పుడమిఱేఁడు శయనాగారామున కరిగినపిదపఁ గొంతదడవునకు మంత్రి యిఱుకటమున దాఁగియుండఁజలక యిటు నటుఁ గదలఁగాఁ ఇప్పుడగుట విని మఱల నాదూతిచెప్పునది.
చ|| అళికులవర్య! పద్మముకుళాంతరమందు వసింపనేరమి
జలనము సెందేదేమి నవసారసమిత్రుఁడు రాకయుండునా?
తొలఁగక యందె యుండు మిఁకఁ దోయజవైరి తిరంబే రాత్రియీ
కలవరమేల? తమ్మితుద గానక తూఱక యూరకుండుమా! 378
సాద్వీమణియగు నామంత్రి భార్య ఱేఁ డంతిపురమునఁ జేరుటవిని రేయి రెండు జాములు కడచనినను దనభర్త యిలు సేరమిచే దిగుల్వడి యేమికీడు వాటిల్లెనో యని కనుఁగొనరాఁగా నామెను గూర్చి దూతి చెప్పునది.
మ|| ఆలినీ! తత్తఱ మేలె నేఁడు నీదె నీయత్మే శుఁ డౌభృంగము
జలజాస క్తమారందపానవశత సానందుఁడై యున్నవాఁ
డులు కింతేనియు లేక నీ వరుగుమా! యోప్పార నిప్పాట నీ
చెలువుండుం బఱతెంచుఁ దేకువను రాజీవంబు పుష్పించినన్. 379
తా మింక వెలువలకు దయచేయుండని మంత్రికిని బోధించుచుఁ జెప్పునది.
మ|| వతినిద్రించినావేళ రాఁదగున యోపద్మారి యీ కేళికా
యతనంబందు రతిశ్రమ విభుఁడు నిద్రాసక్తుఁడై యుండే నీ
శతవత్రేక్షణ మోమువాంచినది నీసామర్ధ్యము జూవఁబో
కతివేగంబున నేఁగుమా! తొలఁగి మాయాత్మల్ సుఖం బందఁగన్. 380
రేయి రాజమహిషి తన కంఠహారమును మంత్రికంఠమున వైచెను. అతఁడు నది మఱచి మఱునాడు దానిఁదాల్చియే రాజసభ కరుదెంచెను. అది గాంచి రాజు గుఱుతించునెమో యని భీతిలి నిపుణయగునాదూతి వంటి వేషమున నరుగుదెంచి యీ క్రింది పర్యమున జదువ, నందలి "మానవరిపాల" యను విశేషణముఁ బట్టి మంత్రి తెలిసికొని తన కంఠమందలి హారమును బైవచ్చడమునఁ జుట్టి పారితోషికముగా నొసంగేను.
చ|| అతులసభాంతర స్థితబుధావాళికేల్ల జోహారు వీరరా
హుతులకు మేల్జోహారు సతతోజ్జ్వలవిక్రమ సార్వభౌమసం
తతికి జోహారు వైభవవితానపురందరుఁ డైనయట్టి భూ
పతికి జోహారు మనపరిపాల! జోహారు ప్రధాన శేఖరా! 381
బమ్మెర పోతన
ఈతఁడు క్రీశ. 1400 ప్రాంతముల నున్నవాఁడు. శ్రీనాధునకు బావమఱఁది యందురు. శ్రీ భాగవతము, దండకము, వీర భద్ర విజయము నీతని కృతులు. కొందఱు. భోగినీదండక వీరభద్ర విజయములకుఁ బోతన కర్తృత్వ మునేడ సంశ యవడేదరు. ఈపవిత్రకవి వైషయి కేచ్చావైముఖ్యమును బ్రశంసించుకట్టుకతలు కొన్ని కలవు. వానిని విడచి యాప్రసక్తి లోని పద్యము లుదాహరించేదను.
ఉ|| కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చేదో
కైటభదైత్యమర్ధనునిగాదిలికోడల! యోమదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాఁకటికై కొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ!. 382
శ్రీనాధకవీశ్వరుఁడు, పోతనామాత్య్నునితో నిట్లనియె న!
క|| కమ్మని గ్రంధం బొక్కటి!
యిమ్ముగ నేనృపతి కైనఁ గృతియిచ్చి నఁ గై
కొమ్మని యీయరె యర్ధం?
బిమ్మహి దున్నంగ నేల యిట్టి మహాత్ముల్? 383
నందిమల్లయ ఘంటసింగయలు , శృంగారషష్ట మను పేర భాగవతషష్ట స్కందమునే తేలిఁగించినారు. దానిఁ గూర్చి-
శా|| చండాంశుప్రభవీక్ష! తిమ్మయతనూజా! తిమ్మ! విద్వస్తసా
షండం బైనత్రిలింగ భాగవత షష్టస్కందభాగంబు నీ
కుం డక్కెం జతురానసత్వగుణయుక్తుల్మీఱ వాణీమనో
భండారొద్దతి చూఱకారబిరుద ప్రఖ్యాతి సార్ధంబుగన్. 384
పిల్లల మఱ్ఱి పిన వీరభద్రకవి
ఈమేటి కవి క్రై 1480 ప్రాంతమున నాంధ్ర దేశమునఁ బ్రఖ్యాటి కెక్కినవాఁడు. శృంగారశాకుంతలము , జైమిని భారతము నను రెండు కృతులు మాత్ర మీతనివి లభించు]చున్నవి. విద్యానగరమున బరిపాలించిన సాళ్వ గుండ నరసింహరాజునాకు జైమిని భారతము కృతిగా నోసఁగఁ బడినది. నరసింహ రాజునకు కృతి రచించికొనివచ్చుట కేర్పఱిచిన గడువు నాఁటి వరకు నీతఁడు గ్రంధరచన మారంభింపనే లేదనియు నాఁడు తద్భందుజనులు కృతి రచింపవైతివి రాజు వలనఁ జిక్కు వచ్చు నని మొఱ పెట్టఁగా నారాత్రి యింటిలో నొక గది యకిలింఛి ముగ్గు వెట్టించి తాటి యాకులును గంటమును గొని తానొక్కరుఁడ యందుఁ బ్రవేశించి సరస్వతీసహయ్యమునఁ దెల్లవారువఱకుఁ గృతిని సమకూర్చి మఱునాఁడు రాజాస్థానమున వినిపించి 'వాణి నారాణి' యనేననియు నొకకట్టుకధ కలదు. అంత శీఘ్రకాలములో నతిరసవంటమగు నాకృతి నాతఁడు రచించుట సత్యమయు యుండును. పై కధకు దోడుగా నీ పద్య మొకటి కలదు.
క|| పిల్లలమఱి పినవీరన
కిల్లా లట వాణి యట్టులే కా కున్న
తెల్లముగ నొక్క రాతిరి
తెల్లగ తెలవారువఱకు తేగలఁడే కృతిన్. 385
వెల్లంకి తాతంభట్టు
కవిలోక చింతామణి యనుపెరి లక్షణ గ్రంధమును రచియించిన యీ కవీశ్వరుఁడు పదునై దవశతాబ్దిలో నున్నవాఁడు. ఈ క్రింది పద్యము లాతని ప్రశస్తిని దెలుపుచున్నవి--
సీ|| ఏకవి నిర్మించే నీశబ్దశాస్త్రవ
ద్దతి యేల్ల సుకవి చింతామణి యన
ఏకవి చెప్పే ననేక పుణ్యానల్ప
బంధురసంక్షేవ భాగవతము
ఏకవి పఠియించె నెల్ల భాషలు నతి
ప్రకటనిర్భయమతి ప్రౌడి మెఱసి
ఏకవి తెచ్చే మహీశ సంఘము చేత
వారణాశ్వాదిసువస్తుచయము
గీ|| అతఁడు వెల్లంకి తాతమహాశాయశో గ్ర
గణ్యుఁ డుత్త మసుకవి ముఖ్యాధినాధుఁ
దంబరాశావకాశవిఖ్యాతచక్ర
వాళశైలాంతరావాప్తఖేల యశుఁడు. 386
సీ|| 'కర్ణాటకటకభూ కాంతసభంత వ్ర
గల్ప కవీశ్వరకమల హేళి
గజపతి సంసద ఖర్వ విద్యాగర్వ
తార్కికకుముదసుధామయూఖ!
అశ్వ సాధనమ హేంద్రాస్థానశాబ్దిక
వర్య చూత ద్రుమవనవసంత!
మూళవేశ్వరసదో మధ్యమస్థాయికా
లంకారిక మయూరలలిత మేఘ!"
గీ|| యనుచు ని న్న వనీపతు లహరహంబు
సరగ గంభీరవాక్ప్రౌడి నన్నుతింతు
రబ్జదీమణితనయ! శాబ్దార్దనిలయ
తస్థిరాత్మక! వెల్లంకి తాతసుకవి! 387
