Previous Page Next Page 
నయనతార పేజి 4

 

    హాలులో ఖరీదయిన కార్పెట్లు, ఖరీదయిన ఫర్నిచర్ సిల్కు పరదాలు, అందమైన చాండిలియర్స్ డెకరేషన్ పీసెస్, పెయింటింగ్స్, రేడియో గ్రాము. ఒకటేమిటి డబ్బుతో ఎంత అందమైన వస్తువులు కొనవచ్చునో అన్నీ వున్నాయి. అన్నీ ఉండడం కన్న వాటిని అందంగా అభిరుచితో అలంకరించిన నైపుణ్యమూ కనిపిస్తుంది ప్రతి అంగుళంలో. జిడ్దోడుతున్నా రెండు గుడ్డ కుర్చీల మధ్య చింకి చాపల మధ్య పెరిగిన సుందరికి యీనాడు యి టెస్టు ఎక్కడ నించి వచ్చింది? డబ్బు మహత్యం. మరోసారి అనుకున్నాడు సారధి.
    హలునిండా అడ మగపిల్ల పెద్ద చాలా మంది ఉన్నారు. ఆరుగురు అడ మగ కలిసి పెకాడుకుంటున్నారు. ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు చదరంగం ఆడుతున్నారు. కొందరమ్మాయిలు రెడియోగ్రాం చుట్టూ కూర్చుని రికార్డులు వింటున్నారు. కొందరు సోఫాల్లో వ్రాలి పుస్తకాలు చదువుతున్నారు.
    హాలులో అడుగు పెట్టగానే ఒక్క క్షణంలో సారధి కంటపడిన దృశ్యాలివి. తార లోపలికి రావడంతో హాలంతా ఒక్క క్షణం నిశ్శబ్దమయింది. అందరూ తలలు ఒకసారి పైకెత్తి తార వైపు చూశారు. మరుక్షణంలో మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నులైపోయారు. చదరంగం ఆడుతున్న ఇద్దరిలో సుందరి తండ్రిని గుర్తించి పలకరించబోయెంతలో తార "రా పైకి వెడదాం" అంటూ మెట్ల మీదకి దారి తీసింది. సుందరి తండ్రి సారధిని గుర్తుంచలేదేమో ఏమీ పలకరించలేదు.
    మేడమేట్లు ఎక్కుతూ ఇంకా అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్న సారధిని చూసి "వీళ్ళంతా నా బంధు]జనం . నా హితైషులు, శ్రేయోభిలాషులు." అంది చిన్నగా , చిలిపిగా నవ్వి.
    మేడమీదకి అడుగు పెట్టాక అదో వేరే లోకంలో వున్నట్టనిపించింది సారధికి. మెడ మీద అందమైన పెద్ద గదులు, రెండు వున్నాయి. "మేడ అంతా నేనే వాడుకుంటాను. క్రింద గదులలో అంతా వుంటారు. ఇక్కడ ఈ గది డ్రాయింగు రూముగా , ఇలా రా ఇదిగో ఇది నా బెడ్ రూము" అంటూ తీసికెళ్ళి చూపించింది సారధికి. క్రింద డ్రాయింగు రూము కంటే ఇంకా ఖరీదయిన ఫర్నిచర్ వుంది మేడ మీద. అక్కడి కంటే ఖరీదయిన పరదాలు, తివాచీలు, ఒకటేమిటి -- బెడ్ రూమ్.... అదేదో దేవలోకంలాగ.... చల్లగా డిమ్ లైట్లు కాంతిలో, దేవలోకంలో అప్సరసలు పడుకునే లాంటి మంచం, గులాబీ రంగు పట్టుపరుపు - సిల్కు దుప్పట్లు, గులాబీ రంగు పల్చటి సిల్కు పరదాలు, విరిసిన గులాబీ పూలతో వాజులు..... గులాబీ రంగు ఫర్నిచర్, గులాబీ రంగు కార్పెట్టు, సన్నని గులాబీ లవందర్ పరిమళం ..... ఏదో గులాబీ తోటలో అడుగు పెట్టినట్టుంది. విభ్రాంతిలో  కళ్ళు వాల్చడం మరచిపోయి చూస్తున్నాడు.
    "బట్టలు మార్చుకు వస్తాను, ప్లీజ్ , అలా డ్రాయింగ్ రూములో కూర్చో ఒక్క క్షణం..." అన్న తార మాటలకీ ఉలిక్కిపడి, సిగ్గుపడి, అక్కడ నించి వెళ్లి డ్రాయింగ్ రూములో కూర్చున్నాడు సారధి.
    తనని చూసి సిగ్గుపడి వీధిలోంచి ఒక్క గెంతు గెంతి లోపలికి దుమికే సుందరి, తననే చూస్తున్నట్టు అనుకుని తను కనిపించేసరికి సిగ్గిసిగ్గ్గుగా నవ్వి పమిట కప్పేసుకుంటూ, మెలికలు తిరిగి తలుపు చాటుకి వెళ్ళి తొంగి తొంగి చూసే సుందరి, ఏమన్నా పుస్తకాలుంటే ఇమ్మంది అక్క అంటూ తమ్ముడ్ని తన దగ్గరికి పంపి వీధి గుమ్మంలో నిల్చుని ఆరాటంగా తన గది కిటికీ వైపు చూస్తూ నిల్చునే సుందరి, సుందరి తండ్రి ఎప్పుడన్నా పిలిస్తే వీధి గుమ్మంలో కుర్చుని మాట్లాడే తన ప్రతి మాట తలుపు చాటు నించే వినే సుందరి, నల్లటి మడ్డి కాఫీ ఆప్యాయంగా తమ్ముడి చేత పంపే సుందరిని ......... ఆమెకి తన పట్ల వుండే ఆసక్తికి, ఆమె తనని ఆకర్షించడానికి పడే తాపత్రయాలని గమనించి, ఆమె ఆరాటానికి నవ్వుకునేవాడు. ఏమగాడు సుందరి లాంటి అమ్మాయిలని చూడడానికి ఆరాటపడడన్న సంగతి కూడా గుర్తుంచలేని ఆమె అమాయకత్వానికి జాలి పడేవాడు. అలాంటి సుందరి ఎంత చనువుగా పెద్ద పరిచయస్తురాలిగా గలగల జంకు బొంకు లేకుండా ధాటిగా "నీవు' అంటూ కూడా మాట్లాడేస్తుంది. పుట్టుక నించీ ఇంత వైభవం మధ్య పెరిగినంత సహజంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS