Previous Page Next Page 
అభిలాష పేజి 3

    ఆ ఆఆహచ్చ్_ అని తుమ్మితే _అమ్మో _అన్ని కళ్ళూ తనవైపు తిరగావూ... తింటూన్న వాళ్ళంతా తమ చర్యని ఆపి, తనను చూడరూ! ఎక్కడో చదివేడు _ తుమ్మితే నీటి తుంపర్లు గంటకు నూరు కిలోమీటర్లు వేగంతో ప్రయాణింస్తాడట. నోటికి చేతులు అడ్డుపేట్టిముందే వాటిని నిరోధించవచ్చుగానీ, శబ్దాన్ని ఆపుచెయ్యలేముకదా. జనాన్ని ఆకర్షించేది  ఒక్కసారిగా వెలువడే అ శబ్దమే కదా! అయినా తన ప్రయత్నం, పనిలో నిమజ్ఞామైవున్న జనాన్ని తనవైపు ఆకర్శించకుండా వుండాలనేకదా.
   
    అప్పుడు తట్టింది అతడికి ఆలోచన.
   
    గుండెల్నిండా శ్వాస పీల్చి వదిలితే తుమ్ము రాదనీ _ వచ్చేది ఆగిపోతుందనీ పెద్దలు చెప్పారు. తనకి తనే ఆ ఆలోచన వచ్చినందుకు అభినందించుకుని, కళ్ళు మూసుకుని ఊపిరినితీసి వదలటం ప్రారంభించాడు. భారంగా వూపిరి వదులుతూ రెండు నిముషాలు గడిపిన తరువాత అంటే సర్దుకొన్నట్టు అనిపించి, కళ్ళు తెరచి, చుట్టూ వున్న దృశ్యాన్ని చూసి దారాసింగ్ కన్నార్పకుండాపరికిస్తున్నాడు.
   
    చిరంజీవి బిక్కచిక్కిపోయి "బిల్లు" అన్నాడు.
   
    "ఎమైంది సార్ ."
   
    "ఏమీకాలేదు _ బిల్లు......."
   
    వెయిటర్ బిల్లిచ్చి వెళ్ళిపోయేడు. వాతావరణం అంత మమూలుగా సర్దుకొన్నదని నమ్మకం కలిగేక బిల్లు పట్టుకుని లేచాడు. లేస్తూ బిల్లుచూసి ఉలిక్కిపడ్డాడు. బిల్లు అయిదుపైసా లెక్కువైంది. అతడి దగ్గరున్న డబ్బుకంటె అసలతడి దగ్గర ఎక్కువ డబ్బులేదు. అందుకే నిన్న సాయంత్రం తాలూకు భోజనమూ, పొద్దున చేయవలసిన బ్రేక్ ఫాస్టూకలిపి ఒకేసారి, రెండిడ్లీ, ఒక స్ట్రాంగ్ కాఫీగా తన దగ్గరున్న డబ్బులకి సరిచూసుకుని లాగించేసెడు. అంతలా చూసుకుని చూసుకుని తిన్నా అయిదుపైసా లెక్కువటం అతడిని చాలా ఇబ్బందిలో పడేసింది. సర్వరేమనుకుంటాడో అని భయపడుతూనే బిల్లుచూపించి, సర్వరు కూడికళ పట్ల తన కేవిధమైన అనుమానం లేడనీ, కానీ ఎన్నో లెక్కలు_ ఏమ్తమంది తిన్నవోమనసులో పెట్టుకోవాల్సిన గురుతరమైనా బాధ్యతలో చిన్న పొరపాటు చేసి వుండవచ్చనీ సూచించాడు.
   
    "నూట పదిహేను పైసలు కరెక్టే సార్"
   
    "కానీ నిన్న ఇదే రెండిడ్లీ _ఒక్క కాఫీకి నూట పదిపైసలె అయింది కదా."
   
    "నిన్న సాయంత్రం మినిస్ట్రీ మారింది కద్సార్." అనేసి వాడేళ్ళిపోయాడు. చిరంజీవి బి. య్యే లో ఎకనామిక్సూ పాలిటిక్స్. కానీ రాజకీయా లకీ, ఆర్ధిక శాస్రానికి అంత దగ్గర సంబంధం వుంటుందని అతడికి అప్పుడే తెలిసింది.
   
    కౌంటర్ వైపు చూసేడు. అక్కడ కూర్చోన్నాయన సౌమ్యుడిలా కనిపించి ధైర్యం తెచ్చుకుని దగ్గరకి వెళ్ళి, వున్న డబ్బులిచ్చి "రుబ్బురోలెక్కడ సార్  " అడిగేడు మర్యాదగా.
   
    "మా వోటలంతా ఎలక్టీకరంటే " అన్నాడాయన .
   
    "ఎల్లెల్సీ పాసయ్యేను.మరీ ఏంట ఉస్మానియా యూనివర్సీటి అయినా, కప్పులు కడగటం అంత బావోదేమో! దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి? " అని అడిగేడు.
   
    "అసలు విషయం ఏమిటి?"
   
    చిరంజీవి అయిదుపైసలు తక్కువైన విషయం చెప్పాడు. అయన భోళాగానవ్వేసి, "జీవిత ఖాళీ అయిపోయిన కప్పులాటిది. డబ్బులు ప్లేట్లో ఇడ్లీల్లాటివి. ఒకదాని కోసం ఇంకొకటి ఖర్చుపెట్టకు నాయనా ఫర్లేదూలె" అన్నాడు.

    మనస్పూర్తిగా ఆయనకు క్రుతజ్ఞలు చెప్పుకుని బైట పడ్డాడు చిరంజీవి.
   
                               2
   
    "ఇలాటి వాడివి ఈ జీవితంలో ఎలా బ్రతుకుతావో నాకు అర్ధం కావటంలేదు...." అన్నాడు యస్సేయ్ స్పూర్తి .
   
    "ఎలాటి వాడిని జీవితంలో ఎలా బ్రతుకుతానోనీకు అర్ధంకావటంలేదు ?" అని అడిగేడు అర్ధంకాక.
   
    గట్టిగా తుమ్మితే ఎవరేమనుకుంటారాయని భయపడేవాడివి.... బల్ల మీద ఓ రేటూ, బిల్లుమీద ఓరేటూ వేస్తె గట్టిగా దెబ్బలాదలేని హొటల్ రెట్ల ని అదుపులో పెట్టటం కాదు..."
       
    "మరి ?"
   
    "ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ని మార్చటం! భారత దేశపు న్యాయశాస్ర పరిధి నుంచి ఉరిశిక్షని రద్దు చేయటం !!! నా తండ్రీని పొట్టనబెట్టుకున్న ఈ సమాజంమీద కసిదీర్చుకోవటం !" పిడికిలి బిగించి ప్రతిజ్ఞ చేసేడు.
   
    "చూడమ్మా ఛీరంజీవి..... ప్రాక్టీసు పేట్టి మూడేళ్ళయింది. బైట నిలబడితే చెట్లుకింద ప్లీడరంటారని లోపల కూర్చుంటున్నావు తప్పితే, ఇంతవరకూ ఒక్కకేసు వాదించలేదు నువ్వు. భారతదేశపు మ్యాపులో డిల్లీ ఎక్కడుటుందో నీకు తెలియదు. డీల్లీ లో పార్లమెంటేక్కడా అని గట్టిగా అడిగితె బీచి ఒడ్డున అంటావు. అటువంటిది .... నువ్వు _ఐ.పి.సి.ని. మారుస్తావా....?"
   
    "నవ్విన నాపచేనే పండుతుంది శేషావతారం ! ఆరువందల మండి పార్లమెంటు సభ్యులు ..." అతడు మాట్లాడటం ఆపుచేసి కళ్ళల్లోకి వెళ్ళి పోయాడు.
   
    ట్లింగ్ ..... ట్లింగ్ .....
   
    పార్లమెంటులోంచి చిరంజీవి బైటకు వస్తున్నాడు. విశాలమైన మెట్లు... ఇరువైపులా పార్లమెంటు సభ్యులు ....రాజ్యసభ మెంబర్లు ..... నవ్వుతూ విష్ చేసి, కళ్ళతోనే కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయిన ప్రధానమంత్రి.
   
    చిరంజీవి రెండు మెట్లు దిగి ఎదురుగావున్న అశేష ప్రజానీకాన్ని చూసి ఆశ్చర్యపోయేడు. కొంతమంది చేతిలో దండలు, కొంతమంది చేతిలోజేమ్దాలు, అందరి మొహాల్లో సంతోషం. హర్షధ్వానాలు చేస్తున్నారు కొందరు 'లాంగ్ లివ్ చరంజీవి' అంటున్నారు కొంతమంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS