ళి చేసుకుంటాడా?"
"చేసుకున్నా ఆమె బ్రతకదు. అతనిలో నిగాఢంగా వున్న విద్యుత్ శక్తిని నిర్వీర్యం చేయకపోతే, ఆమెకు ఎప్పుడోకప్పుడు ప్రమాదమే.
వాళ్లిద్దరి మధ్య సెక్స్ రిలేషన్స్ ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడే ఆమె అతనిలోని విద్యుత్ శక్తిని తట్టుకోలేకపోతుంది. ఒక విధంగా ఆమె కరెంట్ మనిషితో కాపురం చేస్తున్నట్టే..."
పాముతో కాపురం చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది.
"వెరీ గుడ్... అయితే ఇప్పటికీ మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నమాట.."
"అలా చెప్పలేము... ఎవరైనా అతడ్ని తమ అధినంలోకి తెచ్చుకుని, అతనిలోని విద్యుత్ ని నిర్వీర్యం చేస్తే..."
అలా చేస్తే భస్మ బ్రతుకుతాడా ?"
"ఫీప్టి ఫీప్టి చాయిస్.. చవదానికే అవకాశాలు ఎక్కువ..."
"మరి మనం ఇప్పుడేం చేద్దాం?"
"వెంటనే భస్మలో హైవోల్టేజీని నింపి... అతన్ని పూర్తిస్థాయికి కరెంట్ మెన్ ని చేయాలి. అప్పుడు తన మరణానికి చివరి దశలో వున్నట్టే. మనం కరెంట్ సెల్ లో అతనికి ట్రీట్ మెంట్ వుండిపోతుంది..."
"వెరీ గుడ్... ఖాన్ సాబ్... ఆ తర్వాత నేను కాన్ఫరెన్స్ స్టార్ట్ వుతుంది. అతని చావు, కాన్ఫరెన్స్ హాలు బద్దలవడం... ఒకేసారి జరగాలి..." అన్నాడు ఖాన్.
వెరీ గుడ్... ఖాన్ సాబ్... ఆ తర్వాత నేను ఇండియాకు ప్రధానిని.." అన్నాడు ఉత్సాహంగా కర్మజయా.
"మరి నేను" ఎప్పుడూ బుద్దిగా చేతులు కట్టుకుని 'ఎస్ బస' లా వుండే లల్లూరామ్ అడిగేడు.
"నువ్వా... హొమ్ మినిష్టర్ వి ..." అన్నాడు కరంజయా.
పగలపడి నవ్వాడు ఖాన్.
"అదేంటి సార్... అలా నవ్వుతారు?" అయోమయంగా అడిగాడు కరంజయా.
"మీరు ఇండియాకే పరిమితమైతే ఎలా? స్వరణంలో అయితే ఎలా వుంటుంది? నో నో..మీరు పాపాలు చేసిన వాళ్ళు నరకం వెళ్తారటగా... అక్కడే ప్రధానమంత్రి అవ్వండి. మరొకరు ప్రెసిడెంట్ అవ్వండి" నవ్వుతూ అన్నాడు ఖాన్.
అయోమయంగా చూసాడు కరంయజా.
"ఎస్ మిస్టర్ కరంజయా... అన్నాట్టు నీ ఇష్టదైవం ఎవరు?"
"మీ మాటలు కొత్తగా వున్నాయి?" కరంజయాలో ఏదో అనిమానం.
"పాపం... టెన్షన్ భరించలేకపోతున్నారు కదూ..." అంటూ కోటు జేబులోంచి రివాల్వర్ తీశాడు.
"ఖాన్ సాబ్..."
"ఎస్... ఖాన్ సాబ్ నే... మాతృదేశాన్ని మోసం చేసిన మీరు, రేపు నన్ను మాత్రం మోసం చేయరని గ్యారంటీ ఏంటి? అదీగాక... మీతో పని పినిష్ అయింది. ఇకమీరే విధంగా నాగ్గానీ, ఏదో ఓ రోజు మా నెత్తికి మేమే కొరివి పెట్టుకావులేము..."
అతని చేతిలో రివాల్వర్ పేలింది.
ఒకటి... రెండు... మూడు.. నలుగు...
కరంజయా,లల్లూరామ్శరీరంల్లో నుంచి గుళ్ళు దూసుకు వెళ్ళాయి. అలాగే వెనక్కి విరుచుకుపడ్డారు.
"వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుగాక..." అని రివాల్వర్ ని లోపల పెట్టుకున్నాడు.
అగర్వాల్ వణికిపోయాడు.
"అదేంటి అగర్వాల్ సాబ్... మీరెందుకిలా వణికిపోతారు. మీరు మేధావులు... మీలాంటి వారితో దేశానికి ఎప్పుడూ పని వుంటూనే వుంటుంది. బ్రీ బ్రేవ్..." అన్నాడు అతని భుజం తగ్గలేదు.
పాతికేళ్ళు తమలో ఒకడిగా కలసిపోయిన వ్యక్తిని, తమకు అత్యంత నమ్మగంగా పనిచేసిన వాడిని నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు.
అగరావాల్ జీ..." ఖాన్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు.
"మీరు మీ పనికానీయండి" అంటూ మరో గదిలోకి వెళ్ళిపోయాడు.
'ఈ రివాల్వర్ లో మిగిలివున్న రెండు గుళ్ళు మీ కోసమే అగర్వాల్ సాబ్...' మనసులో అనుకున్నాడు ఖాన్.
***
ఒక్కక్షణం అనందం అర్ణవమై, అపురూప సంఘటన అంబరమై, ఓ పాత జ్ఞాపకం కన్రేప్పల మధ్య మెరిసి, మురిసే స్ప్రుతి అయి...
మనసా చెమ్మగిల్లకే... కన్నీటి చెమ్మ కలతపడకే... సంవత్సరాల పర్యంతం కన్నీటి సముద్రాలైన నీ కన్నీళ్ళు ఒక్క క్షణపు అద్బుత దృశ్యంతో పునీతమయ్యాయి.
మౌన భస్మను భరద్వాజ యింటికి తీసుకువచ్చింది. తలుపులు తెరవగానే ఎదురుగా... తల్లీ..
"ఎవరో చూడు... అమ్మ..." చెప్పింది మౌన.
అర్ధంకాక అలాగే విశాలివైపు చూసేడు.
"అ..మ్మ..మ..ద..ర్.." అని భస్మ గుండెల మీద చేయేసి విశాలిని చూపిస్తూ "అమ్మా..." అంది.
భస్మ అలాకే చూస్తుండిపోయాడు.
సంవత్సరాల పర్యంతంరం గోంతువుండీ, మూగావాడిగా, మెదడు వుండీ ఆలోచనా రహితుడిగా, మనసు వుండీ, ప్రేమ రాహిత్యంలో వున్న భస్మకు ఈ అనుబందాల గురించి తెలిసే అవకాశం లేదు.
సరిగ్గా అప్పుడే కోఎశిక్ కూడా వచ్చాడు.
ఆ దృశ్యాన్ని అతని ఆసక్తిగా గమనిస్తున్నాడు.
భరద్వాజ తన ల్యాబ్ లో నుంచి బయటకు వచ్చాడు.
చిన్నప్పుడు పసి గుడ్డును తన చేతులతో తీసుకెళ్ళి పాతిపెట్టిన బిడ్డా...
చేట్టంతయి తన ముందు నిలిచినా బిడ్డని చూసిన భరద్వాజ లో ఏదో అవ్యాజమైన అనురాగం.
మౌన భస్మకు ఎక్స్ ప్లెయిన్ చేయటానికి ప్రయత్నిస్తుంది.
ఆమె దృష్టి టేబుల్ మీదున్న బొమ్మ మీద పడింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బొమ్మ అది.
