ఇంట్లో సీతారామయ్య, సత్యవతి తప్ప మరెవరూ లేరు. అంతలో సత్యవతి భోజనానికి పిలిచింది. చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు సీతారామయ్య. విస్తర్లో అన్నీ వడ్డించింది ఆమె. అతను వచ్చి కూర్చున్నాడు.
"రాశిఫలాలు వినడానికి నువ్వు వెళ్ళలేదా?" అని అడిగింది సత్యవతి.
"నా రాశిఫలాలు నాకు తెలుసు. నువ్వు కరుణిస్తే నా అంత అదృష్టవంతుడు మరొకడు లేడు. నువ్వు నిరాకరిస్తే బికారినయి పోయి సన్యాసుల్లో కలిసిపోతాను" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
"వ్యాపారస్తుడివి - నేను కాదన్నా బికారి ఎలా అవుతావ్? ఇంకొక ఊరికిపోయి వ్యాపారం చెసుకుంటావ్. అంతేకదా?" అన్నది ఆమె.
"నువ్వు లేనప్పుడు ఈ వ్యాపారం ఎందుకు? ఈ డబ్బెందుకు? నువ్వు కాదని చెప్పు - రేపే సన్యాసుల్లో కలిసిపోతాను" అని జేబులోంచి సన్నగా, పొడవుగా వుండే పుస్తకాన్ని బయటకు తీశాడు.
"ఇది నేను ఇప్పటివరకు ఈ ఊర్లో ఎవరికి ఏయే వస్తువులు ఇచ్చానో రాసుకున్న లెక్క నువ్వు కాదంటే ఇదిగో ఇప్పుడే దీన్ని కాల్చేసి రేపే ఊరెళ్ళిపోతాను" అన్నాడు సీతారామయ్య.
ఆమె ఇదంతా సరదాగా అనుకుంది.
"ఏదీ కాల్చెయ్ చూద్దాం" అంది.
అతను దిగ్గున లేచి పక్కనే వున్న కిరసనాయిల్ దీపం దగ్గరికి వెళ్ళి ఎలాంటి సంకోచం లేకుండా పుస్తకాన్ని దీపం మీద పెట్టాడు. అది అంటుకుంది.
అప్పటివరకు చేష్టలు చూస్తున్న ఆమె ఒక్క అంగలో అక్కడికి చేరుకుని విసురుగా అతని చేతిని లాగింది. సగం కాలిన పుస్తకం క్రిందపడింది.
"ఏమిటీ పిచ్చి?" కోపంగా అడిగింది. తనకోసం వ్యాపారాన్నే తృణప్రాయంగా చూసిన అతనిపై ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొచ్చింది.
"పిచ్చికాదు. నువ్వంటే వున్న ఇష్టం"
ఇక ఏమీ మాట్లాడలేదు ఆమె. ఇంతకాలం తను ఒంటరిగా పడిన హింసనంతా ఆ క్షణంలో మరిచిపోయింది. ఠక్కున దీపం ఆర్పేసింది.
చీకటి లోకంమీద నల్లటి ముసుగు కప్పింది.
ఆమె అడుగు ముందుకు వేసి అతన్ని దగ్గరగా లాక్కుంది. అతను తూలి ఆమె మీద పడ్డాడు. అతని ఛాతీకి ఆమె ఎద స్పర్శ తెలుస్తూనే వుంది.
"అయితే ఒక్క షరతు!"
అతను ఆగాడు ఆ షరతు ఏమైనప్పటికీ తను వెనుకడుగు వేసేది లేదన్నట్లు ఆమె భుజం మీదున్న అతని చేయి బిగుసుకుంది.
"నా ధ్యాసలో పడి వ్యాపారాన్ని చెడగొట్టుకోకూడదు" అదే తన షరతు అన్నట్లు ఆగింది సత్యవతి.
సీతారామయ్య ఏమీ మాట్లాడలేదు. ఒక సెకను ఆలస్యాన్నికూడా భరించలేనట్లు ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
"నీ మాటను ఎప్పుడూ జవదాటను" అని ఆమె పెదవులపై తన పెదవులని ఆన్చాడు. సత్యవతి ఆ క్షణంలో క్రూరమృగమే అయిపోయింది. అతన్ని గిచ్చింది. ఊపిరాడకుండా తన ఎదకు అదుముకుంది. చక్కిలిగింతలు పెట్టి అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఊరించింది.
అతను జాలిగా చూస్తుంటే భరించలేక తన నడుం మడతల్లో అతని ముఖాన్ని అదిమి పెట్టింది. తనను చూసి తానే సిగ్గుపడి గదిలోకి వెళ్ళి దాక్కుంది.
అతను ఎంత ప్రార్థించినా బయటికి రాలేదు. పాపం సీతారామయ్యకి ఏడుపొక్కటే తక్కువైంది.
"సత్యా" అని పిలిచాడు దీనంగా.
ఆమె రాలేదు.
"నువ్వు బయటికి రావడానికి ఏం చేయాలో చెప్పు?"
"ఏమీ అక్కర్లేదు. నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు" అన్నది కవ్వింపుగా.
అతను కళ్ళు మూసుకున్నాడు. కానీ అతను కళ్ళు మూసుకున్నాడో లేదో తెలియడం లేదామెకు. మెల్లగా బయటకొచ్చి కిందపడున్న చీరను పైన కప్పుకుని "కళ్ళు తెరువు" అంది.
అతను కళ్ళు తెరిచాడు.
"అప్పుడు కళ్ళు మూసుకోవడం - ఇప్పుడు కళ్ళు తెరవడం - రెండూ బాగాలేవు"
"మరిక ఏం చేయను? సిగ్గు"
"సిగ్గు పోవాలంటే మరింత బరితెగించడమే. పూర్తిగా నీళ్ళలో మునిగాక చలివేయదంటారే. ఆ సూత్రం సిగ్గుకూ వర్తిస్తుంది" అతను ఆమె రియాక్షన్ కోసం చూడకుండా వెళ్ళి కిరసనాయిల్ దీపం వెలిగించాడు.
ఒక్కసారిగా వెలుగు గదంతా ప్రవహించింది.
ఆమె తన చీరను మరింతగా అదుముకుంది.
"అయ్యయ్యో! నీ చీర మీద కంబళిపురుగు" అన్నాడు సీతారామయ్య.
ఆమె బిత్తరలో తన చేతులని వదిలేసింది. ఎదురుపడ్డప్పుడు శత్రువు ముఖం మాడ్చుకుని వెళ్ళిపోయినట్టు చీర ఆమె ఒంటిమీద నుంచి తప్పుకుంది.
దీపపు వెలుగులో తనని తాను చూసుకున్నాక సిగ్గు కాస్తా ఎగిరిపోయింది.
ఇదే మంచి సమయమనుకున్నాడతను. దగ్గరికెళ్ళి ఆమె ముఖాన్ని పైకెత్తాడు. గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"జాతర వారం రోజులుందనగా చాటింపు వేస్తారు తెలుసా? ముద్దు అంటే చాటింపు. అసలు జాతర ముందుంది" అన్నాడు సీతారామయ్య.
"జాతర జరగడానికి ముందు ఇంకా చాలా వుంటాయే?" అంది.
"ఇప్పుడు మొదలవుతాయి మరి. చాటింపు వేసింది యిప్పుడే కదా!" అని ముఖంతో ఆమె కంఠం మీద రాశాడు.
అతడు ఇంకాస్త కిందకు దిగుతుంటే మధ్యలోనే అడ్డుకుని "దీపం" అంది.
అతడు దీపాన్ని ఆర్పేశాడు.
మళ్ళీ మొదలుపెడితే పైనుంచి ప్రారంభిస్తాడనుకుని అంతగా ఓపలేక అతని ముఖాన్ని తన ఎదకేసి గట్టిగా అదుముకుంది.
ఆ నునుపుకీ, ఆ బరువుకి అతనికి వూపిరాడలేదు.
కొండల మీద నుంచి దిగాక సన్నటి బాట మొదలయినట్లు ఆమె ఎదనుంచి దిగి, ముఖాన్ని ఆమె పొట్ట మీదకి జార్చాడు. ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి సాధ్యపడ్డట్లు బలంగా శ్వాస పీల్చాడు.
ఇప్పుడు అతడు మాయమైపోతే తను చచ్చిపోతానేమోనన్న భయం కలిగి అతన్ని ముఖాన్ని గట్టిగా పట్టుకుంది.
మూడేళ్ళ పైచిలుకే ఆమె ఈ అనుభవానికి దూరంగా వుంది. ఇప్పుడది ప్రాప్తించడంతో అవయవాలన్నీ పూలపొట్లంలా విచ్చుకుంటూ వుండటం తెలుస్తూనే వుంది.
చీకట్లో అతనికి ఏమీ కనిపించదన్న భరోసాతో మరికాస్తంత యాక్టివ్ అయింది.
అతను ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
వ్యాపారం మీద అశ్రద్ధ చూపవద్దని సత్యవతి షరతు పెట్టకుండా వుంటే మరుసటి రోజు నుంచి సీతారామయ్య దేవాలయానికి వెళ్లుండేవాడు కాదు.
ఆ రాత్రి సత్యవతితో గడిపాక ఆమె తప్ప మరేదీ వద్దనుకున్నాడు. కానీ షరతు గుర్తొచ్చి వ్యాపారం దగ్గరికి వెళ్ళాడు. ఆ అనుభవం అతన్ని చాలా మార్చింది. సెన్సిటివ్ గా తయారయినాడు.
